పుదొవ్కిన్ on ఎడిటింగ్

Pudovkinవి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. పుదొవ్కిన్ సినిమాలనగానే బ్రహ్మాండమైన విజువల్స్, ఎడిటింగ్ సాధించే effect గుర్తుకొస్తాయి.

సినిమా కళకి కూర్పు పునాది వంటిది. (The foundation of film art is editing)

ఈ మాటలు సోవియెట్ సినిమా కళకు ఇప్పటికీ శిరోధార్యాలు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ సోవియెట్ సినిమాలో ఎడిటింగుదే ప్రాధాన పాత్ర..

ఎడిటింగ్ అన్న మాటను ఇంతవరకూ పూర్తి స్థాయిలో నిర్వచించిన వారు లేరు. చాలా మంది దృష్టిలో ఎడిటింగ్ అంటే… చిత్రీకరించిన సన్నివేశాలను ఒక పద్ధతి ప్రకారం అతికించి కథానుసారంగా (కథాకాలానుసారంగా) తయారు చేయటమే. మరికొందరికి తెలిసిందల్లా వేగవంతమైన/నిదానమైన పద్ధతులు. కానీ ఎడిటింగ్ అంటే కేవలం ఇదే కాదు. ఎంతో విస్తృతమైన అర్థముంది. సన్నివేశరూపకల్పనలో, దృశ్యావిష్కరణలో ఎడిటింగు ఎంత కీలకమో నేనీ ఉదాహరణ ద్వారా వెల్లడిస్తాను.

చాలా మందికి నవలా ప్రక్రియతో మరియూ రచనా ప్రక్రియతో కాస్తో కూస్తో పరిచయముంటుంది. ఆ ప్రక్రియలకు సంబంధించిన ఉదాహరణతోనే నేను చెప్పజూచిన దాన్ని చెప్తాను. ఒక నవలలో వ్రాసేది వచన రూపంలో ఉంటుంది. అదే కవితా ప్రక్రియలో వాక్య నిర్మాణం వచన లోని వాక్య నిర్మాణానికి భిన్నంగా ఉంటుంది. పద ప్రయోగాలు, సన్నివేశ వర్ణన కూడా వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అలాగే షూటింగ్ సమయంలో కెమేరాతో చిత్రీకరించిన ప్రతి దృశ్యం తెరపైకి ఎక్కించనవసరం లేదు. ఒక వాక్యంలో పదం ఎలాంటిదో ఒక చలన చిత్రంలో ఒక దృశ్యం అలాంటిది. తెర పైన కనబడే ప్రతి దృశ్యం ఒక వాక్యంలోని పదంలా ఆయా సందర్భాలకు తగినట్లు ఒక్కోరకమైన భావనను కలుగజేస్తుంది. ఏరకమైన భావను ప్రేక్షకులకు కలుగజేయలనేది ఒక సినీ స్రష్టకు తెలిసి ఉండాలి.

మరింత వివరంగా చెప్పాలంటే… ఏదన్నా ఒక పదాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వంటరిగా దాని అర్థం సాదృస్యం కాదు. దానినే ఏదన్నా వాక్యంలో వాడితే ఆ పదం ఆ వాక్య సందర్భాన్ని బట్టీ ఆ సన్నివేశాన్ని బట్టీ సాదృస్యమవుతుంది (తెలుస్తుంది, in a narrower sense). ఉదాహరణకు… దండుగ అనే మాటను ఈ వాక్యానుసారం ఎలా తన అర్థాలను మార్చుకుందో చూద్దాం. Here Pudovkin had taken an English word to explain the context, am going to take a Telugu word).

ఇక్కడ దండుగ అనే మాటను చూడండి.

చిన్ని చేపలు నీటిలో కదలాడుతుంటే
చూసే కన్నులదే పండుగ…
మరి మన కడుపులో అరిగిపోతే
వాటి బ్రతుకు కాదా దండుగ?
చంపే జనం… ఆలోచించరే…!

Here it’s a word play. ’దండుగ’ నాలుగో వాక్యంలో తీసుకుంటే వృథా అనే అర్థంలో వస్తుంది. అదే ’దండుగ’ ని ఐదో వాక్యానికి అనుసంధానం చేసుకుంటే అర్థం మారి ’ఎక్కువగా’, విపరీతంగా’ అనే అర్థం వస్తుంది. ఇలా ఒక పదం ఒక వాక్యంలో అర్థాన్ని మార్చుకున్నట్లే ఒక దృశ్యం చిత్రానువాదంలో తెర పైన కనిపించే పద్ధతిని బట్టీ, ఆవిష్కరించిన తీరును బట్టీ, వీక్షకునికి విభిన్నమైన అనుభూతిని కలుగజేస్తుంది. ఏ సందర్భానికి ఏ పదాన్ని ఎలా వాడాలో ఒక కవికి తెలుస్తుందో, ఆ యా సందర్భాలకు తగిన దృశ్యాలను తెర పైన ఆవిష్కరించటం దర్శకుకునికి.

అలా కెమేరా చిత్రీకరించిన శ్నాప్స్ లోంచీ, తనకు కావలసిన వాటిని ఎన్నుకోవటం, అవసరం లేని వాటిని వదిలేయటం, తీసుకున్నవి సరిపోవని భావిస్తే వాటిని నిరాకరించి వేరు వాటిని ఎన్నుకోవటం, అన్నిటినీ కలిపి ఒక చక్కని వరుసలో ఉంచి, ఆ పైన రసావిష్కారానికి తగిన విధంగా చేయటం, ఇవన్నీ కూర్పు క్రిందకే వస్తాయి. పుదొవ్కిన్ మాటల్లోనే చెప్పాలంటే… A film maker stands before the separate takes, and only by conscious artistic composition at this stage are gradually pieced together the ‘phrases of editing’, the incidents and sequences, from which arises, step by step, the film.

సినిమాని తీశాము అన్న మాట పూర్తిగా తప్పు. అసలా మాటే సినీ పరిభాషలో ఉండకూడదు. సినిమాని తీయటం కాదు. సినిమాని నిర్మించారు అన్నదే సరియైన పదం. ఒక భవన నిర్మాణమెలాగో, చిత్ర నిర్మాణం కూడా అలాగే. సినిమా నిర్మించ బడుతుంది. ఎదురుగ ఉన్న దృశ్యాలు అనే ముడి సరుకు నుంచీ. (కెమేరాతో తీసి ఉంచుకున్న దృశ్యాలతో). ఎక్కడెక్కడ ఎలాంటి ఇటుకలు కావాలో, ఎలాంటి రాళ్ళను వాడాలో, అదే విధంగా తనకు కావలసిన దృశ్యాలను అందుకోవటం, వీక్షకునికందించటం సినీ స్రష్ట బాధ్యత. దీన్ని అర్థం చేసుకోవటానికి పైన చెప్పిన ఉదాహరణను మరల చూడండి.

గమనిక: ఇదే విషయం మీద చెప్పాల్సింది ఇంకా ఉంది.. కానీ అవి మరింత విపులంగా ఉంటాయి. వాటిని కంటిన్యుటీ దెబ్బతినకుండా చెప్పాలంటే ఇక్కడికాపక తప్పదు. Meet you Monday next.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

గీతాచార్య

రచయిత:

A wrong entrant at the right time, but belong everywhere ;-)

5 Comments to “పుదొవ్కిన్ on ఎడిటింగ్”

  • The translation is so nice. It’s lucid, and also well versed. Taking a telugu word to explain the things instead of an english word is a good idea, and the example is cool. I have no idea of the original. Will u please provide the original link/whereabouts of the book? Lots of telugu flavor in the article, but the only problem is usage of excessive english.

  • excellentga undandi mee tapa editing gurunchi, direction gurunchi inka viveriste malanti cinee jignasulaku chalaa telustundi anyway thank u for giving an wonderful explanation

  • నిజంగా…కూర్పు గుండె లాంటిది…

  • అనువాదం బావుంది. మరిన్ని అతి త్వరలో అందిస్తారని ఎదురుచూస్తున్నాం.

  • Very nice and informative article.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories