ఇది ఒక లాంగ్ పెండింగ్ పోస్ట్. చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది.కొంచెం సెల్ఫ్ డబ్బాతో పాటు శరత్ అనే ఒక ఔత్సాహిక దర్శకుణ్ణి పరిచయం చేయడం ఈ పోస్ట్ ఉద్దేశం.
2003 లో అనుకుంటాను. సినిమా తియ్యాలనే కలలు నిజం చేసుకోడానికి నేనూ నా స్నేహితుడు వర్మ శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే పరిచయం అయ్యాడు శరత్. అప్పుడే కెనడాలో షెరిడన్ యానిమేషన్ స్కూల్ నుంచి బయటపడి “థింకర్” అనే లఘు చిత్రం రూపొందించి ఉన్నాడు శరత్. అతనితో మొదటి పరిచయంలోనే మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ రోజుల్లోనే హిందీ సినిమా రూపొందించాలని ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా ద్వారా మేమూ మా కలల ప్రపంచంలోకి అడుగుపెట్టేద్దామని కలలు కనేసాం.ఆ రోజుల్లో మేము రాత్రుళ్ళు ప్రపంచమంతా నిద్ర పోయాక ప్రపంచాన్ని మా హాల్లోకి తెచ్చేవాళ్ళం. ప్రపంచ సినిమా కొద్దిగా పరిచయమున్నా పూర్తిగా పీకల్లోతుగా మునిగిపోయింది ఆ రోజుల్లోనే.
కాలం గడిచిపోయింది. ఆ సినిమా అయితే నిర్మాణానికి నోచుకోలేదు కానీ మేమంతా కలిసి మా టివి లో విహారి అనే ట్రావెలాగ్ రూపకల్పనలో భాగస్వాములయ్యాము. ఈ ట్రావెలాగ్ కి శరత్ దర్శకుడు. నేను ఎడిటర్. వింద సినిమాటోగ్రాఫర్. వర్మ స్క్రిప్ట్ రైటర్. నితిని నిర్మాత. అలా అప్పుడు కలిసిన వారిలో ఒకరయిన పి.జి.వింద ఇప్పుడు నాలుగైదు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి ఈ మధ్యనే లోటస్ పాండ్ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాని నితిని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారి తో పని చేస్తున్న వర్మ ఈ మధ్యనే తన సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇప్పుడిప్పుడే సినిమా కష్టాలకు అలవాటుపడుతూఉన్నాను. శరత్ ముంబైలో కొన్ని మ్యూజిక్ వీడియోలు, డాక్యుమెంటరీలు మరియు లఘు చిత్రాలు రూపొందించారు. ముంబై నుంచి తిరిగి వచ్చిన శరత్ ఇప్పుడు తెలుగులో ఒక పూర్తి నిడివి సినిమా రూపొందించే పని లో ఉన్నారు. శరత్ గురించి మరిన్ని విశేషాల కోసం ఈ క్రింది లింక్స్ చూడండి.
శరత్ గురించి మాటల్లో చెప్పడం కంటే అతను రూపొందించిన థింకర్ సినిమా తో పరిచయం చేయడం మేలని నా అభిప్రాయం. ఈ లఘు చిత్రం చూసి మీ అభిప్రాయాలు తెలియచేయండి. రాబోయే రోజుల్లో శరత్ రూపొందించిన మరి కొన్ని లఘు చిత్రాలను ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము.
Thinker from anveshi on Vimeo.
K మహేశ్ కుమార్ says:
విషయపరంగా చాలా హై కాన్సెప్ట్ ఫిల్మ్.
సాంకేతికంగా క్లే యానిమేషన్, లైవ్ యాక్షన్ కలగలిపి తీసిన విధానం నిజంగా ఒక ప్రయోగమే. నేపధ్యసంగీతంలో దర్శకుడుపడ్డ శ్రమ కనిపిస్తోంది. చాలా మంచి చిత్రాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.
Manjula says:
Wow! Amazing!
కన్నగాడు says:
చాలా బాగుంది. నేపథ్య సంగీతమే హీరో అని చెప్పవచ్చు.
వెంకట్ ఉప్పలూరి says:
నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇప్పుడిప్పుడే సినిమా కష్టాలకు అలవాటుపడుతూఉన్నాను.– ఇది ఎప్పట్నించి మాష్టారు…
శిద్దారెడ్డి వెంకట్ says:
ఈ మధ్యనే సర్. నెల రోజులు దాటింది.
rayraj says:
చాలా బాగుంది