Menu

ఎగిరే పావురమా – ఒక గొప్ప ప్రేమ సందేశం

egire_pavurama-vcd1997లో విడుదల అయిన “ఎగిరే పావురమా” సినిమా నాకు బాగా నచ్చిన ప్రేమ కథా సినిమాలలో ఒకటి. ఇది ఏమాత్రం రొటీన్ ప్రేమ కథ కాదు. అన్ని ప్రేమ కథలకీ పూర్తి భిన్నమైన ప్రేమ కథ. పావురాన్ని పంజరంలో పెట్టినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూసినా అది నిజమైన ప్రేమ కాదు. సినిమా ఈ సందేశం ఇస్తుంది కాబట్టే ఈ సినిమాకి “ఎగిరే పావురమా” అని టైటిల్ పెట్టారు.

ఈ సినిమాలో జ్యోతి (లైలా) తండ్రి ఒక తాగుబోతు. జ్యోతి పసిపాపగా ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోతే ఆమెని పదేళ్ళు వయసు ఉన్న ఆమె మేనమామ శివ (జె.డి. చక్రవర్తి) చేరదీస్తాడు. శివ జ్యోతిని యశోద (సుహాసిని) అనే ఆవిడకి అప్పగిస్తాడు. యశోద జ్యోతిని తన కూతురిలా పెంచుతుంది. శివ జ్యోతిని పెళ్ళి చేసుకోవాలని చిన్నప్పటి నుంచీ కలలు కంటుంటాడు. జ్యోతికి సరస్వతి అనే సంగీత విద్వాంసురాలి ఇంటిలో జూనియర్ బాల సుబ్రహ్మణ్యం (శ్రీకాంత్) అనే గాయకుడు పరిచయమవుతాడు. సరస్వతి కూతురు కంటే జ్యోతి బాగా పాడుతుండడం గమనించిన బాల సుబ్రహ్మణ్యం ఊరిలో జరగబోయే మ్యూజికల్ నైట్ లో తనతో కలిసి పాడాలని జ్యోతిని కోరుతాడు. బాల సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు జ్యోతి మ్యూజికల్ నైట్ లో పాడుతుంది. ఓ రోజు బాల సుబ్రహ్మణ్యం అనుకోకుండా జ్యోతి ఇంటికే కార్పెంటర్ పనికి వస్తాడు. జూనియర్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పుకున్నవాడు కార్పెంటర్ పని చెయ్యడం చూసి జ్యోతి నవ్వుతుంది. యశోద పిల్లల చేత కూడా ఆమె నవ్విస్తుంది. బాలు ఒక కార్పెంటర్ అని తెలియడంతో సరస్వతి అతన్ని అవమానిస్తుంది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీత బోధకుడు అయిన ప్రభాకర శాస్త్రి తన గురువు అని చెప్పుకున్న బాలు ముందుకి ప్రభాకర శాస్త్రిని తీసుకువచ్చి ఇతను మా అన్నయ్య అని చెపుతుంది. సంగీతం నేర్చుకున్నా ప్రోగ్రాంలకి అవకాశాలు దొరకకపోవడం వల్ల కార్పెంటర్ పనిలో చేరానని తన గురువు ప్రభాకర శాస్త్రి ముందు చెపుతాడు బాలు. ప్రభాకర శాస్త్రి బాలుని సంగీత సాధన తిరిగి ప్రారంభించాలని ప్రోత్సహిస్తాడు. బాలు గురించి నిజం తెలుసుకున్న జ్యోతి తాను చేసిన పనులకి బాధ పడుతుంది. సరస్వతి కూడా బాలుకి క్షమాపణ కోరుతుంది.

జ్యోతి బాలుతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం జ్యోతి బాలుతో చెపుతుంది. అదే సమయంలో బాలుకి మ్యూజిక్ ప్రోగ్రాంల కోసం వేరే ఊర్లకి వెళ్ళాల్సి వస్తుంది. జ్యోతి బాలుతో అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెపుతుంది. ఆ సందర్భంలోని పాట “మాఘ మాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగాలెన్నినాళ్ళో, మత్తు మంచు ముంచుకొస్తుందో” నాకు బాగా గుర్తున్న పాట. ఆ సినిమాలో రైల్వే ట్రాక్ దగ్గర తీసిన సన్నివేశాలూ, పాటలూ ఇప్పుడు కూడా నా మనసు నుంచి చెరిగిపోలేదు. ఆ సినిమాని విజయనగరం సమీపంలో విద్యుతీకరించిన రైల్వే లైన్ కి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీశారు. ఆ ప్రాంత పరిసరాల అందం కూడా సినిమాకి మంచి కళ తెచ్చింది.

దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన యశోద భర్త జ్యోతిని చెరపట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలు గమనించిన యశోద జ్యోతిని శివ ఇంటికి పంపించేస్తుంది. బాలు శివ ఇంటికి వచ్చి జ్యోతితో మాట్లాడడం శివ వాళ్ళ అమ్మ చూస్తుంది. ఆమె శివకి ఈ విషయం చెపుతుంది. శివ బాలుతో గొడవ పెట్టుకుంటాడు. శివ బాలుని చంపినా సరే తాను శివని పెళ్ళి చేసుకోను అనీ, తనని బతకనిస్తే బాలునే పెళ్ళి చేసుకుంటాననీ జ్యోతి శివతో చెపుతుంది. శివ ఆత్మహత్య చేసుకుంటాడనే భయంతో శివ తల్లి బాలు దగ్గరకి వెళ్ళి అతన్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది. బాలు జ్యోతిని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించడం వల్ల జ్యోతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ట్రైన్ కింద పడి చావబోతున్న జ్యోతిని శివ రక్షిస్తాడు. తన మేన కోడలు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండడమే ముఖ్యమనుకుని శివ జ్యోతిని బాలుకి ఇచ్చి పెళ్ళి చేస్తాడు.

1997లో చూసిన ఈ సినిమాలోని సన్నివేశాలని ఇప్పుడు కూడా మరచిపోలేక నిన్న ఈ సినిమా DVD కొని మళ్ళీ చూశాను. బూతు గానీ, హింస గానీ లేని గొప్ప సినిమా ఇది. హీరో హీరోయిన్ వెంట పడి ఏడిపించడాన్ని ప్రేమగా చూపించే రొటీన్ సినిమాల కంటే ఈ సినిమా ఎంతో ఉత్తమమైనది.

–ప్రవీణ్ శర్మ

36 Comments
 1. poornachand yalamanchili October 28, 2009 /
 2. Praveen October 28, 2009 /
  • అచ్చి రెడ్డి October 28, 2009 /
   • మజ్ను October 29, 2009 /
  • Jonathan V October 29, 2009 /
 3. Sowmya October 28, 2009 /
  • Praveen October 28, 2009 /
 4. sri October 28, 2009 /
  • రామ October 28, 2009 /
 5. అరిపిరాల October 28, 2009 /
 6. Praveen October 28, 2009 /
 7. venkat October 28, 2009 /
 8. సుజాత October 28, 2009 /
  • పులి రాజా October 28, 2009 /
   • సింహపు రాణి October 28, 2009 /
  • chandrasen October 29, 2009 /
 9. సుజాత October 28, 2009 /
  • తమ్ముడు రెడ్డి October 28, 2009 /
  • పులి రాజా October 28, 2009 /
  • గాలిశీను October 29, 2009 /
 10. Praveen October 28, 2009 /
  • తమ్ముడు రెడ్డి October 28, 2009 /
   • harsha October 30, 2009 /
 11. సుజాత October 28, 2009 /
  • పులి రాజా October 29, 2009 /
  • సౌమ్య October 29, 2009 /
   • గాలిశీను October 29, 2009 /
  • అబ్రకదబ్ర October 30, 2009 /
 12. మజ్ను October 29, 2009 /
 13. Chandritha October 30, 2009 /
 14. V. Chowdary Jampala November 5, 2009 /