2008 సంవత్సరానికి గాను నంది చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. నంది ఫిల్మ్ అవార్డుల కమిటి ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలోని జ్యూరీ బృందం ప్రతినిధులు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుల ఎంపిక కోసం ఎంట్రీలు స్వీకరించామని, జ్యూరి ప్రతినిధులు పలుమార్లు సమావేశమై అన్ని కోణాలను క్షణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డులకు ఎంపిక చేసామని ఈ సందర్భంగా చెప్పారు.
ఉత్తమ చిత్రం : గమ్యం
ద్వితీయ ఉత్తమ చిత్రం : వినాయకుడు
తృతీయ ఉత్తమ చిత్రం : పరుగు
కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం : అష్టాచమ్మా
బహుళ జనాదరణ పొందిన చిత్రం : రెడీ
జాతీయ సమగ్రత చిత్రం : 1940లో ఒక గ్రామం
ఉత్తమ దర్శకుడు : రాధాకృష్ణ జాగర్లమూడి (గమ్యం)
ఉత్తమ నటుడు : రవితేజ (నేనింతే)
ఉత్తమ నటి : స్వాతి (అష్టాచమ్మా)
ఉత్తమ సహాయనటుడు : నరేష్ (గమ్యం)
ఉత్తమ సహాయనటి : రక్ష (నచ్చావులే)
ఉత్తమ గుణచిత్ర నటుడు : ముక్కు రాజు (1940లో ఒక గ్రామం)
ఉత్తమ హాస్య నటుడు : బ్రహ్మానందం (రెడీ)
ఉత్త హాస్య నటి : ఎవరూ ఎంపిక కాలేదు
ఉత్తమ ప్రతినాయకుడు : సోనుసూద్ (అరుంధతి)
ఉత్తమ బాల నటుడు : మాస్టర్ భరత్ (రెడీ)
ఉత్తమ బాల నటి : బేబీ దివ్యనగేష్ (అరుంధతి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : సాయికిరణ్ అడవి (వినాయకుడు)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : ఎ.కరుణాకరన్ (ఉల్లాసంగా ఉత్సాహంగా)
ఉత్తమ కథా రచయిత : ఆర్పీ పట్నాయక్ (అందమైన మనసులో)
ఉత్తమ మాటల రచయిత : పూరి జగన్నాథ్ (నేనింతే)
ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఎంతవరకు…- గమ్యం)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు : ఛోటా కె.నాయుడు (కొత్తబంగారు లోకం)
ఉత్తమ సంగీత దర్శకుడు : మిక్కీ జె.మేయర్ (కొత్తబంగారు లోకం)
ఉత్తమ గాయకుడు : శంకర్‌మహదేవన్ (నాద సంధానమే… వెంకటాద్రి)
ఉత్తమ గాయని : గీతా మాధురి (నిన్నేనిన్నే కోరా… నచ్చావులే)
ఉత్తమ ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్ (అరుంధతి)
ఉత్తమ కళాదర్శకుడు : అశోక్ (అరుంధతి)
ఉత్తమ నృత్యదర్శకుడు : ప్రేమ్‌రక్షిత్ (వయస్సునామీ… కంత్రి)
ఉత్తమ శబ్దగ్రాహకులు : రాధాకృష్ణ, మధుసూదన్‌రెడ్డి (అరుంధతి)
ఉత్తమ వస్త్రాలంకరణ : దీపా చందర్ (అరుంధతి)
ఉత్తమ ఆహార్యం : రమేష్ మహంతి (అరుంధతి)
ఉత్తమ ఫైట్‌మాస్టర్ : రామ్-లక్ష్మణ్ (నేనింతే)
ఉత్తమ అనువాద కళాకారుడు : పి.రవిశంకర్ (అరుంధతి)
ఉత్తమ అనువాద కళాకారిణి : ఆర్.హరిత (నచ్చావులే)
ఉత్తమ స్పెషల్‌ఎఫెక్ట్స్ : రాహుల్ నంబియార్ (అరుంధతి)
ఉత్తమ బాలల చిత్రం : అర్హత పొందలేదు
ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం : దుర్గి
ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు : ఎవరూ లేరు
ఉత్తమ డాక్యుమెంటరీ : అర్హత పొందలేదు
ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ : మేమూ మనుషులమే
ఉత్తమ విద్యావిషయక చిత్రం : అర్హత పొందలేదు
ద్వితీయ విద్యావిషయక చిత్రం : అడవి నా తల్లిరో
సినిమాపై ఉత్తమ రచన : ఆరుద్ర సినీమినీ కబుర్లు (డా||రామలక్ష్మి ఆరుద్ర)
ఉత్తమ సినీ విమర్శకుడు : పర్చా శరత్‌కుమార్
ప్రత్యేక ప్రశంస పురస్కారాలు
అనుష్క (అరుంధతి), బతుకమ్మ చిత్రం, అల్లు అర్జున్ (పరుగు), సుశీల (1940లో ఒక గ్రామం)
నందులు పొందిన పై వారికి నవతరంగం హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తోంది.
tags: నంది అవార్డ్, 2008, గమ్యం, వినాయకుడు, పరుగు, అష్టాచమ్మా, రెడీ, 1940లో ఒక గ్రామం, క్రిష్, రవితేజ, స్వాతి, నరేష్, బ్రహ్మానందం, nandhiaward, krish, gamyam, alluarjun, swathy, astachamma, raviteja, purijagannath
కె.మహేష్ కుమార్ says:
అవార్డు గ్రహీతలకు అభినందనలు.
పూరీ జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయిత…ఇవ్వాల్సిందే!
“నేనెంత ఎదవనో నాకేతెలీదు” అనే ఒక్క డైలాగ్ కోసం నేషనల్ అవార్డుకూడా ఇచ్చెయ్యొచ్చు.
పూరీ జగన్నాథ్ says:
పనీపాట లేక సమీక్షలు & కామెంట్స్ వ్రాసున్న మీకు ఉత్తమ సమీక్షకుడు అవార్డ్ ఇవ్వల్సిందే!
రాజమౌళి says:
అవును అవును.. ఇవ్వాల్సిందే !:)
కె.మహేష్ కుమార్ says:
@పూరీ జగన్నాథ్: సమీక్షలు రాయడం పనిలేనిపనైతే ఫిల్మ్ మేకింగ్ కూడా పనిలేనిపనే అవుతుంది. Reviewing a film or critically appreciating a film is a “creation” in itself. సినిమా తీస్తేనే అది సృజనాత్మకత కాదు. అది చూసి అబిమానించి ప్రేమించే ప్రేక్షకుడూ,చూసి విమర్శించే విమర్శకులు కూడా వారివారి సృజనాత్మకతను ఉపయోగించే సినిమాను చూస్తున్నారు. They are making their own meaning out of the film.
ఈ విషయం అర్థంకానంత వరకూ,ప్రేక్షకుడి-విమర్శకుడి సృజనాత్మకతని పనిలేనిపనిగా అనుకున్నంతవరకూ ఫిల్మ్ మేకర్ పనికిరానివాడుగానే మిగులుతాడు.
పూరీ జగన్నాథ్ says:
అందుకే నీలాంటి వాళ్ళకోసం నా సినిమా లో ఏమిరా బాలరాజూ అనే డైలాగ్ పెట్టాను అప్పుడే మర్చిపోయావా
నేస్తం says:
అవార్డుల కమిటీ తన పని పూర్తి చేసి చేతులు దులుపుకుంది. పనిలోపనిగా అన్ని వర్గాలనీ, లాబీలనీ సంతోషపరిచినట్లుగా కూడా కనిపిస్తోంది. అవార్డులకు అర్హమైన ఎంట్రీలు లేని చోట ఆయా కేటగిరీలలో ఎవరికీ ఇవ్వలేదని చెప్పుకుని తన నిష్పాక్షికతను (?) చాటుకునే ప్రయత్నం కూడా చేసింది. (అంటే అవార్డులు పొందిన వాళ్ళు అందరూ వాటికి అంత అర్హులేనా అనే చెత్త ప్రశ్నలు వెయ్యకూడదు ఇక్కడ). జ్యూరి ప్రతినిధులు పలుమార్లు సమావేశమై “అన్ని కోణాలను” క్షణ్ణంగా పరిశీలించారట. నిజమేననిపిస్తోంది.
.
ఉత్తమ చిత్రంగా గమ్యం, మరో నాలుగైదు ఇతర అవార్డులు తప్ప మిగిలినవి చిత్ర పరిశ్రమకే ఆశ్చర్యం కలిగించాయని మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. వినాయకుడు సినిమా నేను చూడలేదు. పరుగు ఎలా ఉత్తమ చిత్రం అయిందో నాకు అంతుబట్టలేదు. ఇంట్లోనుంచి లేచిపోయి పెళ్లి చేసుకొమ్మనే సందేశం ఇచ్చినందుకో, లేక అలా వెళ్ళే వాళ్లకి మిత్రులు విలన్ చేతిలో తన్నులు తింటూ ఐనా సరే, (దాన్ని త్యాగంగా ఫీల్ అవుతూ) అన్నిరకాలుగా హెల్ప్ చెయ్యాలనే సందేశం ఇచ్చినందుకో మరి తెలీదు.
.
ఉత్తమ నటుడు రవితేజ, ఉత్తమ నటి స్వాతి. వీళ్ళిద్దరూ తమ తమ రోల్స్ లో చేసిందేమిటంటే కొన్ని జనాకర్షక డైలాగులని తమ మేనరిజమ్స్ తో కలిపి వండటం. బహుశా ‘నీ కష్టాలన్నీ చెప్పి నన్ను దొబ్బకు’ అని రవితేజ హీరోయిన్ తో అన్న మాట, ‘మహ్…ఏష్’ అంటూ స్వాతి చేసిన హొయలు జ్యూరీకి గొప్పగా నచ్చి ఉండొచ్చు. అందుకు మనమేమి చెయ్యలేము. దగ్గర్లోని థియేటర్ గోడకు తలబాదుకోవటం తప్ప. తన కామెడీ హీరో ఇమేజ్ ని సైతం దాటుకుని ‘గమ్యం’లో గాలిశీను పాత్రలో దూరిపోయి మన హృదయాలని తాకిన నరేష్ ఉత్తమ నటుడు కాకుండా ఉత్తమ సహాయ నటుడు ఎందుకయ్యాడు? సింపుల్. అతను వేసింది హీరో పాత్ర కాదు కదా. హీరోలు మాత్రమే ఉత్తమ నటులు కాగలరు. ఇది అవార్డుల రూలు కాబోలు.
.
ఉత్తమ మాటల రచయిత పూరి జగన్నాథ్ (నేనింతే). నిజమేలెండి పాపం ఈ సినిమాలో చాల సందేశాలిచ్చారు. ఒక్కరు కాదు, ఈ సినిమాలో అన్ని పాత్రలు సందేశాలమీద సందేశాలు ఇస్తూనే ఉంటాయి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, సైడు యాక్టర్లు, ముమైత్ ఖాన్ తో సహా .(వీళ్ళందరూ ఈ సినిమాలో పాత్రలు సార్). వాళ్ళు ఎంత కష్టపడి సినిమా తీస్తారు, ఎంత డబ్బు పెడతారు, ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎంత పర్సనల్ లైఫ్ మిస్ అవుతారు, గాసిప్స్ వస్తే ఎంత బాధపడతారు, మనం వాళ్ళ అంత కష్టాన్నీ ఎంత ఈజీగా సినిమా ఫ్లాప్ అని ఒక్క మాటతో తీసేస్తాము, నవతరంగంలాంటి చోట్ల సినిమా రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళటం మానేస్తే వాళ్లకి ఎంత నష్టం.. అబ్బో ఎన్ని చెప్పాల్లెండి ఈ లిస్టు. ఉత్తమ సందేశాత్మక చిత్రం అనే కేటగిరీ ఏది లేదు కాని, ఈ సినిమా దాన్ని ఎగరేసుకుపోయేది అంటే నమ్మండి. ఎవరికీ కావాలి బాబు మీ సొద? అక్కడికి మీ సినిమావాళ్ళు అంతా మహానుభావులు, చూసే ప్రేక్షకులే మామూలుభావులు అనే చులకన భావం ముందు మీరు వదులుకోండి. లేకపొతే ప్రేక్షకులు ‘మేమింతే’ అని మీ సినిమాలని తిప్పి కొడుతూనే ఉంటారు.
.
ఉత్తమ విలన్ గా సోనుసూద్! నిజమే లెండి అరువుగొంతుతో, stereophonic audiography తో థియేటర్లు దడదదలాడించి మన బీపీ పెంచాడుగా. ఇవిరెండూ తీసేసి చూస్తే ‘అతనుగా’ చూపిన నటన ఏమిటి అంటారా? మీరు మరీ అలా నిలదీస్తే ఎలాగండీ?
.
కంత్రి సినిమాలోని ‘వయస్సునామీ’ పాటకి ఉత్తమ నృత్య దర్శకత్వం అవార్డు! శరీరాన్ని ఎన్ని వంకరలు తిప్పితే అంత గొప్ప డాన్స్.
.
ఉత్తమ స్పెషల్‌ఎఫెక్ట్స్ : రాహుల్ నంబియార్ (అరుంధతి). సమయం సరిపోకపోవటం వలన సినిమా విడుదల రెండ్రోజులు ఆపి మరీ చెయ్యటం వలన గ్రాఫిక్స్ అనుకున్నంత బాగా చెయ్యలేకపోయామని రాహుల్ నంబియార్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐనా మన అవార్డు కమిటీ ఉదారస్వభావం ముందు ఇవన్నీ బలాదూర్. Nothing is perfect అనే మాటని మనవాళ్ళు నమ్మారు.
.
ఇంతమందికి ఇచ్చి మిమ్మల్ని మాత్రం ఎందుకు వదలాలి అనుకున్నారేమో, బొమ్మాలినీ వదలకుండా అల్లు అర్జున్ తో పాటు ప్రత్యేకంగా ప్రశంసించారు. శుభమ్.
కె.మహేష్ కుమార్ says:
@నేస్తం: Agreed. ఆ మాత్రం దానికి ఉత్తమ”నటుడు-నటి” అనడం ఎందుకో నాకు అర్థం కాదు.వాళ్ళు ఎలాగూ చేసింది నటన కాదుకాబట్టి, హాయిగా ఉత్తమ హీరో-హీరోయిన్ అనుకోవచ్చుగా!
భరద్వాజ says:
అంతా తమ్మారెడ్డి గారి చలవే …:D
అయన ఏదంటే అదే
రాజకీయాలు కి వెళ్ళినా ఇంకా వారసులకు అవార్డు లకు ఢోకా లేదు
వచ్చే ఏడాది మగధీర కు పది నందులు
ఉత్తమ హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, స్పెషల్ విసుయల్ ఎఫ్ఫెక్ట్స్,ఇంకా మరో ఆరు అవార్డు లు
ఉత్తమ హీరో వేరొకరికి వెళ్తే ఏమి చేస్తాం జ్యూరి అవార్డు వుందనే వుంది కదా! అది ఇచ్చేదాం.. ఏమంటారు?
చదువరి says:
“.. నరేష్ ఉత్తమ నటుడు కాకుండా ఉత్తమ సహాయ నటుడు ఎందుకయ్యాడు?” – చాలా బాగా అడిగారు, నేస్తం. (నా మనసులోని ప్రశ్న కూడా అదే.)
పులి రాజా says:
same feeling bro . what more we can do ?
అబ్రకదబ్ర says:
‘వినాయకుడు’ ద్వితీయ ఉత్తమ చిత్రమా? హతవిధీ!
Ramu says:
Too many awards!
సుజాత says:
వినాయకుడు చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించడాన్ని కమిటీ మీద ఆరోపణలను ఇంకో మాట లేకుండా ఆమోదించ వచ్చు!
భాస్కర్ says:
పరుగు లో నటన కే ఇచేసారు జ్యూరి..అది నటనా అదొక సినిమా ఆ
ఫిలిం ఫేర్ లో ఉత్తమ నటుడు అవార్డు ఏందో !
కే ఏ పాల్ కి ఉత్తమ హాస్యనటుడు అవార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గా
Vasu says:
గమ్యం సినిమాని ఎందుకు అంట ఎత్తేస్తున్నారో /ఎత్తేసారో నాకైతే అర్థం కాలేదు. చాలా నొర్మల్ సినిమా. నరేష్ తప్ప మిగతా నటులంతా ఘోరంగా పెర్ఫోం చేసారు. ఈ ఏడాది మరీ దారుణం గ ఉన్న్నాయి అవార్డ్స్. నేనింతే కి మాటలకి అవార్డు. న బూతే న బవిష్యత్. పచ్చి బూతులు రాస్తే అవార్డు ఇచి ఈ సారి మరిన్ని కొత్త బూతులు రాయడానికి పూరిని ప్రోత్సహిస్తున్న నంది సెలక్షన్ కమిటీ కి వెయ్యి నమస్కారాలు. ఇంకెవరికి.. ఆ అరుంధతికి. చాలా బావుంది. అయినా నోబుల్లు, ఒస్కార్లె ఎవడికి పడితే వాడికి ఇస్తుంటే, నంది అవార్డుల గురించి అడగాలా..
suresh says:
కేవలం ఏదో విమర్శించాలని విమర్శించవద్దు. గమ్యం లాంటి సినిమాలు కూడ తెలుగులో రాకపోతె ఇక మనకు మిగిలేవి So called “బ్లాక్ బస్టర్స్” మాత్రమే. Gamyam deseves Nandi.
Vasu says:
విమర్శించాలని విమర్శించడం ఏంటో నాకర్థం కాలేదు. విమర్శించడంలో నాకేం ఆనందం లేదు ఇలా ఇస్తున్నారని బాధ తప్ప. ఇంకా వేరేవి ఏమి లేక ఇస్తే ఇచ్చుండచ్చు కాని నంది ఇవ్వాల్సినంత అదీ బంగారు నంది ఇవ్వాల్సినంత సీన్ లేదు ఆ సినిమాకి (It does not deserve a nandi definitely). మీరన్నట్టు కొత్త తరహా సినిమాలని ఆహ్వానించడం ముదావహం. ఒప్పుకుంటా కానీ అలాగని కొత్తది కాబట్టి ఆకాశానికి ఎత్తెయ్యడం అనవసరం. ఇంకోటి శేఖర్ కమ్ముల ౪ సినిమాలు తీసిన రాణి రెకగ్నిషన్ (industry లో) క్రిష్ కు ఒక్క సినిమాతో రావడం కేవలం సినిమా వల్ల అని నేను అనుకోను. రాఘవేంద్ర రావు గారి అండ దండ, లోబ్బియింగ్ బానే ఉండి ఉంటాయని ఈ నంది రావడానికి నా గట్టి నమ్మకం.
suresh says:
మొత్తం ఇప్పటి వరకు విడుదలైన తెలుగు సినిమాల్లొ ‘గమ్యం’ ఉత్తమ సినిమా అని కాదు కద! 2008-09 విడుదలైన సినిమాల్లొ ఇది ఉత్తమ సినిమ అని ఇచ్హారు. మీరు చెప్పండి 2008-09 విడుదలైన సినిమాల్లో గమ్యానికి కాక బంగారు నంది పొందేదుకు అర్హత ఏ సినిమాకు వుందో.
2008 says:
శంకర్ దాదా జిందాబాద్
Nagarjuna Pavan Kumar says:
filmfare కి follow up లా ఉంది..అక్కడ ఏడ్చిన వాళ్లకి ఇక్కడ కన్నీరు తుడిచారు కొన్ని విభాగాల్లో…ఏంటో మన తెలుగు cinema ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉందా అన్న భావం కలుగుతుంది ఈ award distribution చూస్తే…
నా వరకైతే నరేష్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, గమ్యం awards, ఇంకో 4,5 awards తప్ప మిగతావన్నీ మొక్కుబడిగా ఇచ్చినట్టే అనిపించాయి..
అష్టా చెమ్మ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమా?It’s a loud movie and the climax is awkward(though I like Mohan Krishna Indraganti)
next year best actor – Srikanth
best jury award – Ram Charan Teja
anonymous says:
మోటార్ సైకిల్ డైరీస్ ని కాపీ చేస్తే ఇక్కడ నందులు.. అది ఒక సినిమా నా ఒక్క నరేష్ ఆక్టింగ్ తప్పిస్తే
మూడొందలు టెన్ కమాండ్ మెంట్స్ లకు వచ్చే ఏడాది నందులు
ఓవర్ ఆక్షన్ (ఎనర్జీ లెవెల్స్ అంట) తో బూతు సినిమాలు బూతు డైలాగు లు చెబితే ఇమేజ్ తో పాటు అవార్డులు
raghu says:
గమ్యం, motorcycle diaries copy యా? సినిమాలు రెండు చూసావా అసలు
2008 says:
మగధీర టెన్ కమాండ్ మెంట్స్ మూడొందలు చూసావా నువ్వు అసలు
Vasu says:
నాకెందుకో మగధీర లో Jackie Chan “The Myth” ఛాయలు ఎక్కువగా కనిపించాయి.
G says:
Ravi Teja is an excellent actor, who was never given a chance to act. Still from the time of Khadgam, he has not got his “Okka Chance’. Well Itz now to a Tamil movie again with Naresh. I regret he got this award for a crap (shall we say an incomplete movie? Puri could have done more better, but failed.), but he is a potential awardee.
ఒబామాకి నోబెల్, రవితేజకి నంది.
రెండు కూడా జరుగబోయే వాటికిచ్చారు. Oh! What a coincidence.
This award is for the Nadodigal remake. I agree with this then.
సిరివెన్నెల, గమ్యం are deserved winners, but the rest are mere formality.
How about giving an award to BK for his superb comedy in OM? The climax fight is the best ever comedy scene in the history of world cinema. I have never seen such an ‘out of the Box’office movie in my life.
రామ says:
ఇలా అవార్డులు ఇచ్చి ఇప్పుడిప్పుడే నిద్రపోతున్న పూరి ని అనవసరం గా రెచ్చగొట్టారు
.
పి. రవిశంకర్ కి ఉత్తమ విలన్ అవార్డ్ కూడా ఇచ్చి వుంటే కరెక్ట్ గా ఉండేది. సోను సూదే అక్కర్లేదు. అక్కడ ఎవడు నించున్నా జనాలు జడుసుకునే వారు.
గీతామాధురికి అవార్డు మాత్రం well-deserved అనిపిస్తుంది. Beautiful rendition of a nice song.
అబ్రకదబ్ర says:
ఓ పక్క వరదల్లో సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలు, మరో పక్క వయ్యస్సారువారి ఉచిత వరాల మూలంగా ఖజానా ఖాళీ అయ్యి రెండు మూడు నెలలుగా ప్రభుత్వోద్యోగులకి జీతాలు సైతం సరిగా ఇచ్చుకోలేని పరిస్థితి. ప్రభుత్వం దివాలా తీసిన ఈ పరిస్థితిలో ఇంతింత ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఇచ్చే అవార్డులు ఎలా ఉండాలి?
నంది అవార్డుల మీద గతంలోనూ విమర్శలొచ్చాయి కానీ ఈ సారంత కంగాళీ అవార్డుల పంపకం ఇంతకు ముందెప్పుడూ లేదు. అంత గొప్ప సినిమాలు రాకపోతే ఎవరికీ అవార్డులీయకుండా వదిలేయొచ్చు కదా. కొన్ని విభాగాల్లో చెప్పుకునేంత గొప్ప ఎంట్రీలు లేవంటూ పేద్ద గొప్పగా ఎవరికీ అవార్డివ్వలేదు. బాగానే ఉంది. అదేమాదిరిగా మిగతా చాలా అవార్డులూ ఎవరికీ ఇవ్వకుండా వదిలేస్తే వద్దన్నదెవరో? పైగా కొన్ని కేటగిరీల్లోనైతే మూడేసి అవార్డులు – ప్రధమ, ద్వితీయ, తృతీయ అంటూ. జనాల సొమ్ము దోచి పెట్టటానిక్కాకపోతే, ఇన్నేసి అవార్డులెందుకు? పరుగు పందాల్లోలా సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ ఏమిటో!!! ఇది అవార్డుల లిస్టా, టాప్ టెన్ లిస్టా?
‘ఉత్తమ హాస్యనటి’ వంటి కొన్ని విభాగాలకు ఎవరూ ఎంపిక కాలేదు. వాటికోసం ఎవరూ లాబీయింగ్ చేసుకోలేదన్నమాట
.
‘బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం’ కేటగిరీ హేఁవిటో! దానికి బదులు ‘ఉత్తమ అట్టర్ ఫ్లాప్ చిత్రం’ అని ఒకటిస్తే పాపమా ఫ్లాప్ సినిమా తీసినాయనకి వేణ్నీళ్లకి చన్నీళ్లుగా ఉండదూ?
‘ఉత్తమ గుణచిత్ర నటుడు’ అనగానేమి? అదున్నది కానీ ‘ఉత్తమ గుణచిత్ర నటి’ కేటగిరీ లేదేమి?
ఉత్తమ నటుడి/నటి విభాగాల్లో ఎన్ని రకాలో చూడండి: నటుడు, హాస్య నటుడు, సహాయ నటుడు, ప్రతినాయకుడు, గుణచిత్ర నటుడు .. ఇవన్నీ చాలనట్లు ప్రత్యేక ప్రశంసా (జ్యూరీ) నటుడు!
ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ విద్యావిషయక చిత్రం ఏవీ లేవు కానీ ఆయా విభాగాల్లో ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం ఉన్నాయట! ఉన్నవాటిలో మెరుగైనది ఉత్తమం కావాలి కానీ ద్వితీయ ఉత్తమం కావటమేంటో!! ఏ స్కేలు ప్రకారం ఈ కొలతలేస్తారో మరి.
‘నేనింతే’లో ఒకానొక సన్నివేశంలో హీరోగారిని ప్రతినాయకుడు ‘నీ అమ్మని ***’ (no award for guessing the rest of it) అని బండబూతులు తిడతాడు (సెన్సారు వారు ఆ సన్నివేశంలో మాటలు తుడిచేసినా, క్లోజప్‌లో కనపడే ప్రతినాయకుడి పెదాల కలయికతో ఆ మాటలు చిన్నపిల్లాడికీ అర్ధమవుతాయి). ఇంత ప్రతిభావంతమైన డవిలాగులు రాసిన పూరీ జగన్నాధ్‌కి ఆ చిత్రానికిగానూ ఉత్తమ మాటల రచయితగా అవార్డివ్వటం ముదావహం. ఇకనుండీ పూరీగారు చూపిన దారిలో నడిచే చిల్లరమల్లర మాటల రచయితలకి రాబోయే కాలంలో నందులే నందులు.
సతీష్ కుమార్ కొత్త says:
నిన్నటి రాత్రి ఈ టీవీ ఝుమ్మంది నాదం అనే కార్యక్రమంలో ఎస్.పీ.బాలసుబ్రమణ్యంగారు ఈ మధ్యకాలంలో అవార్డులివ్వటం అనే ప్రక్రియనుద్దేశించి ఓ మాటన్నారు. “ఈ మధ్యా అవార్డులివ్వటంలేదు పంచుతున్నారు” అని చెప్పి ఇలా వివరించారు.ఓ మంచి సినిమా/నటుడు/పాట ఏదైనా కావచ్చు అది నామినేషనుగా చెప్పు దాని సరసన ఓ రెండు నాసిరకం వస్తువులని నామినేషన్సుగా ప్రకటించి ఆఖరున ఆ ఒకనొక నాసిరకానికి అవార్డులివ్వటం జరుగుతుంది, ఇలా ఇవ్వటం ద్వారా సదరు జ్యూరీ సభ్యులేమి నిరూపించాలనుకుంటున్నారు? అవార్డులిచ్చేటప్పుడు “ఉత్తమ” అనే తోక ముక్తాయింపునివ్వకుండా “ప్రజాదరణ పొందిన చిత్రం” అనే క్యాటగరీలోనే అన్ని అవార్డులనీ ఇచ్చేస్తే పోలా? కొన్ని నాసిరకాలకి బహుమతులిచ్చి వారు ప్రజలకి ఏమని సందేశమిస్తున్నారు? ఆ నాసిరకాలు గొప్పవాటికంటె గొప్పవనా? లేక ఆ గొప్పవి వెఱ్రి వెంగళాయి వస్తువులనా? అలా ఇద్దామని మీరనుకున్నప్పుడు నామినేషన్సనే పద్దతిని తీసెయ్యండి. కేవలం ఫలానా క్యాటగరీకి గాను ఫలానా వారికి అవార్డు అని చెప్పి ఊరుకోండి.