Menu

Inherit the wind (1960)

inherit_the_windమొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి సంబంధించిన రిపోర్టులూ, వ్యాసాలూ, కార్టూన్లూ చదివి/చూసి, కొంత ఆశ్చర్యం కలిగింది. తరువాత ఈ బ్లాగు తగిలింది. ఈ సినిమా యూట్యూబులో ఉందని లంకె ఇవ్వడంతో, ఇక చూడటం మొదలుపెట్టాను.

ఈసినిమాలో పేర్లూ అవీ మార్చారులెండి. అసలు ఉదంతం నాటి పేర్లు వాడలేదు.

కథ విషయానికొస్తే, ఒకానొక సమయంలో అమెరికాలొని కొన్ని చోట్ల డార్విన్ సిద్ధాంతం పాఠశాలల్లో పాఠ్యాంశంగా చెప్పకూడదన్న చట్టం ఉండేది. అలాంటి ఓ చోట ఓ ఉపాధ్యాయుడు దాన్ని ధిక్కరించిన కారణం చేత అతనిపై కోర్టులో కేసు నడిచింది. ఇతని తరపున ఓ సంస్థ వకాల్తా తీసుకుని ఒక న్యాయవాదిని పెట్టింది. అటువైపు మరో ఇంతే సమర్థుడైన న్యాయవాది. మన కథ అంతా కోర్టు కేసు గా నడుస్తుంది. ఇరుపక్షాలవారూ రకరకాల వాదాలు, ప్రతివాదాలు చేసుకోడం తో సాగుతుంది. అయితే, ఇక్కడ అసలు విషయం పక్కకు వెళ్ళి, బైబిల్ కూ, సైన్సుకూ మధ్య తగాదా అన్నట్లు నడుస్తుంది. చివర్లో ఆ ఉపాధ్యాయుడికి జరిమానా పడటం, వీళ్ళు పెద్ద కోర్టుకి అపీలు చేస్కోవాలి అని నిర్ణయించుకోడంతో కథ ముగుస్తుంది.

నా మటుకు నాకైతే సినిమా లో సంభాషణలు చాలా చాలా నచ్చాయి. లో సంఘర్షణలకు దగ్గరగా ఉండటం వల్ల కాబోలు. ముఖ్యంగా – కోర్టు దృశ్యంలోని వాద-ప్రతివాదాలు అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి. ఉదాహరణకు, ఇలా సాగుతుంది ఓ సంభాషణ:

Brady: It’s not an opinion. It’s a literal fact — which the good Bishop arrived at through careful computation of the ages of the prophets, as set down in the Old Testament. In fact, he determined that the Lord began the Creation on the 23rd of October, 4004 B.C. at, uh, 9:00am.
Drummond: [Is] that Eastern Standard Time? Or Rocky Mountain Time? It wasn’t Daylight Saving Time, was it, because the Lord didn’t make the sun until the fourth day.
Brady: That is correct.
Drummond: That first day, what do you think, it was 24 hours long?
Brady: [The] Bible says it was a day.
Drummond: Well, there was no sun out. How do you know how long it was?
Brady: The Bible says it was a day!
Drummond: Well, was it a normal day, a literal day, 24 hour day?
Brady: I don’t know.
Drummond: What do you think?
Brady: I do not think about things that I do not think about.

(Courtesy: http://www.americanrhetoric.com/MovieSpeeches/moviespeechinheritthewind.html)
-ఇలా సాగే సంభాషణలు మీకు ఆసక్తి కలిగిస్తే తప్పక ఈ సినిమా చూడండి.

అసలు నటుల నటన కోసమైనా ఈ సినిమా చూడాలి. వాయిస్ మాడ్యులేట్ చేయడమూ, ముఖ కవళికలు మార్చడమూ – నేను spencer Tracy, Frederic March లకు అభిమానిని అయిపోయాను. ముఖ్యంగా ట్రేసీ నాకు చాలా నచ్చేశాడు.

వీటన్నింటికంటే కూడా ప్రధాన కారణం (నాకు నచ్చడానికి) – చర్చ కు ఎంచుకున్న అంశం కావొచ్చు. కానీ, సంభాషణలే ఈ సినిమాకి ఆయువు పట్టు అనుకుంటున్నాను. ఇలాంటి వస్తువు ఐనప్పటికీ, సినిమాలో కావాల్సినంత హాస్యం ఉంది.

అలాగే, అంత అభివృద్ధి చెందిన అమెరికాలో ఇలాంటి కేసులేవిటో, అన్న అనుమానం కలగకమానదు. ఇలాంటివి ఇంకా బోలెడుండొచ్చు లెండి కానీ, డార్విన్ సిద్ధాంతం స్కూళ్ళలో చెప్పడానికి వ్యతిరేకత ఏమిటో 🙂 ఎందుకో 🙂

నన్నడిగితే ఇది తప్పక చూడవలసిన సినిమా అని చెప్తాను. యూట్యూబులో సినిమా లంకె ఇక్కడ.

6 Comments
  1. Manjula October 7, 2009 /
      • శంకర్ October 10, 2009 /
  2. V. Chowdary jampala October 8, 2009 /
  3. గీతాచార్య October 8, 2009 /