Menu

బాబోయ్ అవార్డు సినిమాలు-మూడవ భాగం

బాబోయ్ అవార్డు సినిమాలంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలు అందులో చెప్పిన అంశాల గురించి విశ్లేషిస్తూ గతంలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు ఇక్కడ(మొదటి భాగం) మరియు ఇక్కడ(రెండో భాగం) చదవొచ్చు. ఈ వ్యాసంలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు ప్రస్తావించిన మరి కొన్ని అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

film-studyఆర్ట్ సినిమాలంటే సింబాలిజం పేరుతో, ఆంబియన్స్ క్రియేట్ చేయడం లాంటి అంశాలతో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష బెట్టే సినిమాలని చెప్తూ కళాత్మక సినిమాలపై మొదటి రెండు వ్యాసాల్లో దండెత్తిన ప్రసాద్ గారు మూడు భాగంలో మరియు నాలుగో భాగంలో ఈ సోకాల్డ్ ఆర్ట్ సినిమా టైటిల్స్ గురించి ప్రస్తావించారు.

ఆర్ట్ సినిమాలకి నిమజ్జనం, నిర్మాల్యం, ముఖాముఖి అని సంస్కృతం పేర్లు పెట్టడం గురించి రాసుకొస్తూ, ఈ టైటిల్ చూడగానే అవార్డు వాసనలొచ్చేస్తాయన్నారు. అలాగే నిర్మాల్యం సినిమా గురించి చెప్తూ ఇలా అన్నారు.

“అసలు నిర్మాల్యం సినిమా ఏమిటండి? పూజారి జీవితంలో కష్టాలు వచ్చాయని దేవి ప్రతిమ మీద ఉమ్మడమా? మనను షాక్ చెయ్యడం తప్ప ఇంకెందుకైనా పనికొస్తుందా అది? వీళ్ళకి అప్పనంగా దొరికేదేమిట్రా అంటే హిందూ గాడ్స్. లేదా జనమే మర్చిపోయిన ఓ పాత ఆచారం. దాన్ని గోతిలోంచి లాగడం, దాన్ని నిరసిస్తూ ఒక సినిమా తీయడం.”

అయితే ఇక్కడ రచయిత టైటిల్స్ సంస్కృతంలో ఉండడం గురించి వ్యక్తం చేసిన ఆవేదన నాకస్సలు అర్థం కాలేదు. సోంభేరి,పోకిరి, కంత్రి, బలాదూర్, ఇడియట్,స్టుపిడ్…..ఇవన్నీ గొప్పటైటిల్సా?

టైటిల్స్ సంగతి పక్కనపెడితే, నిర్మాల్యం గురించి రచయిత వ్యక్తం చేసిన ఆవేదనకూడా నాకర్థం కాలేదు.ఈ విషయం గురించి మరింత చర్చించే ముందు నిర్మాల్యం సినిమా గురించి కొంచెం చెప్పుకోవాలి.

నిర్మాల్యం అనేది ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన ఎమ్టీ వాసుదేవన్ అయ్యర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం తో పాటు కేరళ రాష్ట్ర సినిమా అవార్డులు కూడా అందుకున్నారు ఎమ్టీ. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు:

During the fast phase of modernisation, certain sections of the society lost phase with the changes happening around them, especially those who were slaves to religious dogmas. Nirmalyam narrates the story of a temple ‘Valichappadu’ (Oracle- the ‘Valichappadu’ is supposed to be the personification of God. He speaks on behalf of God to the gathering) and his family, passing through extreme poverty.

An ancient temple is neglected to ruins and is tended only by the Velichappadu and the man who picked flowers from the garden, Variyar. When the priest leaves the temple to start a teashop, a young man, not at all interested in the job, takes up the job of the priest. He forms a relationship with the Velichappadu’s daughter. The Velichappadu’s son is caught trying to sell the sacred sword and have to leave the village. When small pox breaks out, the villagers return to the temple and organise a festival. On the festival day the Velichappadu finds out that his daughter has been seduced by the young priest and his wife sells herself to a moneylender to feed the family. The film ends with the scene of the Velichappadu spitting on the idol of the goddess while performing the final ceremony and later killing himself by striking his head with the holly sword.

Nirmalyam won the National award for best film and P J Antony for best actor in 1973. It also won State awards for the best film and the best director.

సినిమా చూసుండకపోయినా పై కథ చదివినవారెవరైనా ఈ సినిమా కేవలం మీనింగ్ లెస్ ఆర్ట్ సినిమా అని తీసిపారెయ్యగలరా? ఇక్కడ ప్రసాద్ గారికి కేవలం పూజారి దేవతా విగ్రహం పై ఉమ్మెయ్యడమే కనిపించింది కానీ ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న కొన్ని ముఖ్య అంశాలను గ్రహించలేదనుకుంటా.

నా దృష్టిలో నిర్మాల్యం ఒకప్పటి దురాచారాలను, అప్పటి సామాజిక పరిస్థుతులను తెరకెక్కించడమనే అద్భుత ప్రయత్నమనిపిస్తుంది. అయినా గడిచిపోయిన గతంలోని దురాచారాలు ఇప్పుడు తెలుసుకోవడం అవసరమా అంటే అవుననే అంటాను.

నిర్మాల్యం సినిమాలో చివర్లో పూజారి దేవతా విగ్రహం పై ఉమ్మెయ్యడం అనే అంశాన్నే తీసుకుంటే ఇక్కడ ఆ పూజారి దేవుడి మీద పూర్తిగా నమ్మకం పోయినట్టా? ఒక వేళ నమ్మకమే కోల్పోయుంటే ఉమ్మేయడంలో అసలు అర్థం లేదు. నా అభిప్రాయం ప్రకారం పూజారికి దేవుడు లేడనే నమ్మకం పోవడం కంటే కూడా ఉన్నా కూడా దేవుడు కేవలం ఒక బండరాయి మాత్రమే అని నమ్మకానికి రావడమే ఈ కథ ముగింపనిపిస్తుంది.

చిన్నప్పుడు మా అమ్మ నన్ను సినిమాకి పంపించలేదన్న కోపంతో దేవుడింట్లోకెళ్ళి దేవుడి పటాన్ని కాల్తో తన్ని “నువ్వు లేవు, ఉండుంటే మా అమ్మ మనసు మార్చుండేవాడివి” అని దేవుణ్ణి తిట్టేవాడిని. అయితే కాస్త పెద్దయ్యాక ఆలోచిస్తే నేను చేసిన ఆ పని చాలా సిల్లీగా అనిపించింది. దేవుడు లేడు అని నిర్ణయానికి వచ్చేశాక ఇక దేవుణ్ణి తిట్టడం, కొట్టడంలో అర్థమేముంది.

ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే నిర్మాల్యం ద్వారా పైన చెప్పిన అంశాలు కొన్నైనా ఎమ్టీ చెప్పాలనుకునే సినిమా తీసుండొచ్చు. మైండ్ లెస్ ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చేమోకానీ నిర్మాల్యం చెత్త సినిమా అంటే మాత్రం ఒప్పుకోలేను. ఇంతకీ ఈ విషయాలేవీ ప్రసాద్ గారు చెప్పకపోవడం విశేషం. ఆయన బాధల్లా ఎవరో కొద్ది మంది తమని తాము వివేకవంతులుగా ఫీల్ ఐపోయి సంస్కృతం టైటిల్స్ పెట్టేసి అవార్డులు కొట్టేస్తున్నారన్నట్టుగా ఉంది.

సంస్కృతం టైటిల్స్ పై ప్రసాద్ గారి దాడి నిర్మాల్యం తో ఆగలేదు. సత్యజిత్ రే తీసిన సద్గతి పై తన దాడి కొనసాగించారు.  ఈ సినిమా  ద్వారా మనదేశంలోని కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు రే (ఈ సినిమా గురించి మహేశ్ గారి వ్యాసం ఇక్కడ చదవండి). ఈ సినిమా గురించి చెప్తూ 80 ఏళ్ళ క్రితం ప్రేమ్ చంద్ రాసిన కథను సత్యజిత్ రే 1980 లలో తీయడంలో అర్థముందా అని ప్రశ్నించారు. అయితే నేనదేంటంటే 80 లలో కాదు ఇప్పుడు కూడా ఈ సినిమా, ఈ సినిమాలో డీల్ చేసిన సబ్జెక్ట్ రిలవెంటే.

మాది ఆంధ్రప్రదేశ్ లో ఒక పల్లెటూరు. అమ్మానాన్నలు ఇప్పటికే అక్కడే ఉంటారు. మాఊర్లో హరిజనులకు బడి గుడి తో పాటు వాళ్ళ నివసించే ప్రాంతం కూడా ఊరికి బయట ఉంటుంది. ఇది మా ఊర్లోనే కాదు మన రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కనిపించే దృశ్యమే. ఇలాంటి పరిస్థుతుల్లో 80 లలోనే ఇలాంటి సినిమా తీసినందుకు సత్యజిత్ రే ని పొగడాలి కానీ సద్గతి లాంటి సినిమాని అవార్డ్ సినిమా అంటూ తీసిపారెయ్యగలమా? అలా తీసిపారెయ్యడంలో ప్రసాద్ గారు ముంది స్థానంలో ఉన్నట్టున్నారు.

ముందు స్థానం అని ఎందుకంటున్నానంటే ప్రసాద్ గారు తన వ్యాసంలో ఒక చోట ఈ విధంగా రాసుకొస్తారు:

“దీంట్లో (సద్గతి) బ్రాహ్మడి ఇంట్లో హరిజనుడు ఛస్తాడా? ఇలాగే ఓ బ్రాహ్మణ అగ్రహారంలో గాడిద ఛస్తే ఏమవుతుంది? అని అరవంలో మరొకడు సినిమా తీశాడు. ’అగ్రహారిత్తిల్ కళుదై’ అని. ఛస్తే ఏమవుతుందిట? అది పెద్ద ఇష్యూనా?”

ఇంతకీ పైన ప్రసాద్ గారు పేరు కూడా చెప్పలేనంతగా ఈ గాడిద కథతో సినిమా తీసిన ఆ ఒకడు ఎవరంటే జాన్ అబ్రహం. సినిమా నచ్చకపోత పోయేను. జాన్ అబ్రహం లాంటి దర్శకుణ్ణి ఒకడు అనడంలోనే ప్రసాద్ గారి కోపం అర్థమవుతుంది. అయితే  ఆయన అసలీ సినిమా చూశారా అనేది నా అనుమానం. ఎందుకంటే అగ్రహారిత్తిల్ కళుదై సినిమా గురించి పూర్తిగా తెలిసిన వారు ఇలా మాట్లాడలేరు.

ఈ సినిమా గురించి: (కందుకూరి రమేష్ బాబు)

జాన్ ఈ సినిమాను 1977 లో తమిళంలో తీశాడు.

పేరు:అగ్రహారథిల్ కళిదై లేదా అగ్రహారంలో గాడిద

Donkey in the agrahara

ఓ గాడిద ఒకానొక రోజు ప్రొఫెసర్ నారాయణ స్వామి ఇంటికి వస్తుంది.ఎందుకో, దాన్ని చూస్తే ఆయనకు వెళ్లగొట్టాలనిపించదు. ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఓ పనిమనిషిని పెట్టి మరీ దాని మంచీచెడ్డా చూసుకుంటుంటాడు.

కానీ ప్రొఫెసర్ గారి పని ఊర్లోని అగ్ర కులస్థులకు నచ్చదు. మండిపడతారు.ఇదేం పని అని బాహాటంగా విమర్శిస్తారు.

ఇంతలో ఊరికి అరిష్టం దాపురించిందా అన్నట్టు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక చెడు జరుగుతుంటుంది. కలహాలు మొదలవుతాయి. తమ ఊరికి గాడిదరాకతోనే ఇలాంటి హాని జరుగుతున్నదనే అనుమానం అందరినీ పీడిస్తుంటుంది. ఇంతలో అకస్మాత్తుగా ఆ గాడిద మరణిస్తుంది.

అదేం విచిత్రమో ఆ అగ్రహారంలో వరుసగా అనేక మహత్యాలు సంభవిస్తుంటాయి.అందరి ఇంటా ఏదో శుభం జరుగుతుంటుంది. దాంతో జనమంతా ఆ గాడిద ఆశీస్సులతోనే ఇవన్నీ జరుగుతున్నాయని విశ్వసిస్తారు.

చూస్తుండగానే జనం నిన్నమొన్నటి వరకూ పిశాచి అని శపించిన ఆ గాడిదను దేవదూతగా కొలవడం ప్రారంభిస్తారు.

చిత్రంగా, ఎవరైతే ఆ గాడిదను చంపి భూమిలో పాతేశారో వారే గాడిద ఎముకలగూడును వెలికితీయడానికి పూనుకుంటారు.

ఆ కళేబరాన్ని పూజించాలని, ఓ గుడి కట్టాలని కూడా అంటారు.

చివరికి సినిమా ఎలా ముగుస్తుందంటే, మట్టిలోంచి ఆ గాడిద కపాలాన్ని వెలికితీస్తుండగా హఠాత్తుగా కోరలు చాచిన అగ్నికీలలు ప్రత్యక్షమై ఊరు ఊరంతటినీ ఆక్రమిస్తాయి.

జాన్ అబ్రహం గురించి (వారాల ఆనంద్)

సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం.

ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట వున్న విషయాన్ని మాత్రమే చూపుతుంది.అందుకే ఆ విశ్వాసంతోనే తన కెమెరాను మన సామాజిక నగ్న సత్యాల్ని ఎత్తి చూపడానికి ఉపయోగించాలనే ధ్యేయంతో చివరంటా పోరాటం చేసినవాడు జాన్ అబ్రహం.

జాన్ అబ్రహం పేదల్లో పేదవాడు. వారి మధ్యే జీవిస్తూ, వారి సహచర్యంలోనే జీవితాన్ని గడిపాడు. ఈ వ్యవస్థ పేదల జీవితాలతో ఎట్లా ఆడుకుంటూ వుందో గమనించాడు. అటు మధ్య తరగతి జీవితాల్లో వున్న కుహనా విలువల్ని ఈసడించుకున్నాడు.వారి నడవడికల్ని సర్దుబాటుతనాన్ని అసహ్యించుకున్నాడు.

జాన్ అబ్రహం క్రైస్తవునిగా జన్మించాడు.అయినప్పటికీ కేవలం మనిషిగా మాత్రమే జివించాడు. మానవీయ విలువల పట్ల సంస్కృతి పట్ల ఖచ్చితమైన అభిప్రాయాల్తో ఎదిగాడు. పూనా ఫిలిం ఇన్‍స్టిట్యూట్ లొ శిక్షణ పొంది గోల్డ్ మెడల్ సంపాదించుకున్న అబ్రహం చుట్టూ వ్యాపార సినిమా నిర్మాతలు చేరారు.కాని ఆయన వారందరిని కాలదన్ని తనదైన ’సినిమా కోసం’ అంకితమయ్యాడు.

జాన్ అబ్రహంని విపరీతంగా అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత మాత్రం చేత ప్రసాద్ గారు కూడా జాన్ ని, ఆయన సినిమాలనూ ఇష్టపడలనిలేదు. కానీ ఆయన సినిమా గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన పేరు చెప్పకోతే పోయింది ’మరొకడు’ అనడం అస్సలు నచ్చలేదు.

అలాగే పార్ అనే హిందీ సినిమాలో హీరో హీరోయిన్లు క్లైమాక్స్లో పందులను నది దాటించడమనే సీను గురించి కూడా ప్రసాద్ గారు తన ఆవేశాన్ని, ఆవేదనను “ఆ పందులను మన పాపాలుగా, అవి దాటే నదిని వైతరిణిగా మనం అనుకోవాలా?” వ్యక్తం చేస్తారు. కానీ అలా అనుకోవాలని దర్శకుడు ఎక్కడా చెప్పినట్టు నాకనిపించలేదు.

పార్ సినిమా గురించి:

The film of exploitation in rural Bihar, in which a landlord (Utpal Dutt)’s men wreck a village and kill the benevolent schoolmaster (Anil Chatterjee) who was in progressive force. The labourer Naurangia (Naseeruddin Shah) breaks with a tradition to passive resistance and retaliates by killing the landlord’s brother. Naurangia and his wife Rama (Shabana Azmi) become fugitives from justice. After many efforts to find sustenance elsewhere, the two decide to return home. To earn the fare, they agree to drive the herd of pigs through the river , causing the pregnant Rama to believe she has lost her baby.But they have to swim across a wide, swiftly flowing river, in which they nearly drown before reaching safety. At the end of the film Naurangia puts his ear to her belly and listens to the heartbeats of the unborn son.

ఇంతకీ ఈ పార్ సినిమా ఏమీ అల్లాటప్పా సినిమా కూడా కాదు. గౌతమ్ ఘోశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రదర్శించిన నటనకు నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీలకు ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.

ఇవండీ నాలుగు భాగాలుగా ప్రసాద్ గారు బాబోయ్ అవార్డు సినిమాల వ్యాస పరంపరలో వెల్లడించిన ముఖ్య విషయాలు, వాటిపై నా అభిప్రాయాలు.

Note:గతంలో ప్రచురించినప్పుడు ఇదే చివరి భాగం అనుకున్నాను. కానీ ఇంకా ఈ విషయం గురించి వ్రాయాల్సి ఉందనిపించి ఈ వ్యాసాన్ని చివరి భాగంగా కాకుండా మూడో భాగంగా మార్చబడింది.

57 Comments
 1. Sri December 25, 2008 /
 2. మేడేపల్లి శేషు December 26, 2008 /
 3. Sri December 27, 2008 /
 4. అన్వేషి December 27, 2008 /
 5. Sri December 28, 2008 /
 6. Sri December 28, 2008 /
 7. Sri December 29, 2008 /
 8. rayraj October 3, 2009 /
  • Misty December 27, 2016 /
 9. su October 4, 2009 /
  • విజయవర్ధన్ October 5, 2009 /
 10. MBS Prasad October 19, 2009 /
  • vara October 19, 2009 /
  • Jagadish October 20, 2009 /
  • Manjula October 20, 2009 /
 11. MBS Prasad October 20, 2009 /
  • Manjula October 20, 2009 /
 12. MBS Prasad October 20, 2009 /
  • Sowmya October 20, 2009 /
  • Krishh October 20, 2009 /
 13. MBS Prasad October 20, 2009 /
  • mohanrazz October 20, 2009 /
 14. విజయవర్ధన్ October 20, 2009 /
  • శంకర్ October 20, 2009 /
 15. MBS Prasad October 21, 2009 /
 16. MBS Prasad October 21, 2009 /
  • Manjula October 22, 2009 /
 17. MBS Prasad October 22, 2009 /
  • విజయవర్ధన్ October 22, 2009 /
 18. Phanindra October 23, 2009 /
 19. Phanindra October 23, 2009 /
   • Phanindra October 24, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 23, 2009 /
  • నేస్తం October 23, 2009 /
   • నేస్తం October 23, 2009 /
 20. MBS PRASAD October 24, 2009 /
 21. MBS Prasad October 27, 2009 /
 22. MBS fan October 27, 2009 /
 23. MBS Prasad October 28, 2009 /