Menu

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం

మొదటి భాగం ఇక్కడ చదవండి.


బాబోయ్ అవార్డు సినిమాలు!
-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు.

రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం ద్వారా ఆర్ట్ సినిమాలని వెక్కిరించారని ప్రసాద్ గారు వెల్లడించారు. కొండల్రావు గారు కామెడీకి రాస్తే రాసుండొచ్చు గానీ అవార్డు సినిమాలంటే ఇలానే ఉంటాయని మనవాళ్ళలో బాగా బలంగా నాటుకుపోయింది.ఆ మధ్యలో ఒక ప్రముఖ చిత్ర దర్శకుణ్ణి హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ లో జరిగిన ఒక చిత్రోత్సవం ఓపెనింగ్ కి ఆహ్వానించారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన చెప్పుకొచ్చిందేంటంటే, తనకీ అవార్డు సినిమాలంటే ఇష్టమనీ కాకపోతే అవి మరీ స్లోగా ఉంటాయని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. అప్పుడెప్పుడో ఒక అవార్డు సినిమా చూసారట ఆయన. అందులో హీరో తన తల్లిని చూడ్డానికి ఒక ఊరినుంచి బయలుదేరతాడట. అలా నడుస్తూ ఉండగా చీకటి పడుతుంది. ఆ రాత్రికి ఒక చెట్టుకింద పడుకుంటాడతను. అప్పుడు ఇంటర్వెల్. ఉదయం అవుతుంది. అతను మళ్ళీ నడక ఆరంభించడంతో రెండో సగం మొదలు. అతనలా నడుస్తూ ఇంటికి చేరుకోవడంతో సినిమా ముగిసిందనీ ఆ దర్శకుడు చెప్పుకొచ్చాడు. తనకి అవార్డు సినిమాలు ఇష్టమైనా మరీ ఇలాంటి స్లో సినిమాలు ఎక్కవని చెప్పారాయన. అంతటితో ముగించలేదాయన. తను తీసే కమర్షియల్ సినిమాల్లో సైతం అవార్డు సినిమా ఎలిమెంట్స్ జోడిస్తానని తన ప్రతిభను తెలియచేసారు. అందుకు ఉదాహరణగా తను తీసిన ఫలానా సినిమాలో యజమాని చనిపోతే ఏడ్చే ఏనుగు సీన్ గురించి ఆయన ప్రస్తావించారు. అది విని అక్కడి ప్రేక్షకులంతా కంటతడిపెట్టకుండా ఉండలేకపోయారు.

మరొక ఉదాహరణ: ఇది సర్రాజు ప్రసన్నకుమార్ గారు అల్లిన మరో బ్రహ్మాండమైన కథ. అవార్డు సినిమాలపైన సెటైర్. ఈ కథలో ఒక బెస్తవాడు చేపలు పట్టి ఇంటికొచ్చి ఆ చేపలు భార్యకిచ్చి వంట చేయించుకుని నిద్రపోయి మళ్ళి ఉదయాన్నే లేచి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళడంతో సినిమా ముగుస్తుందనీ ఈ సినిమా ’భూమత్స్య గుండ్ర’ అని ఒక వెరైటీ పేరు పెట్టి దర్శకుడు అవార్డు కొట్టేసాడనేది ఈ కథ సారాంశం.

అయితే పైన చెప్పిన ఉదాహరణలు చూస్తే అర్థమయ్యే విషయమేమిటంటే అవార్డు సినిమాలంటే ఇలా ఉంటాయనే ఒక per-conceived నోషన్ మనలో చాలామందికి ఉంది. దాన్నుంచి బయటపడలేకపోవడంలో వచ్చిన తంటా ఇది.

ఇక్కడ మీకందరికీ తెలిసిన ఒక పిట్టకథ:

ఒక మోడర్న్ ఆర్ట్ ఎక్జిబిషన్ జరుగుతోంది. ఒక పెయింటింగ్ ని చూసి అందరూ ఆహా ఓహో అంటున్నారు. ఇంతలో ఆ పెయింటింగ్ చేసిన చిత్రకారుడు అటుగా వచ్చి అయ్యో నా పెయింటింగ్ తిరగతిప్పి తగిలించారనీ లబోదిబోమంటే అప్పటివరకూ ఆహా ఓహో అన్నవాళ్ళు తేలుకుట్టిన దొంగళ్ళా అక్కడ్నుంచి జారుకున్నారట.

