సినీప్రస్థానానికి సహప్రయాణికులు కావాలి

vulture heights logo black bg

vulture heights logo black bgరెండు సంవత్సరాల కష్టం తరువాత…. “వల్చర్ హైట్స్” అనే నిర్మాణ సంస్థను స్థాపించాను.

స్క్రిప్ట్ - పూర్తి స్థాయిలో రెడీగా ఉంది.
నటీనటులు – చాలావరకూ ఎంపిక చేసుకోవడం జరిగిపోయింది.
పాటలు: సంగీతం – సిద్ధం. ఇక రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళడమే తరువాయి.
లొకేషన్లు - ఫైనలైజ్ అయిపోయాయి. డేట్లు నిర్ణయించి పర్మిషన్లు తీసుకుంటే సరి.

అంటే,షెడ్యూలింగ్ తోసహా  మొత్తంగా ప్రి-ప్రొడక్షన్ అంతా అయిపోయింది. అయినా సినిమా మొదలెట్టలేకుండా ఉన్నాను.
కారణం…విటమిన్-ఎమ్ డెఫిషియన్సీ…మనీ…మనీ.

అప్పుడే నవతరంగంలో కో-ఆపరేటివ్ ఫిల్మ్ గురించి విన్నాను. ఆలోచన అద్భుతంగా అనిపించింది.
నాలాంటి పెద్ద ఆశ,చిన్నజేబున్న ఫిల్మ్ మేకర్స్ కి ఆక్సిజన్ లాంటి ఆలోచన అనిపించింది.

సినిమా మీద ఉండే ప్రేమ సాధ్యాసాధ్యాలను చూడదు. కలల్ని కనమంటుంది.
ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాల్ని చెయ్యమంటుంది.
ఇన్నాళ్ళూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను.
కాకపోతే…కలసి కలలుకనే మరికొందరు మిత్రులకోసం చూస్తున్నాను. అంతే!

సినిమా తియ్యడానికి, కలల్ని నిజం చెయ్యడానికి, ఇష్టపడి కష్టంగానైనా సరే 20 లక్షలు కూడబెట్టాను.
నా దగ్గరున్న స్క్రిప్టుకి అయ్యే ఖర్చు 35 లక్షలు. అంటే, ఇంకో 15 లక్షలు కావాలి.

సహనిర్మాతలో, సినీఔత్సాహికులో,సినీప్రేమికులో పేరు ఏదనుకున్నా…నా కలను సాకారం చేస్తూ తమ కలల్ని సార్థకం చేసుకునేందుకు దార్లు వెతికే సినీమిత్రులు కావాలి.

ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ సినీప్రయాణంలో భాగస్వాములు కావాలనుకునేవాళ్ళు vultureheights@gmail.com కు మెయిల్ చెయ్యండి.
కలిసి కలలు కందాం! కలిసి సినిమా కలను నిజం చేసుకుందాం!!

అజయ్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

6 Comments to “సినీప్రస్థానానికి సహప్రయాణికులు కావాలి”

  • నవతరంగం ఒక సినిమా నిర్మాణానికి వేదికగా మారబోతోందన్నమాట.బాగుంది…బాగుంది.

    నావంతుగా డబ్బులు పెట్టలేకపోయినా, సహాయదర్శకత్వం లాంటి సేవల్నైతే అందించడానికి నేను రెడీ…ఇప్పుడే అజయ్ గారికి ఒక మెయిల్ కొడుతున్నా.

  • ఆల్ ద బెస్ట్.
    may God full fill all your wishes.amen.

    Dilse..

    Gorey Saif Ali
    feelings – director

    • Congrats Ali! I am a regular visitor to NT and familiar with you through your articles here. Found out that you are directing a movie “feelings” with a single character through eenadu paper. I wish you all the best and I hope you come up with something really good.

  • Ajay,

    All the best!

    Magesh

  • Ajay,

    I wish you all the best!

  • Hi Ajay,

    I will invest 2 lac if you assure good returns.

    bab

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories