చలి-A film by మోహన్ కృష్ణ ఇంద్రగంటి
తెలుగు సినిమ ప్రేక్షకులకు ఈ రోజు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటా. అష్టా చెమ్మా తో మోహన్ హిట్ సినిమా దర్శకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించినా మోహన్ సినీ ప్రయాణం మొదలయ్యి చాలా రోజులయింది. మోహన్ సినీ ప్రయాణం మొదలైనా తీరు అలాగే ఆ ప్రయాణం సాగుతూ మోహన్ ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి ఏ ఔత్సాహిక సినీ దర్శకుడికైనా inspiration గా పనికొస్తుందని చెప్పొచ్చు.
మనసుంటే మార్గముంటుందన్నారు. సినిమా ప్రక్రియను విదేశాల్లో నేర్చుకుని పట్టబధ్రుడై ఇండియా వచ్చిన మోహన్ కృష్ణ సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూపులు చూడకుండా అవకాశాన్ని ఆయనే సొంతంగా క్రియేట్ చేసుకున్నారు. 2003 లో మోహన్ 3000 రూపాయలతో అరగంట నిడివి గల ఒక డిజిటల్ సినిమా రూపొందించారు. ‘చలి‘ పేరుతో వచ్చిన ఈ థ్రిల్లర్ ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. డిజిటల్ మీడియా ద్వారా సినిమాలు తీయొచ్చని, వాటి ద్వారా కొత్త అవకాశాలు సృష్టించుకోవచ్చని మోహన్ ప్రూవ్ చేశారు. ఈ సినిమా తర్వాత మోహన్ గ్రహణం ద్వారా మరోసారి తన independent spirit ని చూపించారు. ఐదు లక్షల రూపయల వ్యయంతో ఒక పూర్తి స్థాయి చిత్రాన్ని నిర్మించి దానితో జాతీయ అవార్డు పొందడం సామాన్యమైన విషయం కాదు.
గ్రహణం తర్వాత మోహన్ దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆష్టా చెమ్మాతో మంచి విజయం సాధించారు.
మోహన్ కృష్ణ రూపొందించిన మొదటి సినిమా ’చలి’ నవతరంగం పాఠకుల కోసం ప్రత్యేకం.
Filed Under: featured • lead • లఘు చిత్రాలు • వీడియో
చలి చూడాలి; చూస్తాను. చూసొచ్చి మళ్లీ రాస్తాను
అందించినందుకు ధన్యవాదాలు.
Very nice. Will watch when in leisure.
Thanks for the upload. ఈమధ్యే చూసిన మోహనకృష్ణ interviewలో “చలి” గురించి విని దీన్ని ఎలా ఎక్కడ చూడాలా అనుకుంటుండగా బాగానే upload చేసారు. BTW here is the link to one of the 6 parts of that very recent and very extensive interview of Mohana Krishna, discussing Chali along with his other movies, his background and his inspirations.
http://www.youtube.com/watch?v=uYD-6ln5NpM
Chetanaగారు, youtube linkకు ధన్యవాదాలు
After reading this article and watching those 6 youtube links–I felt how intelligent he is. seems like he has sound knowledge on Telugu literature. I appreciate his intention of making these good telugu books as movies. one more “Krish”(Gamyam) on the bloc. I know the passion of Krish’s -in reading telugu books,ramayan and geetha.
way to go Mohan!…
కొంత కష్టపడి మొత్తానికి ముప్పై ఐదు నిమిషాల ఈ లఘు చిత్రం చూట్టం పూర్తి చేశాను (‘కొంత కష్టపడి’ అనటానికి కారణముంది. ఇది థ్రిల్లర్ తరహా సినిమా అని అన్వేషి రాయటంతో, I tightened my seat belt expecting an edge-of-the-seat action packed & fast paced short. అది తాపీగా సాగే హారర్ ఫిల్మ్ అని అర్ధమయ్యాక కాస్త నిరాశకి గురయ్యాను). ‘చలి’ గజ గజా వణికించలేదు, అలాగని విసిగించలేదు. సంచలనం సృష్టించేంత సరుకైతే నాకిందులో కనిపించలేదు.
—- Spoiler —-
మరి – ‘చలి’లో చెప్పుకోదగ్గవేమీ లేవా అంటే ఉన్నాయి. మొదటిది – మూడు వేల రూపాయల ఖర్చుతో ఈ మాత్రం సాధించటం ఆషామాషీ కాదు. అది అభినందించదగ్గ విషయం. సినిమాలో అన్నిటికన్నా బాగుంది నేపధ్య సంగీతం (విండ్ ఛైమ్స్ ధాటిగా ఊగుతున్నా శబ్దం రాకపోవటం లాంటి బుల్లి పొరపాట్లున్నాయనుకోండి. దెయ్యం శబ్దాల్ని మింగేసిందనుకోవాలేమో
). ఆ తర్వాత బాగున్నది మోహన కృష్ణ కెమెరా వీల్డింగ్. లో-బడ్జెట్ చిత్రం కావటం వల్ల భారీ రిగ్స్ ఏమీ లేకుండా చేత్తో పట్టుకునే ఆపరేట్ చేశాడనుకుంటా. అయినా ఎక్కడా జెర్కుల్లేవు. కొన్ని షాట్లైతే స్టెడీకేమ్‌తో తీసినంత చక్కగా వచ్చాయి. He probably used a make-shift steadycam made out of a tripod or something. ఆ తర్వాత చెప్పుకోవలసింది – లైటింగ్. చీకట్లో తీసిన సన్నివేశాలు కూడా కళ్లని ఇబ్బంది పెట్టకుండా వచ్చాయి (Btw, సినిమా 16×9లో ఉంటుందనుకోలేదు కానీ 4×3లో అన్నా ఉంటుందనుకున్నాను. ఇదేమిటో 3×4 లా అనిపించింది. Any idea why?)
ఇక – అంత గొప్పగా లేనిది నటుల అభినయం. అయితే బడ్జెట్ పరిమితుల దృష్ట్యా దీన్ని క్షమించి వదిలేయొచ్చు. క్షమించలేనిది వేరేదుంది. అది చిత్రం నిడివి. దీన్ని కనీసం పది నిమిషాలు కుదించి ఇరవై ఐదు నిమిషాల్లో ముగించొచ్చు. ఫ్రిజ్ తలుపు తెరుచుకోటం, గిన్నెలు కింద పడటం లాంటివి పదే పదే చూపాల్సిన అవసరం లేదు. ఫీచర్ ఫిల్ములో ఉన్నంత తాపీగా సన్నివేశాలుండటం షార్ట్‌కి అతకదు. మొదట్లో ఉన్న కొన్ని ఎస్టాబ్లిష్‌మెంట్ షాట్లు కూడా అనవసరం. దెయ్యం తిరుగుతుందన్న భయమున్నోడు హాయిగా పడుకుని నిద్రపోవటం ఏమిటో అర్ధం కాలేదు. ‘డిన్నర్‌కి బయటికెళదాం’ అని ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అతను బయటికెళ్లే సన్నివేశమొకటి ఉంచటం సహజం. ఆ తర్వాత ఆ ఊసే లేనప్పుడు ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంటుంది. ఇలాంటివన్నీ స్క్రీన్‌ప్లే లోపాలు. ‘వీటిని గురించి అంతగా పట్టించుకోవాలా’ అని కొందరనొచ్చు. తప్పకుండా పట్టించుకోవాలి. ఎందుకంటే – ఇలాంటి ప్రయోగాత్మక లో-బడ్జెట్ సినిమాల్లో దర్శకుడికి సాంకేతికంగా అనేక పరిమితులుంటాయి. వాటిని అతను ఎటూ అధిగమించలేడు. అయితే ఔత్సాహిక దర్శకులకి ఉండే, ఫ్రొఫెషనల్స్‌కి ఉండని విలువైన వనరు ఒకటుంది. అది – చేతిలో కావలసినంత సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్క్రీన్-ప్లేని పకడ్బందీగా రూపొందించుకోవటం ముఖ్యం. అది ‘చలి’కి జరిగినట్లు అనిపించలేదు. కెమెరా, లైటింగ్, సంగీతం వంటి ఇతర సాంకేతిక విషయాలపై పెట్టిన శ్రద్ధ కథ మీద, దాన్ని చెప్పే విధానమ్మీద పెట్టినట్లనిపించలేదు.
—- End Spoiler —-
నేను మోహనకృష్ణ ‘గ్రహణం’ చూడలేదు కానీ, ‘మాయాబజార్’, ‘అష్టా-చమ్మా’ చూశాను. అవి రెండూ నచ్చాయి (అష్టా-చమ్మా మరింత బాగా తీసుండొచ్చనిపించిందనుకోండి. ముఖ్యంగా, రెండో భాగంలో పల్లెటూర్లో జరిగే కథలో mistaken identities ఆధారంగా మరికొన్ని హాస్య సన్నివేశాలు అల్లుకొని ఉండొచ్చు).
ఈ మోహనకృష్ణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి బంధువా?
ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి కొడుకే మోహనకృష్ణ అని ఎక్కడో చదివినట్టు గుర్తు..
yes.
స్లో paced narration కాని, మొదటి ప్రయత్నం కింద తప్పకుండ పాస్ మార్కులు (అంత కంటే ఎక్కువ కూడా) ఇవ్వొచ్చు. సంగీతం విజయ్ K అనగానే వెంటనే విజయ్ కూరాకుల గుర్తుకి వచ్చారు. అతనే కావచ్చేమో కూడా – అ ఫిలిం బై అరవింద్ లో చక్కటి మ్యూజిక్ ఇచ్చింది అతనే కదా.
ఇంద్రగంటి మోహన క్రిష్ణ గ్రహణం సినెమా నాకు బాగా నచ్చినా తరువాత వచ్చిన మాయాజారు నాన్ను నిరాశ పరచింది. ఇక ఈ చలి కూడా అలాగే ఉంది పేలవంగా. ఈ మద్యే వచ్చిన “Paranormal Activity” కేవలం 11000 డాలర్లు ఖర్చుతో తీసిన అద్భుతమైన చిత్రం.