Menu

సినిమాదోవకిన్!!!

Pudovkinపింగళి వారి పేకి కథ తెలుసా మీకు? తెలియకపోతే అర్జంటుగా తెలుసుకోండి. ఒక సారి పింగళ వారి కుటుంబంలోకి పేకి అనే రాక్షస (అంటే నీలాంటిదేనా? నాట్ యూ, మీ… నాట్ మీ, యూ… అద్దీ సంగతి) జాతి స్త్రీ పనిపిల్ల గా చేరుతుంది. ఎన్ని పన్లు చెప్పినా అన్నీ చేసి ఇంకా చెప్పాలంటుంది. (నా చిన్నప్పుడు చదివిన ఉక్రేనియన్ జానపద గాథల్లో ఉన్నారులే ఇద్దరు. తెగతిని ఇంకా తెమ్మనే వాడు. పూటుగా త్రాగి ఇంకా కావాలనే వాడు. వాళ్ళలా). చివరికి విసుగెత్తి, ఒకాయన ఉపాయమాలచించి బాగా మెలితిరిగి ఉన్న వెంట్రుకనిచ్చి దాన్ని సాఫు చేయమన్నాట్ట. దాని వల్ల కాక అక్కడ నుంచీ అద పరుగో పరుగని నా చిన్నపుడు విన్న కథ.

*** *** ***

VI (నంబరు 6 కాదు. కాకపోతే విచిత్రం అతనివి నాలుగు సినిమాలు చాల గొప్పవిగా చెప్పబడుతాయి. అలాగే రెండు పుస్తకాలు, Film acting, and Film Technique. మొదట రెండుగా వచ్చి, ఇప్పుడు సింగిల్ బుక్ గా దొరుకుతున్నది. అలా మొత్తం ఆరు గొప్ప కంట్రిబ్యూషన్స్ ప్రపంచ సినిమాకి) Pudovkin (Vsevolod Illarionovich Pudovkin) రష్యాకు చెందిన తొలితరం film maker. Maxim Gorky రచన “The Mother” కి నభూతో అనే రీతిలో దృశ్యరూపమిచ్చిన ఘనుడు. “The foundation of film art is editing,” అని చెప్పే పుదోవ్కిన్ ప్రపంచ సినిమాకి ఇచ్చిన అరుదైన, విలువైన కానుక అతను వ్రాసిన FILM TECHNIQUE AND FILM ACTING అనే పుస్తకం. Lev Kuleshov సారథ్యంలో రూపుదిద్దుకుని ప్రపంచ వ్యాప్తమైన montage theory ని మరింత అభివృద్ధి చేసి, రష్యన్ సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన పుదోవ్కిన్ సినిమాలలో సాధారణంగా వ్యక్తులలోని శక్తి సామర్థ్యాలు, అంత:సంఘర్షణల, ఇతర భావోద్వేగాలమీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాడు. ఈ విషయం అతను తీసిన “The Mother” సినిమాలో గమనించవచ్చు. అద్భుతమైన ఎడిటింగ్, దృశ్యకావ్యం లాంటి చిత్రీకరణ, సన్నివేశాల మధ్య ఉండే అంత:సంబంధం, అర్గదర్శనీయమైంది. ద గాడ్‍ఫాదర్ సినిమాలో ఆఖరి సన్నివేశాలలో వచ్చిన ప్రావవంతమైన ఎడిటింగ్ వల్ల మనకు కలిగే అనుభూతి పుదోవ్కిన్ ఇచ్చిన స్ఫూర్తి వల్లే. (ఈ విషయం గురించి మరో వ్యాసంలో).

ఎడిటింగ్ ద్వారా తనకు కావలసిన ఎఫెక్టులని రాబట్టటమే కాదు, తనకు తెలిసిన, నేర్చుకున్న విషయాలని నలుగురితో పంచుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి పుదొవ్కిన్. అతను వ్రాసిన పైన చెప్పిన పుస్తకంలోని కొన్ని ప్రముఖమైన విషయాలను అనువదించి నవతరంగంలో పెట్టాలనే ఆలోచన. ఈ పుస్తకం నాపాలబడి దాదాపూ ఇరవై రోజులు కావస్తున్నా, వీలైనంతలో బాగా అందించాలనే ఆలోచనతో మరిన్ని సార్లు అందులోని విషయాన్ని చదువుతున్నాను. అంతే కాక పుదొవ్కిన్ సినిమాల గురించీ, అతని శైలి గురించీ, వీలైనంత విషయం సేకరించి ఆ పైన రంగంలోకి దిగాలని ఇన్నాళ్ళూ ఆగాను.

తన చివరి రోజుల్లో తన పుస్తకాలు పున:ప్రచురిణకి ఆయన అంతగ ఇష్టపడేవారుకాదట. ఎప్పుడో వ్రాసుకున్న అంశాలు ఇప్పటి తరానికి ఉపయోగ పడుతాయా అని. కానీ, ఆ పుస్తకాన్ని చూస్తున్నా నెట్టులో గూగులైజేషన్ చేసినా తెలిసిన విషయాలు నన్ను ఆశ్చర్యానందాలకు గురిచేసినై. పేకిలా ఆ వెంట్రుకని సాఫుచేయాలని కాక ఆ వెంట్రుకతో సినిమా కళ అనే కొండను నాకు అర్థమైనంతలో, నా సామర్థ్యానుసారం అవగతం చేసుకోవటానికి పుదొవ్కిన్ చూపిన బాట ’సినిమాదోవ’కిన్. ఇదే నేను వ్రాయ బోయే వ్యాసాల శీర్షిక. ఎత్తుకున్నది చాలా పెద్ద బాధ్యత. ఎక్కడైనా ఎప్పుడైనా తప్పులు దొర్ల వచ్చు. పెద్దలు సహృదయంతో నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ…

సెలవ్!

గీతాచార్య

2 Comments
  1. mohanrazz October 9, 2009 /