Menu

నవతరంగం-రెండవ వార్షికోత్సవం

happy-f

నవతరంగం రెండవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం.

2007 నవంబరు 28 న  పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం రెండు సంవత్సరాలలో  ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల సినిమా పత్రికగా పేరుగాంచింది. దీని వెనుక ఎంతో మంది సభ్యుల కృషి, మరెంతో మంది పాఠకుల ప్రోత్సాహం వుంది.

ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుతో నవతరంగం తెలుగు సినీ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే లెక్క. నవతరంగం ప్రాచుర్యం పాఠకులను, ఔత్సాహికులను, సినీప్రేమికులతోపాటూ సినీపరిశ్రమలోకి కూడా ప్రవేశించింది. నిస్పక్షపాతమైన సమీక్షలతోపాటూ, ఇతర భారతీయ భాషా చిత్రాల గురించీ, ప్రపంచసినిమా గురించీ తెలుసుకునే ఒక స్థలంగా పరిశ్రమ నవతరంగాన్ని గుర్తిస్తోంది. ఈ నేపధ్యంలో నవతరంగం భవిష్యత్తుని నిర్ణయించుకోవడం మనచేతుల్లో ఉంది.

గత రెండు సంవత్సరాలలో నవతరంగం ఇన్ని హిట్లొచ్చాయి, వందలకొద్దీ వ్యాసాలొచ్చాయి, వేలకొలదీ వ్యాఖ్యలొచ్చాయనీ సంబరపడిపోవచ్చు. కానీ సంవత్సరం పాటు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరంలో మన ప్రణాళిక ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.

ఈ ప్రశ్న కు సమాధానం మీ అందరి దగ్గరా వుంది. మనమంతా కలిసి నవతరంగం భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు. నవతరంగం మరింతగా ఎదగడానికి తోడ్పడవచ్చు. అందుకు మీ అందరి సహాయం కావాలి. నవతరంగం అభివృధ్ధికొరకు మీరు మూడు విధాలుగా సహాయం అందించవచ్చు.

ప్రచారం:నవతరంగం సైటుకి ఈ రోజున సరాసారిన మూడువందల్మంది సందర్శిస్తున్నారు. ఈ నెలలో మీకు తెలిసిన వారందరికీ నవతరంగం గురించి తెలియచేయండి. వీలైతే మీకు నచ్చిన వ్యాసాలను వారికి మైల్స్ పంపండి. నవతరంగం గురించి మీ ఆఫీసుల్లో కరపాత్రాలు పంచండి. లేదా మీరు ఎన్నుకున్న మరే పద్ధతి ద్వారా అయినా నవతరంగం గురించి మరింత మందికి తెలియచేయండి.

ఫీడ్ బ్యాక్: నవతరంగంలో మీకు నచ్చిన ముఖ్యంగా నచ్చని అంశాల గురించి మాకు మైల్ (navatarangam at gmail dot com) ద్వారా తెలియచేయండి. అలా మీరు పంపించిన అభిప్రాయాలు/సలహాలూ/విమర్శలూ సమీకరించి నవతరంగంలో పోస్టు చేస్తాము. ఇదే విధంగా నవతరంగం సభ్యులు కూడా ఈ సంవత్సరంలో నవతరంగంలో తమ అనుభవలను కూడా ప్రచురించాలని మనవి చేసుకుంటూన్నాను. ఈ సమాచారం ద్వారా మన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

సహాయం:నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. గత సంవత్సర కాలం పాటు నవతరంగం నిర్వహణలో బాగానే సమయమూ ధనమూ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నవతరంగంలో ప్రచురించడానికి కావలసిన కంటెంట్ సేకరించడంతో పాటు, చాలా వరకూ ప్రింట్ లో ఉన్న వ్యాసాలను టైపింగ్ చేయడం లోనూ, నవతరంగం రోజు వారీ ఆడ్మిన్స్ట్రేషన్ పనులు నిర్వహించడానికీ, నవతరంగం డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, వర్డ్ ప్రెస్ థీం కోసం ఇలా చాలా విధాలుగా సమయమూ ధనమూ ఖర్చయింది. రాబోయే సంవత్సరంలో పైన చెప్పిన వాటన్నిటి కోసం కావల్సిన ధనసహాయం చేయదలచిన వారు ఇక్కడ నుంచి ఆ పని చెయ్యవచ్చు.

మీరు నవతరంగానికి సహాయం చేయాలనుకుంటే మీరు ధనసహాయమే చెయ్యనక్కర్లేదు. మరెన్నో విధాలుగా కూడా మీరు సహాయపడవచ్చు.

 • మీరు నవతరంగంలో సభ్యులుగా చేరి వ్యాసాలు వ్రాయవచ్చు.\
 • మీకు తెలిసిన వారెవరైనా నవతరంగంలో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే అలాంటి సమాచారం మాకందివ్వవచ్చు.
 • ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుగు సినీ ప్రపంచంలోని ఉత్తమ దర్శకులు, సాంకేతిక నిపుణులనూ కలుసుకును వారి వద్దనుండి చలనచిత్ర ప్రక్రియలోని వివిధ అంశాల గురించి సేకరించిన విలువైన సమాచారం నవతరంగంలో ప్రచురించవచ్చు.
 • నవతరంగంలో ప్రచురించడం కోసం సేకరించిన ఎన్నో వ్యాసాలు, పుస్తకాల రచయితల అనుమతులు సంపాదించడంలో కూడా మీరు సహాయం చేయవచ్చు.
 • లేదా మీకు తోచిన మరే విధంగానైనా కూడా మీ సహాయ సహకారాలు అందివ్వవచ్చు.

మీకు తోచిన సహాయం చేయండి.నవతరంగం అభివృద్ధికి తోడ్పడండి.

Update: ’నవతరంగం’ లో కోసం సేకరించిన విరాళాలు కేవలం నవతరంగం అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామని తెలియచేస్తున్నాము. ఈ విరాళాలను ఈ క్రింది పనుల కోసం ఉపయోగించాలనుకుంటున్నాము.

 • ప్రింట్ లో ఉన్న ఎంతో మెటీరియల్ ని యూనికోడ్ లోకి మార్చి ప్రచురించడం – విలువైన పాత పుస్తకాలను సేకరించడం జరిగింది. యూనీకోడీకరణ సాగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా తెలుగులో చలనచిత్ర కళ గురించి హైదరాబాదులోని సిటీ సెంట్రల్ లైబ్రరీలోని ఎన్నో పుస్తకాల నుండి సేకరించిన వ్యాసాలు,  పాత పుస్తకాలమ్మే షాపుల నుండి సేకరించిన విలువైన పుస్తకాలు ఉన్నాయి. వీటి సేకరణ జరుగుతూనే ఉంటుంది. మీ వద్ద ఇలాంటి ఏవైనా వ్యాసాలు, పుస్తకాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు.
 • కరీంనగర్ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందివ్వడం కొనసాగించడం
 • కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్ వారి సహకారంతో ఒక ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ నిర్వహించడం.
 • ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన వివిధ అంశాల గురించి ట్యుటోరియల్స్ తో కూడిన వ్యాసాలు రూపొందించడం.
 • సినిమా రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఒక నెట్ వర్క్ రూపొందించడం – ఇప్పటికే ‘ప్రకామ్య’ రూపొందించడం జరిగింది. దాన్ని పటిష్టపరచడం.
 • మరిన్ని లఘు చిత్రాల నిర్మాణం – ఇప్పటికే ‘విజేత’ అనే ఒకనిమిషం ఫిల్మ్ రూపొందించడం జరిగింది.
 • కరీంనగర్ ఫిల్మ్ క్లబ్ ల సహకారంతో ’ఫిల్మ్ అప్రెషియేషన్’ గురించి ఒక చిన్న కోర్సు రూపకల్పన చేయడం.
 • నవతరంగంలో వచ్చిన వ్యాసాలను పుస్తక రూపంలోకి తేవడం : సత్యజిత్ రే “Our films and their films” తెలుగు అనువాదం త్వరలో అచ్చువేయబోతున్నాం.
 • ఇవి మాత్రమే కాకుండా నవతరంగం ద్వారా ఇంకా ఏమేం చెయ్యొచ్చో మీరూ తెలియచేయవచ్చు.

నవతరంగం రెండవ జన్మదినం సందర్భంగా పాఠకులకు, సభ్యులకు మరియు అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతో నవతరంగం ఇంకా ఎన్నో రెట్లు ఎదిగి ముందుకు సాగుతుందని ఆశిస్తూ….

-’నవతరంగం’ వెంకట్

28 Comments
 1. గిరి November 28, 2009 /
 2. wb November 29, 2009 /
 3. Prasad November 29, 2009 /
 4. srikanth November 29, 2009 /
 5. G November 29, 2009 /
 6. Vj November 29, 2009 /
 7. pappu November 29, 2009 /
 8. moneymaker November 29, 2009 /
 9. yogi November 29, 2009 /
 10. Vasu November 30, 2009 /
 11. Arvind November 30, 2009 /
 12. రాజశేఖర్ November 30, 2009 /
  • G November 30, 2009 /
 13. VUMRAO November 30, 2009 /
 14. VUMRAO November 30, 2009 /
 15. nareshkota November 30, 2009 /
 16. శంకర్ November 30, 2009 /
 17. అబ్రకదబ్ర December 1, 2009 /
 18. విజయవర్ధన్ December 1, 2009 /
 19. బ్రహ్మానందం December 1, 2009 /
 20. Heera December 1, 2009 /
 21. rayraj December 1, 2009 /
 22. rkb December 1, 2009 /
 23. Sathish December 1, 2009 /