గర్హించాల్సిన ఇంకో విషయం ఏమిటంటె, ఒక వేళ ఓ వ్యక్తి/సంస్థ కి పోయినేడాదో అంతకముందో ఓ సారి అవార్డు వస్తే అదే వ్యక్తి/సంస్థ మళ్ళీ ఈ సంస్థ ఓ మంచి చిత్రంలో ఉంటె, “ఆ వారికి పోయినేడాది ఇచ్చాము కదా ఈ సారి వేరే వాళ్ళకిద్దాం” అనే ధోరణి ఎక్కువగా కనపడుతుంది. ఇది అవార్డివ్వటం ఎల అవుతుంది ప్రోత్సాహమివ్వటానికే అవార్డులైతే వేరే పద్దతులు వెతుక్కోవచ్చును కదా..ఇలా అన్నింటికీ ఏదోలా అవార్డులిచ్చేయాలనుకుంటె ఇక వారికి వారు చేసినవే గొప్ప పనులనుకుంటె ఇక మంచి అభివృధ్ధికి తావేది? ఒక ఉత్తమ నటుడు లేక వేరే క్యాటగరీలో నిజంగా ప్రతి ఏడాదీ ఒకరే ఉత్తమంగా ఉంటే వారికే ఆ అవార్డునివ్వండి మిగతా వారికి కసినిపెంచండి.మరింత ఉత్తమంగా ఉండేలా మిగతావారిని పోటీకి ప్రేరేపించండి.అలా చేయటం మోనోపొలీ అవుతుందంటే అది మీ ఇష్టం, అలాంటప్పుడు మీరు అవార్డులకి అంత హైపివ్వకండి. ఎందరో ప్రేక్షకులని తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి “అవార్డు” ఇవ్వటం అనే ఓ ఎంటర్టెయిన్మెంటు కార్యక్రమాలని దయచేసి ప్రోత్సాహించకండి.
@అబ్రకదబ్ర: మీరన్నట్టు “ఉత్తమ ఫ్లాప్ చిత్రం” వంటి క్యాటగరీలు త్వరలో మన సినిమాలకి వచ్చే అవకాశమూ లేకపోలేదు.ఆల్రెడీ ప్రపంచ భాషల్లో ఇసుమంటి వింత అవార్డులిస్తున్నారు, “చెత్త నటన”, “చెత్త సినిమా”, వెగటు పుట్టించిన బట్టలు”, వంటి క్యాటగరీల గురించి వినే ఉంటారు.నిత్యం ప్రజానాడినీ,ప్రజా వేడినీ బట్టి మారుతున్నట్టు చెప్పుకునే కొన్ని చిత్ర పరిశ్రమ శ్రేణులకి ఇలాంటి అవార్డుల ఆలోచన త్వరలోనే వస్తుందేమో
శ్రీధర్ రెడ్డి says:
“సంజ (సంధ్య) డబ్బులిస్తె వస్తద?” , “నీయ…..” , “లం…..క” , “నేనెంత వెదవనో నాకే తెలీదు” ఇలాంటి మాటలకే ఉత్తమ మాటల రచయిత అయ్యాడంటె. మావురు లో చాలామంది అత్యుత్తమ మాటల రచయిత అవార్డులు గెలుచుకోవచ్చు.
hero says:
mari mee olloni vallani petti oka cinema teesi nandi kottu…lekapote moosukuni koorcho
Srikanth Dhondi says:
All these award giving ceremonies have become a mere formality and mutual masturbation clubs.