హా..మహాత్మా!!( రివ్యూ)

mahatma

mahatmaబ్యానర్: గోల్డెన్ లయిన్ ఫిలింస్

నటీనటులు: శ్రీకాంత్, బావన,జయప్రకాష్ రెడ్డి,ఉత్తేజ్,రామ్ జగన్,పరుచూరి వెంకటేస్వరరావు,జ్యోతి,ఆహుతి ప్రసాద్ తదితరులు.
సంగీతం: విజయ్ ఆందోని
కెమెరా: శరత్
ఎడిటింగ్ : శంకర్
ఫైట్స్ : విజయ్
డైలాగులు: పరుచూరి బ్రదర్శ్
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి
నిర్మాత: సి.ఆర్.మనోహర్
రిలీజ్ డేట్: 09,అక్టోబర్ 2009

శశిరేఖా పరిణయం చూసాక ఇక కృష్ణవంశి సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా..అయితే మహాత్మా టైటిల్,పోస్టర్స్ చూసాక మనసాగక..మాట తప్పి ధియోటర్లో అడుగుపెట్టా..అయితే అందుకు తగిన ఫలితం స్పష్టంగా అనుభవించా. అసలే కృష్ణవంశి..ఆపై పరుచూరి వారి అండ దాంతో సినిమా బండ.. ఏతావాతా(వాతలు పడ్డాకే) తెలిసొచ్చిందేమిటి అంటే మహాత్మా టైటిల్ పెట్టి మనల్ని ఫూల్ చేసారు అని.ఈ సినిమా చేసిన గొప్ప పని ఏమిటీ అంటే ఈ మధ్యనే కాస్త వదిలించుకుంటున్న మొలోడ్రామాను మళ్లీ వెలికితీయటం.
ఇక గాంధీ మహాత్ముడు సిద్దాంతాలను ఈ తరానికి అన్వయిస్తూ అల్లుకున్న సన్నవేశాలు కూడా ఆచరణయోగ్యంగా లేవు…సరికదా ఆయన సిద్దాంతం జీవితంలో అమలు చేయటం ఇంత కష్టమా అని అనుమానం వచ్చింది. ఇక ఇలాంటి పాయింట్ తో వచ్చిన లగేరహో మున్నాభాయిలో ఉన్న స్పష్టత ఇక్కడ కనపడకపోవటం విషాదకరం. కృష్ణవంశి భక్తులకు ఏమన్నా నచ్చాలేమో గానీ మిగతావారికి కష్టమే.

ఓ కరుడుగట్టిన రౌడీ.. గాంధీ సిద్దాంతాలను నమ్మి అమలు చేసే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..అనేది ఈ కథ ముఖ్య ఉద్దేశం. దాసు(శ్రీకాంత్) వీధి రౌడి. తన పరిధిలో సెటిల్ మెంట్స్ చేసుకుంటూ బ్రతికే అతనికి లోకల్ పొలిటీషియన్ దాదా(జయప్రకాష్ రెడ్డి) పరిచయయి దగ్గరవుతాడు. అతన్ని గుడ్డిగా నమ్మి గూండాయిజం చేసుకుని పొట్ట పోసుకుంటూండగా ఓ సంఘటనతో దాదా..దుర్మార్గుడు అనే నిజ స్వరూపం తెలుస్తుంది. దాంతో దాసు తిరగపడతాడు. అతనికి ప్రత్యర్ధిగా మారి ఎమ్మల్యేగా నిలబడి
ఓడించి దెబ్బ కొడతానని శపధం చేస్తాడు. అయితే అతనికి ఏ పార్టీలోనూ టిక్కెట్టు దొరక్క సొంతంగా మహాత్మా పార్టీ పెడతాడు.అలాగే ఈ క్రమంలో దాసుకు కృష్ణవేణి(భావన) అనే లాయర్ పరిచయమవుతుంది. ఆమె సలహాపై తను పెట్టిన పార్టీ గుర్తు గాంధీ కావటంతో ఆ సిద్దాంతాలను అమలు చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి దాసు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు..విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.

ఇక ఈ చిత్రం ఎత్తుగడ బావుంది. అలాగే ఎత్తుకున్న పాయింట్ వరకూ దర్శకుడుని మెచ్చుకోవాల్సిందే.. అయితే ఎగ్జిక్యూషనే కరెక్టుగా లేదనిపిస్తుంది. అందులోనూ అసలు ఎత్తుకున్న గాంధీ సిద్దాంతం చర్చ కన్నా మధ్యలో వచ్చే రాజకీయం గోల ఎక్కువైంది.అంతేగాక ఎప్పట్లాగే చెప్పాల్సిన పాయింట్ కి ఇంటర్వెల్ వరకూ రాకుండా కథనం నడుస్తుంది. దాంతో ఫస్టాఫ్ లో శ్రీకాంత్ సినిమాల్లో చేరాలని (ఖడ్గంలో రవితేజ)ట్రైల్స్ సీన్స్, ఛార్మి ఐంటం సాంగ్ వంటివి అనవసరంగా వస్తాయి. పోనీ మన తెలుగు సినిమాకు ఇది అలవాటే కదా అని సరిపెట్టుకుని…సెకెండాప్ నన్నా గాంధీ సిద్దాంతాలపై చర్చ జరుగుతుందేమని ఆశిస్తాం. అదీ కనపడదు. ఇక ఇవి ప్రక్కన పెడితే దర్శకుడుగా కృష్ణవంశి ప్రతిభ చాలా సన్నివేశాల్లో మెరుస్తుంది. అలాగే వివిధ దేశ భక్తుల గెటప్ లలో రామ్ జగన్ కనపడటం మంచి ఆలోచన. వీటితో పాటు ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర
గాంధీ అనే పాటలో విజువల్స్ గుర్తుండిపోతాయి. నటుల్లో క్రూడ్ పొలిటీషన్ గా జయప్రకాష్ రెడ్డి అదరకొట్టాడు.వీరప్ప మొయిలీ తరహాలో ఆహుతి ప్రసాద్ బాగా చేసాడు. అలాగే ఒకే సీన్లో మెరిసిన బ్రహ్మానందం కథకు ఏమీ ఉపయోగం లేదు. పోస్టర్ వ్యాల్యూ కోసం పెట్టుకున్నట్లున్నారు. అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు,జ్యోతి, ఉత్తేజ్ యధావిధిగా చేసుకుపోయారు. టైటిల్ సాంగ్ ని సిరివెన్నల కలకాలం గుర్తుండిపోయేలా కలంబలం చూపి రాశారు.

సాంకేతికంగా ..కెమెరా ఓ మోస్తరుగా ఉంది. సంగీతం ఇచ్చిన విజయ్ ఆంటోని డలైమో..డలైమో సాంగ్ ఇక్కడ ఇంతకు ముందే డిష్యుం..డిష్యుం అనే చిత్రంలో వచ్చి హిట్ అయిందనే సంగతి తెలుసుకుని ఉంటే బావుండేది.ఆఖరుగా శ్రీకాంత్ కొన్ని చోట్ల చిరంజీవిని అనుకరించినట్లు కనపడటం వందవ చిత్రానికి
వన్నె తెచ్చేది కాదు. పరుచూరి సంభాషణలు పస తగ్గాయని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఏదైమైనా గాంధీ సిద్దాంతం అనేది ప్రక్కన పెట్టి ఓ మామూలు కమర్షియల్ సినిమా చూస్తున్నామనుకుంటే కొంత వరకూ తృప్తిపడచ్చు. బి,సి సెంటర్లు కొంత వరకూ భరిస్తారు గానీ ఎ సెంటర్లు అనుమానమే. ఇక మానవుడు…మహాత్ముడు కావటం ఇంత కష్టమని ప్రత్యేకంగా చూపాలా..ఈజీ అని చూపితే ఎవరైనా ఆ సిద్దాంతం గురించి కొద్ది సేపైనా ఆలోచిస్తారు. ఇలా అయితే గాంధీ అంటేనే భయపడతారు. అయినా దర్శకుడు అహింసా సిద్దాంతం చెప్పదలిచి తెరనిండా హింస చూపుతాడు ఇదేమీ నిబద్దతో అర్ధం కాదు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

17 Comments to “హా..మహాత్మా!!( రివ్యూ)”

  • శశిరేఖా పరిణయం చూసాక ఇక కృష్ణవంశి సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా.. మీ పని బాగా అయిందన్నమాట! నాకసలు ఈ సినిమా ప్రొమోలు చూస్తుంటేనే ఎందుకో ఆపరేషన్ దుర్యోధన సినిమా గుర్తొచ్చి భయం వేసింది. ఇందులో ఒక పాట నాదంటే నాదని ఇద్దరు రచైతలు వివాదం లేపినా జనం పట్టించుకున్నట్టు లేదు!

    ఎలాగూ చూసే ఉద్దేశం లేదనుకోండి, నా నిర్ణయాన్ని బలపరిచేలా మీ రివ్యూ ఉన్నందుకు థాంక్యూలు!

  • ఖాళీ బుర్రలో సమీక్ష చదివినప్పుడే నాకు రాజశేఖర్, రాశి నటించిన ‘నేటి గాంధీ’ సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా రాజశేఖర్ ఒక వీధి గూండాగా విలన్ దగ్గర పనిచేస్తూ గాంధీ సిద్దాంతాలకు ఆకర్షితుడవుతాడు.
    ఇక మనం సినిమా చూడకూడదని ఎన్ని ఒట్లు పెట్టుకున్న కొత్త సినిమా అనగానే క్యూలో నిలబడడం పరిపాటి.

  • ఖాళీబుర్ర లోని సమీక్షని జస్ట్ తెనిగించినట్లున్నారు ?
    http://idlebrain.com/movie/archive/mr-mahatma.html

    • @నేస్తం: ఖాళీబుర్ర కాదు. జస్ట్ తెలుగు డాట్ కామ్ లో చదివుంటారు. ఆరచయితా,ఈ రచయితా ఒకరే!

      అయినా, జీవీ ఇంగ్లీషుకాని ఇంగ్లీషుని తెనిగించే సాహసం ఎవరైనా చెయ్యగలరా!!

      • Sorry Mahesh.. late gaa chusanu mii reply

      • మహేష్ కుమార్ గారు,
        జస్ట్ తెలుగు డాట్ కామ్ అనే సైట్ నేను ఇంతవరకు చూడలేదు. (నా టపాలో ‘జస్ట్ తెనిగించినట్లున్నారు’ అనే పదం చూసి అలా అనుకున్నారేమో. ఆ మాట చాల informal గా రాసాను). నేను చూసింది ఐడిల్ బ్రైనే. ఒక సినిమా సమీక్ష రాసేటప్పుడు ఎవరు రాసినా బాగున్న వాటిని బాగున్నాయనే రాస్తారు. కానీ ఇక్కడ అన్నీ అవే అంశాలు స్పృశిస్తూ అవే అభిప్రాయాలతో రాయటంతో నాకు అలా అనిపించింది. ఈ రచనపై ఆ సమీక్ష ప్రభావం నిజంగా లేకుంటే చాలా సంతోషం.

        ఈ క్రింది పోలికలు చూస్తే అలా అనిపించింది.
        **
        This is Srikanth’s 100th film and he excels as an actor. He seemed to imitate Chiranjeevi in certain mass episodes (especially drinking scenes).
        శ్రీకాంత్ కొన్ని చోట్ల చిరంజీవిని అనుకరించినట్లు కనపడటం వందవ చిత్రానికి
        వన్నె తెచ్చేది కాదు.
        **
        Jaya Prakash Reddy is delight to watch.
        నటుల్లో క్రూడ్ పొలిటీషన్ గా జయప్రకాష్ రెడ్డి అదరకొట్టాడు.
        **
        Pellam Voorelithe Jyothy is pretty good as evil politician. Paruchuri Gopala Krishna is adequate. Duvvasi Mohan entertains in a small role. Brahmanandam is wasted in the movie.After a long gap, we have got good lyrics in a Telugu movie that are excellently sung by SPB.
        ఒకే సీన్లో మెరిసిన బ్రహ్మానందం కథకు ఏమీ ఉపయోగం లేదు. పోస్టర్ వ్యాల్యూ కోసం పెట్టుకున్నట్లున్నారు. అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు,జ్యోతి, ఉత్తేజ్ యధావిధిగా చేసుకుపోయారు. టైటిల్ సాంగ్ ని సిరివెన్నల కలకాలం గుర్తుండిపోయేలా కలంబలం చూపి రాశారు.
        **
        But I personally would have liked Krishna Vamsi to make a film of class orientation like Lage Raho Munna Bhai.
        ఇక ఇలాంటి పాయింట్ తో వచ్చిన లగేరహో మున్నాభాయిలో ఉన్న స్పష్టత ఇక్కడ కనపడకపోవటం విషాదకరం.
        **
        With an intention to reach B and C centers, Krishna Vamsi diluted his making standards. We have to wait and see how the masses receive it.
        బి,సి సెంటర్లు కొంత వరకూ భరిస్తారు గానీ ఎ సెంటర్లు అనుమానమే.
        ***

  • అంతే కాదు.. దట్స్ తెలుగు.కాం లొ కూడా.. వారే వీరు.. వీరే వారు. ఎటొచ్చి అక్కడక్కడా కాస్త మార్పులు

  • కరెక్టే…మీరు అనుమానించటంలో తప్పులేదు…అయితే నాకు తెలిసి ఉండి ఈ చిత్రానికి ఎవరు ఈ రివ్యూ రాసినా ఇలాగే ఉంటుందేమో…ఎందుకంటే స్ట్రెస్ చేసే అంశాలు అవి కదా..ఇంకొక విషయం నేను దట్స్ తెలుగులో రివ్యూ రాసిన తర్వాత ఇక్కడ మరుసటి రోజు కొద్దిగా మార్చి రాయటం జరిగింది.ఇక మిగతా సైట్స్ కూడా ఇవే అంశాలు హైలెట్ చేసాయి గమనించగలరు…

    సూర్యప్రకాష్ జోశ్యుల

  • సినిమాలో కధానాయకుడు ప్రజల దృష్టిలో నాయకుడుగా మారిన సన్నివేశం…. పెట్రోలు పోసుకుని తగలపెట్టుకోవడం… ఇది ఆత్మ హత్య…. నాకు తెలిసిన నేను చదివిన అర్దం చేసుకున్న గాందీయిజంలో ఈ ఆత్మ హత్య లేదు……….. కాని ఆత్మ హత్య గాంధీయిజం లో చేర్చటం బాగాలేదు…

    మరోక్క మాట నేను గాంధీ అభిమానిని ….. కానీ గాంధీ అహింస ధర్మాలు న్యాయభద్దమయిన ఒక సంఘాన్ని లేక ప్రభుత్వాలను ఎదిరించడానికి మాత్రమే ఉపయోగపడుతాయి కాని …. నిరంకుశ ప్రభుత్వాలు, నిరంకుశులయిన మనుషులను ఏదుర్కొనుటలో గాంధీయిజం నిశ్ఫలం .

    బి సి సెంటర్స్ కి సినిమా ఎక్కేస్తుంది …..

    • మంచి పాయింటే…ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం గాంధీఇజం ఎలా అవుతుంది..కొత్త విషయాలు చెప్పకపోయినా పర్వాలేదు..ఇలా లేనిపోనివి చూపట్టడం ఎంతవరకూ సమంజసం..

      సూర్యప్రకా ష్ జోశ్యుల

  • హెలొ,

    “ఫస్టాఫ్ లో శ్రీకాంత్ సినిమాల్లో చేరాలని (ఖడ్గంలో రవితేజ)ట్రైల్స్ సీన్స్” ఎ సినిమాలొ శ్రీకాంత్ సినిమలొ చెరలనుకొనె ఉద్దెసం వెరు , కడ్గం లొ రవితెజ ఉద్దెసం వెరు. ఎక్కడ శ్రీకాంత్ గోల్ దబ్బు సంపాదించలని , అక్కడ రవితెజ మాంచి యక్టర్ అవుదమని.

    how can you say both characters intentions are same?

    2) సెకెండాప్ నన్నా గాంధీ సిద్దాంతాలపై చర్చ జరుగుతుందేమని ఆశిస్తాం

    Who(audience) are we to expect to happen which we think? audience must experience the cinema but do not expect.Audience should fallow the film how director is talking.

    And film is not about ” Gandhi philosophy”, so there is no need to show munna bhai MBBS film.

  • దుమ్ము లేపావు గురు, బాగుంది!

  • అహ్హింస ఒక సిధ్ఢాంతం….గాంధీ ని చదవకుండా..ప్రయెగాలు చేస్త్థే ఇలాగే ఉంటాయి …

  • సినిమా పోస్టర్లు చూసినప్పుడే అర్థం అయిపోయింది, అది వయొలెన్స్ సినిమా అని. ఎలకని పట్టడానికి చిన్న గొయ్యి తవ్వితే సరిపోతుంది. పెద్ద బిలం తవ్వాల్సిన పని లేదు. ఈ సినిమా వయొలెన్స్ సినిమా అని తెలుసుకోవడానికి సినిమా మొత్తం చూశారన్న మాట.

  • krishna vamsi mark missaina cinema..mahatma
    kothadanam leni cinema ..mahatma
    heroinee carectorlo continuetee leni cinema ..mahatma
    paruchuri brothers dialouges power missaina cinema ..mahatma

  • మహాత్మా సినిమా నిర్మాత సినిమా పోస్టర్ల మీద సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిన UA రేట్ ముద్రించలేదు. మహాత్మా సినిమాలో ఒక పాటని రచయిత అనుమతి లేకుండా వాడుకోవడం జరిగింది. ఈ సినిమా మీద ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయి.
    http://thatstelugu.oneindia.in/news/2009/10/15/case-against-mahatma-film-producer-151009.html

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories