అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామిడీలు తీసిన ఇవివి కొత్త సినిమా రిలీజ్ అంటే ఉషారే. అయితే ఫిటింగ్ మాస్టర్,పెళ్లయింది కానీ..అంటూ వదిలిన సినిమాలు గుర్తుకు వచ్చి కాస్త భయం కలిగిన మాట వాస్తవం. అయితే ఆయన పాత సినిమాలతో పోల్చదగినదీకాదు.. మరీ అంత రోత పుట్టించే వ్యవహారం కాదు..ఈ బెండు అప్పారావు. ట్రీట్ మెంట్ (స్టోరీ)సమస్యగా వచ్చినా డైలాగులతో లాక్కెళ్ళిపోయాడు.అయినా ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు అన్నట్లు..వరసగా వస్తున్న చెత్త చిత్రాల మధ్య ఏ మాత్రం కాస్త రిలీఫ్ దొరికే సినిమా కనపడినా ఫరవాలేదనిపిస్తుంది కదా.
బొబ్బర్లంక అనే పల్లెలో బెండు అప్పారావు(అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైధ్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు.అఫ్ కోర్స్ అతని అడ్డదిడ్డ సంపాదనకు కట్నం కోసం వేధించే బావ(కృష్ణ భగవాన్)అనే రీజన్ ఉంటుంది(గృహహింస చట్టం ఇంకా రాని రోజుల్లో రాసుకున్న కథ కావచ్చు). ఇక ఈ అప్పారావుకి అతి మర్యాదలు చేసి బెదరకొట్టే ఆ ఊరి రాజుగారు(ఆహుతి ప్రాసాద్)గారి కూతురు పద్మ ప్రియ (కామ్నా)తో లవ్ ఇంట్రస్టు ఉంటుంది.అలాగే పనిలో పనిగా ఓ బేవార్స్ బ్యాచ్ (శ్రీనివాసరెడ్డి,ఉత్తేజ్)తో ప్రెండ్ షిప్ ఉంటుంది.ఇలా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ పూర్తయ్యాక కథలో అతిధి లాంటి మలుపు వస్తుంది. ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయిన ఓ వ్యక్తి డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తూ యాక్సిడెంట్ కి గురి అవుతాడు. అతను మరణిస్తూ మన అప్పారావు అతని ప్రెండ్స్ కి తగులుతాడు. అంతేగాక తన దగ్గర ఉన్న పదిహేను లక్షలు తన కుటుంబానికి అప్పచెప్పమని వారికి అప్పచెబుతాడు. అయితే వారి ఎడ్రస్ తెలియని అప్పారావు తప్పనిసరి స్ధితిలో ఆ డబ్బుని తమ అవసరాలకి,ఊరి అవసరాలకి ఖర్చు పెడతాడు. ఈలోగా మనమూహించినట్లే ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఆ ఊళ్లో దిగుతుంది. అప్పుడు అప్పారావు ఏం చేస్తాడు..అనేది మిగతా కథ.
ఈ చిత్రంలో కథ సమస్యలోకి పడేసరికి(చనిపోయిన వ్యక్తి ప్యామిలీ ఆ ఊరు రావటం)సెకెండాప్ సగం జరిగిపోతుంది. దాంతో ఆ సమస్యని పరిష్కరించటానికి స్క్రీన్ టైమ్ సరిపోలేదు. అయినా సమస్య వచ్చిన తర్వాత దాన్ని హీరో ఎలా ఫేస్ చేసాడు..ఆ క్రమంలో ఏ ఇబ్బందులు పడ్డాడు అనే దిశగా కథనం నడవదు.సమస్యకు పరిష్కారం ఆ చనిపోయిన వ్యక్తి చెల్లెని పెళ్లి చేసుకోవడమే అని హీరో నిర్ణయించుకోవటం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది స్క్రీన్ ప్లే లోపమే. అనుకున్న పాయింట్ ని పూర్తి స్ధాయి కధగా విస్తరింపచేయలేదు. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే వెలగొండ శ్రీనివాస్ డైలాగులు చాలా వరకూ లాక్కొచ్చాయి. అలాగే ఇవివి మార్క్ క్యారెక్టరైజేషన్స్ బావున్నాయి. ఆహుతి ప్రసాద్ అతి మర్యాదలు అలరిస్తాయి. ఇక ఎల్.బి.శ్రీరాం పందెం కోడి వ్యవహారం సగంలో తేల్చకుండా ముగించేసారు. లెంగ్త్ ఎక్కువై ఎడిటింగ్ లో పోయినట్లుంది. అలాగే శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్ దుబాయి ట్రిప్ కామిడీ ట్రాక్ కూడా పండలేదు. అయితే ఉన్నంతలో రఘుబాబు బాగా చేసాడు. అల్లరి నరేష్ ఒక్క ఎక్సప్రెషన్ కూడా కొత్తది ఇవ్వలేదు. హీరోయిన్ కామ్నా ఓవర్ స్లిమ్ అయి అసలు అందం పోగొట్టుకుంది. ఎడిగింగ్ ఓ మాదిరిగా ఉంది. దర్శకుడుగా ఇవివి ఆరోగ్యం బాగోలేని స్ధితిలో ఈ సినిమా పూర్తి చేసారు. అది స్పష్టంగా చాలా చోట్ల కనపడుతుంది. కోటి అందించిన పాటలు గొప్పగా లేవు. అలాగే వాటిని కూడా మ్రెక్కుబడిగా తీసారు.
అప్పుడప్పుడూ నవ్వొచ్చే డైలాగులు,సిట్యువేషన్స్, ఫీలయితే కాస్త సెంటిమెంట్ ఉన్నాయి కాబట్టి ధైర్యం చేయవచ్చు. అలాగే బూతులు,అక్రమసంభంధాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీలని ఎంకరేజ్ చేయవచ్చు. అయితే పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మాత్రం ఫీలయి
వెళ్తే నిరాశే మిగులుతుంది.ఇక ఈ చిత్రంలో డైలాగులు మీద పెట్టిన శ్రధ్ద కథ,కథనాల మీద పెడితే మరింత బావుండనిపిస్తుంది. అలాగే సిట్యువేషన్ కామిడీ కన్నా డైలాగ్ కామిడీనే ఎక్కువ ఆశ్రయించటంతో కొన్ని చోట్ల సినిమా వింటున్నట్లు ఫీల్ కలగుతూంటుంది.అయినా సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి రాదగ్గ సినిమా కాకపోయినా ఇవివి స్కూల్ నుంచి మాత్రం ఇలాంటి సినిమానే ఎక్సపెక్ట్ చేయవచ్చు. ఏదైమైనా మరీ మన బెండు తీయని ఈ అప్పారావు ఓ బిలో యావరేజ్ సినిమా అనిపిస్తుంది.
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.
నటీనటులు: నరేష్, కామ్న జెఠ్మలానీ, మేఘన, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, చలపతిరావు, రఘుబాబు, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్, శకుంతల,అనితానాథ్.
ఆర్ట్ :బి.వెకటేశ్వరరావు
కెమెరా :వి.జయరామ్
ఎడిటింగ్: గౌతంరాజ్
సంగీతం :కోటి
నిర్మాత: డా||డి.రామానాయుడు
దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ
G says:
Hahaha. Seen the movie. Really entertaining. But I felt what you wrote. So much is wanted on the Screenplay front. But itz a movie watchable with families.
K మహేశ్ కుమార్ says:
“అహనాపెళ్ళంట” లాంటి క్లాసిక్ కామెడీ సినిమా అందించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, ఇన్నాళ్ళకు ఒక పూర్తిస్థాయి కామెడీ తీస్తోందంటే ఆమాత్రం ఆశించడంలో తప్పులేదు. కానీ…తెలిసిందేకదా! గతవైభవం మాత్రం మిగిలినట్టు తయారైన ఈ సంస్థనుంచీ ఇలాంటి బిలోయావరేజ్,యావరేజ్ చిత్రాలే వస్తున్నాయి. ఆ లిస్టులో ఈ బెండు అప్పారావొకటి కొత్తగాచేరింది. అంతే! DVD వచ్చేవరకూ చూడకూడదనుకున్నాను. కానీ సమీక్ష చదివాక ధియేటర్లో చూసెయ్యడానికి నిర్ణయించుకున్నాను.
G says:
Yea. one can watch it for some wholesome entertainment. For a change, it can be seen with families
Praveen says:
సినిమా చూడలేదు కానీ రామానాయుడు సినిమాలలో క్వాలిటీ ఇంత తక్కువగా ఉంటుందంటే నేను మొదట నమ్మలేదు.
Praveen says:
సినిమా కొత్తదే కానీ టైటిల్ మాత్రం పాతది. ఒకప్పుడు సినిమా హీరో కృష్ణ గారి డాన్స్ బాగుండేది కాదు. మేము చిన్నప్పుడు కృష్ణ డాన్స్ ని “బెండి అప్పారావు డాన్స్” అనే వాళ్ళం. పలాస స్టేషన్ కి దగ్గర్లో ఉన్న బెండి గేట్ అనే గ్రామం పేరుతో “బెండి అప్పారావు” అని పేరు వచ్చిందనుకుంటాను. “బెండి అప్పారావు” పేరు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పాకి ఇప్పుడు ఓ సినిమాకి టైటిల్ అయ్యింది.
K మహేశ్ కుమార్ says:
బాబూ ప్రవీణ్, నీ ఎటిమాలజీకి ఒక దండం. హీరో కృష్ణను “బెండు” అనడానికి కారణం ఆయన డైలాగులు చెబుతున్నప్పుడు శరీరాన్ని వంకరగా పెడతాడు, అలాగే డ్యాన్సులన్నీ వంకరగానే చేస్తాడు అని. వంకరకు ఇంగ్లీషుపదం “bend”. అది అసలు కథ. దానికీ శ్రీకాకుళానికీ సంబంధం లేదు. కృష్ణను ఆంద్రప్రదేశ్ మొత్తంలో (కొన్ని వేరియేషన్స్ తో) ఇదేపేరుతో పిల్చేవారు.
బెండుఅప్పారావులో హీరో పాత్ర కొంత వంకరపాత్ర అందుకే అది బెండు అప్పారావు అయ్యింది.
Praveen says:
సినిమాలో ఈస్ట్ గోదావరి విలేజ్ చూపించారు కానీ “బెండి అప్పారావు” అనే పేరుని కనిపెట్టింది మా జిల్లా వాళ్ళే. “చిడతల అప్పారావు” పేరు కనిపెట్టింది కూడా మా జిల్లా వాళ్ళే. ఈస్ట్ గోదావరి జిల్లాలో పల్లెటూరి వాళ్ళకి సత్తిబాబు, సూరిబాబు, వీర్రాజు లాంటి పేర్లు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పల్లెటూరి వాళ్ళకి అప్పారావు, రామారావు, అప్పల నాయుడు, సన్యాసి నాయుడు, బైరాగి నాయుడు, నారాయణప్పడు లాంటి పేర్లు ఉంటాయి. ఒక జిల్లా వాళ్ళు కనిపెట్టిన పేరుని టైటిల్ గా పెట్టి ఇంకో జిల్లా బ్యాక్ గ్రౌండ్ తో సినిమా తీశారు.
ceenu says:
పవన్‌గారూ….మగధీర లాగ మీరో కొత్త సమశ్య తెస్తున్నట్టున్నారు.మనవళ్ళు అంటే మన పూర్వికులు ప్రతిసంధర్బానికీ ఓ సామెత పెట్టేసారండి.దీనికి కోడిగుడ్డుకి ఈకలుపీకడం అనిపెట్టరు.ఈమద్య శంకరాభరణం మీద సమీక్ష,మరియు దానిపై చర్చ,అంటే అసలే వాన ఆ పై వరద,ఈ వరదబాదితులను మీరు కరుణించాలి.
ceenu says:
ప్రవీణ్ గారూ అనిటైప్ చేస్తే పవన్ అనివచ్చింది.ఓజిల్లా పేరుపెట్టి ఓజిల్లా సినిమా తీసినట్టు.
వెంకట్ శిద్దారెడ్డి says:
Praveen says:
కోడి గుడ్డుకి ఈకలు పీకడం కాదు. పేరు ప్రాంతోచితంగా సెలెక్ట్ చెయ్యడం రాదు మన సినిమా వాళ్ళకి అని చెపుతున్నాను.
అబ్రకదబ్ర says:
ప్రవీణ్‌ని కనిపెట్టింది కూడా శ్రీకాకుళపోళ్లే
Praveen says:
టైటిల్ ప్రాంతీయ బ్యాక్ గ్రౌండ్ ప్రకారం ఉండాలంటే ఈ సినిమాకి “కట్ల సత్తిబాబు” అనో, వీర్రాజు RMP అనో టైటిల్ పెట్టాల్సింది. లేదా బ్యాక్ గ్రౌండ్ “బెండి అప్పారావు” పేరుకి ఒరిజినేషన్ అయిన పలాస ప్రాంతంగా చూపించాల్సింది.
వెంకట్ శిద్దారెడ్డి says:
సినిమా ఇంకా చూడలేదు కానీ ఇక్కడే సూపర్ కామెడీగా ఉంది….
ప్రవీణ్…ఇజీనగరం సికాకుళం నేటివిటీ కోసం పైడితల్లి RMP అని పెట్టుంటే బావుండేదని నా అభిప్రాయం..మీరన్నట్టు బెండి అప్పారావు కూడా సరైనది కాదని నా అభిప్రాయం
Praveen says:
“పైడితల్లి నాయుడు” పేరు విజయనగరం జిల్లాలో ఫేమస్. విజయనగరం పట్టణంలో ఉన్న పైడితల్లి అమ్మవారి ఆలయం పేరు వల్ల.
నేస్తం says:
లాజిక్కులు, ఐడియాలజీలు, సందేశాలు, ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడు… ఇలాంటి పడికట్టు పదాలన్నీ థియేటర్ బయట వదిలేసి సినిమాకి వెళ్ళండి. రెండున్నర గంటల నాన్-స్టాప్ కామెడీని ఎంజాయ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చు. 100% recommended.
G says:
A long time after EVV made a sensible movie, though not of that quality. Suresh Productions is also in need of a decent hit. This film has the potential. As per the action, Naresh is watchable. He is a double edged knife, as seen in Gamyam, and Nenu, and here on the comedy front.
***This was a comment written b4. Now edited to suit the content
veerni srinivasarao says:
cinema chusanu..bagundhi..familytho chudachu..
పులి రాజా says:
బెండి గేటు బెండు అప్పారావు?? వామ్మో ఇదెక్కడి పోలిక ? జనాల కళ్ళుతెరిపించావు నాయనా
siddu says:
ee cinema chusanu paravaledu
director says:
Hi All ,
Andharu directors Sreekakulam name ni cinema llo baga vadukuntunnaru , konni sarlu insult chestunnaru .. adi correct kadu … Nijamga antha insult cheivalsina need ledu , prathi area ki oka slang untundi , Infact Srikakulam people are honest, very hardworking people . i hurt the scene in happy days . Any way as all said Bendu appa rao came becuase of Krishna dances, body movements .