![]()
గత నెల రోజులుగా అమ్మా లేదు..నాన్నా లేదు ..ఏక్ నిరంజన్ అంటూ పాట వింటూ వింటూ అమ్మా..నాన్న ఆగమన్నా కూడా ఆ సినిమాకు వెళ్ళి తీరాలని ఫిక్స్ అయ్యా…వెళ్లా..ఏమైంది..మళ్లీ బుజ్జిగాడు దర్శనమిచ్చాడు. అదేంటి అప్పుడు చూసాంగా అంటే ఈసారి నేను బౌంటీ హంటర్ ని అన్నాడు. అలా వచ్చావా…కానీయ్ .. అయినా పూరీ సినిమాల్లో ఒకే క్యారెక్టర్ రిపీట్ అవుతూండటం కామనే కదా అని కూర్చున్నా.
కాస్స్పటికి కథ,కథనాలను ప్రక్కన పెట్టి కేవలం డైలాగులను,పాటలను నమ్ముకుని ఏక్ నిరంజన్ అంటూ వదిలాడని అర్దమైంది. దాంతో ఫస్టాఫ్ ఫరవాలేదనిపించినా సెకెండాఫ్ కష్టమనిపించింది. అందులోనూ కంగనా రౌనత్ ఇక్కడ మన నేటివిటికీ బాగా దూరం అనిపిస్తూ..రొమాన్స్ ని ఎంజాయ్ చేయలేని స్దితికి తెచ్చింది. ఇక పూరీ రెగ్యులర్ ప్లస్ పాయింట్ అయిన కామెడీ పండకపోవటం మరో మైనస్ అయి నిలిచింది.
ఛోటు(ప్రభాస్)చిన్నతనంలోనే ముస్టి మాఫియా వల్ల తల్లి తండ్రులకు దూరం అవుతాడు. అయితే ధైర్యం గల ఛోటూ తనని ఎత్తుకొచ్చినవాడిని పోలీసులకు పట్టిచ్చి పోలీసుల మన్ననలు పొందుతాడు. దాంతో అప్పటినుంచీ ..తనని బౌంటీ హంటర్ గా చెప్పుకుంటూంటూ క్రిమినల్స్ ని పోలీసులకు పట్టిస్తూ..డబ్బు సంపాదించుకుంటూంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ క్రిమినల్ చెల్లి సమీరా(కంగనా)పరిచయమై..ప్రేమగా మారుతుంది. ఆమె ఓ గిటార్ టీచర్. ఈలోగా కథను వేడెక్కించటానికి లోకల్ దాదా జానీభాయ్(సోనూ సూద్)ఓ మినిస్టర్ ని చంపటానికి కాంట్రాక్ట్ ఒప్పుకుని పూర్తి చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ ఫినిష్ చేసింది మరెవరో కాదు జానీ బాయ్ మనిషి.. ఛోటూ సొంత అన్న. అది తెలియని ఛోటూ అతన్ని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర నుండి పని ఒప్పుకుంటాడు.అప్పుడేం జరిగింది.అతను తన సొంత తల్లి తండ్రులను కలుసుకున్నాడా..జానీ భాయ్ ని ఎలా అంతమొందించాడు అన్నది తెరపై చూడాల్సిందే.
పూరీ సినిమాలు కంటెన్యూగా చూస్తున్న వారికి ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా అనిపించదు..అలాగే పూరీ పంచ్ డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోనూసూద్,బ్రహ్మాజి మద్య జరిగే సంభాషణలుకు క్లాప్స్ పడ్డాయి. ఇక కథలో హీరో బౌంటీ హంటర్ గా పరిచయం చేస్తారు. మనకు ఇన్ఫార్మర్ల వ్యవస్ధ ఉంది కానీ మరీ బౌంటీ హంటర్ లు లేకపోవటం తో నేచురాలటికీ దూరంగా అనిపించి ఐడెండిటి దొరకదు. అలాగే సత్యప్రకాష్ ని క్రూడ్ పోలీస్ ఆపీసర్ గా చూపటం కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే కావటం..ఆ తర్వాత ఆ ట్రాకే వదిలేయటం జరిగింది. అంతేగాక హీరోయిన్ అన్నయ్య పాత్రను క్రిమినల్ గా చూపి ఆ తర్వాత సెకెండాప్ లో అతను మంచివాడన్నట్లు చూపటం ట్విస్ట్ గా ఓకే గానీ జస్టిఫై అనిపించుకోదు.పోనీ ట్విస్ట్ గా భావించినా అది హీరో కి కాకపోవటంతో పెద్దగా పండలేదు. అన్నటికన్నా ముఖ్యంగా హీరో ప్యాసివ్ గా ఉంటాడు. జై చిరంజీవాలో మాదిరి బ్యాంకాక్ పారిపోయిన క్రిమినల్ ని అక్కడికి వెళ్లి పట్టుకుని వచ్చేస్తాడు. ఈ క్రమంలో ఎక్కడా అతనికి సమస్యలు ఎదురుకావు.ఎత్తుకు పై ఎత్తులు అసలు ఉండవు. దాంతో ఆ ఎపిసోడ్ పూర్తి స్ధాయి బోర్ వచ్చేస్తుంది. ఇక కామిడీ కోసం పెట్టిన అలీ,బ్రహ్మానందం ట్రాక్ ఎక్కడా చిన్నపాటి నవ్వు తెప్పించదు.ఉన్నంతలో పోసాని కృష్ణ మురళి కన్నింగ్ రాజకీయనాయకుడు గా ఉన్న కాసేపు ఎంగేజ్ చేస్తాడు.ఇక మీ అమ్మా నాన్న ఎవరో నాకు తెలుసు అంటూ హీరోని బ్లాక్ మెయిల్ చేసే దేశ్ పాండే పాత్ర కొదమసింహం చిత్రంలో మోహన్ బాబు సుడిగాలి పాత్రను గుర్తు చేస్తూ..ఇంకా ఇలాంటి పాత్రలు పెడుతున్నారా అని నవ్వు తెప్పింస్తుంది.
మిగతా విభాగాల్లో మణిశర్మ ఈ సినిమాకు పెద్ద ప్లస్. అమ్మా లేరు..నాన్నా లేరు అనే టైటిల్ సాంగ్ జనాల్ని ధియోటర్ కి లాక్కు
వచ్చిందంటే అతిశయోక్తి కాదు.ఇక కెమెరా శ్యామ్ కె.నాయుడు కి వంక పెట్టాల్సిన పనిలేదు.ఫస్టాఫ్ ఆ మాత్ర అయినా బాగుంది అనిపించి అంటే
షార్ప్ ఎడిటింగే కారణం.దర్శకత్వపరంగా పూరీ ఎప్పటిలాగే ఫైట్స్ లో, పంచ్ డైలాగుల్లో తనదైన ముద్ర చూపించే ప్రయత్నం చేసారు.అయితే కథను
బలవంతంగా బ్యాంకాక్ పంపిచటం మాత్రం కొంచెం విసుగ్గానే ఉంటుంది.ఇక నటీనటుల్లో ఉన్నంతలో ప్రభాస్ బాగా చేసాడు. అలానే విలన్ పాత్ర వేసిన సోనూసూద్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఏదైమైనా పూరీ మరో సారి పూర్తిగా నిరాశపరిచిన చిత్రం ఇది. ఆయన కొద్ది కాలం పూర్తి స్దాయి స్క్రిప్టుపై కష్టపడి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఇక ప్రబాస్ అభిమానులుకు ఆ ఫైట్స్,డైలాగ్ డెలివిరీ నచ్చి ఆదరించాలేమో గానీ లేకపోతే కష్టమే. టైటిల్,టైటిల్ సాంగ్ చూసి ధియోటర్లోకి దూరితే కష్టమేననిపిస్తుంది.
సంస్థ: ఆదిత్యరామ్ మూవీస్
నటీనటులు: ప్రభాస్, కంగనా రనౌత్, తనికెళ్ళ భరణి, సంగీత, మకరంద్ దేశ్‌పాండే, సోనూసూద్, ముకుల్‌దేవ్, బ్రహ్మానందం, అలీ తదితరులు.
సంగీతం :మణి శర్మ
ఎడిటింగ్ :ఎమ్.ఆర్.వర్మ
ఆర్ట్ :చిన్నా
కెమెరా: శ్యామ్.కె.నాయుడు
యాక్షన్: స్టన్ శివ,పీటర్ హెయిన్స్
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: ఆదిత్యరామ్
రిలీజ్ తేది: అక్టోబర్ 29,2009
నేస్తం says:
…. అంటే, ‘అమ్మా లేదు నాన్నా లేడు’ అని పాడిన ఏక్ నిరంజన్ కి ఈ బ్యాచీ అంతా ఉందా? కొంపదీసి సెంటిమెంటలెక్కించరుగా ??
అబ్రకదబ్ర says:
ఒకటికి రెండు సార్లు పంచ్ డైలాగులన్నారు. ‘నువ్వెంత శుంఠవో నీకే తెలీదు’, ‘ఎక్కడికెళ్లావన్నది కాదు తమ్ముడూ, ఎప్పుడెళ్లావన్నది ముఖ్యం’, ‘ఎవడు గీకితే దురద తీరిద్దో వాడే గోపి’ తరహా ఆణిముత్యాలు కాబోలు
నేస్తం says:
ఇంకో బోనస్ కూడా ఉందండోయ్! హీరోయిన్ హీరోని ప్రేమగా (!) “నా కొడకా” అని పిలుస్తుందంట. ఎంత నాటు ప్రేమయో…
jatardamal says:
సెంటిమెంటల్ కాదండి ఏకంగా మెంటలే .
బుద్ధి లేదు సిగ్గులేదు
కథ లేదు కాకర్కయలేదు
ఏక నిరంజనుడు
పూరి లేదు దోస లేదు
మెదడే కాలే మెంటల్ కేసు
ఏక నిరంజనుడు
Vasu says:
” స్టొరీ లేదు స్క్రీన్ ప్లే లేదు
సినిమాని గట్టికించే కామెడీ లేదు
ఏక్ నిరంజన్
హిట్ అపుడూ లేదు ఇపుడూ లేదు
ఇంకా పూరి ఫాం లో లేడు
ఏక్ నిరంజన్ ”
అన్నమాట..
అది సరే ఇంతకీ ఈ సారి నంది వస్తుందా లేదా మాటలకి?
Krishh says:
Lol
Nice one !!
Indian Minerva says:
నాకో డౌటు మాష్టారు… ఈ సినిమాలో హీరోయిన్ తాగుబోతుకాదు(గ్యాంగ్‌స్టర్లో లాగ), డ్రగ్స్ తీసుకుంటుందా (ఫ్యాషన్ లో లాగా)అంటే అదీలేదు… మరి కంగనా రనౌతే హీరోయింగా ఎంచుకోవాలని మనవాళ్ళకెందుకనిపించిందీ? అసలామాటకొస్తే ఇందులో హీరోయినుగా ఏ రవళినో, మీనానో, పెడితేమాత్రం ఏం తేడావుంటుంది? ఈ పిల్ల గ్యాంగ్‌స్టర్లో తప్ప నాకింకెక్కడా నచ్చలేదు అదికూడా ఆ హస్కీవాయిస్ వల్ల నచ్చింది. నన్ను గనుక ఈ సినిమాని తీయమంటే ఆ వెనకాలున్న ఏదోఒక డాన్సరుని పట్టుకొని సినిమాలాగించేస్తాను.
మనవాళ్ళు “బ్రమ్హానందం కామెడీ మంచిగా జేస్తడు” అన్నమాటని “బ్రమ్హానందం ఏంజేసినా మంచి కామెడీగ వుంటది” అని అర్ధం చేసుకున్నట్లున్నారు. బ్రమ్హానందం-అలీ సీన్లు చాలా చక్కగా మన సహనాన్ని పరీక్షిస్తాయి. అసలూ… సినిమా తీసేటప్పుడు లేదా ఎడిటింగ్ చేసేటప్పుడు తెలీదా ఇవిలేకుంటేనే సినిమా బాగుంటుందని?
సినిమాలో “యోగి” ఛాయలుచూసి పారిపోదామనుకున్నానుగానీ పోకిరి తరహా డవిలాగులు పవన్ కల్యాణ్‌లా చెప్పడంచూసి ఆగిపోయాననుకుంటా. లేకపోతె ఈ బౌంటీ హంటరేమిటి? ఎప్పుడుబడితే అప్పుడు ఎవడుబడితే వాడు థాయ్‌లాండ్ వెళ్ళిపోవడమెమిటీ (అది కూడా పాస్‌పోర్ట్ లేకుండానట)?
కొన్ని ప్రభాస్ గారి డైలాగులు బాగున్నాయి కానీ విలన్ గారి అన్ని డైలాగులూ బాగున్నాయి.
బ్లాగాగ్ని says:
>> పూరీ రెగ్యులర్ ప్లస్ పాయింట్ అయిన కామెడీ పండకపోవటం
నాకుమాత్రం పూరి తీసిన ఏసిన్మాలోనూ ఈ హాస్యమనే పదార్థం ఉన్నట్లనిపించలేదు, అపహాస్యం తప్ప. ఇడియట్, అమ్మ నాన్న …, పోకిరి లాంటివన్నీ మన సహనానికి పరీక్షపెట్టే చెత్త హాస్య సన్నివేశాలే.
Kiran says:
కంగనా “రౌనత్” ఆ!!!… అది రాణావత్ అండీ… ,..తెలుగు పత్రికల్లో రనౌత్ అని వ్రాస్తున్నారు… rao రావు ఎలా అయ్యిందో ఇదీ అలానే. దిక్కుమాలిన రొమన్‌లిపి మహిమ..
లలిత says:
క్రిమినల్ చెల్లి హీరోకుందేమో , అని పొబడ్డాను సుమండి. ఇక పూరీ టీం మొత్తాన్ని తీసుకొని విదేసాలకి వెళ్ళకపోతే మనం ఆశ్చర్యపోవాలి . మొత్తానికి ముష్టి మాఫియా సినిమా అంటారు.
నేస్తం says:
క్రిమినల్ యొక్క చెల్లి.
కిన్, కున్, యొక్క, లోన్, లోపల .. షష్టీ విభక్తి.
(అబ్బో..నాకెన్ని తెలుస్తున్నాయో ఈ సినిమా వలన). వలన, కంటే, పట్టి.. పంచమి విభక్తి. (ఇంకోటి తెలిసిందోచ్).
మిత్రుడు says:
ముష్టి సినిమా ఏక్ నిరంజన్ లో మాత్రం అది కుష్టీ విభక్తి కదండీ
నేస్తం యొక్క Friend says:
నేస్తం.. సినిమా లొ కంటె నీ డైలాగ్ కి చఛె నవ్వు వచింది..హి హి హీ…..
G says:
కొంపదీసీ సినిమా ముష్టియా (పోకిరిలో ఆ సన్నివేశాలు తీసేటప్పుడుఈ కథ తట్టిందేమొ మరి) అప్పుడు ఐడియా వచ్చిందేమో?
మిత్రుడు says:
హ హ హ.. ఖచితంగా ముస్టియా నే అది
శ్రీకాంత్ says:
తెలుగు సినిమా పరిశ్రమలోని over hyped directors లో పూరి జగన్నాథ్ వొకడు.ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,ఇడియట్ తప్ప మిగతా సినిమాలన్ని అతని అదృష్టం బావుండి హిట్టైన సినిమాలే.
ఇడియట్ లో రవితేజ చేత హీరోయిన్ని ‘ఒసేయ్ ఒసేయ్’ అని పిలిపించి,కథానాయికని అలా పిలవటం కూడా ఒక ఫ్యాషన్ అని తెలియచేశాడు.ఏక్ నిరంజన్లో హీరోయిన్ హీరోని ‘నా కొడకా’ అంటుందట.ఇదొక కొత్త రకం సరసం కాబోలు అనుకుని కుర్రకారు దాన్ని ఫాలో అవుతారు.ఎలాగూ అతని సినిమాల్లో హీరోలందరూ పనీపాటా లేకుండా పోకిరిగా తిరిగే బ్యాచే కాబట్టి యువత తమని తాము సులువుగా ఐడెంటిఫై చేసుకుంటారు.ఇటువంటి డైలాగులతో తెలుగుభాషని పరిపుష్టం చేస్తున్న పూరీ కి ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డు ప్రకటించి ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్య నిర్వహణ సరిగ్గానే చేసింది.
anon says:
ముష్టియా. భలే ఉంది.
సుజాత says:
బ్లాగాగ్ని గారూ నిజం చెప్పారండీ! పోకిరిలో బిచ్చగాళ్ళు బ్రహ్మానందం వెంటపడే సీన్లో నా చుట్టుపక్కల వాళ్ళు విరగబడి నవ్వుతుంటే తెల్లమొహమేస్కుని కూచుంది నేనొక్కదాన్నే అనుకుంటా!
పూరీ గురించి ఇంటర్నెట్ ప్రపంచంలో పాఠకులకు ఇంత ఘనమైన అభిప్రాయాలున్నాయని తెలిస్తే గురువు గారేమైపోతాడో?
నేస్తం says:
ఆయన ఉత్తమ సంభాషణల మీద నంది అవార్డుల వ్యాసంలో మనమిత్రులు కామెంట్లు రాసినందుకు రెచ్చిపోయి తిట్టారు మనల్ని. చూడలేదా మీరు?
http://navatarangam.com/2009/10/congrats-to-nandi-winners-2008/
Suman says:
ee madhya choosina chetta sinimallo idi okati…
sankar says:
అమ్మా లేదు..నాన్నా లేదు.. చూడటానికి జనమూ లేరు ..ఏక్ నిరంజన్
రవి says:
ఈ సినిమాలో ఒక డవిలాగుంది.
“నేను కొడితే మామూలుగా ఉండదు. గొర్తొచ్చినప్పుడల్లా, తల్చుకుని, తల్చుకుని మరీ ఏడుస్తావు”.
నిజమే. ఆ దెబ్బ పేరు కంగనా. ఆ దరిద్రాన్ని ఏరి కోరి ఇక్కడికి తెచ్చి దింపాడు పూరీ. ఈ సినిమాలో హాస్యం ఉందనే వాణ్ణి కొరతెయ్యాలి.
venu says:
kangana maree antha worst em kaadhandi..
siddu says:
kangana paravaledu andi. ee cinema lo tanaku puri anta importance ivvaledu anukunanu
vebnkat Balusupati says:
ఈ సినిమా నిజంగానే ఓ .ఏమి లేని ఏక్ నిరంజన్…
కథ ..స్రీస్కిస్ర్కీన్ ప్లే అంతా ఏక్ నిరంజన్…..
ఏప్పుడూ అన్నగారు…
suresh says:
పోకిరి తర్వాత ఏదొ కిరికిరి అయ్యినట్టుంది. పూరి సినిమాల్లొ మొనాటని ఎక్కువయ్యి కథ పలుచన అవుతూవుంది.
K మహేశ్ కుమార్ says:
ఇంతచెప్పినా ఈ సినిమా నేను నిన్నే చూశానండీ బాబూ! మొదలైన అరగంటలో లేచొద్దామనిపించినా, పెట్టిన వందకు ఖర్చురాద్ధామని కూర్చున్నా. ఇంటర్వెల్ లో వచ్చేద్దామనుకుని మరో పదినిమిషాలు పాప్ కార్న్ చూస్తూ భరిద్ధామనుకున్నా, సగం పాప్ కార్న్ బకెట్ మిగిలుండగానే లగెత్తుకు పారిపోయొచ్చా.
సతీష్ కుమార్ కొత్త says:
ఈ సినిమాలో పాటల్ని రేడియో ద్వారా విన్నాను అది కూడా కేవలం 3 పాటలు విన్నట్టున్నాను (గుండెల్లో గిటారు, నర్తనతార, ఏక్ నిరంజన్)…. ఇవాళే తెలిసింది ఇందులో భాస్కర భట్ల గారు వ్రాసిన ఓ పాట గురించి… (మహమ్మారి మహమ్మారి)….పాట పర్లేదు కదా అనుకునేలోగా ఒక చోట చరణంలో….
“హాలివుడ్ బాలీవుడ్ టాలివుడ్ గాలించేసా
నీలాంటి మొనగాడు నో నో నో నో నో
పికాసొ నీకేసి ఆనాడే చూశాడంటే
మోనాలీస పెయింటింగు మానేసుంటాడే”
ఒక్క నిమిషం కళ్ళు తెరుచుకున్నాయి నాకు…. వామ్మో భాస్కరభట్ల గారేనా ఈ విధంగా కళ్ళు తెరిపిచిందీ అని మళ్ళీ మళ్ళీ విన్నా…
మోనాలీస ని పికాసో గీశాడా??? ఎప్పుడూ??? పాపం ఆ లైనుని పాటలో ఎమైనా వెటకారంగా రాయాలి అని రాశారా అంటే.. మిగతా పాటంతా మామూలుగానే ఉందాయే.
పాపం లియనార్డో డావించి, ఆయన గీసిన మోనాలీస ని పికాసో గారికి ధారాదత్తం చేసేశారు భస్కర భట్ల గారు…..
నాకర్ధంకాక అడుగుతాను ఆయనేదో పొరపాటు రాసారే అనుకోండి.. మిగతా వాళ్ళేమయ్యారు? సంగీత దర్శకుడో, గాయకులో ఐనా చూసుకోవాలా? ఇలాంటి అవకతవకలని సరిచేసుకునే ప్రయత్నం చేయటానికి వాళ్ళకి ఒక్కరు కూడా దొరకలేదా? తెలిసిన వాళ్ళకి సరే మిగతా వారికి ఇక పికాసో గీశాడు మోనాలీసా ని అని చెప్పుకుంటారేమో…. సినిమా అనేది నేటి కాలంలో ఓ ముఖ్యమైన మీడియా.. ఆ స్థానంలో ఉండి …. ఒక కవి… ఏదొ తను అనుకున్న తప్పుని ప్రజలకి రుద్దటం ఏంటో?
భాస్కరబట్ల says:
నేనూ ఇలాంటి మాటే అన్నా కాని
ఈ రోజుల్లో భావం ఎవరికీ కావాలండీ డబ్బు కావాలి కాని అని నోరుమూసేసారు
నేను డావన్సీ అనే రాసాను మణికి అది నచ్చలేదు
పాటలు రికార్డు అయ్యాక నేను కూడా షాక్ అయ్యా మీలాగే
సతీష్ కుమార్ కొత్త says:
EdEmainaa meeru raasina(presuming u r THE bhaskarabhatla) paaTa anE kadaa prachurincha baDindi?…ilaanTi sangatula valla cheDDa pEru meekE kadaa…mari deeni parishkaaram EmiTanTaaru?
Shiva Kishore Kandukuri says:
బాస్కరబట్ల గారూ…మీరు కూడ… ఓపించలేకపొయారా… లేక మీరుకూడా… డబ్బు…
శివ కిశొర్ కందుకూరి says:
ఏమైనా సినిమా ఫ్లొఫ్….
rayraj says:
సంగీత జ్ఞానులుగానీ, మణిశర్మో లేక అతని టీంతోగానీ పరిచయమున్నవాళ్ళో, హేమ చంద్ర గీతా మాధురీ ఫ్రెండ్సో …ఎవరో ఒకరు ఓ క్లారిటీ ఇవ్వండయ్యా బాబు! తెగ ఇదయ్యి పోతున్నాను.
ఇందులో “గుండెల్లో గిటార్ మోగించావే” పాట ఏ రాగం లోనిది. నా గెస్సు “శ్రీ” రాగం అని.కానీ ఈ పాటలోంచి “ఆకాశంలో ఆశల హరి విల్లూ” లోకి కూడా వెళ్ళిపోతున్నాను! మరి “ఆకాశంలో” ఏ రాగం!!! బాబ్బాబు…ఎవరన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి….పోనీ ఇలాంటి డిస్కషన్ బోర్డు తెలుగులో ఎక్కడుందో చెప్పండి…ప్లీజ్!!
అనంతపురంలో పాటని “రీతిగౌళ” అని కరెక్టుగా గుర్తుపట్టేశాను.ఇంగ్లీషు సెర్చిలో, తమిళులు స్వరాలతో సహా చర్చించేశారు ఎక్కడో! బైదవే, ఇంకోటి కూడా చూడండి. “అందాల రాక్షసివే” కూడా రీతిగౌళేనా!!?? ఇలాంటివన్నే తెలుగులో చర్చించుకునే అంతర్జాల క్షేత్రాలను చెప్పుడి.
zulu says:
నేను కూడా ఈ సినిమా చూసా. మలేసియా వెల్లాలనుకునే వారు నా దగ్గరకొస్తే నేను తీసుకెల్తా. వీసా, పాస్పోర్టు ఎమీ లేకుండా. నేను కూడా మార్గదర్సి లో చేరా, (పూరీ దగ్గర అని గమనించగలరు)