Menu

Monthly Archive:: September 2009

జెనెర్‌లు – మూసలు (ఒక పరిశీలన)

సినిమా పరిభాషలో జెనెర్ అనే పదం తరచుగా వినపడుతుంటుంది (కొంత మంది జెనెరె అని అంటారు). ప్రాధమికంగా ఇది ఏ “రకమైన” సినిమానో చెప్పటానికి వాడుతుంటారు. చాలా వరకు సినిమాల ప్రచారంలో రివ్యూలలో ఈ పదం వినపడుతుంటుంది. (సినిమా విడుదలకి ముందు మాత్రం ఇదొక డిఫరెంట్ సినిమా అనే వినపడుతుంది). “పూర్తి హాస్య రస చిత్రం”, “వళ్ళు గగుర్పొడిచే ఫైట్లతో, అనూహ్యమైన చేజింగ్ దృశ్యాలతో..”, “అన్నా చెళ్ళెళ్ళ అనురాగానికి అద్దం పట్టే సినిమా..” ఇలాగ నేరుగా జెనెర్

సినిమాలెలా తీస్తారు-రెండో భాగం

చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి: ప్రి-ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్-ప్రొడక్షన్ షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి. ప్రొడక్షన్

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమా – ఒక పరిచయం: సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఉపోద్ఘాతం సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ

ఫిల్మ్ తెలంగాణ 2009:ఆహ్వానం

నవతరంగం పాఠకులకు నమస్కారం. “ఫిల్మ్ తెలంగాణ” పేరుతో నిర్వహించిన ఫిల్మ్ మేకింగ్ పోటీలో భాగంగా ఔత్సాహిక సినిమా కళాకారులు రూపొందించిన లఘు చిత్రాల ప్రదర్శనతో పాటు, ఈ పోటీలో పాల్గొన్న సినిమాలనుంచి విజేతలను ఎన్నుకుని వారికి ఈ నెల 12 మరియు 13 తేదీలలో (శని,ఆది వారాలు) కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు: Film Festival & Prize Distribution for ‘Film Telangana 2009′