మోడర్న్ ఆర్ట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా జనాలు పై కథను చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం. అలాగే అవార్డు సినిమాలకూ పైన చెప్పినలాంటి పిట్టకథలను చెప్పేసుకొని తమకర్థంకాని విషయాల్ని తేలికచేసి చూసే జనాలు ప్రపంచం మొత్తం ఉన్నారు కానీ పర్సెంటేజ్ లో మనవాళ్ళు అధికం అనుకుంటా.

మొదటి రెండు భాగాల్లో మన తెలుగు సినిమాలకీ అవార్డులకీ చుక్కెదురని తీర్మానించి, వాటిని ఎగతాళి చేసిన తర్వాత మూడో భాగంలో ఇలా వ్రాసుకొచ్చారు ప్రసాద్ గారు.

1960-70 ల నాటికి నేషనల్ లెవల్లో మలయాళీ, బెంగాళీ వాళ్ళు పాగా వేసారని, ఆ సమయంలోనే మృణాల్ సేన్ అవార్డులు తెచ్చుకోసాగాడని అన్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ మృణాల్ సేన్ కి అసలు సినిమాలు తీయడం రాదనీ అయినా కూడా ఆయనకి అవార్డులు కురిపించేస్తున్నారని, ఆయనకి పాత్రల ద్వారా కథ చెప్పడం రాదనీ, కథలు వెనకనుంచి చెప్పుకొస్తారనీ చెప్పారు.

మృణాల్ సేన్ అంతటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడికి సినిమాలు తీయడం రాదని చెప్పడం లో రచయిత ఉద్దేశం ఏమిటో?. భువన్ సోమే, అకేలార్ సంధానే, కలకత్తా 71, ఏక్ దిన్ ప్రతి దిన్, ఏక్ దిన్ అచానక్ వంటి అద్భుతమైన సినిమాలకు రూపొందించిన మృణాల్ సేన్ కి సినిమాలు తీయడం రాదా? ఆయనకి పాత్రల ద్వారా కథ చెప్పడం రాదా? కేవలం ఇద్దరు పాత్రలతో 1993 లో ఆయన అంతరీన్ లో ఆయన కథ చెప్పింది పాత్రల ద్వారానే కదా!

మృణాల్ సేన్ మోడెస్ట్ గా “Though I receive this award with all the dignity and I am very happy to receive it but it makes me a bit uncomfortable.I have a feeling that perhaps I could do something more than this. Nothing is the last word in aesthetics. It can grow.” అని వుండొచ్చు కానీ ఆయనకి సినిమాలే తీయడం రాదంటే ఎలా?

నిజానికి సత్యజిత్ రే పథేర్ పాంచాలీతో అంతర్జాతీయ ఖ్యాతి గడించి ఉండొచ్చు కానీ మన దేశంలో నవ్య సినిమాకు శ్రీకారం చుట్టి ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ని నవ్య సినిమా బాటలో నడిపించేలా చేసిన వారిలో ముఖ్యుడు మృణాల్ సేన్.

మృణాల్ సేన్ పై రచయిత దాడి అంతటితో ఆగలేదు. సేన్ తెలుగులో రూపొందించిన ’ఒక ఊరి కథ’ పై విమర్శనాశ్త్రాలు ఎక్కుపెట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరినట్టు ప్రేమ్ చంద్ రచించిన ’కఫన్’ అనే లఘు కథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం తెలంగాణాలో నిర్మించినందుకు, అందులో బెంగాలీ హీరోయిన్, మరో ముఖ్య పాత్రలో ఒక కన్నడిగుడ్ని ఎన్నుకున్నందుకు అభ్యంతరం తెలిపారు రచయిత.

విదేశాల్లో షేక్స్పియర్ రచించిన నాటకాలని మన తెలుగు కి అనువదించి గుణసుందరి కథగా తీయడంలో లేని తప్పు, ’సిలాస్ మార్నర్’ ని ’బంగారు పాప’ గా మలచుకోవడంలో లేని తప్పు ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టు రాసిన కథని తెలంగాణా నేపథ్యంలో చిత్రీకరించడం తప్పా? ఇక మృణాల్ సేన్ బెంగాల్ నుంచి ఇక్కడకు వచ్చి సినిమా తీయడంలో కూడా తప్పేముంది. రవాండాలో జరిగిన హత్యాఖాండ గురించి ’హోటల్ రవాండా’, ’షూటింగ్ డాగ్స్’ అనే సినిమాలు రూపిందించింది రువాండా దేశస్థులు కాదు.మన రాష్ట్రంలో మతం పేరుతో బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ’మాయ’ అనే సినిమా మన తెలుగు వాడు తీయలేదే! తెలంగాణా ఉద్యమం గురించి వచ్చిన ’మా భూమి’ తీసిన గౌతమ్ ఘోష్ తెలుగువాడు కాదే!

ఒక సమస్య లేదా సమాజంలోని రుగ్మత లేదా ఒక సమాజపు పరిస్థుతులు చూసి స్పందించే హృదయం ఉండాలి కానీ ఎక్కడెక్కడి వాళ్ళో ఎక్కడెక్కడో సినిమాలు తీసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ఈ వ్యాసంలోనే ఆర్ట్ సినిమాల్లో లో్పాలేంటో మరోసారి వివరించారు రచయిత. ఈ ఆర్ట్/అవార్డ్ సినిమాల్లో కథ చిన్నదనీ, కథనం చాలా నిదానంగా వుంటుందనీ రచయిత విశ్లేషించారు. అయితే ఒక మంచి సినిమా లో పెద్ద కథ ఉండాల్సిన అవసరం అసలు లేదు. మైకేల్ హనకి అనే దర్శకుడి సినిమాలు (ముఖ్యంగా బెన్నీస్ వీడియో, కాష్, సెవెంత్ కాంటినెంట్) చూస్తే అర్థమవుతుంది సినిమాకి అసలు కథ అవసరమే లేదని. అంత దాకా ఎందుకు సత్యజిత్ రే ని ప్రభావితం చేసిన బైసికిల్ థీవ్స్ సినిమాలో కథ ఎంత పెద్దది?

అసలా మాటకొస్తే ప్రపంచంలో అత్యుత్తమ సినిమాలుగా పరిగణించబడే ఎన్నో సినిమాలు లఘు కథల అధారంగా రూపొందించబడ్డవే. ఉదాహరణకు Shawshank Rdemption అనే సినిమా స్టీఫెన్ కింగ్ రచించిన ఒక కథ ఆధారంగా రూపొందించబడింది. కపోలా దర్శకత్వంలో Apocalypse Now అనే సినిమా Heart of Darkness అనే మినీ నవల ఆధారంగా రూపొందించారు. 2001, A Space Odyssey, The Third Man, All about Eve, Million Dollar baby, Birds, Breakfast at Tiffany’s, Brokeback Mountain లాంటి ఎన్నో గొప్ప సినిమాలు లఘుకథలు/మినీ నవలల ఆధారంగా రూపొందించబడినవే.

ఆలోచిస్తుంటే ఒక మంచి సినిమాకి దాని ఆధారమైన కథ యొక్క నిడివికి సంబంధం లేదనే చెప్పాలి. మీరేమంటారు?

అవార్డు సినిమాల గురించి మరిన్ని విశేషాలతో ….త్వరలో

60 Comments
 1. radhika November 23, 2008 /
  • anveshi October 2, 2009 /
   • sujata October 2, 2009 /
   • Manjula October 22, 2009 /
  • G October 2, 2009 /
 2. వెంకట్ ఉప్పలూరి October 2, 2009 /
 3. Manjula October 2, 2009 /
 4. శేఖర్ October 3, 2009 /
 5. అబ్రకదబ్ర October 3, 2009 /
   • అబ్రకదబ్ర October 3, 2009 /
   • anveshi October 4, 2009 /
   • గీతాచార్య October 4, 2009 /
   • అబ్రకదబ్ర October 4, 2009 /
   • అబ్రకదబ్ర October 5, 2009 /
 6. su October 3, 2009 /
  • అబ్రకదబ్ర October 3, 2009 /
   • su October 4, 2009 /
   • su October 4, 2009 /
   • నేస్తం October 4, 2009 /
   • RK October 6, 2009 /
  • వెంకట్ ఉప్పలూరి October 3, 2009 /
   • Manjula October 7, 2009 /
 7. mohanrazz October 7, 2009 /
  • su October 7, 2009 /
 8. RK October 8, 2009 /
 9. su October 8, 2009 /
  • వెంకట్ శిద్దారెడ్డి October 8, 2009 /
   • su October 8, 2009 /
   • వెంకట్ శిద్దారెడ్డి October 8, 2009 /
   • su October 8, 2009 /
   • su October 8, 2009 /
   • su October 8, 2009 /
   • su October 8, 2009 /
   • Chetana October 9, 2009 /
 10. RK October 8, 2009 /
  • వెంకట్ శిద్దారెడ్డి October 8, 2009 /
   • RK October 8, 2009 /
 11. Dhanaraj Manmadha October 8, 2009 /
 12. venu October 8, 2009 /
 13. Dhanaraj Manmadha October 8, 2009 /
 14. su October 8, 2009 /
 15. vardhan August 2, 2010 /