Menu

బెండు అప్పారావే సూపర్ హీరో

పోయిన వారం బెండు అప్పారావు సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుంది. మొదటి నుండి చివర వరకు నవ్వులే నవ్వులు. నవ్వకుండా ఉండలేము. నేను ఒక్కడినే కాదు హాల్ మొత్తం దిగువ టిక్కెట్ నుండి ఎగువ టిక్కెట్ వరకు పగల బడి నవ్వుతూనే ఉన్నారు. అంతకంటే ఒక సినిమాకు కావల్సినదేముంది? ఈ మధ్య మితృలు కొందరు మన తెలుగు సినిమాలో జనర్ అనే కాన్సెప్ట్ లేదు అంతా కలిపి కలగూరగంపలా రోట్లో వేసి రుబ్బటమే అని వ్రాశారు. కాని పూర్తిగా కామెడీ జనర్ సినిమాలు మనకి కొత్త కాదు, ఈ సినిమా ఆ కోవలోనిదే. పాటలు విదేశాల్లో తీశారు, కాని సంగీత సాహిత్యాలపై ఇంకా కొంత దృష్టి పెడితే బాగుండేది. ఏదో మొక్కుబడిగా తీసినట్టు అన్పించాయి. సెంటిమెంట్ మొత్తం చివరి పది పదిహేను నిమిషాల్లో లాగించి మంచి పని చేశారు. కామెడీ జనర్ కి న్యాయం చేశారు. ఫుల్ పైసా వసూల్. తప్పనిసరిగా చూడదగ్గ చిత్రం. ఇంకా నడమంత్రపు సిరి వస్తే మానవ ప్రవర్తన ఎలా ఉంటుందో చూపి ఓ మెస్సేజ్ కూడా ఇవ్వకుండానే ఇచ్చారు. అన్నగారి డైలాగ్ లు కులాంతర వివాహానికి నటి తండ్రిని ఒప్పించడం సూపరో సూపర్ సెన్సిబుల్ కామెడీ ఐడియా. అల్లరి నరేష్ ఇంకా నటించడం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది – ఇప్పుడు అంచనాలు పెరిగాయి కదా.

అసలు ఈ మధ్య టీవీలో చూస్తుంటే ఏ చానల్ లో చూసినా అల్లరి నరేషే. కామెడీ బిట్ల సీరియల్లు అల్లరి నరేష్ నటించిన సినిమాలు నుండి ముక్కలు విరివిగా చూపిస్తున్నారు. అసలు నన్నడిగితే జూనియర్ యన్టీఆర్నీ, ఘట్టమనేని మహేష్ బాబునీ నమ్ముకోవటం కంటే అల్లరి నరేష్ ను నమ్ముకుంటే సంవత్సరం అంతా ఎంటర్ టైన్ మెంట్. పెద్ద హీరోలను నమ్ముకుంటే సంవత్సరానికి ఒక సినిమానో, రెండు సంవత్సరాలకు ఒక సినిమానో దిక్కు, అదే అల్లరి నరేషును చూడండి పొయిన సంవత్సరం ఎనిమిది సినిమాలు తీశాడంట. పిల్లోడు వీర హార్డ్ వర్కరనుకుంటాను. సంవత్సరానికి ఎనిమిది సినిమాల్లో నటించటం అంటే మాటలు కాదు. మన పెద్ద హీరోలు అపజయాలకు తీవ్రంగా భయపడుతున్నట్టున్నారు. ఇంతా చేస్తే వాళ్ల సంపాదన కంటే అల్లరి నరేష్ సంపాదనే ఎక్కువలాగుంది నా కాకి లెక్కలకు. ఒక్క సినిమాకు వాళ్లు ఆరు కోట్లు ? తీసుకున్నారనుకుందా, నరేష్ సినిమాకు కోటి తీసుకున్నా ఎనిమిది కోట్లు తీసుకున్నాడు కదా. ఏ రకంగా చూసినా ఎక్కువ సినిమాలే సినిమా పరిశ్రమకు, సినిమా హాల్లకు, డిష్ట్రిబ్యూటర్లకు, ప్రేక్షకులకు, హీరోలకు మంచిది లాగుంది. ఇంకో మాట టీవీ రైట్స్ సీడీల ఆదాయం కూడా కామెడీ జనర్ కు బాగానే ఉండేట్టుంది.

ఎక్కువ సినిమాలు తియ్యాలంటే కథలు అంటారు మనవాళ్లు. అలా ఆలోచిస్తే అల్లరి నరేష్ హీరోగా ఒక మంచి కామెడీ కథ అయిడియా వచ్చింది. ఏదో సినిమాలో అల్లరి నరేష్ పోలీసుగా , జీప్ లో వెల్తున్న వేణు మాధవ్ ని పరుగెత్తుకుంటూ చేజ్ చేసి పట్టుకుంటాడు. అలానే ఇంకే సినిమాలో ప్రేయసి కోసం ముప్పై మైళ్లు పరుగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్తాడు. కట్ చేసి ఇంగ్లీష్ సినిమాకి వెళ్తే హాన్ కాక్ అనే సినిమాలో సూపర్ హీరో, సూపర్ హీరోఇన్. మళ్లా కట్ చేసి మన వాడి దగ్గరకు వస్తే – గోదావరి తీరం, ఒక పల్లెటూరు. ఒక సూపర్ హీరో (అల్లరి నరేష్) కాని వాడికి తెలీదు సూపర్ పవర్స్ ఉన్నాయని. ఒక సూపర్ హీరోఇన్ , కాని మామూలు జీవితం గడుపుతుంటుంది. (పెళ్లి కాలేదు) . ఇంకా ఒక పిల్ల సన్యాసి – హీరోను సరి అయిన దార్లో నడిపిస్తుంటాడు. చివర్లో చెపుతాం. ఆ పిల్లవాడు హీరోకి హీరోఇన్ కి , హీరో గతం మర్చిపోక ముందు పుట్టిన వాడని. ఇంకా ఒక సూపర్ కామెడీ విలన్ – ఈ ఐడియాపై ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ వ్రాసుకోవచ్చు.

ఇతీ వార్తాహ్!

 

కిరణ్ కుమార్ చావా

6 Comments
    • jatardamal October 27, 2009 /
  1. వీవెన్ October 27, 2009 /
    • అబ్రకదబ్ర October 28, 2009 /
  2. నాగప్రసాద్ October 27, 2009 /
  3. jeevani October 28, 2009 /