విలేజ్ లో వినాయకుడు-Audio Review

village_lo_vinayakudu

గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది.

1. చినుకై వరదై

ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping number గా మలచడంలో సంగీత దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. ఈ మధ్య అంతగా వినిపించని హరిహరన్ గొంతు మథురంగా ఈ పాటలో వింటాం.

సాహిత్య పరంగా వనమాలి ఎంత బాగో రాశారో తెలియలాంటే మచ్చుకి ఒక భావం -

తడి లేని నీరున్నదేమో
సడి లేని యద ఉన్నదేమో
నువు లేక నేనున్న క్షణమున్నదా?

ఈ పాట సాహిత్యంలో వినిపించే “విధిని ఎదిరించడం”, “అనుకోని మలుపు” లాటివి చూస్తే సినిమా సందర్భాన్నీ, కథనీ కూడా వనమాలి కొంత ఈ పాటలో స్పృశించారు అనిపిస్తుంది.

2. అహ నా పెళ్ళియంట!

మయాబజార్ లోని “అహ నా పెళ్ళియంట” పాట పల్లవిని, ట్యూన్ నీ తీసుకుని దాని చుట్టూ ఒక rap గీతాన్ని పొదిగిన వెరైటీ పాట ఇది. ఇందులో female voice (సౌమ్య) పాత మాయబజార్ పాట గొంతులానే అనిపించడం ఇంకో తమషా. సాహిత్యంలో కూడా

నీకు మూడు ముళ్ళంట, లోకమంత థ్రిల్లంట !

అంటూ కొంత modern touch కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అనిపించింది.

3. నీలి మేఘమా

ఇదో అద్భుతమైన solo song. ఎంతో melodious గా, హాయిగా విన్న మొదటిసారే గుండెలకి హత్తుకుంటుంది. ట్యూనూ, పాటలో వినిపించే కోరస్ ఆకట్టుకునేలా ఉన్నాయ్. కార్తీక్ చాలా బాగా పాడాడు. సాహిత్యపరంగా ఒక భావ గీతంలా మలిచారు వనమాలి.

ఆ ఏటిగట్టు అల పాదాల తోటి
ఈ గుండె తడిమి తడిగురుతు చూపుతోంది

లాటి చక్కటి భావాలు ఉన్నాయ్. సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే సినిమాలో కథానాయకుడు పల్లెటూరు వచ్చి అక్కడి హీరోయిన్ కుటుంబంతో అనుబంధం ఏర్పరచుకుంటాడు అనిపిస్తుంది.

4. తీసే ప్రతి శ్వాస

సందర్భోచితంగా సాగుతున్న ఈ చిత్ర గీతాలలో ఒక శోక గీతం ఉండి తీరాలని ఊహించడం పెద్ద కష్టం కాదు. అదే ఇది. శోక గీతాన్నీ జనరంజకంగా మలచడంలో సంగీత దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అనిపిస్తుంది. హరిహరన్ చక్కగా పాడిన ఈ పాటకి వనమాలి తగిన సాహిత్యాని అందించారు.

5. సూపర్మేన్ బ్రదర్ ని

“సూపర్మేన్ బ్రదర్‌నీ, స్పైడర్మేన్ కజిన్‌నీ” అంటూ trendy గా సాగే ఈ పాట సాహిత్యం వనమాలి లో ఇంకో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బహుశా హీరో పిల్లల దగ్గర పాడే పాట కావొచ్చు ఇది. సంగీతం, గానం తగ్గట్టుగా ఉన్నాయ్. అయితే హోరు కొంత ఎక్కువై సాహిత్యం స్పష్టంగా వినిపించకపోవడం ఈ పాటలో ఒక లోపం అనిపించింది.

ఇవి కాక violin తో వినసొంపుగా వింపించే theme music ఈ ఆల్బంకి ప్రత్యేక ఆకర్షణ. “ముద్దుగారే యశోద” అన్నమయ్య గీతం కూడా రెండు సార్లు male and female voices లో వినిపించి రంజింపజేస్తుంది. ఈ గీతాన్ని కూడా సందర్భోచితంగా వాడి ఉంటారని భావించవచ్చు.

ఒక గొప్ప సంగీత సాహిత్య అనుభవం కావాలంటే ఈ ఆల్బం తప్పక వినండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

KSM ఫణీంద్ర

రచయిత:

నా గురించి చెప్పుకోడానికి పెద్ద ఏమీ లేదు. వయసు 28, వృత్తి రీత్యా హైదరాబాద్ లో DSP Engineer ని. ప్రవృత్తి రీత్యా తెలుగు సినీ సాహితీ పాఠశాలలో విద్యార్థిని, ఔత్సాహిక సినీ గేయ రచయితని. నా మనసు ఆరబోసుకున్న రాతలూ కొన్ని "అక్షర శిక్షలు" (http://kukavi.wordpress.com) గా బ్లాగించాను. సినీ సాహితీ వ్యాఖ్యానాలు "తెరచాటు చందమామ" (http://manikya.wordpress.com) బ్లాగులో ఉన్నాయి.

21 Comments to “విలేజ్ లో వినాయకుడు-Audio Review”

  • అంతా బానే అనిపించింది కానీ.. ‘ముద్దుగారే..’ పాట మాత్రం ‘పడమటి సంధ్యారాగం’ సినిమాలోనిదే బావుంది.

    • నిజమే! ఈ సినిమాలో “ముద్దుగారే యశోద” పాడిన ఇద్దరూ సాహిత్యంలో చిన్న చిన్న తప్పులు పాడారని. నా మిత్రుడు పట్టుకున్నాడు. male singer “అంతనింత” అనాల్సిన చోట “అందనింద” అని పాడారనీ, female singer “మూడు లోకాలు” అనాల్సిన చోట “నూడు లోకాలు” అని పాడిందనీ అతను అన్నాడు. ఇలాటివి పక్కన పెడితే ఇద్దరూ బాగా పాడారు. సంగీతమూ బాగుంది.

      • ఇందాకా వింటుంటే గమనించా, ఆ రెండు తప్పులూ మేల్ సింగర్ పాడాడు. ఫీమేల్ సింగర్ (నూడు) అని మాత్రమే పాడింది.

  • మంచి సమీక్ష. అభినందనలు.

    • “సమీక్ష” పెద్ద మాట! ఇది “review” కాదనీ, “view” మాత్రమేననీ నేను వెంకట్ గారికి విన్నవించుకున్నాను!

  • Welcome to NT :)

    • Thanks :) నువ్వు NT లో ఉన్నావని తెలుసు కానీ, admin వి అనీ, విరివిగా రాస్తున్నావనీ ఈ రోజే తెలిసింది!

  • Good review Phanindra garu, Baaga rasaru
    Konchem music orchestration gurunchi kuda vishayalu expect chestunnamu future reviews lo…
    regards,
    Radio Jockey Mithra

    • Thanks, Bro!. ఇది నిజానికి lyrics review గా మొదలెట్టాను. అందుకే music మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ఈ సారి చేస్తాను. అవసరమైతే నువ్వున్నావ్ గా, నీ సహాయం తీసుకుంటాను!

  • అవును ముద్దుగారే యశోద లో తప్పులున్నాయ్! బహుశా గాయకుడు(ని) పరభాష వాళ్లు అయ్యుండొచ్చు. అయినా బాగుంది. రెహమాన్ బాణీల్లో వినిపించే బీట్ తో వినసొంపుగా వుంది.వర్ధమాన సంగీత దర్శకుడు మణికాంత్ ప్రముఖ శాక్సోఫోన్ విద్వంసుడు కద్రి గోపాల్ నాధ్ తనయుడు.ఆవకాయ్ బిరియాని లో కూడా వైవిధ్యమైన మెలోడీలతో అలరించాడు.మంచి భవిష్యత్తువున్న సంగీత దర్శకుడు. అభిరుచి వున్న దర్శక నిర్మాతలు వుంటే ఇంకా ఇలాంటి మంచి ఆల్బంస్ తెలుగు లో మనం వినొచ్చు. దేవీశ్రీ, మణి, చక్రి లాంటి మూస సంగీతం నుంచి కొంత మన తెలుగు శ్రోతలు కొంచెం తేరుకోవచ్చు.ఫణీంద్ర గారు మంచి ప్రయత్నం కొంచెం గాయకుల గురించి పాటల్లో వాడిన రాగాల గురించి (నాకు తెలియదు తెలుసుకోవాలనే ఉబలాటం) ప్రస్తావిస్తే బాగుంటుంది.భవిష్యత్తులో ఇంకా ఆశిస్తున్నాము.

    • హ హహ !! విద్వంసుడు కాదు అచ్చు తప్పు విద్వాంసుడు

      • మీరు ఎత్తి చూపేవరకు నేను “విద్వాంసుడు” అనే చదివాను :) .

    • “రాయలేను రాగమేదో, music రాని వాడను” అంటూ సింథుభైరవి సినిమాలో సుహాసిని స్టైల్‌లో పాడాలని ఉంది, మీరు రాసినది చదివితే :) పాటలో సాహిత్యం గురించి కొంత విశ్లేషణ రాయగలను కానీ, సంగీతం లో తెలిసింది చాలా తక్కువ. పైన చెప్పినట్టు నిజానికి నేను చేద్దామనుకున్నది lyrics review. అది ఇలా అయ్యింది!

  • Phani,

    Re’view’ chaalaa baagundi. Great start. Keep it going!! Perhaps, you can have more about the music (Director, Orchesterization, etc) from next time round. I’ve become a fan of Manikanth Kadri after ‘Avakai – Biriyani’. I will latch on to this one for sure, particularly after reading your review.

    -Sumanth

    • Sumanth, thanks! You raised the same points RJ Mithra raised. I will try to incorporate more music feedback in my future reviews.

  • హరిహరన్ గొప్ప, మృదు మధుర గాయకుడే కాని, “బాద” లాంటి పదోఛ్ఛారణలతో “బాధ” పెడుతుంటాడు. ఈ ఆల్బం ఇంకా వినలేదు కాని, అందులో ఇలాంటివి లేకపొతే బాగుండును!.

  • బొమ్మరిల్లులో సిధ్ధార్థ గుళ్ళో లేదా గుడిలో అనడానికి గుడ్లో అంటాడు.

    • అది సిధార్థ్ తప్పు కాదు.పాపం ఆయనకి తెలుగు రాదు. కాని సునిత లాంటి వెరైటీగా తెలుగు మాట్లాడే డబ్బింగ్ ఆర్టిష్ట్ భాషని ఖూని చేస్తున్నారు.

  • Bavundi Phanindra garu review. naadi andari maate.. inkoncham detailed ga raste bavuntundi.

    Music nachindi baaga. Theme music excellent.

    Itanu Saxophone vidyvaamsudu Kadri Gopalnath abbayita kadaa..

  • నీలి మేఘమా అద్బుతంగా ఉన్నది,
    హ ఫణి మీ నుండి సిరివెన్నల గారి పాటల మీద ఒక శీర్షిక అశిసున్నాను , మీరు రాయగలరు :)

  • chakkagaa vraasaavu, sOdaraa! kaanee, tammuDu Mithra annaTTE marinta depth and detail avasaramE… (I came here from H’s status message, convey my thanks!)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories