కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

wall_800x600_1Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం.

ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది.

HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’ అన్నిచోట్లా ప్రశంసలు అందుకుంది. ఈ విషయంపై భారతదేశం రూపొందించబడిన మొదటి చిత్రం ఇది.

సాధారణంగా అంతర్జాతీయ అవార్డులకు పంపేటప్పుడు పాటల్ని తొలగించడం పరిపాటి. కానీ “they are an integral part of the film” అంటూ దర్శకురాలు రూపా అయ్యర్ ఉంచెయ్యడం ఒకసాహసమనే చెప్పాలి.

ఈ సందర్భంగా నవతరంగం ఈ చిత్ర యూనిట్ కు, నటీనటులకు,నిర్మాతలు ప్రొఫెసర్ నారాయణ్ హోస్మనే,సుబ్రయ హోస్మనే మరియూ నటి- దర్శకురాలు రూపా అయ్యర్ కు అభినందనలు తెలియజేస్తోంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం”

  • మామూలుగా..మామూలుగా..మామూలుగా అంటే మామూలుగా ఈ వార్తకు ఒక్క వ్యాఖ్యా ఇప్పటివరకూ రాలేదన్నమాట!

    ఈ సినీనిర్మాతా దర్శకులకు నాతరఫున్నించీ కూడా అభినందనలు.

  • …అసలే బాబోయ్ ఆవార్డ్ సినిమాలని జనాలు పారిపోతుంటే అవార్డు వచ్చిందని చెప్తున్న కన్నడ సినిమా గురించి ఎవడికి కావాలి?

  • @అన్వేషి: నిజమే!
    నాకైతే ఈ సినిమా థీం నచ్చింది. తమ ప్రమేయంలేకుండా సంక్రమించిన ప్రాణాంతక ఎయిడ్స్ తో పోరాడుతున్న పిల్లల్ని కళ్ళారా చూసినవాడ్ని. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలకు చనిపోతాడని తెలిసీ,అప్పటీకే తల్లోతండ్రో ఎయిడ్స్ తో చనిపోయి,నిరంతరం ఏదోఒక రోగంతో బాధపడుతూ అర్థంకాని-అర్థంచేసుకోలేని వేదనతో కృశించే ఈ పిల్లల బాల్యం ఎంత సంఘర్షణ భరితమో ప్రజలకు తెలియాలి. ఈ సినిమా ఆ పనిచేసిందని అనిపిస్తోంది. ఇలాంటి విషయాన్ని తీసుకున్న దర్శక నిర్మాతలు సినిమా బాగున్నా,బాగలేకున్నా అభినందనీయులే. Honest attempt అంటే ఇది…

  • ఈ సినిమాని తీసిన దర్శక నిర్మాతలకి నా అభినందనలు.
    @ మహేష్ గారూ,
    సినిమా థీమ్ ఏమిటో తెలియచేసినందుకు ధన్యవాదాలు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories