Menu

Monthly Archive:: September 2009

పదునున్నా గురిలేని ‘బాణం’

“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో

లఘుచిత్ర నిర్మాణం-కొన్ని సంగతులు

వేలయోజనాల దూరమని తెలిసినా… ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్నే సినిమాకి అన్వయిస్తే…అక్కడా ఓ సక్సెస్‌ ఫార్ములా కనబడుతుంది. సరదాగా మనింట్లో తిరుగాడే …అల్లరి పెట్‌ ప్రవర్తనను సిల్లీగా చిత్రీకరించినా….ఆ అలవాటే ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి పురికొల్పవచ్చు. అనూహ్యంగా అది అందలమెక్కనూవచ్చు. సరదాగా మొదలైన వ్యాపకమే ముదిరి పాకానపడి ఓ పెద్ద సినిమా అవకాశానికి ఊపిరులూదనూ వచ్చు. బిగ్‌స్క్రీన్‌ కలలను నిజం చేయనూ వచ్చు. ఆనక కమర్షియల్‌ పంథాలో ఎదగడానికి… అదే కారణమూ కావొచ్చు. అలా ముందుకెళ్లినవాళ్లు

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

తెలుగు సినిమా ఒక అందమైన తోట… అందులో ఒక పాటల చెట్టు… ఆ చెట్టులోని కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి! తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన! తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి. ఆకాశదేశాన… ఆషాఢమాసాన, నవమి నాటి వెన్నెలని చూపించి రగులుతున్న మొగలిపొదలో చిలక్కొట్టుడు చిన్నదాన్ని మంచమేసి దుప్పటేసి

‘సినిమా’టోగ్రాఫర్

మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా

సినిమాలెలా తీస్తారు-మూడో భాగం

ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (”Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు