Menu

4నెలల 3 వారాల 2 రోజులు

4monthsదాదాపు రెండు దశాబ్దాల పాటు రొమానియా ప్రజలను పట్టి పీడించిన కమ్యూనిస్టు భూతం Nicolae Ceausescu ని సాయుధ ఉద్యమం ద్వారా కిందకు దించి అతనికి మరణ శిక్ష విధించడంతో రొమానియన్ ప్రజలు తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. కానీ ఆ రెండు దశాబ్దాల కాలంలో Nicolae Ceausescu పాలనలో రొమానియా ఎన్నో విధాల నష్టపోయింది. ఎన్నో రంగాల్లో ప్రపంచం లోని ఇతరదేశాలకంటే వెనుకబడింది. ఇలా వెనుకబడిన వాటిలో రొమానియా చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకటి.

1989 నుంచి దాదాపు 2005 వరకూ రొమానియాలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవనే చెప్పాలి. 2005 లో Cristi Puiu నిర్మించిన The Death of Mr Lazarescu తో రొమానియన్ చిత్ర పరిశ్రమ కొత్త బలంతో ముందుకు సాగింది. 2005 లో ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడిన ఈ చిత్రంతో పాటు 2005-2006 మధ్యలో వచ్చిన మరికొన్ని చిత్రాలు, ముఖ్యంగా Coreliu Porumboiu నిర్మించిన 12:08 East of Buchrest పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విమర్శకులను ఆకట్టుకుంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే 2007 లో వచ్చిన 4 Months, 3 Weeks and 2 Days అనే సినిమాతో రొమానియా ప్రపంచ సినీ చరిత్రలో తన చోటు పదిలం చేసుకుంది. Cristian Mungiu దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్రాన్స్ లో జరిగిన Cannes చిత్రోత్సవంలో ప్రదర్శింపబడడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన Plame d’Or అవార్డును కూడా గెలుచుకుంది.

Mungiu దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ కమ్యూనిజం చివరి రోజులైన 1987వ సంవత్సరంలోని ఒక రోజు లో జరుగుతుంది. Gabita మరియు Otilia ఒక కాలేజ్ హాస్టల్ లో ఉండి చదువు కొనసాగిస్తుంటారు. సినిమా మొదలయ్యే సమయానికి వీరిద్దరూ హాస్టల్ లోని మిగతా వారిలాగానే సిగరెట్ ల కోసం, వేరే దేశం నుంచి రహస్యంగా దిగుమతి చేసుకున్న మేకప్ సామాగ్రి లాంటి కోసం తపించే వారిలా కనిపిస్తారు. కానీ ఒక సమయంలో వీరిద్దరూ రహస్యంగా హాస్టల్ నుంచి బయల్దేరి ఒక వ్యక్తిని కలుస్తారు. అతను Bebe అనే ఒక నాటు వైద్యుడు. Bebe సాయంతో Gabita గర్భంలో ఉన్న 4 నెలల, 3 వారాల 2 రోజుల శిశువును అబార్షన్ ద్వారా తీయుంచుకోవాలన్నది వారి ప్లాన్. అయితే అప్పటి రొమానియాలో abortion అనేది చాలా పెద్ద నేరం. ఇలాంటి పరిస్థుతుల్లో Gabita మరియు ఆమె స్నేహితురాలు Otilia ఒక రోజు పడ్డ కష్ట నష్టాలే ఈ సినిమా యొక్క మిగతా కథ.

నా దృష్టిలో ఈ సినిమాలోది కథ అనడం కంటే ఒక visual document about History అనొచ్చనిపిస్తుంది. హ్యాండ్ హెల్డ్ కెమెరా, సహజమైనా పాత్ర చిత్రణ, నేపథ్య సంగీతం లేకపోవడం వంటి ఎన్నో అంశాలు 4 Months, 3 Weeks, and 2 Days సినిమాను ఒక “model of constructed reality” గా ఉదహరించవచ్చు.

ఈ సినిమాలో ఉన్న ఒక సీన్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా చెప్పొచ్చు. ఈ సీన్ ఒక ఇంటిలో జరిగే డిన్నర్ సీన్. ఈ సీన్ జరుగుతున్నంత సేపూ కెమెరా ఎటూ కదలకుండా ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున మరో అతిథి లా కన్నార్పకుండా చూసినట్టనిపిస్తుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్ ప్రత్యేకత ఏంటో ఆలోచించండి. ఇది వరకే చూసినవాళ్లు ఆ సీన్ ప్రత్యేకత ఏంటో చెప్పగలరా?

3 Comments
  1. Manjula December 1, 2009 /
  2. Chilakapati Srinivas December 2, 2009 /
  3. chakri January 9, 2010 /