Menu

ఆనాటి సినీసమీక్షలు

హలంకు ఆకుల డ్రాయర్ వేయడంతో ఆకులేమైనా పక్కకు తొలుగునేమోనని ఆశతో కుర్రకారు కొంతమంది ఆశపడటం మినహాయించి చిత్రం ఏం బాగాలేదని పేరుబడింది. నాడు-నేడు ఎలా వుందని ధియోటర్ల దగ్గర అడిగినప్పుడు వెళ్ళేందుకు నేడో-రేపో అన్న కామెంట్స్ వినిపించాయి..ఈ ఆకులేమిటి..నాడు-నేడు ఎప్పుడు రిలీజైంది అంటూ కంగారు పడకండి.ఈ రివ్యూ 1976 జూలై విజయ అనే సినీపత్రికలోది. అప్పట్లో రివ్యూలు ఎలా ఉండేవి అనేది కుతూహలంతో చదివి..మిత్రులతో పంచుకుందామనే సరదా ప్రయత్నం ఇది.ఇక ఈ నాడు-నేడు చిత్రానికి రేటింగ్ సి-2 గ్రేడ్ ఇచ్చారు.
ఇక అదే నెలలో వచ్చిన భక్త కన్నప్ప గురించి…
చిత్రం బాగోలేదని ఏ నోటా వినరాలేదు. రంగులు చాలా బాగున్నట్లు,కొన్నిచోట్లు కావ్యంగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పబడుతోంది. బాపు చిత్రాన్ని ఊహించుకున్న వారెవరికీ ఈ చిత్రం నిసృహ కలిగించదు. డ్రమ్ డాన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఫోటోగ్రఫీ చాలా బాగుంది.ఈ చిత్రానికి రేటింగ్ ఎ-త్రి గ్రేడ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ మగాడు చిత్రం గురించి
ఈ సినిమా ఎంతో బాగుంటుందని అంతా అంచనావేశారు. ఈ చిత్రంలో యన్.టి.ఆర్ నటనకు ప్రశంసలు రాకపోగా అమితాబ్ బచ్చన్ తో పోల్చి నిస్పృహగా మాట్లాడుకోవటం జరిగింది. రామకృష్ణ నటన అసలు బాగోలేదని అన్నవారున్నారు. కొన్ని సీన్స్ స్లో గా నడిచిన ఫీలింగ్ ఏర్పడింది. క్షేత్రయ్య కాదుకాని, దాని దరిదాపులుగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాను తారుమారు చేసింది.ఈ చిత్రానికి రేటింగ్ బి-2 ఇచ్చారు.
జ్యోతి
ఈ చిత్రం దాదాపు అన్ని చోట్ల నుండి బాగున్నట్లు రిపోర్టులు అందాయి. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్ ఏక కంఠం వినిపించింది. లేడీస్ కు బాగా పట్టి, వున్న కొద్దీ పిక్చర్ రన్ పెరిగే సూచనలు ఉన్నాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ప్లాష్ బాక్స్ రెండూ ఈ  చిత్రానికి హైలెట్స్. జయసుధకు నటిగా మంచి పేరు వస్తుంది. క్రాంతి కుమార్(నిర్మాత)సబ్జక్ట్స్ ఎన్నుకోవటంలో ప్రత్యేకత కలిగినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు శారద, ఊశ్వరి,(ఊర్వశి ఫెయిల్ కావచ్చు.అయితే ఊర్వశి లాగానే శారద,జ్యోతి కూడా ధిన్ ఎడ్జెడ్ సబ్జక్ట్స్ ,సక్సెస్ అయితే అటువంటి సబ్జెక్టులు శారదలవుతాయి. ఫెయిల్ అయితే ఊర్వశిలవుతాయి) ఆత్మవిశ్వాసం,గుండె ధైర్యం వుంటే తప్ప అందరూ ప్రయత్నించలేని సబ్జక్స్ ఎన్నుకుని పురోగమిస్తున్న క్రాంతికుమార్ అభినందనీయుడు.ఈ చిత్రానికి రేటింగ్ ఎ-3 ఇవ్వబడింది.
అల్లుడొచ్చాడు
ఇది పి.ఏ.పి. నుంచి రావలిసిన చిత్రం కాదని కొందరు రాశారు. చిత్రం స్టాండర్డ్ దృష్ట్యా రాసారనుకున్నా,లేక నాగేశ్వర్రావు,రంగులు లేవన్న దృష్టితో వ్రాశారనుకున్నా ఈ చిత్రానికి సరిపోతుంది. పి.ఏ.పి.విషయం వదిలేసి దర్శకుడు ప్రత్యగాత్మ విషయం తీసుకుంట,ఆయన మెరుగులు,మెరుపులు ఈ చిత్రంలో అంతగా కనిపించంలేదు. ఏమైనా సన్నివేశాల్లో గల హాస్యం నిలబెట్టగలగటం దర్శకుని ప్రతిభే. షోలే టైప్ సాంగ్-షోలే సాంగ్ కు ఏ మాత్రం దగ్గరగా రాలేదు. ఈ చిత్రానికి రేటింగ్ బి-2 ఇచ్చారు.
మన ఊరి కథ
గ్రామీణ వాతావరణంలో తీయబడిన ఈ సినిమా ఫర్వాలేదు అని అన్ని చోట్లా పేరుపడింది. ఈ చిత్రంలో రోజారమణికి మంచి పేరు రాగలదు. అవుట్ డోర్ చిత్రీకరణంతా కనులు పండువుగా ఉంది. జయప్రద ఈ చిత్రంలో చాలా చోట్ల కన్నీటి తార గా పనికిరాదన్న అభిప్రాయం కలిగింది. ఈ చిత్రానికి రేటింగ్ బి-1 ఇచ్చారు.
ముద్దబంది పువ్వు
ఇది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా కావటం ముఖ్య విశేషం. అన్ని సర్కిల్ వారి నుంచి బాగోలేదని పేరు పడింది. చిత్రం బాగా దెబ్బతిన్నదనేందుకు ఉదాహరణ
రాజమండ్రిలో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)
గుంటూరు లో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)
తిరుపతి లో 28-5-76 న విడుదలై 9-6-76 న వెళ్ళిపోయింది..(13 రోజులు)
తెనాలి లో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)
ఈ చిత్రంలో మురళీమోహన్ నటన బాగుంది. అయితే త్రాగుడు సీన్లలో దేవదాసు కాస్ట్యూమ్స్ వాడటం ద్వారా నాగేశ్వరరావుతో మురళీమోహన్ పారలెల్ గా ఊహించి కేకలు వేసినట్లు ఒకటి రెండు సెంటర్ల నుండి వార్తలు.
ఇక్కడకు ఇవి..ఇంకా ఉన్నాయి. అయితే ఇవి కేవలం సరదాగా సేకరించినవి. అప్పట్లోనే గట్స్ ఉన్న రివ్యూ రైటర్స్,పబ్లిషర్ ఉన్నారని గుర్తు చేసుకునేందుకు.
ఇంతకీ ఈ పత్రిక ఆ నెల మెయిన్ ఆర్టికల్  హెడ్డింగ్ ఏంటో తెలుసా….
“దాసరి నారాయణరావు పని అయిపోయింది”
——-సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

film connection 2హలంకు ఆకుల డ్రాయర్ వేయడంతో ఆకులేమైనా పక్కకు తొలుగునేమోనని ఆశతో కుర్రకారు కొంతమంది ఆశపడటం మినహాయించి చిత్రం ఏం బాగాలేదని పేరుబడింది. ‘నాడు-నేడు’ ఎలా వుందని ధియోటర్ల దగ్గర అడిగినప్పుడు వెళ్ళేందుకు నేడో-రేపో అన్న కామెంట్స్ వినిపించాయి..ఈ ఆకులేమిటి..నాడు-నేడు ఎప్పుడు రిలీజైంది అంటూ కంగారు పడకండి.ఈ రివ్యూ 1976 జూలై విజయ అనే సినీపత్రికలోది. అప్పట్లో రివ్యూలు ఎలా ఉండేవి అనేది కుతూహలంతో చదివి..మిత్రులతో పంచుకుందామనే సరదా ప్రయత్నం ఇది.ఇక ఈ నాడు-నేడు చిత్రానికి రేటింగ్ సి-2 గ్రేడ్ ఇచ్చారు.

ఇక అదే నెలలో వచ్చిన భక్త కన్నప్ప గురించి…

చిత్రం బాగోలేదని ఏ నోటా వినరాలేదు. రంగులు చాలా బాగున్నట్లు,కొన్నిచోట్లు కావ్యంగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పబడుతోంది. బాపు చిత్రాన్ని ఊహించుకున్న వారెవరికీ ఈ చిత్రం నిసృహ కలిగించదు. డ్రమ్ డాన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఫోటోగ్రఫీ చాలా బాగుంది.ఈ చిత్రానికి రేటింగ్ ఎ-త్రి గ్రేడ్ ఇచ్చారు.

ఎన్టీఆర్ ‘మగాడు’ చిత్రం గురించి

ఈ సినిమా ఎంతో బాగుంటుందని అంతా అంచనావేశారు. ఈ చిత్రంలో యన్.టి.ఆర్ నటనకు ప్రశంసలు రాకపోగా అమితాబ్ బచ్చన్ తో పోల్చి నిస్పృహగా మాట్లాడుకోవటం జరిగింది. రామకృష్ణ నటన అసలు బాగోలేదని అన్నవారున్నారు. కొన్ని సీన్స్ స్లో గా నడిచిన ఫీలింగ్ ఏర్పడింది. క్షేత్రయ్య కాదుకాని, దాని దరిదాపులుగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాను తారుమారు చేసింది.ఈ చిత్రానికి రేటింగ్ బి-2 ఇచ్చారు.

జ్యోతి

చిత్రం దాదాపు అన్ని చోట్ల నుండి బాగున్నట్లు రిపోర్టులు అందాయి. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్ ఏక కంఠం వినిపించింది. లేడీస్ కు బాగా పట్టి, వున్న కొద్దీ పిక్చర్ రన్ పెరిగే సూచనలు ఉన్నాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ప్లాష్ బాక్స్ రెండూ ఈ  చిత్రానికి హైలెట్స్. జయసుధకు నటిగా మంచి పేరు వస్తుంది. క్రాంతి కుమార్(నిర్మాత)సబ్జక్ట్స్ ఎన్నుకోవటంలో ప్రత్యేకత కలిగినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు శారద, ఊశ్వరి,(ఊర్వశి ఫెయిల్ కావచ్చు.అయితే ఊర్వశి లాగానే శారద,జ్యోతి కూడా ధిన్ ఎడ్జెడ్ సబ్జక్ట్స్ ,సక్సెస్ అయితే అటువంటి సబ్జెక్టులు శారదలవుతాయి. ఫెయిల్ అయితే ఊర్వశిలవుతాయి) ఆత్మవిశ్వాసం,గుండె ధైర్యం వుంటే తప్ప అందరూ ప్రయత్నించలేని సబ్జక్స్ ఎన్నుకుని పురోగమిస్తున్న క్రాంతికుమార్ అభినందనీయుడు.ఈ చిత్రానికి రేటింగ్ ఎ-3 ఇవ్వబడింది.

అల్లుడొచ్చాడు

ఇది పి.ఏ.పి. నుంచి రావలిసిన చిత్రం కాదని కొందరు రాశారు. చిత్రం స్టాండర్డ్ దృష్ట్యా రాసారనుకున్నా,లేక నాగేశ్వర్రావు,రంగులు లేవన్న దృష్టితో వ్రాశారనుకున్నా ఈ చిత్రానికి సరిపోతుంది. పి.ఏ.పి.విషయం వదిలేసి దర్శకుడు ప్రత్యగాత్మ విషయం తీసుకుంట,ఆయన మెరుగులు,మెరుపులు ఈ చిత్రంలో అంతగా కనిపించంలేదు. ఏమైనా సన్నివేశాల్లో గల హాస్యం నిలబెట్టగలగటం దర్శకుని ప్రతిభే. షోలే టైప్ సాంగ్-షోలే సాంగ్ కు ఏ మాత్రం దగ్గరగా రాలేదు. ఈ చిత్రానికి రేటింగ్ బి-2 ఇచ్చారు.

మన ఊరి కథ

గ్రామీణ వాతావరణంలో తీయబడిన ఈ సినిమా ఫర్వాలేదు అని అన్ని చోట్లా పేరుపడింది. ఈ చిత్రంలో రోజారమణికి మంచి పేరు రాగలదు. అవుట్ డోర్ చిత్రీకరణంతా కనులు పండువుగా ఉంది. జయప్రద ఈ చిత్రంలో చాలా చోట్ల కన్నీటి తార గా పనికిరాదన్న అభిప్రాయం కలిగింది. ఈ చిత్రానికి రేటింగ్ బి-1 ఇచ్చారు.

ముద్దబంతి పువ్వు

ఇది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా కావటం ముఖ్య విశేషం. అన్ని సర్కిల్ వారి నుంచి బాగోలేదని పేరు పడింది. చిత్రం బాగా దెబ్బతిన్నదనేందుకు ఉదాహరణ

రాజమండ్రిలో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)

గుంటూరు లో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)

తిరుపతి లో 28-5-76 న విడుదలై 9-6-76 న వెళ్ళిపోయింది..(13 రోజులు)

తెనాలి లో 28-5-76 న విడుదలై 11-6-76 న వెళ్ళిపోయింది..(15 రోజులు)

ఈ చిత్రంలో మురళీమోహన్ నటన బాగుంది. అయితే త్రాగుడు సీన్లలో దేవదాసు కాస్ట్యూమ్స్ వాడటం ద్వారా నాగేశ్వరరావుతో మురళీమోహన్ పారలెల్ గా ఊహించి కేకలు వేసినట్లు ఒకటి రెండు సెంటర్ల నుండి వార్తలు.

ఇక్కడకు ఇవి..ఇంకా ఉన్నాయి. అయితే ఇవి కేవలం సరదాగా సేకరించినవి. అప్పట్లోనే గట్స్ ఉన్న రివ్యూ రైటర్స్,పబ్లిషర్ ఉన్నారని గుర్తు చేసుకునేందుకు.

ఇంతకీ ఈ పత్రిక ఆ నెల మెయిన్ ఆర్టికల్  హెడ్డింగ్ ఏంటో తెలుసా….

“దాసరి నారాయణరావు పని అయిపోయింది”

——-సేకరణ: సూర్య ప్రకాష్ జోశ్యుల

6 Comments
  1. mohanrazz October 27, 2009 /
  2. G October 27, 2009 /
  3. yardstick October 27, 2009 /
    • V. Chowdary jampala November 3, 2009 /
  4. Vasu October 28, 2009 /