Menu

Monthly Archive:: September 2009

సినీప్రస్థానానికి సహప్రయాణికులు కావాలి

రెండు సంవత్సరాల కష్టం తరువాత…. “వల్చర్ హైట్స్” అనే నిర్మాణ సంస్థను స్థాపించాను. స్క్రిప్ట్ – పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. నటీనటులు – చాలావరకూ ఎంపిక చేసుకోవడం జరిగిపోయింది. పాటలు: సంగీతం – సిద్ధం. ఇక రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళడమే తరువాయి. లొకేషన్లు – ఫైనలైజ్ అయిపోయాయి. డేట్లు నిర్ణయించి పర్మిషన్లు తీసుకుంటే సరి. అంటే,షెడ్యూలింగ్ తోసహా  మొత్తంగా ప్రి-ప్రొడక్షన్ అంతా అయిపోయింది. అయినా సినిమా మొదలెట్టలేకుండా ఉన్నాను. కారణం…విటమిన్-ఎమ్ డెఫిషియన్సీ…మనీ…మనీ. అప్పుడే నవతరంగంలో

ఈనాడు – సఫలం కాని రీమేక్

టెర్రరిజం భయంతో, ప్రభుత్వ అలసత్వం మీద నిరసనతో, ఈ పరిస్థితుల్లో  ఏంచెయ్యాలో తెలీని నైరాశ్యంలో జీవిస్తున్న సాధారణ జనంలోంచీ వచ్చిన ఒక ‘సామాన్యుడు’  వ్యవస్థ ఉలిక్కిపడే విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని instant justice అమలుజరిపే కథ ‘ఈనాడు’ చిత్రానిది. కథ కొత్తదికాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ విన్నూత్నమైన కథనం ఈ చిత్రానికి ఆయువుపట్టు. గత సంవత్సరం హిందీలో అనూహ్యమైన విజయం సాధించిన A Wednesday చిత్రానికి తెలుగు రూపం “ఈనాడు”. ఒక భాషలో

బాణం

అసలు సినిమాలు చూడడం , అందునా తెలుగువి చూడడం చాలా తగ్గించేసిన నేను , ఈవేళ ఒక స్నేహితుడి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఈ సినిమా చూడాల్సి వచ్చింది. నా స్నేహితుడు సినిమా అంటే పడిచచ్చిపోయేరకం. తానూ ఏదో కళాఖండం ఏనాటికయినా సృష్టిస్తానని మాతో ఆవేశపడిపోతుంటాడు. సరే… మిత్రుడయినా వాడు మంచి ఫిలింమేకర్‍ అవునో కాదో ఒక సినిమా తీసాక కానీ చెప్పలేము కాబట్టి , ప్రస్తుతానికి వాడికి ఆ అవకాశంరావాలని కోరుకుంటాం. ఈవేళ హఠాత్తుగా వాడినుంచి

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం. ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య

యానిమేషను సినిమాలు …

ఎందుకనో భారతంలో మామూలు సినిమాలను ఆదరించినట్టుగా యానిమేషను సినిమాలను ఆదరించరేమో అని నాకనిపిస్తుంది. (ఈ మధ్య ట్రెండు మారుతున్నట్టుంది). వాటి గురించి ఎంతో కొంత ఈ వ్యాసంలో చెబుదామని నా ప్రయత్నం. యానిమేషను సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఇజాలు ఉండవు, స్టార్ నటులు ఉండరు, ఇగోలు చెల్లవు. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆలోచించండి అసలు ఇవాళ మన సినిమాలలో ఇలాంటి అదృష్టం మనకుందా ? సర్లెండి అదో పెద్ద అంతులేని కథ. ఇంతకీ