పేరు గొప్ప..ఊరు దిబ్బ..పబ్లిసిటీ అదుర్స్..సినిమా బెదుర్స్ అన్నట్లు తయారైంది తెలుగు సినిమా. ఏ సినిమాకైనా ఎగేసుకుంటూ వెళ్ళటం..కళ్ళు తేలేసి,తల నోప్పి తెచ్చుకుని పారిపోయి బయిటపడటం. తాజాగా రిలీజైన ఆర్య-2 పరిస్ధితి కూడా అలాగే తయారైంది. ఏదో సుకుమార్ తెలివైన వాడే..కాస్త జగడంతో దారి తప్పాడు కానీ అని లోపాయికారీ గా అనుకోనే మాటలు చెరపేయటానికా అన్నట్లు ఈ సినిమా తీసి వదిలాడు. ఇంత గ్యాప్ తీసుకుని ఇంత ఇలాంటి దారణమైన సినిమా తీస్తారని ఎవరూ ఊహించరు. అప్పటికీ రకరకాల వెర్షన్స్, కుప్పలు తెప్పలుగా సీన్స్ రాసుకున్నాడని చెప్పుకున్నారు…ఆ సెగ,శ్రమ అంతా ఏమై పోయిందో. అయినా ఆ మద్య జోష్ సినిమా అప్పుడూ వాసు వర్మ గురించి ఇలాగే చెప్పుకున్నారు..అతనూ తల బొప్పి కట్టించలేదా అంటారా..కరెక్టే కదా..కానివ్వండి.
ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…అనే చక్కని డైలాగుతో ప్రారంభమైన ఆర్య-2 నిజంగానే ప్రేక్షకుల పాలిట శత్రువుగా మారి సహన పరీక్షకు గురిచేసిందచి. ఎన్నాళ్ళగానో..సూపర్ హిట్ ఆర్య సీక్వెల్ అంటూ ఊరిస్తూ వచ్చిన ఆర్య-2 కథా లేమితో గొప్పగా రిలీజై చప్పగా మిగిలిపోయింది. దర్శకుడు సుకుమార్ తెలివి..అతి తెలివి గా మారి..హీరో పాత్ర కన్ఫూజై సినిమా గలీజైంది.అప్పటికీ అల్లు అర్జున్ తన ఎనర్జీతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేసాడు..కానీ కథ అతన్ని ముందుకు సాగనివ్వక ప్రతీ అడుగులోనూ,డైలాగులోనూ ముప్పు తిప్పలు పెట్టింది. అసలు ఫస్టాఫ్ చూసే సరికి హీరో ఏమన్నా సైకో నా అనే డౌట్ గ్యారింటీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత తన స్నేహం కోసం పెళ్ళి చేసుకున్న భార్యని దానం చేస్తానంటే అది కన్ఫర్మ్ అనిపిస్తుంది.(ఎందుకంటే ఇదేమీ కన్యాదానం తరహా స్టోరీ కాదు).ఈ లోగా ఫ్యాక్షన్ భూతం ఆవహించి,కిడ్నాప్ డ్రామాలు కలుపుకుని ఎటెటో వెళ్ళుతుంది. చివరకు ఇంటర్వెల్ కు బయిటకు వెళ్ళిన వారిని ధియోటర్ లోకి రాకూడదు అనిపించేలా చేస్తుంది.
ఇక ఈ సీక్వెల్ లో కూడా ఆర్య(అల్లు అర్జున్) అనాధే. అతనికి అనాధాశ్రయంలో అజయ్(నవదీప్) పరిచయం అవుతాడు. అతన్ని తన స్నేహితుడుగా ఎంచుకున్న ఆర్య బలవంతంగా స్నేహితుడ్ని చేసుకుంటాడు. అంతేగాక ఎప్పుడూ అతన్నే కలవరిస్తూ అతని తోడే జీవితమన్నట్లు బ్రతుకుతూంటాడు(దీనికి రీజన్ వెతక్కండి..అది అంతే). అయితే అజయ్ కు మాత్రం ఆర్య అంటే స్నేహభావం ఉండదు. ఇలా డిఫెరెంట్ గా (గెటప్ కూడా డిఫెరెంట్ గానే ఉంటుంది) పెరిగి పెద్దయిన వీరి జీవితాల్లోకి గీత(కాజల్)ప్రవేశిస్తుంది. అప్పుడు మీరూహించినట్లే ఇద్దరూ ఆమెతో ప్రేమలో పడతారు. క్యాజువల్ గానే ఆర్య తన ట్రిక్ లతో ఆమెను ఆకట్టుకో చూస్తాడు. పనిలో పనిగా ఆమెతో చనువుగా మెలిగే వారిని ఏక్సిడెంట్ దారి తప్పిస్తూంటాడు. అయితే ఆర్య నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో గీత తాను అజయ్ ని ప్రేమిస్తున్నానని చెప్తుంది(ఇదేం ట్విస్టు అనకండి..లేకపోతే కథ కదలదు). ఈ లోగా ఈ మలుపు చాలదన్నట్లు గీత తండ్రి రాయలసీమ ఫ్యాక్షనిస్టు(ముఖేష్ రుషి)తన కూతురుని రైవల్ గ్రూప్ ఫ్యాక్షనిస్టు (సాయీజీ షిండే) కొడుకు సుబ్బారెడ్డి(అజయ్)తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు.గీతను తన గ్రామం తీసుకెళ్థాడు. అటువంటి పరిస్ధితుల్లో గీత పెళ్ళి చెడకొట్టమని…ఆర్య ని అజయ్ అడుగుతాడు..అటువంటి పరిస్దితుల్లో ఆర్య ఏం చేసాడు. గీత ఎవరిని పెళ్ళి చేసుకుందనేది మిగతా కథ.
అప్పట్లో వచ్చిన కాదల్ కొండేన్ (తెలుగులో నేను చిత్రం) లో హీరో పాత్రను పాజిటివ్ చేసి,వినోదాన్ని జతచేసి ఆర్యగా హిట్ కొట్టి శభాష్ అనిపించుకున్న సుకుమార్ ..ఈ చిత్రం దర్శకుడు అంటే నమ్మబుద్ది కాదు. అయితే కాదల్ కొండేన్ ఛాయలు మాత్రం ఆర్య-2 చిత్రంలో కనపడటంతో(హీరో సైకో తరహాలో బిహేవ్ చేయటం, తనకు అడ్డు వచ్చిన వారిని తప్పించటం, సైడ్ హీరోతో పెళ్ళి చేస్తానని ప్రామిస్ చేసి తాను దక్కించుకోవాలని చూడటం వంటివి)ఆ ప్రభావం నుంచి తప్పుకోలేదనిపిస్తుంది. అయితే కాదల్ కొండేన్ లో క్లారిటీ ఉంటుంది. అనాధ అయిన హీరో తాను పెరిగిన పరిస్ధుతుల వల్లే ఇన్ఫీరియారిటీ కాప్లిక్ట్ కు లోనై సైకో లా మారటం ఆసక్తి కలిగించి జాలి వేస్తుంది. అదే ఇక్కడ మిస్సయింది. హీరో గారి సైకో చేస్టల్ని ఇంటిలిజెంట్ ప్లాన్స్ గా చూడమంటే ఎవరు హర్షిస్తారు. ఒకానొక స్టేజీ వచ్చేసరికి ఆర్య విలనా లేక అజయ్ విలనా అనే డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అర్ధమవుతుంది..దీనకి కథా రచయిత సుకుమార్ పెద్ద విలన్ అని. ఇక బ్రహ్మానందం వంటి స్టార్ కమేడియన్ చేత హాస్యం పండించలేక ఆ సీన్స్ వేస్ట్ చేయటం మరో మైనస్. ఎందుకంటే పోస్టర్స్ మీద బ్రహ్మానందంని కూడా హైలెట్ చేస్తూ వేస్తున్నారు. ఈ నాసిరకమైన కధకు మరింత తలనొప్పి స్క్రీన్ ప్లే తోడయింది. ఎక్కడా హీరో,హీరోయిన్ మధ్య లవ్ ఎస్టాబ్లిష్ కాదు.
ఇక ఆర్యకూ ఈ సీక్వెల్ కూ వెయ్యి యోజనాల తేడా ఉంది. అందులో హీరో పాత్రకు ఓ విశిష్టత ఉంది. నువ్వు ప్రేమించకపోయినా..నేను ప్రేమిస్తాను..అంటూ ఫీల్ మై లవ్ అంటూ వెంటపడటం ముచ్చటేస్తుంది. అతని పోటీ అంతా శివబాలాజీ పాత్రతోనే ఉంటుంది. అదే ఆర్య-2 లో హీరోయిన్ ని కూడా తన సైకో చేష్టలతో ఏడిపిస్తాడు. తన చేతులతో తన ప్రేమను తానే కూలదోసుకుంటాడు. అలాగే హీరోయిన్ పాత్ర ఆర్య చిత్రంలో క్లారిటీగా ఉంటుంది. శివబాలాజీ బలవంతం మీద ఆమె అతనితో ప్రేమ ఒప్పుకుంటుంది. అదే ఆర్య-2 వచ్చే సరికి కాజల్ తన మనస్సు ఎవరితో ప్రయాణం చేస్తుందో క్లారిటీ ఉండదు. అవసరం కోసం నవదీప్ తో ప్రేమలో పడ్డానంటుంది. ఆ తర్వాత ఆర్య ను దూరం చేసుకోవటానికి ఆ ప్రేమను కంటిన్యూ చేసానంటుంది. దాంతో తాను ఆర్యను ప్రేమించటం లేదని ఒక్క డైలాగు చెప్పితే కథ అయిపోతుంది కదా అనే డౌట్ తెప్పిస్తుంది.అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్ళి చేసుకున్న అమ్మాయిని హీరో తన స్నేహితునికి ధారపోస్తాననే ఎపిసోడ్ (కన్యాదానం సినిమాలోలా) మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. మా అమ్మాయిని చేసుకోవటానికి ఎవరూ లేరు..నువ్వు చేసుకుంటావా అని హీరోయిన్ తండ్రి అడిగినప్పుడు ఆమె ఆల్రెడీ తన ప్రెండ్ తో ప్రేమలో ఉందనే డైలాగు హీరో చెపుతాడనుకుంటాం. ఎందుకంటే హీరో అక్కడికి వచ్చిందే తన స్నేహితుడు మ్యారేజి సెటిల్ చేయటానికి కదా.
ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగిన అంశాలు లేవా అంటే చాలా చోట్ల దర్శకుడు టాలెంట్ ను,సృజనాత్మకతను ప్రదర్శించాడు. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ లో నాకా సాయిం చేసే వాడు ప్రెండ్ అని అజయ్ పాత్ర అంటే ఆర్య వెంటనే అతన్ని నీళ్ళలో తోసి,రక్షించి సాయిం చేసాను కదా ప్రెండ్షిప్ ప్రారంభిద్దామని చెప్పటం… బలవంతంగా పచ్చబొట్టు పొడిపించటం వంటివి నవ్విస్తాయి. అలాగే సుబ్బారెడ్డి(అజయ్)తో ఆర్య మందు కొట్టే సీన్ బావుంది. ఇక ఫస్ట్ సాంగ్ కు అల్లు అర్జున్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. ఆ కథకు ఆ రెండు గంటలు కూర్చోపెట్టిందంటే అల్లు అర్జున్ ఎనర్జీ నటనే కారణం. ఇక దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రింగా రింగా ఆడియోలో అధ్బుతంగా పేలితే తెరపై తేలిపోయింది. ఆ ఐటం సాంగ్ కు ఏ వర్గం నుంచీ రెస్పాన్స్ రాలేదు. డైలాగులు ఒకట్రెండుతప్ప గుర్తుంచుకునేవి లేవు. వీటికి తోడు బ్రహ్మానందం వంటి స్టార్ కమిడెయన్ ని పెట్టుకుని కూడా ఒక్క నవ్వూ పండించలేకపోయారు. కాస్తా కూస్తో ఎంజాయ్ చేసిందేమన్నా ఉందంటే అది కిడ్నాప్ ఎపిసోడ్ లోనే.
ఏదైమైనా ఈ చిత్రంలో హీరో అతి స్నేహం ఎపిసోడ్స్ చూస్తూంటే ఇవివి చాలా బావుంది చిత్రం గుర్తుకు వస్తుంది.లవ్ ఎపిసోడ్ చూస్తే కాదల్ కొండేన్ జ్ఞాపకం వస్తుంది. టోటల్ గా విపరీతమైన బోర్ వస్తుంది. అయినా ఇద్దరు మగవాళ్ళ మధ్య మరీ అంత రిలేషన్ కాస్త ఇబ్బందే అనిపిస్తుంది. ఇక ఇంత చదివాక కూడా ఈ చిత్రం చూడాలా అంటే అల్లు అర్జున్ వీర ఫ్యాన్స్ కు కూడా కష్టమే అనిపిస్తుందని చెప్పక తప్పదు. జగడం కన్నా దారుణంగా తయారైన ఈ చిత్రం అదే నిర్మాత ఆదిత్యబాబు,దర్శకుడు సుకుమార్ లకు పూర్తి స్ధాయి ఫెయిల్యూర్ సినిమా అవుతుందనటంలో సందేహం లేదు. అలాగే యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని కూడా ఆకర్షించటం కష్టమే..ఎందుకంటే మౌత్ టాక్ చాలా స్పీడుగా స్పెడ్ అయ్యే రోజులివి. బాగోలేదంటే…ఎవరూ ధైర్యం చేయటం లేదు. అవును పాపం ఇంత రివ్యూలోనూ మరో హీరోయిన్ శ్రధ్దా ఆర్య గురించి గుర్తుకురాలేదెందుకంటే..ఆమె పాత్ర సినిమాలోనూ ఏమీ లేదు కనుక.
jatardamal says:
అడ్డు అదుపు లేని క్రియేటివిటీ !!!!!!!!
దేన్నీ క్రియేటివిటీ అనరు పైత్యం అంటారు … అది ఐతే కావలసినంత వుంది …
hero says:
dudes…cinema naku chala baga nachindi….2nd half lo meeku twist lu ardham kakapote chala mandiki aa twist lu oka adventure ride la anipinchayi…..
cinema super…sukumar did a gr8 job….i appreciate dis movie….
vjarowdy says:
మీ రివ్యూ చాలా వెబ్‌సైట్లకి భిన్నంగా ఏమీ లేదు … కాకపోతే ఈ సినిమాకి చాలా విభిన్నమయిన రివ్యూస్ చూస్తున్నా … ముఖ్యంగా యూత్ నుంచి … సినిమా ని ఓ రేంజిలే పొగుడుతున్నారు … నేను చూడలేదు కనుక ఇంతకన్నా ఏమీ కామెంట్ చెయ్యలేను
రాజు says:
యూత్తు ఎఏవిధంగా ఈ సినిమాని పొగుడుతున్నారో కొంచెం వివరింపుడు!
vjarowdy says:
వెళ్ళి వివిధ డిబి ల ని చూడగలరు …
venu says:
well said.. vjarowdy.. the movie was good.. these people are giving negative publicity..
moreover.. navatarangam lo argue cheyyatam waste andi..
కె.మహేష్ కుమార్ says:
బలవంతపు తుమ్మ జిగురులా అతుక్కుని, అది unconditional స్నేహం,ప్రేమ అనిచెప్పుకుంటూ సైకోచేష్టలు చెయ్యడం ఏవిధమైన హీరోయిజమో నాకైతే అర్థం కాలేదు. కథ,కథనంలో వైవిధ్యం పేరుతో ఈ విపరీతాలే మనకు శరణమైతే తెలుగు సినిమాలో మార్పొచ్చేదెప్పుడో!
దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ, కథ-కథనంకొచ్చేసరికీ ఘోరంగా విఫలమయ్యింది.ఈ సినిమాలో మొచ్చుకోవలసింది ఏమైనా ఉంటే అది అల్లుఅర్జున్ డ్యాన్సులు.చాలా కష్టపడిచేసినా, అంతే ఈజ్ తో చేశాడు. తను చేసిన కొన్ని మూమెంట్స్ సమకాలీన హీరోలు ఎవరూ చెయ్యలేరేమో.
naresh kumar gutthi says:
“ఇద్దరు మగవాళ్ళ మధ్య మరీ అంత రిలేషన్ కాస్త ఇబ్బందే అనిపిస్తుంది……….” ఈ సినిమాలో అంత ఇబ్బందిగా ఏమి అనిపిచ్చింది మీకు, మీరు ఎమన్నా తేడా నా
. ఈ సినిమాలో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అంత అసబ్యమైన దృశ్యాలు ఎమన్నా ఉన్నాయా.మరి మీకు కలిగిన ఇబ్బంది ఏంటి.ఇద్దరు మగాళ్ళు క్లోజ్ గా వుంటే తేడా నా ?
ఈ సమీక్ష కూడా అడ్డు అదుపు లేకుండా వుంది. కుమ్మేయండి మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు..ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన మీ లాంటి వాళ్ళని ఆనందపరిస్తేనీ హిట్ లేక పోతే ఫట్ట్. జుట్టు పట్టుకొని ఆడుకుంటున్నారు. ఆడుకోండి ఒక వేల జుట్టు మొత్తం అయిపోయాక అప్పుడు ఏమి చేస్తారు దానికి కూడా ప్లాన్ చెయ్యండి. దయ చేసి మల్ల కోడిగుడ్డు ఆమ్లెట్ గురుంచి చెప్పదండి
సినిమాలకి మాత్రమే ఎందుకు సమీక్షలు తొక్క అని తోక్కేస్తున్నారు….ఈ టీవీ సిరియల్స్, రియాలిటీ షోస్, యాడ్స్ , వీటి పైన కూడా సమీక్షలు రాయచ్చు కదా …….ఈ ఎందుకు రాయరు…….సినిమా వాళ్ళే దొరికారా
ఇది చదివాక ఎవ్వరు రిప్లై ఇవ్వదండి ఇచ్చిన మీకు టైం వేస్ట్ అన్ని వేస్ట్..ఎందుకు అంటే ఇది ఓన్లీ వన్ వే ……….
P.S
ముఖ్యంగా మై ఫ్రెండ్ కత్తి మహేశ్ కుమార్…రిప్లై ఇవ్వకండి ప్లీజ్ ……మీ లాంటి వాళ్ళతో (వితండ వాదులతో) వాదించే ధైర్యం లేదు…….
Take care get well soon.
Srikanth says:
Even after your humble warning I decided to write this comment.
A movie is not going to be a hit or phut just depending on the reviews. Watching a movie and expressing what one thinks of it, is absolutely fine. To me it is just like spending money on some product and at the end of the day if I don’t think it was worth, I’ll obviously thrash it. Since time and money were invested one feels agitated if he/she thinks it wasn’t worth.
To your second point, why not review serials, reality shows etc..why only movies? The answer is quite simple, cant be bothered. Since this forum is devoted to movies, why should they write about other things?
Also if you think that you don’t want to listen to anyone why post your opinion, why not keep it to yourself?
gay says:
naresh kumar gutthi,
how are you ?
రాజు says:
బాబూ గుత్తికన్నా,
వెళ్ళి ఒకసారి ధియేటర్లో ఈ సినిమాని చూడమ్మా. అల్లుఅర్జున్ నవదీప్ ని “నువ్వులేకుండా నేనుండలేనురా” అని కౌగిలించుకున్న ప్రతిసారీ ఘొల్లుఘొల్లున నవ్వుకుంటూ “గే” అంటున్నారు ప్రేక్షకులు. పాత్రల్ని సరిగ్గా డిజైన్ చెయ్యక, ఇలా ఘోరంగా ప్రెజెంట్ చేస్తే రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది.
కోట్లు పెట్టి సినిమాలు చూసేది నాదగ్గర్నుంచీ వందరూపాయలు లాక్కొని లాభాలు చేసుకోవడానికేనమ్మా! మరి నన్ను ఎదవని చేసి వందరూపాయలకు సరిపడా ఇచ్చామంటే ఎట్లా? ఇలాంటి సినిమావోళ్ళ తాటతీసేవాళ్ళు ఖచ్చితంగా కావాలి. నాలాగా మరో కొన్ని లక్షలమంది ఈ సినిమాకు బలవకుండా కాపాడటానికి ఇలాంటి సమీక్షలు కావాలి. జైహో!!!!
yogi says:
neeku friends lera ? vallandaru neelane gays ?
hero says:
o raju garu aithe meeru ippatidaka evarini kougilinchukoledanamata…manchi pani cheshinav….
atlane undu , dimak kharab cheyyakunda…….
ye theatre lo ghollu mannaro vallani adakkunda ikkadakochi disco sestunnar….
nenu release ke chushina…evadu hug chesukunnantha matraana gay anukodu …gays tappa….
venu says:
this is a fitting reply to the reviewer man.. i never saw this site praising a director or a movie.
I think puri jagannadh is true about this review sites..
)
venu says:
awesome comment by naresh kumar gutti.. same feeling with me tooo.
movie was good.. though not the best.. its not a disaster.. this site sucks a big time..
go get a life man.. u reviewer…
Villager says:
Boss meeku cinema ardam kaaledu malli velli choodandi…deentlo mechuko valsina vishayalu chala vunnayi….avanni kanapadaledu ante…meeku ardam kaaledu ani…avun cinema anta different ga vundi…relationship bad anipinchinda?..meeru konchem perverted brain anukunta…meeredo cinema meeda negative publicity ni spee ga spread cheddamani prayatnincharu kani…aarya 1 lane idi mellaga ekkutundi….
Srikanth says:
This has been said again and again on this platform. Every opinion will be counted here. Instead of just making a vague comment like this, we would appreciate if you share what you think of this movie. Everyone derives their own observations and so what you could see we may fail to. So it would be nice if you can write about what you liked and why?; it might open another window for rest of us.
vishvak says:
Apple laaga solid ga ledu, watery ga undi kabatti Orange baledu ante… Tappu Orange daa leka Apple laaga undali anukonna meeda?
Cinema choodaledu kani review choostunte Arya-1 Vs Arya-2 comparison matrame kanipinchindi…
రాఘ్హవ says:
ఈ సిన్మా గురించి నేను చదివిన అన్ని రివ్యూలో చెత్త అనే రాసారు.ఒకటీఅరా డబ్బులు తీసుకుని సమీక్షలు రాసే సైట్లలో తప్పితే.
ఇంకా ఈళ్ళెవరండీ బాబూ….చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్సా కొంపదీసి!!!!!
శాంపిల్ చూస్కోండి నాయనా…
1)http://www.greatandhra.com/ganews/viewnews.php?id=17553&cat=1&scat=12
“-Is the protagonist a sadist or a gay or a mentally imbalanced one?
-Is the heroine character-less who runs behind any man who sheds tears for her?
-Is the director conveying that marriage ritual has no significance?
-Is the director introducing the wife-swapping subject on Telugu screen?
-Is the director confused totally?”
2.http://indiablogs.searchindia.com/2009/11/27/arya-2-review-a-back-alley-abortion
“If you thought Arya was awful, its successor Arya 2, unleashed by a confederacy of dunces, is an apocalyptic nightmare of biblical proportions.
Handicapped by a bizarrely asinine story, infested with a gaggle of buffoons and endowed with an entertainment quotient of Minus Infinity, Arya 2 plunges the knife into the guts of the unsuspecting audience, repeatedly twists the knife scooping up their entrails, one long, painful intestinal strand at a time.”
xxxx says:
ante nuvvu anni sitelalo riviw lu opy codutunnava,,,ra neeyabba
nag says:
cinema mottaanni A to Z varninchesi janaala meeda abhipraayam ruddadam anedi daarunam…cinema lo glitches unnaayi..adi nenuu chebutaanu..kaanii positive points koodaa chaalaane unnaayi…so cinema meeda public gaa verdict ivvatam anedi anavasaram…evari opinion vaaru form cheskuntaaru…
i seriously condemn this reviewer for explaining every scene in order to support his opinion!asalu cinema teesina vaallu veella meeda copyright case pettaali….
jani says:
meeru cheppindi bagane vundi
ite e realty show la gurinchi raste appuu me guts chuddam
Ashok says:
ఫ్లాప్ అవ్వటానికి కావలసిన అన్ని అర్హతలు ఈ సినిమా కి ఉన్నాయ్. సో మీరు కష్టపడి ఫ్లాప్ చెయ్య టానికి ప్రయత్నిచక్కరలేదు. అసలు ఆర్య కారెక్టర్ సుకుమార్ దేమోనని నా నమ్మకం, అంత confusion లో ఉన్నాడు డైరెక్టర్.అతను కన్ఫుస్ అయ్యి మానని torture చేసాడు.
nag says:
director lo unna confusion avvaneeyandi, character lo unna confusion avvaneeyandi…screen meeda reflect ayyindi…one can either accept or reject that confusion…when you observe things around the lead character, you find that confusion acceptable…but, in general it seems ridiculous at times…since majority of people associate themselves with the lead character, an improper justification to the lead character confuses the viewers as well, which leads to the rejection of the character or as a whole the movie …
But, is it a must that protagonist must always be perfect? or should he have no confusion?…why can’t we accept such changes?
story, AFAIK, is not by Sukumar. There are many names in the titles, crediting different people for rachana, rachanaa sahakaaram etc. Watch the movie and have an opinion. Don’t just rub your opinions on others. Sukumar is an intelligent director. If he corrects his few glitches, he would definitely be one among the best of commercially entertaining directors. At the end of the day, we need a movie to get entertained.
గిరి says:
మీ సమీక్షని, మరికొన్ని సమీక్షలని చదివి నా అభిప్రాయన్ని ఓ డెరివేటివ్ రివ్యూగా ఇక్కడ వ్రాసాను
http://bhaavamulona.blogspot.com/2009/11/blog-post_28.html
chavakiran says:
బాబులూ,
ఈ తెంగ్లీష్ వారిని, ఇగ్లీష్ వారిని నిషేధించి మమ్ము కాపాడండి.
hero says:
cha…anthoddule kani lite teesko….ee matram chadavadam kuda ranivadivi enduku chadavadam…
vere comments chaduvuko
gay says:
i second you
gay says:
chavakiran, i second you
krishna says:
చావా గారు చెప్పినట్లు, వ్రాయగలిగితే తెలుగులొ వ్రాయండి, లేకపోతే ఆ వ్రాసేది ఎదో english భాషలో వ్రాయండి. మధ్యలో దయచేసి ఈ తెంగ్లీష్ లో వ్రాసి ఇద్దరూ చదవకుండా చేయకండి.
Unknown says:
మీకు అర్దం కాలేదు, అందరికీ అర్దం కాదు అనుకుంటే పొరబాటు. సినిమా హిట్. నీళ్ళు లేని గోయ్యి చూసుకొని దూకి చావండి.
srikanth says:
may your soul rest in peace.
xxxxx says:
nee yabba neeku cinima chuse paddati telusa raa,,, cinimani cinima laga chudalira re,,,, asalu photographi ela undira , inka screen play ela undira , asalu cinimalo enni twist lu unna ekkada confugion undadu , anta clear ga untundi , neeyabba ilanti riviw lu inka eppudu rayavaddu re .
yogi says:
reviews rasebadulu nuvvu oka cinema thesi chupincharaadu ?
Vasu says:
నాకైతే సినిమా నచ్చింది. సుకుమార్ చాలా ఇంటెల్లిజెంట్ డైరెక్టర్ అనిపించాడు. కాకపోతే నిడివి కొంచం తగ్గించి ఉంటె బావుండు అనిపించింది. ‘నేను’ సినిమా దీని కంటే బావుంది అనడం మరీ అన్యాయం అనిపించింది.ఇక్కడ మరీ ప్రతీ సినిమాని (బావున్నవి కూడా) ఈకలు పీకి (లేకపోయినా) ఏకి పారెయ్యడం నాకు మింగుడు పడలేదు.
pradeep says:
Aarya2 gurinchi raasindi nijame. Endukante meeru raasindi abaddam anukodaaniki ledu kaabatti. Elaa antaaraa collections cheputaayi. Cinema enni rojulu aadedi telisi potundi kadaa.
Ready says:
Cinema bagolekapote bharinchalenivallu first day second day poti padi black tickets koni enduku chustaru. Anavasaranga starting lo business penchadaniki kakapote. rendu rojulagi story chadivi reviews chusi chudachu anipiste velli chudachu kada.avesanga first day velli black ina sare movie chuseyadam tananoppi teppinchadu boppi kattinchadu money waste chesadu ani edavatam endukoo nakartham kavadam ledu.
అబ్రకదబ్ర says:
ఈ మధ్య ఏ సినిమా రివ్యూ చూసినా ‘రవితేజ మాంఛి ఎనర్జీతో నటించాడు’, ‘ఎన్టీయార్ ఎనర్జీ కుమ్మేశాడు’, ‘అర్జున్ ఎనర్జీతో లాగించాడు’ అనే వాక్యం తప్పనిసరైపోయింది. ఏమిటీ ఎనర్జీ! అర డజను రెడ్ బుల్ టిన్నులు ఖాళీ చేసి నటించటమా?
Heera says:
ha ha
Good Question..
పులి రాజా says:
నాదీ అదే డౌటు. ఒక రౌడీ ని ఒక్క దెబ్బకే పడగొడితే,మంచి పంచ్ డైలాగులు వాడితే అది కూడా ఎనర్జీ ఏమో ?
కె.మహేష్ కుమార్ says:
“ఎనర్జీ” సంగతేమోగానీ,స్క్రీన్ ప్రెజెన్స్ అనేదొకటుందిలెండి. కొందరు నటులు తెరమీద ఉంటే మిగతా నటులు ఆనరు. ఇక సీన్ మొత్తంలో ప్రదర్శనకు ఆ నటుడికే అవకాశం ఉంటే ఇక చెప్పనలవికాదు. ఈ సినిమాలో చాలా దృశ్యాలు అలానే ఉంటాయి. అల్లుఅర్జున్ కాక మరెవరైనా ఆ సీన్లో ఉంటే డొకొచ్చేసేదే. బహుశాదాన్నే కొందరు “ఎనర్జీ” అంటున్నారేమో!
Heera says:
Its true. The movie runs only on Arjun’s performance. Though he gets full marks for his performance its the director who fails miserably in telling a story of this kind.
prathik says:
correct mahesh gaaru
screen presence ani cheppi chiru post Indra movies antha vaade burra pichi ekkedi
comedy artists vunna kooda adi tane chesevadu 2.15 min vadine choodalsi vachedi 2.30 gantala cinemalo 15 min intermission
rudraveena says:
baabu prathik,
chiru ne vaadu ane thopaaa baabu nuvvu….noru adupulo undaale…..lekapothe K.C.R laa iyipothaaav….
undanaa mari…
vjarowdy says:
మీరు కొంపదీసి మహేష్ ఫ్యాన్ కాదు కదా … ఏమీ లేదు … ఎనర్జీ అంటే ఏమిటో తెలీదంటేనూ డౌటొచ్చింది j/k*
అబ్రకదబ్ర says:
లయోలాలో నేను మహేష్ సీనియర్ని. అతనే నాకు ఫ్యాన్
hero says:
kcr ki cheppandi khaaleega bed meeda padukunnadu..he he he
నాగన్న says:
రివ్యూ రాసి కాపాడినందుకు థాంక్స్.
శంకర్ says:
నచ్చని విషయాలు అందరూ చెప్పేసారు కాబట్టి, నచ్చినవి నేను చెప్తా…
… ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తిస్తూ కూడా చివరికి అందరికీ న్యాయం చేసినట్టు అనిపించింది.
హీరోగారి కన్‌ఫ్యూజింగ్ క్యారెక్టర్. ఎప్పుడూ తెలుగు సినిమా హీరో అంటే Mr.perfect అనే మూస నుండి ప్రేక్షకుల్ని బయటికి లాగడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా అవసరం. నేను బాగా ఐడెంటిటిఫై చేసుకున్నా
సుకుమార్ క్రియేటివిటీ కొన్నిసార్లు అతిపోకడలు పోయినా (ప్రస్తుత తెలుగు సినిమా పరిస్ధితికి అంతే మరి) చాలా వరకు నచ్చుతాయి. ఫ్రెండ్‌తో coin flipping, ప్యాక్షనిస్ట్ లు ఒకళ్లమీద ఒకళ్ళు లేని నమ్మకాన్ని చూపించడానికి పడే తంటాలు, కిడ్నాపింగ్, జీప్‌లో ముగ్గురు లవర్స్ తో గీత వెళ్లడం,క్లైమాక్స్ లో ఫ్రెండ్‌ని వెధవని చెయ్యటం (ఇది నాకు లాజికల్‌గా అనిపించింది, ఎందుకు అనేది ఇక్కడ చెప్పదల్చుకోలేదు, ఇంకా సినిమా చూడాలనుకొనేవాళ్ళ కోసం) వగైరా…
ఒకసారి చూడొచ్చు వెరైటీని ఇష్టపడేవాళ్ళు…
Heera says:
If the director had avoided the point of hero marrying the heroine, this movie would definitely have been more acceptable.
Some more positive things are Arjun’s dance, comedy in first half of the movie.
I had enjoyed most of the movie keeping aside the logic.
aarya says:
aarya it is a youth film . youth ki matrame nachuthundhi .
G says:
Not as bad as depicted here.
My rating is 2.5 out of 5.
శివ కిషోర్ కందుకూరి says:
World AIDS Day ఏర్పాటులలో చిరాకుగా ఉండి… రాత్రి ౨వ ఆటకు వెళ్లాను… చిరాకు కాస్త తలనొప్పిగా మారి, ఏదైనా psychological disorder వస్తుందేమోఅని బయం వేసింది… director pervarted అనిపించింది… సినిమా మొదట్లో కొంచం clarity miss అయ్యింది, హిరోఇన్ పై అల్లుఅర్జున్ ప్రేమ సిన్సియర్ అని నిరూపించలేకపోయాడు. చివరలో విలన్ కనుక హీరో పై ఒక డైలొగ్ (వీడు అంతే, వీడికి అందరూ కావాలి)ఇవ్వకపోతే ఆ ఫీల్ అయినా వచ్చేదికాదు. ఏమైనా పై మిత్రుడులు అన్నట్లు flop అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయి… కానీ అల్లు అర్జున్ అడ్డుపడుతున్నాడు…
G says:
flop అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయి… కానీ అల్లు అర్జున్ అడ్డుపడుతున్నాడు…
True indeed. One can bear this movie only for him. He himself got those 2.5 that I gave this movie. But some of the negative comments are exaggerated ones.
Sukumar's Soul says:
Oh god..!! please tell me how to make a film for Tollywood…even those people who at least can write a blog cant accept a new idea…!!! God bless A.P.!!! why cant a hero be psycho or sadist or killer…why he always has to be gentleman…!!!
rayraj says:
సుకుమారా! బాధ పడకు. సినిమాలు ఎందుకు హిట్టో ఫ్లాపో మహుమహులు కూడా తేల్చలేరు. అలాంటి ఫార్ములా అనేది ఒకటి లేదు. ఉన్నా జీవితం చాలా బోరు కొడుతుంది. పోతే, ఆర్య క్యారెక్టర్ (ముందటి సినిమాతో సహా) ఒక సైకో క్యారెక్టర్ అన్న విషయం దర్శకుడికీ, ప్రజలకీ, అల్లు అర్జున్‌కీ అర్ధం అయ్యే చేశారా లేదా అన్న విషయమే కొందరికి అర్ధం గావటం లేదు. కనీసం మీరు దాన్ని “సైకో క్యారెక్టర్” అని గుర్తిస్తే చాలు,నేను మీతోనే ఉంటాను.
“హీరో”కి, కథానాయకుడికి (ప్రొటగనిస్టుకి) చిన్న తేడా ఉంది. “హీరో”ని అందరూ ఎడ్మైర్ చేసి, వాడిలా ఉండాలి అనుకోవచ్చు. సైకోని చూసి, ఎందుకు అది సైకో అనబడుతుందో, ఎందుకని మనుష్యులు అలా ఉండకూడదో తెలుసుకోవాలి. ’వీడు సైకో క్యారెక్టరు, ఐ అడ్మైర్ సైకోస్’ అనే వ్యక్తులను చూసినప్పుడు, “ఏం జరుగుతోందిక్కడ. నాకు తెలియాలి” అని కొంతమందన్నా అడుతారు. అలా కాకుండా “ఇది సైకో సినిమా! భలే ఉంది” అంటే, సినిమా బావుంది గావాల్ను అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీకెలా అనిపించింది? మీ ఆర్యని చూసి అందరూ ఎడ్మైర్ అవ్వాలనుకున్నారా!? లేక ’ఒక ఆర్యలాగా ఎవ్వరూ ఉండకూడదు’ అని చెప్పాలనుకున్నారా!? అసలు ఆర్యద్వారా చెప్పదలుచుకుంది ఏంటి!? పోనీ ఎంటర్‌టైన్ ఔతాం అనుకున్నారా!? ఎలా ఔతాం అనుకున్నారు!?
మీకో ఉదాహరణతో, క్లియర్‌గా చెప్తాను. బ్రోకెన్ యారో సినిమా చూస్తే, జాన్ ట్రావొల్టా నటన నచ్చుతుంది. కానీ, ఆ సినిమాకి/కధకి హీరో మాత్రం క్రిస్టియన్ స్లేటర్. ఈ విషయం మీకు ఆ సినిమా చూస్తే అర్ధమయ్యిందా లేదా!? ఆ క్లారిటీ మీ సినిమాల్లో ఉన్నదా అని ప్రశ్నించుకొని, ఇన్నేళ్ళ కృషికి మీరే మార్కులేసుకోండి. పోనీ అదేదో బాల్‌చందర్ – చిరంజీవి సినిమా ఉంది. అందులో చిరంజీవి శాడిస్టు. హీరోయిన్‌ని ఫారిన్ (అమెరికా కాదు. ఫ్రాన్స్ అనుకుంటా) తీసుకెళ్ళి, తన శాడిజంతో ఆనందపడతాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన నచ్చినంత మాత్రాన, మీరూ చిరంజీవిలో దూరి శాడిజంని ఆనందించినంత మాత్రనా, మాటవరసకి సినిమా హీరో చిరంజీవి అన్నంత మాత్రన, ఆ పాత్ర ఆ సినిమాకి హీరో కాదు.ఆ పాత్రని “విలన్” అంటారు. ఆ క్లారిటీ బాల్‌చందర్‌కీ, చిరంజీవికీ ఉంది. పోనీ బాజీగర్ సినిమా ఉందనుకోండీ, అందులోనూ షారుక్ ఖాన్‌కి, దర్శకుడికీ ఆ పాత్ర “నెగటివ్” అనే విషయంలో క్లారిటీ ఉంది. ఇప్పుడు చెప్పండీ, ఆర్యలో అల్లుఅర్జున్‌కీ, మీకూ ఉన్న క్లారిటీ ఏంటో!?
ఒకవేళ మీ ఉద్దేశ్యం- ’సైకో క్యారెక్టర్లుగా పిలవబడ్డవారు, అణిచివేయబడ్డ హీరోలు. వాళ్ళ తరుఫున ఇది నా సినీ అభివ్యక్తీకరణ, పోరాటం” అని చెప్పటమే ఐతే, ఆ విషయం కూడా మాకు స్పష్టం అవ్వంలేదు.అదన్నమాట విషయం.
K మహేశ్ కుమార్ says:
@రేరాజు: మీరు మరీనండీ బాబూ!
ఫిల్మ్ థియరీ. సైకోఅనాలిసిస్ లాంటి ధియరెటికల్ పరికరాల్తో సుకుమార్ గారి వ్యాఖ్యని ఏకేసారు. ఇవన్నీ “మనకు” అవసరం లేదు అని నమ్మిన చిత్రసీమ మనది. నాయకుడికి-కథానాయకుడికీ తేడా ఒకప్పుడుండేది. ఇప్పుడుండేదల్లా దొంగ హీరోలు-విలన్ హీరోలు-పిచ్చి హీరోలు-బలాదూర్ హీరోలు-అనాధ హీరోలు- సైకో హీరోలు-శాడిస్ట్ హీరోలు-అపహాస్యాన్ని హాస్యమనుకునే హీరోలు.
ఆ హీరోలలో చాలామంది నటులు కాదు. డ్యాన్సులు, ఫైట్లు, గుర్రపుస్వారీవంటి విద్యలుతప్ప నటన అనే ఒక అనవసరపు విషయం జోలికి అస్సలు వెళ్ళని బాపతే. మరి వాళ్ళకు పాత్ర ఔచిత్యం, పాత్ర పోషణ, హీరోస్ జర్నీ లాంటి విషయాలెందుకండీ!
sukumar's soul says:
Hey dont you forget Arya is a super hit hitting 100 days,same as Arya 2.pople like it.infact everyone loves it,you can’t tell the whole world “Don’t admire psychos..Do you?”.hey tell me frankly what character do you like most in the film “Dark Knight”.is it Joker or Bat Man.? You know.both have same purposes.First one wants to prove the world every one has a ugly person inside them.Another one has a purpose of saving the world.Can you remember the dialogue.”Any one can go Mad including Dent.all you need to do is Push”. “Those are only as good as the world allows them to be.I will show you when the chips are down,these civilized people,they will eat each other.” Its a Game.
rayraj says:
ఇంకా ఏం చెప్పను సుకుమారా! జోకరే మనందరికీ నచ్చినా కూడా, జోకరే “విలన్” , బాట్‌మానే “హీరో”. ఆ క్లారిటీ నాకుంది. మీకుందా!? క్లారిటీ కోసం, నా బ్లాగులో ధర్మకధలు అనే మూడు భాగాల పోస్టు చదువుకోండి. దొరకవచ్చు.
నిన్న సినిమా చూశాను. ఎంజాయ్ చేశాను. ’సీనియర్’ సైకోతో ఫ్రెండ్షిప్ నుంచి, రాయలసీమ ఎక్సిట్ దాకా నిజంగానే ఎంజాయ్ చేశాను. యథావిధీ నవనీత్, కాజల్ క్యారెక్టర్స్‌ని దారుణంగా యసాసినేట్ చేసేశారు. అందుచేత మీరు చెప్పిన ఆ లాజిక్కులన్నీ వేస్టు. ఉత్తగా నచ్చేవి, నచ్చనివి ప్రతి మనిషికీ బోళ్డుంటాయి. వాటికి లాజిక్కులక్కర్లేదు.
బబులుగమ్ములు కూడా అస్సలక్కర్లేదు. ఒకే!
ఐనా అందరికీ, అల్లు అర్జున్ అడ్డుపడుతున్నాడంటూ వాడిమీదేంటి జాలి!? నాకు నవనీత్ మీద చాలా జాలేసింది. ’చందమామ’లో “నెగటివ్ షేడ్”ని నవనీత్ కూడా బాగానే చూపించాడు. అంతవరకూ ఆ దర్శకుడు కూడా బానే తీశాడు. అదంతా బానే పండింది. మరి ఈ సినిమాలో ఎందుకని వీడిని వెధవని చేశారు!??
ఈ “orayraj” ఎవరో బహుశా మీ ఫ్యాన్‌లా ఉన్నాడు. ఆల్మోస్ట్ నా కామెంటెంతా కాపీ చేసి “ఆహా, ఓహో ఏం చెప్పారు” అంటాడేగానీ, తనేమీ చెప్పలేడు పాపం. ’సైకోతో ఎకసెక్కాలొద్దూ అని చెప్పినా మీ ఫ్యాన్సుకి అర్ధంకావటం లేదు’ అని నేను ముందే చెప్పానా లేదా? చూస్కోండి మరి.
@orayraj: “……..పోతే తీయకూడదా ” – తీయవచ్చు. కామెంటుని పూర్తిగా చదివితే, ఈ డౌట్ రాకూడదు.
orayraj says:
” అడ్మైర్ సైకోస్ ” ఇది ఒక్కటి చాలు .
“మీ ఆర్యని చూసి అందరూ ఎడ్మైర్ అవ్వాలనుకున్నారా!? లేక ’ఒక ఆర్యలాగా ఎవ్వరూ ఉండకూడదు’ అని చెప్పాలనుకున్నారా” ——– అంటే ఈ రెండిటిలో ఏదన్నా చెపితేనే సినిమా తీయ్యలా లేక పోతే తీయకూడదా ….చాల బాగా చెప్పారు సూపర్బ్ అసలు ………..కేక .అసలు ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు అండి…..:)
“బ్రోకెన్ యారో సినిమా చూస్తే, జాన్ ట్రావొల్టా నటన నచ్చుతుంది. కానీ, ఆ సినిమాకి/కధకి హీరో మాత్రం క్రిస్టియన్ స్లేటర్. ఈ విషయం మీకు ఆ సినిమా చూస్తే అర్ధమయ్యిందా లేదా!? ఆ క్లారిటీ మీ సినిమాల్లో ఉన్నదా అని ప్రశ్నించుకొని, ఇన్నేళ్ళ కృషికి మీరే మార్కులేసుకోండి. పోనీ అదేదో బాల్‌చందర్ – చిరంజీవి సినిమా ఉంది. అందులో చిరంజీవి శాడిస్టు. హీరోయిన్‌ని ఫారిన్ (అమెరికా కాదు. ఫ్రాన్స్ అనుకుంటా) తీసుకెళ్ళి, తన శాడిజంతో ఆనందపడతాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన నచ్చినంత మాత్రాన, మీరూ చిరంజీవిలో దూరి శాడిజంని ఆనందించినంత మాత్రనా, మాటవరసకి సినిమా హీరో చిరంజీవి అన్నంత మాత్రన, ఆ పాత్ర ఆ సినిమాకి హీరో కాదు.ఆ పాత్రని “విలన్” అంటారు. ఆ క్లారిటీ బాల్‌చందర్‌కీ, చిరంజీవికీ ఉంది. పోనీ బాజీగర్ సినిమా ఉందనుకోండీ, అందులోనూ షారుక్ ఖాన్‌కి, దర్శకుడికీ ఆ పాత్ర “నెగటివ్” అనే విషయంలో క్లారిటీ ఉంది” —————–క్లారిటీ అంతా బాగా తెలిసిందా అండి………ఆ సినిమాలో పని చేసిన డైరెక్టర్ ..హీరోస్ మీ దగ్గరకి వచ్చి క్లియర్ గా చెప్పరా ………..ఈ మాత్రం క్లారిటీ వుంటే చాలు……………..ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు………:)
“ఒకవేళ మీ ఉద్దేశ్యం- ’సైకో క్యారెక్టర్లుగా పిలవబడ్డవారు, అణిచివేయబడ్డ హీరోలు. వాళ్ళ తరుఫున ఇది నా సినీ అభివ్యక్తీకరణ, పోరాటం” అని చెప్పటమే ఐతే, ఆ విషయం కూడా మాకు స్పష్టం అవ్వంలేదు.అదన్నమాట విషయం.” —— అబ్బ విషయం మాత్రం బలే చెప్పారు అండి………అసలు…….ఏమి చెప్పారు ఏమి చెప్పారు……….ఇంత బాగా చెప్పారు మరి మీరే ఒక సినిమా తీయచ్చు కదా……..ఇంకొకళ్ళ పైన నాకు అర్థం కాలేదు అని ఏడవడం దేనికి ……..ఇది కూడా ఒక రక మైన సైకో బిహేవియర్ లాంటిది కాదా.
@mahesh Kumar
ఇంకా మన మహేష్ కుమార్ కి ఈ ప్రపంచం లో అన్ని ఆయనే……director, actor, ఇంకా ఎమన్నా వున్నా అన్ని ఆయనే. అసలు మీరు తమిళనాడు లో పుట్టాల్సింది పొరపాటున ఈ పక్క వచ్చేసినట్టున్నారు. తమిళ్ వాళ్ళు ఏమి తీసినా ఆహా ఒహో .సూపర్బ్ బంపర్ కేక కెవ్వ్……అని అన్ని కోసుకునే ఈయనకి తెలుగు సినిమాలు నచ్చావు……ఒక వేల తీసి చూపెట్టమంటే చూపారు …..ఎమన్నా అంటే ఒక తొక్కలో కోడి గుడ్డు ఆమ్లెట్ ఎగ్జాంపుల్ చెపుతారు ……….మీరు ఒక్క సినిమా తీయచ్చు కదా………అది ఎన్ని రోజులు ఆడుతుందో. ఎంత మందికి నచ్చుతుందో ………..ఎంత డబ్బు కల్లెక్ట్ చేస్తుందో చూడాలని వుంది…..
have a good life………..
venkataramana says:
//ఆర్య క్యారెక్టర్ (ముందటి సినిమాతో సహా) ఒక సైకో క్యారెక్టర్….
ముందు సినిమాలో ఆర్య ని ఎలా సైకో కారెక్టర్ అంటున్నారో నాకు అర్ధం కావటం లేదు. కావాలని ఎవరికీ హాని తలపెట్టడు. నిజ జీవితంలో ఇంకో అబ్బాయిని ప్రేమించే అమ్మాయిని అతని ముందే ప్రేమిస్తున్నాను అని చెప్పటం జరగదు కదా అనే సందేహం మీకు రావచ్చు. ఆ ఒక్క విషయాన్ని వదిలేయండి. ఆ సినిమాలో హీరోయిన్ కి అజయ్ మీద కలిగేది సహజ ప్రేమకాదు. ఎలాంటి ప్రేమ నిలుస్తుందో , ఎటువంటి ప్రేమ నిలవదో సినిమాలో ఉంది అనిపిస్తుంది కదా. అతనిది ప్రేమ అనేకంటే ఆరాధన అనుకోవచ్చు. ఆమెకి ఇష్టమైన ప్రతిదీ ఆర్యకి కూడా ఇష్టమే. ఆరాధించే వ్యక్తి ఇష్టాయిష్టాలను మన్నిస్తాడు. అందులో సైకోతనం ఏంటో నాకు అర్ధం కాలేదు. నా ఉద్దేశంలో సైకో సినిమా అంటే తమిళం నుంచి తెలుగుకి డబ్ అయిన మన్మధ అని ఒక సినిమా ఉంది. అది సైకో సినిమా . తనకు జరిగిన నష్టానికి మొత్తం అమ్మాయిల మీద పగ. ఆర్యలో తను ప్రేమించిన అమ్మాయి అభిప్రాయాలకు విలువనిస్తాడు. నా దృష్టిలో అది ఆదర్శవంతమైన సినిమా.
rayraj says:
ఇంకా “మన్మథ” ఒక సైకో సినిమా అనే క్లారిటీ మనకి ఉండటం చాలా ముదావహం.ఆర్యని అందరూ నార్మల్ అనుకుంటే, నేను ఎడ్జస్టౌతా. ఒక వేళ సైకోలే హీరోలంటే, నేనూ ఓ సైకోనౌతా. అంచేత ఇక వదిలేద్దాం. అడిగారు గాబట్టి రెండు విషయాలు చెబుతాను:
౧.కావాలని ఎవరికైన హాని తలపెట్టడాన్ని సైకో అంటామా!? దుర్మార్గం అంటామా?అప్పుడు సైకో ఎవరు!?దుర్మారుడెవరు!? సైకోలందరూ హానికారకులవ్వాలని లేదు. నార్మల్ మైండ్ “ఇది” అని చెప్పలేం గాబట్టి, అందరూ కొంచెం సైకోలమే అనేది మరో థియరీ.
౨. మీరు చెప్పిన లాజిక్కులోనే, నా దృష్టిలో ఆర్య 2 కూడా ఆదర్శవంతమైన సినిమానే! ఇంకా ఆదర్శంగా “భావింపబడని” విషయాలని చెప్పే దమ్ము, ఈ దర్శకులకి లేదు, including Ram gopal varma and his desciples like Puri. That should give you the range of my confidence interval.
venu says:
clarity clarity ani dobbutunnaav.. em clarity kavalo cheppu babu neekippudu.. nenu theerusta..
hero says:
emayya rayi…
arya cinema chudalante nuvvu adigina vishayalu…psycho gurinchi vivaralu telusukovalannamaataa…
inka hero 1st fight gurinchi mbbs chadivi, fight master deggara vishayalu telsukuni chudalannamaata..
bagu bagu inka cheppandi …kasepu navvukuntanu
rayraj says:
>> “ఒకానొక స్టేజీ వచ్చేసరికి..డౌటు వచ్చేస్తుంది. ఆ తర్వాత అర్ధమవుతుంది..దీనకి కథా రచయిత సుకుమార్ పెద్ద విలన్ అని” –
)
)
>> టోటల్‌గా విపరీతమైన బోర్ వస్తుంది. –
కాకపోతే >> “ఇక ఆర్యకూ ఈ సీక్వెల్ కూ వెయ్యి యోజనాల తేడా ఉంది. అందులో హీరో పాత్రకు ఓ విశిష్టత ఉంది. నువ్వు ప్రేమించకపోయినా..నేను ప్రేమిస్తాను..అంటూ ఫీల్ మై లవ్ అంటూ వెంటపడటం ముచ్చటేస్తుంది”
- అలాగా? ముచ్చటేసిందా!? అది సైకో క్యారెక్టర్ అని అనిపించలేదా!?
