Srikanth’s ‘AAEE’ film review
శ్రీకాంత్,సదాల ‘అఆఇఈ’ రివ్యూ
పాత తెలుగు సెంటిమెంట్ చిత్రాల మీద స్పూఫ్ చూడాలని ఆసక్తి ఉందా…అఆఇఈ కి అర్జంటుగా వెళ్ళండి..అయితే ఒక కండీషన్..తెరపై కథ సీరియస్ గా కదులుతూంటుంది. మీరు స్ఫూఫ్ లా ఫీలవుతూ ఎంజాయ్ చేయాలి…అంతే. ఎనబైల నాటి..సారి..అంతకన్నా ముందునాటి ఒక మొగడు..ఇద్దరి పెళ్ళాల ధీమ్ ని,భార్య ఆరోగ్యం కోసం త్యాగం చేస్తూ వేరే అమ్మాయికి భర్తలా నటించే హీరోని ఈ చిత్రంలో చూసి తరించవచ్చు.అలాగే మీరు టీవీ సీరియల్స్ రెగ్యులర్ గా చూసే వారయితే ఓ బెనిఫిట్. ఓ పాచి సీరియల్ ని టెన్షన్ పడకుండా వంద ఎపిసోడ్స్ ని ఒకేసారి చూసిన ఫీలింగ్ ఇస్తుంది.
ఇద్దరు భామల మధ్యన నలిగే ముద్దుల మొగుళ్ళ స్టోరీలు తెలుగు తెరకు కొత్తే కాదు. గతంలో శ్రీకాంత్ సైతం చేసి ఉన్నాడు. అయితే అఆఇఈ అంత ముతక కథను మాత్రం దాదాపు చేసి ఉండరనే చెప్పాలి. బావుంది అనిపించుకోవటానికి ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోవటం మరో విచిత్రం అనిపిస్తుంది. అలాగే హాస్య చిత్రాల శ్రీనివాస రెడ్డి చిత్రం కావటంతో పోనీ కామిడీ అయినా వర్కవుట్ అవుతుంని భావిస్తాం. అదీ ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఇది సెంటిమెంట్ తో మనస్సులను కదిలించటం కన్నా జనాల్ని ధియోటర్ల నుంచి బయిటకు కదిలించేటట్లు తయారైంది.
చంద్రం (శ్రీకాంత్)ఓ అతి నిజాయితీపరుడైన టాక్సీ డ్రైవర్. అంతేగాక కళ్యాణి(మీరా జాస్మిన్ )కి అతి మంచి భర్త.అలా అంతా అతి సవ్యంగా నడుస్తుందనుకున్న సమయంలో కళ్యాణికి పెద్ద జబ్బు పేరుతో ట్విస్ట్ పడుతుంది. అందుకోసం పది లక్షలు అవసరమవుతుంది(ఆరోగ్య శ్రీ వంటివి అమలు కావా అని అడగొద్దు). చంద్రానికి టెన్షన్..ఏమీ చేయలేని స్ధితి. అప్పుడు దేముడు(స్క్రిప్టు రైటర్) పంపించినట్లుగా అతినికో పదిలక్షలు ఉన్న సూటుకేసు దొరుకుతుంది. అంతేగాక డబుల్ ధమాకా ఆపర్ లా ఆ సూటుకేసు తో పాటు ఓ శవం కూడా లభ్యమవుతుంది.అంతేగాక ఆ సూట్ కేసులో రమ్య(సదా)ఫొటో ఉంటుంది.ఫోటో,శవాన్ని ప్రక్కన పెడితే భార్య జబ్బుకు సరిపడ డబ్బు ఎదురుగా ఉంది. అయితే నిజాయితి అడ్డుపడుతుంది.
అప్పుడ ప్రెండ్, లాయిర్ (కృష్ణ భగవాన్) సూచన మేరకు ఆ పది లక్షలు తన అవసరానికి వాడుకుని,ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయిస్తాడు. అంతేగాక ఆ శవం(సదాది అని బిల్డప్ )తండ్రి బాద చూసి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్లి సెటిల్ అవుతాడు. మరో ప్రక్క భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంతలో ఎవరూ ఊహించని విధంగా(పాత్రలు..మనం కాదు) సదా ఊడిపడుతుంది. అంతే ఇంటర్వెల్. ఆ తర్వాత ఏమైంది..సదా తిరిగివచ్చిందంటే..ఆ శవం ఎవరిది..అనే విషయాలు తెలియాలంటే తెరపై సస్పెన్స్ భరిస్తూ చూడాల్సిందే.
ఇంటర్వెల్ అయిపోగానే..సదాని నువ్వు చనిపోయావు కదా ఎలా తిరిగి వచ్చావు అని ఆమె తల్లి తండ్రులు కానీ, భాదితుడైన హీరో గానీ అడగరు. అంతా ఆమెదో పిక్నిక్ కెళ్ళి వచ్చినట్లు గా ఫీలవుతుంటారు. అయితే అప్పుడే విషయం రివిల్ చేసేస్తే ఇక తీయటానికి కథేముందనికున్నారో ఏమో..ప్రి క్లైమాక్స్ దాకా సాగదీసి..అప్పుడు అసలు విషయం రివిల్ చేసి..విలన్ ఎవరో చెప్తారు. దాంతో ఇంటర్వెల్ తర్వాత సినిమా మరీ నత్త నడక మొదలైంది.అప్పుడే రివిల్ అయ్యి ఉంటే విలన్ ఎవరో తెలిసి కాస్త టెన్షన్ అన్నా ఎలివేట్ అయ్యేది. అందులోనూ పూర్వం కాలం సినిమాల పద్దతిలో విలన్ …ఎవరో చూపకుండా కుర్చిలో వెనక్కి తిరిగి కూర్చున్నట్లు షాట్లు..చివరలో అతను ఎవరో రివిల్ చేయటం.
ఇక ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైన పాసివ్ క్యారెక్టర్ ఏ హీరోనూ చేసి ఉండడు. హీరోకి ఒకటి తర్వాత మరొకటి వరసగా సమస్యలు వస్తూంటాయి. అయినా అతను స్ధితప్రజ్ఞుడు లా వాటిని భరిస్తూంటాడే కానీ ఎక్కడా ఎదరు తిరిగి ఓ సంఘటన సృష్టించడు. దాంతో కథ టీవీ సీరియల్ కన్నా అధ్వానంగా సాగి..సాగి విసిగిస్తుంది. ఇక కామిడీకొస్తే..బ్రహ్మానందం,కొవై సరళ జంట ఇంతగా ఫెయిల్యూర్ అవటం ఎప్పుడూ
జరగలేదమో.అలాగే సునీల్ కామిడీ ట్రాక్..గతంలో శివనాగేశ్వరావు చిత్రంలో వచ్చిన బాబుమోహన్..జేమ్స్ బాండ్ గెటప్ కామిడీకి అనుకరణ. శ్రీనివాస రెడ్డి స్క్రీన్ ప్లే సరిగా రాసుకుని ఉంటే కథలో లోపాలు బయిటపడి..కాస్త తలనొప్పి తగ్గేది. వీటికి తోడు అపూర్వ చేత ఎక్సపోజింగ్ భయంకరం. ఇక అలీ ది మతిమరుపు పాత్ర. ధియోటర్ బయిటకొచ్చినా ఆ పాత్రను ఆ చిరాకు మర్చిపోవటం కష్టమే. సినిమాకు ఏమన్నా ప్లస్ ఉందా అంటే పాటలు అనే చెప్పాలి. . మిగతా టెక్నికల్ టీమ్ కూడా కథలాగే డల్ గానే పనిచేసారు.
కొద్దిగా నవ్వించినా సినిమాలు విపరీతంగా ఆడేస్తున్న ఈ రోజుల్లో ఆ మాత్రం కూడా పాస్ మార్కులు వేయించుకోకపోవటం దురదృష్టమే. మహిళలను ఏడ్పించి సొమ్ము చేసుకోవాలన్నట్లు ఉన్న ఈ సినిమా మగాళ్ళకు కూడా మరో విధంగా ఏడుపు తెప్పిస్తుంది. శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తి చేసాడు కాబట్టి ఇప్పటికైనా కాస్త క్వాలిటీ గురించి ఆలోచిస్తే బావుంటుంది. ఏదైమైనా టెక్నికల్ గానూ అంతంతమాత్రంగానే ఉన్న ఈ సినిమాను టీవిల్లో చూడటం బెస్ట్. ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి. ఆ ధైర్యం లేకపోతే కష్టమే.ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలంటే టైటిల్ గురించి శ్రమపడక్కర్లేదు.
‘ఉఊబుబూ’ అని పెడితే చాలు.
సినిమా : అఆఇఈ
బ్యానర్ : కల్పనా ఆర్ట్స్
నటీనటులు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల, రఘుబాబు, అపూర్వ, వెంకట్, ఉత్తేజ్ తదితరులు.
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
కెమెరా: విజయ్.సి.కుమార్
ఎడిటర్: గౌతం రాజు
కథ,మాటలు:గోళ్లపాటి నాగేశ్వరరావు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
ని్ర్మాత: బొద్దం అశోక్ కుమార్
విడుదల తేది: 6,నవంబర్ 2009
————-సూర్య ప్రకాష్ జోశ్యుల
Tags: అఆఇఈ, శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా, శ్రీనివాస రెడ్డి, అదిరిందయ్యా చంద్రం, కుబేరులు, యమగోల మళ్ళీ మొదలైంది, srikanth, meera jasmin, sadaa, srinivasa reddy, adirindayya chandra, kuberulu, yamagola malli modalaindi, review
తెలుగు సెంటిమెంట్ చిత్రాల మీద స్పూఫ్ చూడాలని ఆసక్తి ఉందా…అఆఇఈ కి అర్జంటుగా వెళ్ళండి..అయితే ఒక కండీషన్..తెరపై కథ సీరియస్ గా కదులుతూంటుంది. మీరు స్ఫూఫ్ లా ఫీలవుతూ ఎంజాయ్ చేయాలి…అంతే. ఎనబైల నాటి..సారి..అంతకన్నా ముందునాటి ఒక మొగడు..ఇద్దరి పెళ్ళాల ధీమ్ ని,భార్య ఆరోగ్యం కోసం త్యాగం చేస్తూ వేరే అమ్మాయికి భర్తలా నటించే హీరోని ఈ చిత్రంలో చూసి తరించవచ్చు.అలాగే మీరు టీవీ సీరియల్స్ రెగ్యులర్ గా చూసే వారయితే ఓ బెనిఫిట్. ఓ పాచి సీరియల్ ని టెన్షన్ పడకుండా వంద ఎపిసోడ్స్ ని ఒకేసారి చూసిన ఫీలింగ్ ఇస్తుంది.
ఇద్దరు భామల మధ్యన నలిగే ముద్దుల మొగుళ్ళ స్టోరీలు తెలుగు తెరకు కొత్తే కాదు. గతంలో శ్రీకాంత్ సైతం చేసి ఉన్నాడు. అయితే అఆఇఈ అంత ముతక కథను మాత్రం దాదాపు చేసి ఉండరనే చెప్పాలి. బావుంది అనిపించుకోవటానికి ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోవటం మరో విచిత్రం అనిపిస్తుంది. అలాగే హాస్య చిత్రాల శ్రీనివాస రెడ్డి చిత్రం కావటంతో పోనీ కామిడీ అయినా వర్కవుట్ అవుతుంని భావిస్తాం. అదీ ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఇది సెంటిమెంట్ తో మనస్సులను కదిలించటం కన్నా జనాల్ని ధియోటర్ల నుంచి బయిటకు కదిలించేటట్లు తయారైంది.
చంద్రం (శ్రీకాంత్)ఓ అతి నిజాయితీపరుడైన టాక్సీ డ్రైవర్. అంతేగాక కళ్యాణి(మీరా జాస్మిన్ )కి అతి మంచి భర్త.అలా అంతా అతి సవ్యంగా నడుస్తుందనుకున్న సమయంలో కళ్యాణికి పెద్ద జబ్బు పేరుతో ట్విస్ట్ పడుతుంది. అందుకోసం పది లక్షలు అవసరమవుతుంది(ఆరోగ్య శ్రీ వంటివి అమలు కావా అని అడగొద్దు). చంద్రానికి టెన్షన్..ఏమీ చేయలేని స్ధితి. అప్పుడు దేముడు(స్క్రిప్టు రైటర్) పంపించినట్లుగా అతినికో పదిలక్షలు ఉన్న సూటుకేసు దొరుకుతుంది. అంతేగాక డబుల్ ధమాకా ఆపర్ లా ఆ సూటుకేసు తో పాటు ఓ శవం కూడా లభ్యమవుతుంది.అంతేగాక ఆ సూట్ కేసులో రమ్య(సదా)ఫొటో ఉంటుంది.ఫోటో,శవాన్ని ప్రక్కన పెడితే భార్య జబ్బుకు సరిపడ డబ్బు ఎదురుగా ఉంది. అయితే నిజాయితి అడ్డుపడుతుంది.
అప్పుడ ప్రెండ్, లాయిర్ (కృష్ణ భగవాన్) సూచన మేరకు ఆ పది లక్షలు తన అవసరానికి వాడుకుని,ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయిస్తాడు. అంతేగాక ఆ శవం(సదాది అని బిల్డప్ )తండ్రి బాద చూసి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్లి సెటిల్ అవుతాడు. మరో ప్రక్క భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంతలో ఎవరూ ఊహించని విధంగా(పాత్రలు..మనం కాదు) సదా ఊడిపడుతుంది. అంతే ఇంటర్వెల్. ఆ తర్వాత ఏమైంది..సదా తిరిగివచ్చిందంటే..ఆ శవం ఎవరిది..అనే విషయాలు తెలియాలంటే తెరపై సస్పెన్స్ భరిస్తూ చూడాల్సిందే.
ఇంటర్వెల్ అయిపోగానే..సదాని నువ్వు చనిపోయావు కదా ఎలా తిరిగి వచ్చావు అని ఆమె తల్లి తండ్రులు కానీ, భాదితుడైన హీరో గానీ అడగరు. అంతా ఆమెదో పిక్నిక్ కెళ్ళి వచ్చినట్లు గా ఫీలవుతుంటారు. అయితే అప్పుడే విషయం రివిల్ చేసేస్తే ఇక తీయటానికి కథేముందనికున్నారో ఏమో..ప్రి క్లైమాక్స్ దాకా సాగదీసి..అప్పుడు అసలు విషయం రివిల్ చేసి..విలన్ ఎవరో చెప్తారు. దాంతో ఇంటర్వెల్ తర్వాత సినిమా మరీ నత్త నడక మొదలైంది.అప్పుడే రివిల్ అయ్యి ఉంటే విలన్ ఎవరో తెలిసి కాస్త టెన్షన్ అన్నా ఎలివేట్ అయ్యేది. అందులోనూ పూర్వం కాలం సినిమాల పద్దతిలో విలన్ …ఎవరో చూపకుండా కుర్చిలో వెనక్కి తిరిగి కూర్చున్నట్లు షాట్లు..చివరలో అతను ఎవరో రివిల్ చేయటం.
ఇక ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైన పాసివ్ క్యారెక్టర్ ఏ హీరోనూ చేసి ఉండడు. హీరోకి ఒకటి తర్వాత మరొకటి వరసగా సమస్యలు వస్తూంటాయి. అయినా అతను స్ధితప్రజ్ఞుడు లా వాటిని భరిస్తూంటాడే కానీ ఎక్కడా ఎదరు తిరిగి ఓ సంఘటన సృష్టించడు. దాంతో కథ టీవీ సీరియల్ కన్నా అధ్వానంగా సాగి..సాగి విసిగిస్తుంది. ఇక కామిడీకొస్తే..బ్రహ్మానందం,కొవై సరళ జంట ఇంతగా ఫెయిల్యూర్ అవటం ఎప్పుడూ
జరగలేదమో.అలాగే సునీల్ కామిడీ ట్రాక్..గతంలో శివనాగేశ్వరావు చిత్రంలో వచ్చిన బాబుమోహన్..జేమ్స్ బాండ్ గెటప్ కామిడీకి అనుకరణ. శ్రీనివాస రెడ్డి స్క్రీన్ ప్లే సరిగా రాసుకుని ఉంటే కథలో లోపాలు బయిటపడి..కాస్త తలనొప్పి తగ్గేది. వీటికి తోడు అపూర్వ చేత ఎక్సపోజింగ్ భయంకరం. ఇక అలీ ది మతిమరుపు పాత్ర. ధియోటర్ బయిటకొచ్చినా ఆ పాత్రను ఆ చిరాకు మర్చిపోవటం కష్టమే. సినిమాకు ఏమన్నా ప్లస్ ఉందా అంటే పాటలు అనే చెప్పాలి. . మిగతా టెక్నికల్ టీమ్ కూడా కథలాగే డల్ గానే పనిచేసారు.
