Menu

‘సినిమా’టోగ్రాఫర్

మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా ఈ మధ్యనే Wang-Kar-Wai తీసిన ఇంగ్లీషు సినిమా My Blueberry Nights అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.
Chirstopher Doyle – Wang-Kar-Wai లాగే
Sven Nykvist – Ingmar Bergman,
Wally Pfister – Christopher Nolan,
Robert Burks – Alfred Hitchcock,
Gordon Willis – Woody Allen,
Vittorio Storaro – Bernardo Bertolucci లాంటి ఎంతో మంది దర్శకుడు-సినిమాటోగ్రాఫర్ జంటలు ప్రపంచ సినిమా చరిత్రలో మేలైన కలియకగా పేరుగాంచారు.

అయితే దర్శకుడు ఎప్పుడూ ఒకే సినిమాటొగ్రాఫర్ తో పని చేయడం వలన మాత్రమే మంచి సినిమాలు సాధ్యమవుతాయి అనేది నిజం కానప్పటికీ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ మధ్య ఏర్పడే అవగాహన వలన మంచి ఫలితాలు పొందగలిగే ఆస్కారం వుంది.సినిమాకు దర్శకుడు రచయిత (auteur) అయితే సినిమాటోగ్రాఫర్ సహ-రచయిత. కానీ ఈ అవగాహన ఏర్పడడం ఒక్కోసారి ఎంతో కష్టంతో కూడుకున్న పని.

కొన్నేళ్ళ క్రితం, ప్రసిధ్ధిగాంచిన దేశనాయకుని జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ సినిమా రూపొందించాడానికి ఒక ప్రఖ్యాత దర్శకునితోపాటు ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎన్నుకోబడ్డారు. ఆ సినిమా తీసే ప్రయత్నంలో వారికి ఆ దేశనాయకుని డైరీనుండి ఒక పుటను చిత్రీకరించాల్సిన అవసరం పడిందట. మ్యూజియం లో వున్న ఆ డైరీని వెతికి పట్టుకుని ఆ పేజీని చిత్రీకరించే పనిలో పడ్డారు వారిద్దరూ. ఆ సినిమాటోగ్రాఫర్ బాగా ప్రసిధ్ధి గాంచిన వాడవడంతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరంలేదని పక్కన నిలబడి చూస్తుండిపోయాడా దర్శకుడు. మామూలు రోజుల్లోకంటే ఎక్కువ సమయం తీసుకుని వేర్వేరు లైట్లు వుపయోగించి బాగా కష్టపడి డైరీలోని ఆ పుటను చిత్రీకరించాడు ఆ సినిమాటోగ్రాఫర్.

సమయం వృధా అవుతుందని ఒక వైపు కాస్తా కోపంగానే వున్న సాటి కళాకారునిపై వున్న గౌరవంతో మౌనంగా ఎదురుచూసి చివరిగా సినిమాటోగ్రాఫర్ చిత్రీకరించిన చిత్రాన్ని చూసి పేజీలోని ఒక్క అక్షరం కూడా సరిగ్గా కనిపించకపోవడంతో “పేజీలోని text ఏమైది?”మండిపడ్డాడా దర్శకుడు. అందుకు సమాధానంగా “నేను text గురించి పట్టించుకోలేదు, కాగితం texture గురించి మాత్రమే ఆలోచించాను” అని తాపీగా సమాధానమిచ్చాడా సినిమాటోగ్రాఫర్.

అందుకే,
Text: The filmmaker’s choice.
Texture: The cinematographer’s passion.

పైన చెప్పిన సంఘటన్లోని దర్శకుడు Syam Benegal, సినిమాటోగ్రాఫర్ Subrata Mitra. వీరు నెహ్రూ జీవితం ఆధారంగా సినిమా తీస్తుప్పడు జరిగిందా సంఘటన.

పైన చెప్పినట్టుగానే సినిమాలో సినిమాటోగ్రాఫర్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నా స్నేహితుడు వర్మ ఒక కథ చెప్పేవాడు.
దేవుడు అన్ని రకాల మానవుల్ని పుట్టించినట్టుగానే ఒక సినిమాటోగ్రాఫర్నీ సృష్టించాడట. పుట్టి పుట్టగానే కెమెరా చేత పట్టుకుని దేవున్ని ఫోటో తీయడం మొదలుపెట్టాడట. కాసేపు కెమెరాతో తంటాలు పడి “మీ వెనక లైటు (దేవుని తల చుట్టూ వుండే కిరణావళీ) కొంచెం ఆపేస్తారా?” అన్నాడట. దేవుడు అందుకు సమాధానం గా “అదెలా కుదుర్తుంది? నేను దేవుణ్ణి. ఈ ప్రపంచానికే దర్శకుణ్ణీ” అన్నారట. “అయితే నాకేంటి? నేను సినిమాటోగ్రాఫర్ని. నాకు తెలిసనంతవరకూ బ్యాక్‌లైటు కీలైటు కంటే ఎక్కువ వుండకూడదు” అని మొండి పట్టుపట్టాడట ఆ సినిమాటోగ్రాఫర్.

దీన్నిబట్టి సినిమా అనే ప్రక్రియలో దర్శకునితోబాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రపంచ సినీ చరిత్రలో గత అత్యంత గొప్ప సినిమాగా పేరుపొందిన Citizen Kane సినిమా టైటిల్స్ లో దర్శకుడూ Orson Wells తన పేరునీ మరియు సినిమాటోగ్రాఫర్ పేరునీ ఒకే కార్డులో ప్రదర్శించడం ద్వారా దర్శకునితోపాటు సినిమాటోగ్రాఫర్కి సముచిత స్థానాన్ని కల్పించారు

16 Comments
 1. Sowmya May 15, 2008 /
 2. Uttara May 15, 2008 /
 3. వాసు.బొజ్జ May 15, 2008 /
  • shanthi September 16, 2009 /
 4. Uttara May 15, 2008 /
 5. శంకర్ May 22, 2008 /
 6. Uttara May 22, 2008 /
 7. Venkat Balusupati July 16, 2008 /
 8. G September 15, 2009 /
 9. అనిలు September 16, 2009 /
 10. Srinivas Komanapalli April 21, 2010 /
 11. Srinivas Komanapalli April 21, 2010 /
 12. srinivas July 11, 2010 /
 13. srinivas November 5, 2010 /