ఎలిపత్తయం

elippathyam

ఎలిపత్తయం (Elippathayam) అంటే ఎలుక బోను. ఇది ప్రముఖ మలయాళ దర్శకుడు అదూర్ గోపాల్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా. ఈ సినిమాకి గానూ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు అదూర్.

కేరళలో ఫ్యూడల్ వ్యవస్థ అస్తమిస్తున్న రోజుల్లో అదే భావజాలంలో నిండామునిగిపోయిన ఒక వ్యక్తి కథనాన్ని ఎంతో నైపుణ్యంగా ఈ సినిమాలో చిత్రీకరించారు అదూర్. ఈ సినిమా మొదట్లో చూడగానే చాలామంది బాబోయ్ అవార్డు సినిమా అని ఎగిరి గంతేసి పారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాకపోతే (గతంలో చాలా సార్లు చెప్పినట్టే) ఈ సినిమా ని మిగతా అన్ని సినిమాలలా వినోదం కోసం చూడకుండా ఫ్యూడల్ వ్యవస్థను, అందులో మగ్గుతున్న వ్యక్తులను దర్శకుడు తెరపైకి తీసుకొచ్చి ఎలా ప్రాణం పోశాడు? అలాగే వారి భావాలను, మానసిక స్థితిని ఎటువంటి devices ద్వారా తెరపైన present చెయ్యగలిగాడు అనే విషయాలకోసమైనా ఈ సినిమా, ఒక సారి కాదు నాలుగైదు సార్లు చూడొచ్చు.

ఈ క్రింది వీడియో లో అదూర్ ’ఎలిపత్తయం’ సినిమాలో తను ఉపయోగించిన cinematic devices గురించి వివరిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీలో కొంతమందికైనా ఎలిపత్తయం సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుందని ఆశిస్తున్నాను.

Filed Under: featuredleadభారతీయ సినిమావిశ్లేషణవీడియో

Tags:

Comments (6)

Trackback URL | Comments RSS Feed

  1. వెంకట్ గారు, ఈ కొత్త రూపు బాగుంది. ఈ రోజు వచ్చిన టపాల వంటివి ఇక ముందు కూడా చాలా రావాలని కోరుకుంటున్నాను. మనమందరం ఇది బాగాలేదని అది బాగాలేదని విమర్శిస్తూ కాలం గడపకుండా ఈ సినిమాలో ఇది బాగుంది, ఆ సినిమాలో ఎడిటింగ్ ఎలా బాగుంది అది మనం ఎలా చేయొచ్చు అనే దృక్పథంతో మరిన్ని వ్యాసాలు రావాలని కోరుకుందాం.

  2. “మీ మాట” లో వ్యాఖ్యలు పెట్టడానికి ఏ సదుపాయం లేదు. అది సరిచేయగలరు.

  3. Arvind says:

    Thanks for the video.

  4. Arvind says:

    Right, rather than concentrating on the crap movies, and analysing them, it’s better to concentrate on better movies, and other useful atricles like editing etc.

  5. పులి రాజా says:

    http://beta.thehindu.com/arts/movies/article58559.ece?homepage=true

    ఏమిటీ మన దౌర్బాగ్యం ? మనవాళ్ళు ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదా ?

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.