సో ఆ మాత్రం సైకో ఇప్పుడు నార్మల్సీగా మారి పోయిందన్నమాట. ముచ్చట కూడా వేసిందన్న మాట.సారీ మై ఫ్రెండ్! ఇట్స్ ఎ సైకో క్యారెక్టర్ దెన్ యాజ్ వెల్. బట్ దెన్ వాట్స్ నార్మల్సీ!? ఎ బిట్ ఆఫ్ సైకో ఈజ్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అజ్. రైట్!?
కామెంట్లలో :
) నాకు డౌటేలేదు. ఈ మధ్యే టివిలో ఫేసు చూశాను. వీళ్ళ ’ఫ్రెండ్‌షిప్ డెఫినిషన్స్’ ఎందుకు తేడాగా ఉంటాయో కూడా అప్పుడే మెల్లిగా అర్ధమవ్వటం మొదలయ్యింది.
)…..ఔను…వై కాంట్ వి యాక్సప్ట్ సచ్ చేంజెస్?
>>అసలు ఆర్య కారెక్టర్ సుకుమార్ దేమోనని నా నమ్మకం-
>> director lo unna confusion avvaneeyandi, character lo unna confusion avvaneeyandi…screen meeda reflect ayyindi…one can either accept or reject that confusion……..
But, is it a must that protagonist must always be perfect? or should he have no confusion?…why can’t we accept such changes?
-
నేనింకా సినిమా చూడలేదు. డోంట్ వర్రీ.. ఈ రివ్య్యూలతో వాళ్ళ బిజినస్ దెబ్బతినదు. నేను ఈ సినిమా చూడకపోతే నష్టపోయే నా పేద ఫ్రెండ్స్ అంతా ఫుట్‌పాత్ మీద ఉంటారు. వాళ్ళ కోసం, ఈ సినిమా తప్పకుండా చూస్తాను. ఎటొచ్చీ సుకుమారంత ట్యాలెంట్తో మా వాళ్ళు మళ్ళీ తీసారా లేదా అనేది నా భయం.
కొన్ని ప్రశ్నలు : ఇప్పుడు మీరు ’గే’ కాదు. కానీ ఆర్యా ’గే’ అనుకుందాం. ’నువ్వు ప్రేమించకపోతే పోనీ, నేను ప్రేమిస్తాను’ అంటూ మీ భుజం మీద చెయ్యేస్తాడు.నడుం చుట్టు చేయేస్తాడు. తొడ మీద చరుస్తాడు. చేతులు నలుపుతాడు. ’ఏ? ఫ్రెండ్స్ చేతులు వేసుకోరా’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీరు ఎలా ఫీలౌతారు!? ఒంటిమీద జర్రులు పాకినట్టు ఉంటుందా లేక తియ్యగా ఉంటుందా!? లేక మీకు ఒంటిమీద జర్రులు పాకినప్పుడు మాత్రమే మనసంతా తీపుగా ఉంటుందా!!??
ఏదేమైనా, అన్ని రకలా సెక్సుయల్ ఓరియెంటేషన్లకి రక్షణగా ఉండాల్సిన చట్టాలుకూడా ఉంటే బావుణ్ణు. అలాగే “గృహహింస చట్టం” అంటే స్త్రీలను మాత్రమే రక్షిస్తుందిట! పాపం మరి భర్తల సంగతో!!
@giri: డిరైవేటివ్ సమీక్ష, ఆర్యప్రేమ – రెండు వీరతాళ్ళు
)
)
సమీక్షలొద్దనే ప్రజానీకానీకానికి మీరు ఈ లీగలైజ్డ్ విపణి సమీక్ష విధానం గురించి సరిగ్గా నేర్పిస్తారా
అలాగే రివ్య్యూల వల్ల సినిమా హిట్ ఫట్ అవ్వదు అనటం కూడా తప్పనిన్నీ, ఈ విపణి విధానం ద్వారా మనమూ ఓ అభిప్రాయం ఏర్పరుచుకోవడం తప్పులేదని, అసలు నిజానికి సినిమాలకీ ఫ్యూచర్స్‌ని తొందరగా ప్రవేశపెడితే, ప్రొడ్య్యూసర్లు హెడ్జింగ్ చేసుకోవచ్చని నేర్పించవచ్చు కద! లేకపోతే ఇంకా అమెరికాలో సినిమాలకి హెడ్జింగ్ లేదు కాబట్టి, వాళ్ళు చేసే దాకా మనకి కాపీకొట్టడం రాదనుకోవాలా!?
free says:
యూత్ కు సినిమా బాగోలేదు. రెండు వారాల సినిమా. గే గాళ్ళు సినిమా బాగుందంటున్నారు.
hero says:
mee dad ki intaki nachindo okasari kanukkopoyaavaa?
premsai says:
Dear all………..
Meeru chese cooments chaalla clarity ga vuntunnayi……oka director teesina film lo meeru inni minus, plus points vetiki pattukuntunnarante meedhi chaala creativity mind….
kaani oka vishyam meeru chese comments valla mana ( telugu ) cinema ilanti paristhulalo vunda ani badha vesthondhi…………prathi oka actor ni, director ni ila cheppukuntu pothe chaala mandhi vuntaru…..veellani criticise cheyyadam emibagaledhu………..
navatarangam readers ki oka advice……….meelo antha creativity vunte meere oka film direct chesi choopincha vachukada………
?
chivariga oka advice ye vishyam meedha ayina criticise cheyyadam easy………..kaani chesi chupinchadam chaala kastam////////
రాజశేఖర్ says:
నేను మొన్ననే ఆర్య-2 సినిమా చూసాను. నాకైతే ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా కథానాయకుడిని, అతడి భావోద్వేగాలని చూపించడానికి సుకుమార్ పడ్డ తపన స్పష్టంగా కనిపించింది.ఈ సినిమా ద్వారా ఒక వైవిధ్యమైన కోణాన్ని ఆవిష్కరించారు.
Sukumar's Soul says:
When we make films we keep two things in mind
1.We strongly believe that “this movie is for only Telugu people”, who live normally in Villages,Small towns(where the standard of living is so low that they can’t even think about reading a review before going to film).
2.We strongly believe that, no matter what, 70 out of 100 people who watches our films are not ready to break our traditions(I mean they may not have open mind to accept whatever we show on screen).
We the people of A.P., are living with some conditions and Trends which keep us happy everytime unlike U guys who live in some of the most advanced countries writing blogs and commenting our films and our entertainment sources.You guys decided to stay AWAY from our country and from our state please stay AWAY from everything,watch some of the great f..ing hollywood films(which in fact a single story told everytime with more money added to it) and live the rest of your life happily.why in the hell you even care about our films.if your family and frends want to watch it just watch and leave it.But dont try to suggest Us.No one even cares you.Trust me on that.
Do you really think you can change everything just like that.Guys its mission impossible.just forget about it.even if you want to change everything you need to change Everything.
Do you really think People will listen to you???? Don’t even think about it. More over your comments really hurt.
Sowmya says:
నేను నిన్నే ఈ సినిమా చూశాను.
నాకైతే బాగుంది. కథలో ఈ తరహా మలుపులు, అసలా హీరో పాత్ర చిత్రీకరణ నాకు కొత్త కనుక, బాగా తీసినట్లు అనిపించాయి.
అల్లు అర్జున్ చాలా బా చేశాడూ.. నటన కానీ, డాన్సులు కానీ – ఎటొచ్చీ, ఆ హెయిర్ సటిల్లే భరించడం కష్టమైంది!
‘రింగ రింగా లాంటి పాట అసలు అవసరమా ఈ సినిమాకి? అనిపించింది.