Menu

Monthly Archive:: November 2009

Little box of Sweets-పరిచయం

Little Box of Sweets-భారతదేశంలో పుట్టి బ్రిటన్ లో పెరిగిన మేనక దాస్ మరియు షీనూ దాస్ అనే ఇద్దరు యువతులు రూపొందించిన చిత్రం. 50 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కోసం మేనక బ్యాంక్ లోన్ తీసుకగా, షీనూ తన ఇల్లు అమ్మేసిందట. లిటిల్ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అనే ఈ చిత్రం 2007-2008 లో నిర్మించబడింది. అలహాబాద్ లోని ఒక స్కూలు విద్యార్థిని పాత్రలో మేనక దాస్ ఈ చిత్రం

ఎలిపత్తయం

ఎలిపత్తయం (Elippathayam) అంటే ఎలుక బోను. ఇది ప్రముఖ మలయాళ దర్శకుడు అదూర్ గోపాల్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా. ఈ సినిమాకి గానూ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు అదూర్. కేరళలో ఫ్యూడల్ వ్యవస్థ అస్తమిస్తున్న రోజుల్లో అదే భావజాలంలో నిండామునిగిపోయిన ఒక వ్యక్తి కథనాన్ని ఎంతో నైపుణ్యంగా ఈ సినిమాలో చిత్రీకరించారు అదూర్. ఈ సినిమా మొదట్లో చూడగానే చాలామంది బాబోయ్ అవార్డు సినిమా అని ఎగిరి

The (Half) Man

Irving Wallace వ్రాసిన రాజకీయ నవల. ఒక black-man ని అమెరికా అధ్యక్షునిగా ఊహించి వ్రాసిన ఈ నవల అప్పట్లో పలుసంచలనాలకి కేంద్ర బిందువైంది.  అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పుస్తకం ప్రతులని తగుల పెట్టారు. చాలా చోట్ల నిషేధానికి గురి అయింది. 1972 లో ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పే ముందు కాస్త Irving Wallace గురించీ, అతని నవలలు నాకు పరిచయం అయిన తీరు గురించి చెప్పాల్సి

కథన విజయం – ఈరం (తమిళ్)

మూడేళ్ళ క్రితం తిరుపతిలో నంది నాటక పోటీలు చూడ్డానికని వెళ్ళాను. ఆ పోటీలకి నేను రాసిన “పంచమ ధర్మం” అనే పద్య నాటకమొకటి కూడా ఎంపికయ్యింది. అందులో అది ప్రదర్శించారు. ఆ సందర్భంలో నాటకాలకీ, టీవీలకీ, సినిమాలకీ మధ్య కొట్టిమిట్టాడుతూ, అవకాశాల కోసం పడిగాపులు కాచే కొంతమంది వర్ధమాన రచయితలూ, దర్శకులూ పరిచయమయ్యారు. సినిమాలంటే నాకున్న ఇంట్రస్టు కొద్దీ వాళ్ళేం చేస్తూ ఉంటారూ, ఏఏ సినిమాలకి పనిజేసారనీ వివరాలు తెలుసుకున్నాను. నేను అమెరికా నుండి వచ్చానని తెలిసి