కొద్దిగా నవ్వించినా సినిమాలు విపరీతంగా ఆడేస్తున్న ఈ రోజుల్లో ఆ మాత్రం కూడా పాస్ మార్కులు వేయించుకోకపోవటం దురదృష్టమే. మహిళలను ఏడ్పించి సొమ్ము చేసుకోవాలన్నట్లు ఉన్న ఈ సినిమా మగాళ్ళకు కూడా మరో విధంగా ఏడుపు తెప్పిస్తుంది. శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తి చేసాడు కాబట్టి ఇప్పటికైనా కాస్త క్వాలిటీ గురించి ఆలోచిస్తే బావుంటుంది. ఏదైమైనా టెక్నికల్ గానూ అంతంతమాత్రంగానే ఉన్న ఈ సినిమాను టీవిల్లో చూడటం బెస్ట్. ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి. ఆ ధైర్యం లేకపోతే కష్టమే.ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలంటే టైటిల్ గురించి శ్రమపడక్కర్లేదు. ..
‘ఉఊబుబూ’ అని పెడితే చాలు.
సినిమా : అఆఇఈ
బ్యానర్ : కల్పనా ఆర్ట్స్
నటీనటులు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల, రఘుబాబు, అపూర్వ, వెంకట్, ఉత్తేజ్ తదితరులు.
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
కెమెరా: విజయ్.సి.కుమార్
ఎడిటర్: గౌతం రాజు
కథ,మాటలు:గోళ్లపాటి నాగేశ్వరరావు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
ని్ర్మాత: బొద్దం అశోక్ కుమార్
విడుదల తేది: 6,నవంబర్ 2009
—సూర్య ప్రకాష్ జోశ్యుల
శ్రీకాంత్ says:
అబ్బో చాలా గొప్పగా తీసాడు డైరెక్టర్ అయితే
బాగా రాసితిరి రివ్యూ
శ్రీకాంత్ says:
బొద్దం అశోక్ కుమార్ ని బలిపసువుని చేసారు సమిష్టి గా
Manjula says:
Last night I watched an awesome spoof called Quick Gun Murugan! The real spoof of course! Will post the review soon.
Jonathan V says:
na uddesam NT elanti cinemalaki review rayakudadu…
కె.మహేష్ కుమార్ says:
@Jonathan V: అలాంటి ఇలాంటి సినిమా అనే తేడా నవతరంగంకు లేదండీ. సినిమా అంటే సినిమానే అంతే! అన్నింటి గురించీ మాట్లాడుకోవలసిందే.
Jonathan V says:
NT ki oka standard undi…i mean…NT oka manchi cinemalani, cinema ni oka art ga bhavinche vatilini parichayam chesindi….kani e madya anni cinema websites laga vachina prathi cinemaki reviews rastundi….i think…ekkadiki vachevallu manchi cinemalani premichevallani na uddesham…thats one of the reason why i like NT…but eeppudu adi miss avuthundi….
Sen says:
surprisingly..even jeevi don’t write review for a movie if he feels like it won’t get rating above 2.
Shiva Kishore Kandukuri says:
మహెశ్ గారు… అది ఇది అని లెదు… అన్నిట్లొ మీరె…
nagaraju says:
what do u mean by అన్నిట్లొ
can u explain
Shiva Kishore Kandukuri says:
నువ్వుఎంటి బాబు.. కొత్తగా అంటారా… ఇది మీ ఛలవె…
Shiva Kishore Kandukuri says:
I mean.. మీరు Double Meaning తీయకండి Please… అసలె… Mahesh గారి తొ సావాసమ్ ఈమద్యనె మొదలైది…