Menu

Monthly Archive:: October 2009

“Adaptation” సినిమా మళ్ళీ చూడడం గురించి

చార్లీ కఫ్‌మన్ రాసిన సినిమాల్లో నాకు నచ్చేది అతని పద్దతైన ఉన్మత్తత; సొంత హద్దులున్న విశృంఖలత్వమూను. అతని సినిమాలు ఇవ్వగల పూర్తి అనుభూతిని ఒక్కసారి చూడ్డంతోనే సొంతం చేసుకోలేం. ఎందుకంటే వాటి కథలు పొరలు పొరలుగా వుంటాయి. తొలివీక్షణంలో పైపొర మాత్రమే అందుకోగలుగుతాం. మలివీక్షణాల్లో ఒక్కొక్క పొరా విడిపోవడం మొదలౌతుంది. తొలిసారి గమనింపుకు రానివి ఈ సారి స్పష్టంగా చూడగలుగుతాం. చార్లీ కఫ్‌మన్ అభిప్రాయం ప్రకారం సినిమా ఒక మృత మాధ్యమం. నాటక మాధ్యమంలో ప్రదర్శన ప్రదర్శనకీ

శంకరాభరణం (1979) – నా అనుభవం

ఆ మధ్యోరోజు పొద్దున్నే లేచి ఏమీ తోచక సీడీలున్న షెల్ఫ్ తిరగేస్తూ ఉంటే, కనిపించింది – శంకరాభరణం అన్న పేరు. నేను ఇదివరలో ఈ సినిమాని ఒకసారి చూశాను. పూర్తిగా చూడలేదనుకుంటాను. అయితే, “దొరకునా ఇటువంటి సేవ” నేను డైలీ బేసిస్ లో తల్చుకునే పాటల్లో ఒకటి కావడం వల్ల ఈ సినిమా అంటే నాకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆ కారణంచేత ఈ సినిమాను మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. చూసి మూడువారాలౌతోంది. అయినా, ఇంకా ఆ వావ్

నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ …

ఈ సినిమా వచ్చేసి చాలా కాలమైంది కాబట్టి ఇది సమీక్ష కాదు, దీన్ని మరీ లోతుగా తవ్వే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది విశ్లేషణా కాదు .. సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుడి ఘోష అనుకోండి. దివినించి శివుడి జటాజూటంలోకి దూకే గంగాప్రవాహంలాంటి ఒరవడితో మొదలై, అనేక వింత వింత మలుపులు తిప్పి, ఎన్నో విచిత్రాలున్నూ చూపించి, ఆఖరికి ఇంటెనక పిల్ల కాలవలా చడీ చప్పుడూ కాకుండా ముగిసిపోయిందీ విచిత్రమైన సినిమా. కానీ ముగింపొక్కటే

సినిమాదోవకిన్!!!

పింగళి వారి పేకి కథ తెలుసా మీకు? తెలియకపోతే అర్జంటుగా తెలుసుకోండి. ఒక సారి పింగళ వారి కుటుంబంలోకి పేకి అనే రాక్షస (అంటే నీలాంటిదేనా? నాట్ యూ, మీ… నాట్ మీ, యూ… అద్దీ సంగతి) జాతి స్త్రీ పనిపిల్ల గా చేరుతుంది. ఎన్ని పన్లు చెప్పినా అన్నీ చేసి ఇంకా చెప్పాలంటుంది. (నా చిన్నప్పుడు చదివిన ఉక్రేనియన్ జానపద గాథల్లో ఉన్నారులే ఇద్దరు. తెగతిని ఇంకా తెమ్మనే వాడు. పూటుగా త్రాగి ఇంకా కావాలనే

విలేజ్ లో వినాయకుడు-Audio Review

గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది. 1. చినుకై వరదై ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping