Menu

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

mbpగానం: ఉష
రచన: సురేంద్ర క్రిష్ణ
సంగీతం: కోటి

పల్లవి:
మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ…
కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ
ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను
కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును
మట్టిలో కలిసే దేహమే ఇది
లేని పోని ఆశలు రేపెనా విధీ
పూజతో శోకం దక్కిందా
గుండెలో గాయం మిగిలిందా

చరణం 1:

చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే
నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే
||చిన్న||
ఏడుపంటే కొత్తేమి కాదు
బాధ నాకు వింతేమి కాదు
ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరుగను
చెప్పుకుంటే తగ్గేది కాదు
పంచుకునే తోడంటు లేదు
అంతులేని దారిలోన ఎంత నడవను
ఇది నాలో దోషమా
పై దేవుడి శాపమా
విధి ఆడే జూదమా
మనసంటే మాయేనా

||మాటలే…||

చరణం 2:

నాకు బాధ కలిగినపుడు నువ్వు లాలనా
బొమ్మలాగ నువ్వు ఉంటే దిక్కు తోచునా
||నాకు||
చల్లనైన నీ గుండె పైనా
మాలలాగ నేనుండిపోయే
భాగ్యమింక జన్మలోన నాకులేదులే
జన్మ అంటు ఇంకోటి ఉంటే
పువ్వునై నీ చెంత చేరి నన్ను కడతేరనివ్వు పాద పూజలో
నా ప్రాణం నీవేరా….
నా ధ్యానం నీవేరా…
క్రిష్ణా.. క్రిష్ణా..క్రిష్ణా..క్రిష్ణా..

పాటలో లాలిత్యం, బాణీలో వైవిధ్యం, గానంలో ఆర్ధ్ర్రత ఈ పాటకి జీవాలు.ఈ పాటా చాలామంది వినేవుంటారు.కానీ విననివారు ఇది తప్పక విని చూడండి, గుండెలని ద్రవింప చేసే పాటల్లో ఇదీ ఒకటి. పద కవితలు నచ్చే వారికి ఇది బానే నచ్చుతుందని నా అభిప్రాయం. ఈ పాట వ్రాసిన సురేంద్ర క్రిష్ణగారు మనకు వేరే జోరైన పాటలద్వారా సుపరిచుతులే. ఆయన కలం నుండి జాలువారిన మరి కొన్ని మనకి బాగా తెలిసిన పాటలు.. “సెహరీ” (ఓయ్)(క్రిష్ణ చైతన్యతో కలిసి), “తకధిమితోం తకధిమితో” (ఆర్య), “ఎదోలా ఉందీవేళ” (తమ్ముడు) “హాయిరే హాయిరే హాయ్రే హాయ్” (హాయ్) మొదలైనవి.
ఉష నుండి ఇలాంటి పాట ఇంత భావుకంగా నే వినలేదు.

“మాటలే రాని వేళ పాట ఎలా పాడను” అని మొదటి వాక్యం వినగానే సాహితీ ప్రియులకు 1985లో సింధుభైరవి చిత్రంలోని “పాడలేను పల్లవైనా భాషరాని దానను”, అనే పాట గుర్తొస్తుంది.
దానికీ దీనికీ సంబధం ఏమిటీ అంటారా?
ఏమో తెలియదు నాకు మాత్రం అదే గుర్తొస్తుంది అని నేను తప్పించుకుంటాను.

ఈ పాట వింటుంటే సంగీతపరంగా మీకు “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి” (అంతులేని కథ)అనే పాటకి ఏమైనా సంబంధం వినిపిస్తుందా?

ఈ పాటను దృశ్య రూపంలో యూట్యూబులో ఉంచిన “nkallys” అనే చానల్ వారికి మంగిడీలు

–సతీష్ కుమార్ కొత్త

11 Comments
  1. nestam November 1, 2009 /
    • Sen November 1, 2009 /
  2. anon November 1, 2009 /
  3. Sen November 1, 2009 /
  4. G November 1, 2009 /
    • రామ November 2, 2009 /
    • అబ్రకదబ్ర November 3, 2009 /