Menu

Monthly Archive:: September 2009

థింకర్-శరత్ చంద్ర పార్శ

ఇది ఒక లాంగ్ పెండింగ్ పోస్ట్. చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది.కొంచెం సెల్ఫ్ డబ్బాతో పాటు శరత్ అనే ఒక ఔత్సాహిక దర్శకుణ్ణి పరిచయం చేయడం ఈ పోస్ట్ ఉద్దేశం. 2003 లో అనుకుంటాను. సినిమా తియ్యాలనే కలలు నిజం చేసుకోడానికి నేనూ నా స్నేహితుడు వర్మ శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే పరిచయం అయ్యాడు శరత్. అప్పుడే కెనడాలో షెరిడన్ యానిమేషన్ స్కూల్ నుంచి బయటపడి “థింకర్” అనే లఘు చిత్రం రూపొందించి ఉన్నాడు శరత్.

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు) ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది) ఉత్తమ స్క్రీన్

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ

శ్యాం బెనెగల్

ఏ ఏటికా ఏడు చిత్ర విచిత్రయిన మార్పులకు లోనవుతూ వ్యాపారమే లక్ష్యంగా అనేకానేక ఆటుపోట్లకు గురవుతున్న భారతీయ సినీ రంగంలో అందులో ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో ఏటికెదురీదుతూ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శ్యాంబెనెగల్ భారతీయ నవ్య సినిమాకి ఓ గొప్ప ప్రేరణ. నవ్య సినిమా ప్రపంచంలో ఆయనదో ప్రత్యేకమయిన ముద్ర. సమాజానికీ, సహజత్వానికీ సినిమా ఓ వ్యాఖ్యానంలా వుండాలని భావించే బెనెగల్ ’వాస్తవీకరించబడిన కళారూపమే సినిమా’ అని విశ్వసిస్తాడు. 74 ఏళ్ళ

జోష్ : శివ2009

జోష్. నాగార్జున కుమారుడు నాగచైతన్యని తెలుగుతెరకి పరిచయం చేస్తూ వాసూవర్మ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన చిత్రం. నాగచైతన్య ఎలా చేసాడు? హీరోగా నిలబడతాడా? దిల్ రాజు బ్యానర్ లో పరిచయమైన సుకుమార్, భాస్కర్ ల మాదిరిగా వాసూవర్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇస్తాడా? దిల్ రాజు ‘నాకు ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ సినిమా అవుతుంది’ అన్నాడు. అవుతుందా? నిన్నటి తరం హీరోయిన్ రాధ కూతురు కార్తీక కి ఇది మొదటి సినిమా. ఆమె