పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) నిర్మాణంలో, నీల్ బ్లొకెంప్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా District 9. ఇది ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం.
కథ లోకి వెళ్తే ఒక స్పేస్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం తో కథ ప్రారంభం అవుతుంది. ఇందు లో ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులు చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని వుంటారు. ప్రపంచ దేశాక ఒత్తిడికి లొంగి దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రహాంతరవాసులకి ఒక షెల్టెర్ నిర్మిస్తుంది. ఆదే ‘District-9’.
క్రమక్రమంగా గ్రహాంతరవాసుల బలహీనతలని సొమ్ము చేసుకుంటూ ఆప్రాంతం ఒక అసాంఘిక శక్తుల అడ్డాగా రూపాంతరం చెందుతుంది. అలాగే మరో వైపు గ్రహాంతరవాసుల ఆగడాలు కూడా ఎక్కువవుతాయి. దాంతో జోహనస్బర్గ్ లో నివసించే ప్రజలు మరియు District 9 లోని గ్రహాంతరవాసుల మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలకు స్వస్తి చెప్పాలంటే ఈ గ్రహాంట్తరవాసుల కాలనీని అక్కడినుండి సుదూర ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలా చేసే ఏర్పాట్లని మన హీరో(Protagonist)కి అప్పగిస్తుంది ప్రభుత్వం. కథ లోని ఈ భాగం వరకు ఒక Documentary లా నడుస్తూ ఇకపై ఒక్కసారిగా మనలని ఒక action సినిమా ప్రపంచం లోకి నెట్టివేయబడతాం.
ఈ క్రమం లో హీరో ఒక గ్రహాంతర వాసి chemical matter మూలంగా విచిత్రమైన శారీరక మార్పులకు గురి అవుతాడు. ఇది తెలుసుకున్న అతను పనిచేసే కంపెనీ, అతన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లోంచి బయటకి పడేయడం సంగతి అటుంచి, అతని ద్వారా గ్రహాంతరవాసులు ఉపయోగించే అయుధాలని ఎలా వాడాలి అన్న పరిజ్ఞానము develop చేయడానికి ఒక guinea pig గా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. హీరో మామ(మన దృష్టిలో విలన్) దీనికి అధికారి గా వుంటాడు. ఇది అర్థమైన హీరో, ప్రయోగశాల నుంచి పారిపొయి గ్రహాంతరవాసులు వద్దకు వెళ్లి దీని విరుగుడు కి సాయం కోరతాడు.
అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. కొంతమంది గ్రహాంతరవాసులు(తండ్రి-బిడ్డలు) హీరో కి సాయం చేయడం, దానికి ప్రతిఫలం గా గ్రహాంతరవాసులు మరలా తమ విశ్వంలోకి ఎగిరిపోవడానికి ఉపయోగించే పరికరం తెచ్చి ఇవ్వడంలో సాయపడతాడు హీరో. ఈ కథలో వీరితో పాటు గ్రహాంతరవాసుల అయుధాలు అమ్మే ఒక చిల్లర గాంగ్ నాయకుడు హీరో కి సంక్రమించిన శక్తిని తాను గ్రహించాలని మరో కోణం నుంచి attack చేస్తాడు. ఈ విధంగా హీరో మరియు అతనికి సాయపడే గ్రహాంతరవాసులకు ఓ వైపు ప్రభుత్వ సైన్యం, మరో వైపు నైజీరియన్ చిల్లర గాంగ్ తో పొరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో గ్రహాంతర వాసులు ఏమయ్యారు? మన హీరో ఏమవుతాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే!
ఈ కథ ద్వారా దర్శకుడు మానవ సంబంధాలని,విలువలని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిచాడు. మామూలు Sci-Fi సినిమాల్లొ కనిపించే మనిషికన్నా బలమైన ఏలియన్స్ కాకుండా,మనిషి సాయం కోసం పరితపించే సెంటిమెంటల్ ఏలియన్స్ ని ఈ సినిమా లో చూస్తాం. Director కొత్త వాడైనా, brilliant screenplay తో సినిమా ఆసాంతం రక్తికట్టించాడు. సినిమా setup మరియు conclusion చాలా ఇంట్రెస్తింగ్ గా తీసాడని చెప్పొచ్చు. చూసే ప్రేక్షకుడికి ఇది రియల్ లైఫ్ లో జరుగుతున్న ఒక కథ అని కన్విన్సింగా వుండడం కొరకు T.V లో చూస్తున్న ఒక బ్రేకింగ్ news లా సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా దాదాపు పాతిక భాగం ఈవిధంగా నడిచి ఆతర్వత ఒక action మూడ్ లోకి వెలుతుంది. మొదట్లో విచిత్రంగా, క్రూరంగా అనిపించే ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులపై రాను రాను చూసే ప్రేక్షకుడికి సానుభూతి కలుగుతుంది అంటే అతిశయోక్తికాదు.
ఇకడే దర్శకుడి treatment తీరు, CGI పనితీరు మనలను చాల ఆకట్టుకుంటాయి. ఈ సమ్మర్ లో వచ్చిన ఒకానొక హిట్ ఫిల్మ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. production కాస్ట్ లో దాదాపు 50 శాతాన్ని release అయిన మొదటి రోజు boxoffice వద్ద సంపాదించి పెట్టింది. ఏ విధమైన starcast లేకుండా , ముక్కుమొహం తెలిని కొత్త director తీసిన సినిమా కి ఇటువంటి collections రావడం బహూ అరుదుగా జరుగుతుది. $30మిలియన్ టోటల్ బడ్జెట్ తో release అయ్యి ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదపు $200 మిలియనులు వసూలుచేసింది.
ఇది ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా!
–సురేష్
K మహేశ్ కుమార్ says:
డాక్యూడ్రామా తరహాలో సాగే ఈ సినిమా “ఏలియన్” చిత్రాల్లో ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. బహుశా, “ఎప్పుడూ ఏలియన్స్ అమెరికాకే వస్తారా…ఆఫ్రికాకు ఎందుకు రాకూడదూ!” అంటూ, హాలీవుడ్ కు ఒక చెంపపెట్టుకూడా కావచ్చు.
వేరే గ్రహాలనుంచీ ఏం ఖర్మ, బీహార్ నుంచీ ముంబై వచ్చినవాళ్ళూ,బాంగ్లాదేశ్ నుంచీ బెంగాల్ వచ్చినోళ్ళూ,ఇండియా నుంచీ అమెరికా వెళ్ళినోళ్ళూ అందరూ ఏలియన్సే…ఈ సమస్య అన్ని చోట్లా ఉంది. ఆ “ఏలియన్స్” ని అర్థంచేసుకుంటే (DNA లో మార్పుజరిగి)హీరోలాగా మనం తయారవుతాం. అది అసలు కథ.
“బ్రెక్టియన్ (Bertolt Brecht) ఏలియనేషన్” తరహాలో సమస్యని పరికిస్తూ(తిలకిస్తూ)కూడా దానిలో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆబ్జక్టివ్గా చూసేవిధంగా ఈ సినిమాలో దర్శకుడు ఉపయోగించిన విధానం బహుబాగుంది.
డాక్యూడ్రామా ఏలియనేషన్ను “లెజిటిమైజ్” చెయ్యడానికి బ్ర్హమాండంగా ఉపయోగపడింది.ఒక సమస్యను అనుభవిస్తూ,నిజంగా భ్రమిస్తూకూడా “ఆలోచించడానికి” ఇంతకంటే మంచి టెక్నిక్ మరొకటి లేదు.
అబ్రకదబ్ర says:
>> “వేరే గ్రహాలనుంచీ ఏం ఖర్మ, బీహార్ నుంచీ ముంబై వచ్చినవాళ్ళూ,బాంగ్లాదేశ్ నుంచీ బెంగాల్ వచ్చినోళ్ళూ,ఇండియా నుంచీ అమెరికా వెళ్ళినోళ్ళూ అందరూ ఏలియన్సే…ఈ సమస్య అన్ని చోట్లా ఉంది. ఆ “ఏలియన్స్” ని అర్థంచేసుకుంటే (DNA లో మార్పుజరిగి)హీరోలాగా మనం తయారవుతాం. అది అసలు కథ”
అదే అసలు కథ. ఒకరకంగా District-9 ని గాజా స్ట్రిప్ శరణార్ధుల కథ అని కూడా అనుకోవచ్చు.
>> “.. ఇండియా నుంచీ అమెరికా వెళ్ళినోళ్ళూ అందరూ ఏలియన్సే”
మీరు తెలిసి అన్నారో, మాట వరసకన్నారో కానీ ఇది నిజం. అమెరికాలో నివాసముండే విదేశీయుల్ని ప్రభుత్వ రికార్డుల్లో ‘ఏలియన్స్’ అనే పేర్కొంటారు. అందుకే హాలీవుడ్ ఏలియన్స్‌ని (గ్రహాంతరవాసులని) చెడ్డవారుగా స్టీరియోటైప్ చెయ్యటంపై విమర్శలున్నాయి.
కె.మహేష్ కుమార్ says:
@అబ్రకదబ్ర: మాటవరసకే అన్నానండీ! నిజంగా ఏలియన్స్ అని వ్యవహరిస్తారని నాకు తెలీదు.
పులి రాజా says:
సినిమా బాగుంది. కాని క్రిస్టోఫర్(Father Alien) మళ్ళీ తిరిగి వస్తాడో రాడో చూపించలేదు. sequel ఏమైనా రావొచ్చేమొ.చివర్లో వికస్ (హీరో)భార్యకు మెటల్ గులాబి పంపిస్తాడు అంటే బ్రతికే వున్నాడు అని అర్ధమా ? మిగిలింది తరువాయి భాగంలో చూపిస్తాడేమొ ???
harsha says:
avunu bathike vunnadu..
anthaku mundu chepthadu kada handmade gifts ante ishtamani…
aa tarvatha oka alien flower chesthundatam choopistharu…veede vaadu
Chandra says:
నాకు మాత్రం సినిమా 20 నిమిషాలకే బోరు కొట్టింది.. ఇక చూడలేక పోయ.. పీటర్ జాక్సన్ అనగానె మరో మాగ్నం ఓపస్ ఎక్స్పెక్ట్ చేసాను.. తర్వాత తెలిసింది పీటర్ కేవలం ప్రొడ్యూసర్ అని..
రాకేశ్వర రావు says:
ఆ తెల్లోళ్ళు (సారీ ఫర్ ద ష్టీరియోటైప్) ఎప్పుడూ ఏలియన్ల సినిమాలు ఎందుకు తీస్తారో నాకు అర్థం కాదు. దెయ్యాల సినిమాలు తీస్తే అశాస్త్రీయంగా వుంటుంది ఇఱవయ్యొకటవ శతాబ్దిలోనని కాబోలు. కానీ మీరు తటస్థంగా చూస్తే, గ్రహాంతర వాసలు ఉండడానికీ, వారు మన గ్రహానికి రావడానికీ, వారు మనిషిరూపంలో వుండడానికి (anthropomorphic beings), వారు ‘మనకంటేఁ’ చెడ్డ వారైవుండడానికీ గల సంభావ్యత, దెయ్యాలు (amorphous beings) వుండడానికి గల సంభావ్యత కంటే వేఱు కాదు. రెండూ సున్నానే!(సున్నాలో చాలా రకాల సున్నాలున్నాయి).
పైపెచ్చు వాళెప్పుడూ అమెరికాలోనే ఎందుకు దిగుతారు అని అడిగేవారు అంతర్జాతీయ ప్రేక్షకులు.
కాబట్టి ఈ సారి. తెల్లోళ్ళు, నల్లోళ్ళూ వుండి ఆంగ్లం మాట్లాడే వేఱే దేశం ఎంచుకున్నట్టున్నారు.
బాబోయ్ దెయ్యాల (దెయ్యాలలో చాలా రకాల దెయ్యాలున్నాయి) సినిమాలు!
కె.మహేష్ కుమార్ says:
@రాకేశ్వరరావు: హాలీవుడ్లో వచ్చే ఏలియల్న సినిమాలకన్నా దయ్యాల సినిమాలే ఎక్కువ. శాస్త్రీయతకూ,శతాబ్ధానికీ లంకె లేదు. ఈ సినిమాలో ఏలియల్ను మనుషుల్ని పోలి ఉండరు.కాబట్టి మీ జెనరలైజేషన్ కి ఇక్క్డడ స్థానం లేదు. ఈ సినిమా ఏలియల్న గురించి కాదు,displacement-migration వంటి మానవీయ సమస్యల గురించి. ఏలియన్లు ఆవిషయం చెప్పడానికి ఒక మాధ్యమం మాత్రమే. This is surely not a stereo typical alien film produced by Hollywood. ఎక్కడైనా దొరికితే సినిమా చూడండి. లేదా, నన్ను పంపమంటే నేను పంపుతాను.
రాకేశ్వర రావు says:
@ మహేశ్
ఓహో..
కానీ పైన చెప్పిన దానిని బట్టి ఎక్కడో మధ్యలో అది యాక్షన్ సినిమా అయిపోతుందట. మఱి దాని మాటో..
Krishh says:
@ Rakesh : I’m surprised that you don’t believe extra terrestrial life exists , at least theoretically ……
రాకేశ్వర రావు says:
సున్నాలో చాలా రకాల సున్నాలు వున్నాయి, ఒకటి ప్రాక్టికల్ రకం ఇంకొకటి థియరిటికల్ రకం. అస్యూమ్ థియరిటికల్ సున్నా అన్లెస్ స్టేటెడ్ అదర్వైస్.
Probability of ..
.. Existence of beings p
.. anthropomorphism (or at least vertebrate form) 0.0
.. communicability 0.0
.. successful journey 0.0
.. harmfulness 0.0
total prob. = p x 0.0 x 0.0 x 0.0 x 0.0 = 0.00000
దెయ్యాలలో చాలా రకాల దెయ్యాలు వున్నాయి, ఒకటి ప్రాక్టికల్ రకం ఇంకొకటి థియరిటికల్ రకం. అస్యూమ్ థియరిటికల్ దెయ్యం అన్లెస్ స్టేటెడ్ అదర్వైస్.
Amorphous beings existence 0.0
Practically
0.0 (theoretical) = 0.0 (theoretical)
Ok?
veebee says:
@Rakeswara Rao
From WIKI: The title and premise of District 9 were inspired by historical events that took place in South Africa during the apartheid in a residential area of Cape Town named District Six.
అబ్రకదబ్ర says:
గ్రహాంతరవాసులు ఉన్నారా/లేరా అన్నది సైన్స్‌కి, నమ్మకాలకి వదిలేద్దాం. ఏలియన్స్ కథాంశంతో వచ్చిన సినిమాల్లో ఇది తప్పకుండా విభిన్నమైనదే.
sanjeev says:
ilanti movies hindi lono telugu lono vasthe andaroo emantarante over ga choopinchaaru…ila nijanga jaruguthundaa ani antaru. mari english lo ayithe chachi nodu brathiki vachina abbo amazing ani choostharu.anthe le……ayithe ee movie baane undi. manchi prayogam…..
Vasu says:
నేను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం ఈ సినిమాకి. రెవ్యూస్ చూసి తెగ ఎక్ష్పెక్ట్ చేసి వెళ్ళాం. సినిమా మొదటి రీల్ నించి ఎంత చిరాకుగా ఉందంటే, కష్టపడి సగం వరకు చూశాం. ఇక మా వల్ల కాక, సగం లో వచ్చెసాం. ఇక్కద వాళ్ళది (US) వింత టేస్ట్ అనుకుని సరిపెట్టుకున్నాం, కానీ చాల మందికి ఇది నచ్చడం అశ్చర్యంగా ఉంది.
ఇలాగె రివ్యూస్ గొప్పగా ఉండి ఈ మధ్య (నాకు) చెత్తగా అనిపించిన మరో సినిమా వాచ్ మెన్. అది కూడా పెద్ద హిట్ ఇక్కడ.
పులి రాజా says:
మొదటి సారి నాకు అర్ధం కాక అలాగే వుంది. రెండోసారి చూసినప్పుడు సినిమాలో లోతు అర్ధమయ్యింది.అప్పుడు బాగుంది.
కన్నగాడు says:
డాక్యుమెంటరీలా సా…గినంత సేపు కాస్త బోర్ కాని మిగతా సినిమా బాగుంది.
గీతాచార్య says:
Have 2 see