టైటానిక్, టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు జేమ్స్ కామరన్. ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ సినిమా తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించిన జేమ్స్ కామరన్ ఇప్పుడు తాజాగా “అవతార్” అనే సినిమాతో మన ముందుకు రానున్నారు.
కంప్యూటర్ జెనెరేటడ్ ఇమేజరీ (CGI) ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులను సమ్మోహనపరచడంలో జేమ్స్ కామరన్ సిద్ధహస్తుడని చెప్పొచ్చు. అబిస్ లో సముద్రం అలలు కానీ, టైటానిక్ ఓడ మునిగిపోవడం కానీ, టెర్మినేటర్ సినిమాలోని సీన్స్ కానీ నభూతో నభవిష్యతీ అనిపించేలా ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి దర్శకుడు ఇప్పుడు కొత్తగా మరో సినిమా రూపొందిస్తున్నాడంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మామూలే.
అంతే కాదు. ఈసారి సినిమాని పూర్తిగా 3d లో రూపొందించడమే కాకుండా గతంలో తీసిన 3d సినిమాలలా కాకుండా ఈ సినిమా కోసం ఒక కొత్తరకమైన టెక్నాలజీని కూడా రూపొందించుకున్నారట. ఈ సినిమా చలనచిత్రరంగంలో ఒక కొత్త శకానికి నాంది పలకొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
చూద్దాం. ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. అప్పటివరకూ ఈ సినిమా ట్రైలర్ చూడండి.
G says:
హాయ్ హాయ్!Am waiting for this movie from a long time. But trailers are seen long ago.
suresh says:
య,waiting for the release . వీలైతే aliens of the deep డాక్యుమెంటరీ చూడండి. ఆవతార్ కి ప్రెప్ లాగ వుంటుంది.
అబ్రకదబ్ర says:
కేమరాన్ ఓ అద్భుతంలా అనిపిస్తాడు నాకు. అన్ని బ్లాక్‌బస్టర్స్ తీసినా అతను సినిమా నిర్మాణానికి ఇచ్చే ప్రాధాన్యత తక్కువ. లేకపోతే, ‘టైటానిక్’ వంటి మెగా హిట్ తీశాక పన్నెండేళ్ల విరామం మరే మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ దర్శకుడన్నా తీసుకుంటాడా? సినిమాలు తియ్యటం కన్నా – Aliens of the Deep, Ghosts of the Abyss లాంటి డాక్యుమెంటరీలు తీయటాన్నీ, సముద్రాల గురించీ, ఖగోళం గురించీ అధ్యయనం చెయ్యటాన్నీ అతను మరింత ఎక్కువగా ఆస్వాదిస్తాడనిపిస్తుంది.
Suresh is right about ‘Aliens of the Deep’ being a precursor to ‘Avatar’. మహాసముద్రాల అడుగునుండే వెలుతురు చోరని ప్రదేశాల్లో – సూర్యరశ్మితో పనిలేకుండా – జీవం మనుగడ సాగిస్తున్నప్పుడు, ఏ సుదూర గ్రహమ్మీదనో అలాంటి పరిస్థితుల్లోనే జీవం ఎందుకు పుట్టి పెరగదన్నది జిమ్ కామరాన్ ప్రశ్న. దాన్లోనుండి వచ్చిందే ఈ ‘అవతార్’ కావచ్చు.
G says:
అవునా? లింకెక్కడ దొరుకుతుంది? కాస్త ఇవ్వగలరా?
Vasu says:
ట్రైలర్ ఎప్పట్నించో వేస్తున్నారు. మాంచి హైప్ తెచ్చేసారు ఇప్పటికే. ఇది IMAX ౩డి లో కూడా రిలీజ్ అవుతుందిట. చూడాలి.
jatardamal says:
ఈ సినిమా ప్రివ్యూ 20 నిముషాలు 3D లో చూసాను . ఒక కొత్త లోకం లోకి తీసుకు వెళ్తాడు . మూవీ కోసం వేచి చూస్తున్నాను .
Raj says:
నేను కూడా ఈ సినిమా 20 మిన్ ప్రివ్యు చుసాను… కాని ఆ 3డి అంత గొప్పగా అనిపించలేదు…. మరి మొత్తం సినిమా లొ చూస్తే బావుండొచ్చు అనుకుంటున్నాను. కాని CGI మాత్రం తప్పకుండ చెప్పుకొదగిన విషయం, అందులొ జేంస్ ని మించెవారు ఉండరెమూ. ఎలాగూ “అవతార్” కాబట్టి సాం వర్టింగ్టన్ ని తీసుకున్నారు అనుకున్నాను… కాని ముందు ముందు అతనికి చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి..
vebnkat Balusupati says:
కామరున్ కి సముద్రాలంటే బాగ ఇష్టంల అనీపిస్తుందనడం సమంజసం అనుకుంటా….
KK says:
Avatar – James Cameron’s imagination running wild, and inspiration? Yahoo Emoticons. Crap!