“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

mbp

mbpగానం: ఉష
రచన: సురేంద్ర క్రిష్ణ
సంగీతం: కోటి

పల్లవి:
మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ…
కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ
ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను
కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును
మట్టిలో కలిసే దేహమే ఇది
లేని పోని ఆశలు రేపెనా విధీ
పూజతో శోకం దక్కిందా
గుండెలో గాయం మిగిలిందా

చరణం 1:

చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే
నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే
||చిన్న||
ఏడుపంటే కొత్తేమి కాదు
బాధ నాకు వింతేమి కాదు
ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరుగను
చెప్పుకుంటే తగ్గేది కాదు
పంచుకునే తోడంటు లేదు
అంతులేని దారిలోన ఎంత నడవను
ఇది నాలో దోషమా
పై దేవుడి శాపమా
విధి ఆడే జూదమా
మనసంటే మాయేనా

||మాటలే…||

చరణం 2:

నాకు బాధ కలిగినపుడు నువ్వు లాలనా
బొమ్మలాగ నువ్వు ఉంటే దిక్కు తోచునా
||నాకు||
చల్లనైన నీ గుండె పైనా
మాలలాగ నేనుండిపోయే
భాగ్యమింక జన్మలోన నాకులేదులే
జన్మ అంటు ఇంకోటి ఉంటే
పువ్వునై నీ చెంత చేరి నన్ను కడతేరనివ్వు పాద పూజలో
నా ప్రాణం నీవేరా….
నా ధ్యానం నీవేరా…
క్రిష్ణా.. క్రిష్ణా..క్రిష్ణా..క్రిష్ణా..

పాటలో లాలిత్యం, బాణీలో వైవిధ్యం, గానంలో ఆర్ధ్ర్రత ఈ పాటకి జీవాలు.ఈ పాటా చాలామంది వినేవుంటారు.కానీ విననివారు ఇది తప్పక విని చూడండి, గుండెలని ద్రవింప చేసే పాటల్లో ఇదీ ఒకటి. పద కవితలు నచ్చే వారికి ఇది బానే నచ్చుతుందని నా అభిప్రాయం. ఈ పాట వ్రాసిన సురేంద్ర క్రిష్ణగారు మనకు వేరే జోరైన పాటలద్వారా సుపరిచుతులే. ఆయన కలం నుండి జాలువారిన మరి కొన్ని మనకి బాగా తెలిసిన పాటలు.. “సెహరీ” (ఓయ్)(క్రిష్ణ చైతన్యతో కలిసి), “తకధిమితోం తకధిమితో” (ఆర్య), “ఎదోలా ఉందీవేళ” (తమ్ముడు) “హాయిరే హాయిరే హాయ్రే హాయ్” (హాయ్) మొదలైనవి.
ఉష నుండి ఇలాంటి పాట ఇంత భావుకంగా నే వినలేదు.

“మాటలే రాని వేళ పాట ఎలా పాడను” అని మొదటి వాక్యం వినగానే సాహితీ ప్రియులకు 1985లో సింధుభైరవి చిత్రంలోని “పాడలేను పల్లవైనా భాషరాని దానను”, అనే పాట గుర్తొస్తుంది.
దానికీ దీనికీ సంబధం ఏమిటీ అంటారా?
ఏమో తెలియదు నాకు మాత్రం అదే గుర్తొస్తుంది అని నేను తప్పించుకుంటాను.

ఈ పాట వింటుంటే సంగీతపరంగా మీకు “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి” (అంతులేని కథ)అనే పాటకి ఏమైనా సంబంధం వినిపిస్తుందా?

ఈ పాటను దృశ్య రూపంలో యూట్యూబులో ఉంచిన “nkallys” అనే చానల్ వారికి మంగిడీలు

–సతీష్ కుమార్ కొత్త

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

11 Comments to ““మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?”

  • ఎందుకోగాని ఈ పాటలో నాకు ఏ విధమైన ప్రత్యేకతా కనపడలేదు. పదాలలో చెప్పుకోదగిన గొప్ప ప్రయోగాలేవి లేవు. పాటకు వాడిన రిథం ఏదో ఉద్యమగీతాలకి వాదేమాదిరిగా ఉండి విషాద గీతానికి నప్పలేదేమో అనిపించింది.దృశ్యపరంగా కూడా ఆర్టిస్టులు ‘వేదన వెలిబుచ్చేందుకు’ చేసిన వృధా ప్రయాసలతో రసాభాసగా ఉంది. ఈ పాట’ఏ శ్వాసలో చేరితే’ పాటకంటే బాగుందనటం కొంచెం మరీ ఎక్కువేమో! “ఉష నుండి ఇలాంటి పాట ఇంత భావుకంగా నే వినలేదు” అనేది కూడ కొంచెం ఓవర్ స్టేట్మెంటే. ‘నీ స్నేహం’లోని ‘చినుకుతడికి చిగురుతొడుగు పువ్వమ్మా’ అనే “ఓ పాట మీరు విన్నారా?” :)

    • in “santhosham” she sung “ne tholisaariga” beautifully…completly agree with nestham…

      • I will be repeating myself as i did in reply to nestam
        I didn’t mean/attempt to compare 2 beautiful songs and neither did i say usha has no beautiful songs in her record. I said this is the song she sung very nice on an emotionally sad note.
        nE tolisaariga is another sad song we have heard from her (no doubt its a beautiful song) All i meant was higher emotions were in her tone in this one.. the heights of emotional trauma

    • మీరన్నది నిజమే పదాలలో సరళత్వం ఉంది అదే నేనూ చెప్పింది అంతగా సాహిత్యాన్వేషణ అవసరంలేని పాట అని. బాణీ అంటారా తాళం అలా అనిపించినా రాగం అలా అనిపించలేదు నాకు. ఉద్యమగీతాలలో ఆవేశాన్ని/ఆవేదనని వెళ్ళబుచ్చుతుంటారు కదా.హీరోయిను పాత్ర కథానుసారంగా క్రిష్ణుడిని తన మిత్రుడిగా భావించి చిన్నప్పట్నుండీ అతనితోనే అన్నీ పంచుకునేది, పూజించేది, కానీ విధి ఆమెని ఎన్నో కష్టాలకి గురిచేస్తుంది, అందుకనే “పూజతో శొకం దక్కిందా” అని, “బొమ్మలాగ నువ్వు ఉంటే దిక్కు తోచునా” అంటూ తన ఆవేదనని వెళ్ళబుచ్చుతుంది.సో అదే ఫక్కీలో ఈ గీతంకూడా సాగిందనుకోవచ్చు. ఏ శ్వాసలో చేరితే అనే పాటకి దీనికి పోలిక చేయలేదు.. దానికంటే ఇది గొప్పదనీ నేననలేదు గమనించగలరు. అది భక్తిప్రధానమైతే ఇది దుఃఖప్రధానం అదే నా ఉద్దేశ్యం కూడా. మళ్ళీ చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ పాట కూడా ఆవేదనకి/దుఃఖానికి సంబంధించిన భావం కాదు. దుఃఖ భావానికి సంబంధించి ఉష గారి నుండి ఇంత భావుకంగా పాట రాలేదు(వినలేదు) అని అనటమే నా ఉద్దేశ్యం.

      అసలు ఇక్కడ ఓ తప్పు దొర్లింది. ఏ శ్వాసలో చేరితే అనే పాట చిత్రగారు పాడారు, నేను చినుకు తడికి పాట గురించి ప్రస్తావించబోయి అలా రాశాను.అది నా తప్పే.

  • బుచికి బుచికి పాట. కిచ కిచ

  • Dear Sathish, it would have been great help if u explain the situation where this song came in a movie and how opt this song to that situation or something from a whole movie perspective…you just pasted lyrics and a link…I didn’t understand the purpose of this article.

    • Sen, I appreciate your interest in knowing the necessary background for the situation of the song. I would definitely note that point in my forthcoming entries. Thank you.
      Well for this song.. The heroine leads a lonely life as she has no parents, since childhood, she prays to lord krishna believing him to be her friend.she shares her highs and lows with him. When the lead (hero) enters she gets a companion whom she considers as a friend and eventually falls in love with him. later hero’s parents accuse her and try to part the lovers. so in anguish she sings the song, asking how much more would lord wants to test her..
      cheers

  • ఏ శ్వాసలో చేరితే… పాట గొప్పదైతే కావచ్చు కానీ, అందులో శ్రియ నటన, తాదాత్మ్యం చెందినట్లు పెట్టిన ఎక్ష్ప్రెషన్లు వద్దు దేవుడా!!!

    ఈ పాటైతే నేను వినలేదు. ఇప్పుడు వినాలి.

    • 100% – ఆ పాటలో శ్రేయ ఎక్ష్ప్రెషన్లు (అసలు అవోటి ఉన్నాయా? – mute లో పెట్టుకొని చూడండి – మీకే తెలుస్తుంది.. ఎప్పుడూ ఒకే చెక్క ఫేస్ పెట్టుకొని క్లోజ్ అప్ లో కూడా లిప్ సింక్ లేకుండా, చూసే (తెలుగు) ప్రేక్షకులని వెర్రి పీనుగులని చేస్తూ – అసలు ఈ పాటకి అత్యంత వీకెస్ట్ లింకు శ్రేయానే) – ఆ పాట గురించి మాట్లాడితే నాకెందుకో పూనకం వచ్చేస్తుంది :) .

    • శ్రియాకి ఆ ఒక్క పాట కొరకు ఇచ్చిన పారితోషికం రెండు రూపాయలు.

      నాకెలా తెలుసో కనుక్కోండి :-)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories