గతంలో వినాయుడు,అష్టా చెమ్మా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి సారించాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.వింద. మా టివి లో గత మూడేళ్ళగా టెలికాస్ట్ చేయబడుతున్న ’విహారి’ అనే టెలివిజన్ సీరియల్ నిర్మించిన నితిన్ ఆళ్లగడ్డ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ’లోటస్ పాండ్’.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలల చిత్రాలు రూపొందించటం లేదు అని అందరూ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో వింద-నితిన్ లు ఎంతో రిస్క్ తీసుకుని హిమాచల ప్రదేశ్ లాంటి సుందర ప్రదేశాలలో చిత్రీకరించిన ఈ చిత్రం పూర్తి స్థాయి బాలల చిత్రం అయినప్పటికీ ఈ సినిమాని ఇంటిల్లపాదీ చూసి ఆనందింవచ్చు.
ఈ సినిమా కి సంబంధించిన కొన్ని స్టిల్స్ మీ కోసం.
కె.మహేష్ కుమార్ says:
స్టిల్స్ చాలా బాగున్నాయి.ఒక సినెమాటోగ్రఫరే దర్శకుడు కాబట్టి సినిమా విజువల్ ట్రీట్ అనిపించేలా ఉన్నాయి. కానీ ఈ సినిమా ఈ మధ్య జరిగిన బాలలచలనచిత్రోత్సవంలో ప్రదర్శించినట్లు లేరే! రిలీజెప్పుడూ?