Menu

జోష్ : శివ2009

జోష్. నాగార్జున కుమారుడు నాగచైతన్యని తెలుగుతెరకి పరిచయం చేస్తూ వాసూవర్మ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన చిత్రం. నాగచైతన్య ఎలా చేసాడు? హీరోగా నిలబడతాడా? దిల్ రాజు బ్యానర్ లో పరిచయమైన సుకుమార్, భాస్కర్ ల మాదిరిగా వాసూవర్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇస్తాడా? దిల్ రాజు ‘నాకు ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ సినిమా అవుతుంది’ అన్నాడు. అవుతుందా? నిన్నటి తరం హీరోయిన్ రాధ కూతురు కార్తీక కి ఇది మొదటి సినిమా. ఆమె పరిస్థితి ఏంటి? -ఇంతలో టైటిల్ కార్డ్ పడింది.

కథ:
“శివ” సినిమా లో – వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో కాలేజ్ జాయినైన తర్వాత శివకి (నాగార్జునకి) ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కి, లోకల్ డాన్ భవానీ (మరియు వాడి పైన వుండే రాజకీయ నాయకుడు మాచిరాజు) కి ఉండే కనెక్షన్, ఈ కనెక్షన్ వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాలు, గొడవలు తెలుస్తాయి. అవి చూసి ఈ సిస్టం ని మార్చాలి అన్న ఉద్దేశ్యం తో కాలేజ్ వదిలేసి బయటకి వచ్చి, మాచిరాజు-భవాని ల ‘సిస్టం’ ని దెబ్బకొడతాడు. జోష్ లో సత్య (నాగ చైతన్య) వైజాగ్ నుంచి హైదరాబాద్ కి చిన్న ఉద్యోగం కోసం వచ్చి, ఇక్కడి స్టుడెంట్స్ కి లోకల్ “అన్నయ్య” జెడి కి ఉన్న కనెక్షన్, దానివల్ల ఏర్పడుతూన్న పర్యవసానాలు, గొడవలు చూసి, సిస్టం మార్చాలి అనుకుని (ఇంటర్వల్ సమయానికి) తర్వాత అదే కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ శివ గొడవలవైపు, భవాని లాంటి వాళ్ళ వైపు ఆకర్షితులవుతున్న స్టుడెంట్స్ ని వదిలేసి, భవానీ-మచిరాజులని టార్గెట్ చేస్తే, ఇక్కడ సత్య స్టూడెంట్స్ లో మార్పు వచ్చేలా చేసి జెడి కుయుక్తులు దెబ్బ కొడతాడు.

నాగచైతన్య:

నాగార్జున ముఖకవళికలని పుణికిపుచ్చుకున్నాడు, చూడటానికి బాగున్నాడు. తనకి వాడిన కాస్ట్యూంస్ బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే ఒక్క ఫ్లాష్ బ్యాక్ లో తప్పిస్తే మిగతా సినిమా అంతా ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఎమోషనల్ బాలెన్స్ తో ఉండే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. చాలా వరకు అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ లో ఫుల్ జోష్ తో ఉండే క్యారెక్టర్. రెండింటి మధ్య వైవిధ్యం చూపించగలిగేంత నటన మొదటి సినిమాలో చేయడం మెచ్చుకోదగ్గ అంశం. డాన్సులు, ఫైట్లు బానే చేశాడు.

కార్తీక :
డిగ్రీ చదవాల్సిన వయసులోనే కాన్వెంట్ టీచరవడం వల్ల, కాలేజ్ లైఫ్ ని మిస్సైపోతున్నానని తెగ బాధపడే ఒక చిలిపి పాత్ర. తన పరిధిలో బాగానే చేసినప్పటికీ పాత్ర చాలా పరిమితం. చూడటానికి పర్వాలేదు. ఏదో పాటలో డ్యాన్సులో కొంచెం ఈజ్ చూపించినప్పుడనిపించింది- ‘అన్నట్టు రాధ కూతురే కదూ’ అని. సవితారెడ్డి డబ్బింగ్ కొంచెం మొహం మొత్తింది.

ఇతర నటీనటులు:
20 ఏళ్ళ క్రితం కాలేజ్ లో శివలాంటి వాళ్ళ చేతిలో తన్నులు తిన్న జెడి(బ్రతికి ఉంటే) ఇప్పుడెలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? కొంచెం ఒళ్ళు చేసి, తను చదివిన కాలేజ్ కే కమిటీ మెంబరై, రాజకీయాల్లో కి వెళ్ళడానికి సీరియస్ గా ట్రై చేస్తూ, తన ఎదుగుదల కోసం విద్యార్థి రాజకీయాల్ని, విద్యార్థి గ్రూపుల మధ్య గొడవల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడంటారా? కరక్టే. అలా ఉంటే ఎలా ఉంటాడో అదేపాత్రని చేసిన జెడి ని చూస్తే తెలుస్తుంది. బాగా చేసాడు. ఇక ప్రకాష్ రాజ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ కాలేజ్ ఏజ్ లో పాడైపోతుంటే బాధపడే కాలేజ్ ప్రిన్సిపాల్ రోల్ లో బాగా చేసాడు.

వాసూవర్మ:
నాగార్జున కుమారుడి మొదటి సినిమా కాబట్టి కేవలం నాగచైతన్య ఎబిలిటీస్ నీ బాగా షోకేస్ చేస్ చేసి బాగా లాంచ్ చేస్తే చాలు అనుకోదానికి వాసువర్మకి ఇదేమీ పదో సినిమానో ఇరవయ్యో సినిమానో కాదు. మొదటి సినిమా. నాగచైతన్యతో పాటు తనని తాను కూడ షోకేస్ చేసుకోవాల్సిన ఒక సంక్లిష్ట బాధ్యత వాసూవర్మ మీద ఉంది. అందులోనూ బహుశా “శివ” లైన్స్ లో కథ తయారు చేసుకోవాల్సి రావడం తన బాధ్యతని మరింత క్లిష్టతరం చేసింది. ఇన్ని పరిమితుల మధ్యలోనూ తను డెలివర్ చేసిన ఫైనల్ ప్రాడక్ట్ చూసాక వాసూవర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

దిల్ రాజు:
వరస హిట్లతో గోల్డెన్ హ్యాండ్ గా పేరొందిన దిల్ రాజు మరొకసారి మెసేజ్ ఓరియెంటేషన్ ఉన్న కథ కి మొగ్గు చూపాడు. నిర్మాణవిలువలు బాగున్నాయి.

శివ వర్సెస్ జోష్:
రాం గోపాల్ వర్మ ఆ మధ్య శివ2006 అనే పేరు తో ఒక రీమేక్ చేసి పోలీస్ సినిమా ఒకటి తీసాడు కానీ నిజంగా శివని మాడ్రనైజ్ చేయాలనుకుంటే అది ఎలా చేయొచ్చో వాసూవర్మ చూపించాడు. నేనిక్కడ కథ గురించే చెప్తున్నాను. సాంకేతికవిలువల గురించి కాదు. రౌడీ స్టూడెంట్స్ ని కాలేజ్ మొత్తం పరుగెత్తించి పరుగెత్తించి కొట్టడం, రౌడీలు రోడ్డు మీద (తను హీరోయిన్ తో) ఉన్నపుడు అటాక్ చేస్తే ఫైట్ చేయకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక ఆటో (శివలో అయితే సిటీ బస్) క్యాచ్ చేసి తప్పించుకోవడం లాంటి సీన్లు శివని గుర్తు కి తెచ్చి నోస్టాల్జిక్ ఫీలింగ్ తెప్పిస్తాయి. సమస్య శివ ఎదుర్కున్నదే. కానీ ఆ సమస్య మీద దృష్టి సారించడానికి శివకి ఉన్న కారణం వేరు, సత్యకు ఉన్నకారణం వేరు. సమస్యని శివ పరిష్కరించిన విధానం వేరు, సత్య పరిష్కరించిన విధానం వేరు.

అయితే ఇక్కడ ఇంకొక “సమస్య” ఏంటంటే-ఆ సమస్య ఇప్పుడంతగా లేదు…ఐ మీన్-  శివ సినిమా టైం లో ఉన్నంతగా ఇప్పుడు లేవు విద్యార్థులు-రాజకీయ నాయకుల మధ్య కనెక్షన్లు, విద్యార్థుల గ్రూపు ఫైటింగులు వగైరా. ఇప్పుడు విద్యార్థులు ఒక ప్రక్క ఎంసెట్, ఐసెట్, ఆ సెట్, ఈ సెట్,
ఇంకోప్రక్క ఫ్రెండ్ షిప్, లవ్, వేలంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే ల తో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల్లో “సమకాలీనత” పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ ఈ సినిమా బేసిక్ మెసేజే అది కావడం వల్ల ప్రస్తావించవలసి వచ్చింది.

ఫైనల్ గా :

ఒకరకంగా చెప్పదలుచుకున్న మెసేజ్ లోని సీరియస్ నెస్ వల్లా, హీరో క్యారెక్టరైజేషన్ లో డెప్త్ వల్లా – “జోష్” అనే టైటిల్ చూసి ఒకతరహా ఎక్స్పెక్టేషన్స్ తో (ఫుల్ కామెడీ లేదా ఫుల్ రొమాంటిక్ స్టోరీ లేదా ఫుల్ యూత్ ఫుల్ మూవీ అనుకుని ) వచ్చిన వాళ్ళకి, మొదటి సినిమాలోనే నాగచైతన్య విపరీతమైన డ్యాన్సులూ ఫైట్లూ చేయాలనో లేదంటే డైరెక్టుగా నాగార్జున తరహా “మన్మధుడు” అయిపోవాలనో ఆశించినవాళ్ళకీ, కొంత నిరుత్సాహమనిపిస్తుంది కానీ నటనా పరంగా నాగచైతన్య, దర్శకుడిగా వాసూవర్మ, సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడం లో దిల్ రాజు- అందరూ ఫస్ట్ క్లాస్ మార్కులే సంపాదించుకున్నారు.

 

–మోహన్ రాజ్

60 Comments
 1. G September 6, 2009 / Reply
 2. goutham September 6, 2009 / Reply
 3. ceenu September 6, 2009 / Reply
 4. చదువరి September 6, 2009 / Reply
 5. G September 6, 2009 / Reply
 6. ఎవడో ఒకడు September 7, 2009 / Reply
 7. sanju September 7, 2009 / Reply
  • విజయ్ నామోజు September 7, 2009 / Reply
 8. sasank September 7, 2009 / Reply
 9. sankar September 7, 2009 / Reply
  • vinay chakravarthi September 7, 2009 / Reply
   • sankar September 7, 2009 /
   • Norman Bates September 8, 2009 /
   • vinay chakravarthi September 8, 2009 /
   • sasank September 8, 2009 /
   • vinay chakravarthi September 9, 2009 /
   • Bluto September 9, 2009 /
   • vinay chakravarthi September 9, 2009 /
   • sasank September 10, 2009 /
 10. మోహన్ రాజ్ September 7, 2009 / Reply
  • vinay chakravarthi September 8, 2009 / Reply
   • sasank September 8, 2009 /
   • Norman Bates September 8, 2009 /
   • vinay chakravarthi September 9, 2009 /
 11. sivaji September 7, 2009 / Reply
 12. Arvind September 7, 2009 / Reply
 13. sankar September 8, 2009 / Reply
  • vinay chakravarthi September 8, 2009 / Reply
   • sasank September 8, 2009 /
 14. harsha September 8, 2009 / Reply
  • రామ September 8, 2009 / Reply
   • sasank September 9, 2009 /
   • రామ September 9, 2009 /
   • sasank September 10, 2009 /
  • sasank September 9, 2009 / Reply
   • sasank September 10, 2009 /
  • vinay chakravarthi September 9, 2009 / Reply
 15. Nagarjuna(nijamgaa) September 8, 2009 / Reply
  • anu September 8, 2009 / Reply
 16. అబ్రకదబ్ర September 8, 2009 / Reply
  • ధోండి September 15, 2009 / Reply
 17. Dhanaraj Manmadha September 8, 2009 / Reply
 18. aakasaramanna September 9, 2009 / Reply
 19. Nagarjuna September 9, 2009 / Reply
 20. Bluto September 9, 2009 / Reply
 21. sekhar September 15, 2009 / Reply
  • మోహన్ రాజ్ September 17, 2009 / Reply
   • మోహన్ రాజ్ September 17, 2009 /
   • sekhar September 17, 2009 /
 22. ధోండి September 15, 2009 / Reply
 23. shanthi September 18, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *