Menu

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు. ఆయన గొంతు, ఆయన మాట్లాడే తమిళం నాకిష్టం. కథలో చెప్పే పరిష్కారం విషయంలో మహేష్ లాగే నాకు సైద్ధాంతికంగా విబేధం ఉన్నా సినిమాని ఆస్వాదించడానికి దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టచ్చనే అనిపించింది.

న్యాయ వ్యవస్థ అందులో భాగంగా రాజ్యం కాపాడవలసిన మానవహక్కులు లాంటి వాటిగుంచి గొడవచేసే వాళ్ళదరూ ఆ పని తమకు వేరే పనిలేకో, స్వార్ధంతోటో చేయరు. ఆ హక్కుల వెనుక, వ్యవస్థ వెనుక వున్న విలువలు కొట్టిపారయదగ్గవి కాదు. నిజానికి, బుష్ ముష్ తోలుబొమ్మలాట చూపడం వెనుక రచయిత  సూచనకూడా బాంబు పేల్చిన తీవ్రవాదికి ఈ హింసలో ఎంత పాత్రవుందో అంతకన్న ఎక్కువగా వాళ్ళని నడిపించిన తోలుబొమ్మలకి, ఆ తోలుబొమ్మలని ఆడిస్తున్న శక్తులది అన్నది. అయితే మొత్తం ధర్మగ్రహం మంతా తీవ్రవాదులమీదే కలగేల రూపుదిద్దుకోవడం ఒక అసంతృప్తికర  అశం.

చాలా సందర్భాలలో, నా వ్యక్తిగత అభిప్రాయం, కమల్ హాసన్ చాలా పెద్ద కాన్వాస్ తీసుకుంటారు, మధ్యలో ఎక్కడో, ఆయనలోని నటుడు ప్రయోక్తని మింగేస్తాడు, దానితో పాత్రమీద శ్రద్ధ ఆ కాన్వాస్ ని నింపడానికి అవసరమైన వివరాల మీద శ్రద్ధకన్న ఎక్కువైపోతుంది. ఈ సినిమా దానికి మినహాయింపు కాదు.

అలాగా మనం అలవాటుపడిపోయినా, అస్వాదించే కమల్ టచ్ లు కూడా చాలా వున్నాయి. ఉదాహరణకి తన మోటివేషన్ గురించి కమిషనర్ కి వివరించే సమయంలో ప్రేక్షకులకి కంట తడిపెట్టించే రీతిలో ఆయన సంభాషణ చెప్పిన తీరు, చివర్లో కళ్ళ నీళ్ళు కారుతుంటే చేతిలో వున్న తుపాకితో కన్నీళ్ళు తుడుచుకున్న వైనం. తమిళంలో కమిషనర్ పాత్ర మోహన్ లాల్ చాలా సమర్ధవంతగా నిర్వహించారు. ఆ పాత్ర చిత్రణకి దర్శకుడు కొన్ని లేయర్స్ చేర్చివుంటే బాగుండేదేమో. కానీ సినిమా ఆసంతం కథనం చాలా సరళంగా, ఆసక్తికరంగా సాగినట్టే అనిపించింది. సంగీతంలో కూడా కొరత కనపడలేదు, చివర్లో పేర్లు వస్తుండగా భగవద్గీత వినపడ్డం కూడా బహుశా కమల్ టచ్.

డిజిటల్ గా షూట్ చేసి రిలీజ్ కోసం కన్వర్ట్ చేసినా ఎక్కడా బ్లోఔట్ అయిన హైలైట్స్ లాంటివి లేకుండా ప్రింట్ బాగుంది. పెద్ద తారలతో పెట్టుబడి పెట్టగలగి తీసే సినిమానే రెడ్ తో షూట్ చేయడం, కథ చెప్పడంకోసం సినిమా తీయలన్న తపనతో వున్న కొత్త ప్రయోక్తలకి చాలా ఉత్సాహం కలిగిస్తుంది. ఈ ఏడాదే కమల హాసన్ స్ర్కీన్ రైటింగ్ వర్కషాప్ నిర్వహించడం, రెడ్ తో ఈ సినిమా నిర్మించడం చూస్తుంటే రాజ్ కమల్ నుంచి కొన్ని మంచి సినిమాలు చూడగలిగే అదృష్టం మనకి పట్టబోయేట్టే అనిపిస్తోంది.

రమణ

9 Comments
 1. నేస్తం October 2, 2009 /
   • పులి రాజా October 2, 2009 /
 2. rayraj October 12, 2009 /
   • mohan October 23, 2009 /
  • అబ్రకదబ్ర October 12, 2009 /
 3. Shiva Kishore Kandukuri November 13, 2009 /