Menu

బాణం

Baanamఅసలు సినిమాలు చూడడం , అందునా తెలుగువి చూడడం చాలా తగ్గించేసిన నేను , ఈవేళ ఒక స్నేహితుడి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఈ సినిమా చూడాల్సి వచ్చింది.

నా స్నేహితుడు సినిమా అంటే పడిచచ్చిపోయేరకం. తానూ ఏదో కళాఖండం ఏనాటికయినా సృష్టిస్తానని మాతో ఆవేశపడిపోతుంటాడు. సరే… మిత్రుడయినా వాడు మంచి ఫిలింమేకర్‍ అవునో కాదో ఒక సినిమా తీసాక కానీ చెప్పలేము కాబట్టి , ప్రస్తుతానికి వాడికి ఆ అవకాశంరావాలని కోరుకుంటాం. ఈవేళ హఠాత్తుగా వాడినుంచి ఫోన్‍. “బాణం” అనే సినిమాను అర్జంటుగా చూడమని.. ఆదేశించాడు , అర్థించాడు , మరీమరీ చెప్పాడు. అంత అర్జెంటేమిరా అంటే చూసాక నీకే అర్థం అవుతుంది అన్నాడు. అంత సూపర్ సినిమానా అని అడిగితే మౌనమే సమాధానం. పోనీ , చెత్త సినిమానా అని అడిగా. ఎందుకంటే కొన్ని చెత్త సినిమాలు కూడా ఎంటర్‍టైన్‍మెంట్ ఇస్తాయి. ఒకసారి.. “ఒక టైపు కామెడీ” కోసం పల్నాటి బ్రహ్మనాయుడు అనే అట్టర్‍ఫ్లాపు సినిమాకు తీసుకెళ్ళాడు : తొడకొడితే రైలు వెనక్కుపోవడం, కుర్చీ మందుకు రావడం, కొడికీ మనిషికి ఫైటింగు , కోళ్ళగుంపును అరెస్ట్ చేసేందుకు బెటాలియన్ పోలీసులు… అన్నీ ఎంజాయ్ చేసాం. ” నేను చెప్పిన మాటతో నువ్వొక ఒపీనియన్ ఏర్పర్చుకుని చూడటం కాదు , ఒక బ్లాంక్ మైండ్‍తో సినిమా చూసి నాకు ఫోన్ చేయ్ అన్నాడు “. మావాడు తక్కువవాడు కాడు. ఇలాంటి మాటలే చెప్పి నాకు కొన్ని గొప్ప సినిమాలు చూపించాడు. కురుసోవా ” రెడ్ బెర్డ్‍” అందులో ఒకటి. సో.. నన్నూ మా స్నేహితుడి అభిరుచులనూ కొంత అర్థం చేసుకోవచ్చు మీరు . ఇక బాణం గురించి. ఆ సినిమా ప్రకారమే మూడు అధ్యాయాల్లో ఈ చిత్రం గురించి చెబుతా. ఇంతవరకూ చెప్పింది జస్ట్ ఉపోద్ఘాతమే..

మొదటి అధ్యాయం

” బాణం ” సినిమా , దాని కథా కమామీషూ ఏమిటంటే : సమాజాన్ని కుళ్ళునుంచి ప్రక్షాళణ చేసేందుకూ , న్యాయం సాగేందుకూ ఉన్నతాశయాలతో నక్సలిజం దారిపట్టిన ఒక వ్యక్తిగా శివాజీ షిండే , పదేళ్ళ ప్రాయంలోనే తండ్రి మార్గం అంతగా హర్షించని బాలుడిగా హీరో పరిచయం. ఎందుకో మరి ఇదంతా 1975లో జరుగుతుంది. పద్నాలుగేళ్ళ తర్వాత : అంటే 1989లో ఆ బాలుడే ఎదిగిన కథానాయకుడు : నారా రోహిత్. ఐపీయస్ ఆఫీసరయ్యేందుకు తపిస్తున్న ఒక యువకుడు. ప్రతి ఉద్యోగికీ రిటైర్మెంటు ఉంటుంది కాబట్టి ఉద్యమంనుంచి తానూ విరమించుకుంటున్నానని చెబుతూ , లొంగిపోయి జనజీవనస్రవంతిలోకి కలిసిపొయిన నక్సలైటుగా (మాజీ) మళ్ళీ కొడుకుకు దగ్గరవుతాడు శివాజీషిండే. తమ చిన్న కుటుంబంలోకి , దిక్కుతోచని స్థితిలో అనాధలా మిగిలిపోయిన ఒక అమ్మాయికి ఆశ్రయం ఇస్తాడు హీరో. (అసలు కథకు ఈ ప్రెమ ట్రాకు కేవలం ఒక సబ్‍ప్లాటే కాబట్టి వివరాలు అంత ముఖ్యమనిపించడం లేదు ) కథలో మరోవైపు ఒక విలన్. తండ్రిని చంపేసి , తన్ను పెంచిన బాబాయ్‍నె అడవులు పట్టించిన క్రూరుడు. లోకల్ ఎస్పీ కూడా అతడినేమీ చేయలేకపోతుంటాడు. మిగతా పోలీసులందరూ అతడిచ్చే మామూళ్ళకు అతడి గులాం అయిపోయి ఉంటారు మరి. తన దారిన తాను వెళుతున్న హీరో , హీరోయిన్‍ను కాపాడే ప్రయత్నంలో వచ్చిన చిన్న గొడవ మూలాన హీరోకూ విలన్‍కూ మొదట ఇన్‍డైరెక్టు విరోధం ఏర్పడుతుంది. (అంటే విలన్ ఐడియాలజీ హీరో ఆదర్శాలూ మధ్య గొడవ కాదు. విలన్ చుట్టు ఉండే ఆకురౌడీలను హీరో తన్నడంతో గొడవ షురూ ) అది ముదిరిముదిరి , ఇద్దరి మధ్య ప్రత్యక్ష్య పోరు. విలన్‍ హీరోను పదిమందితో చుట్టిముట్టి చితకబాది , చిన్నగాయాలతో బ్రతికిబట్టగట్టే స్థితిలో హీరోను వదిలేస్తాడు. ఇప్పటినుంచి , అసలు సమాజం ఏమిటి , సమాజంలో మంచివాళ్ళు ఎలా ఉండాలి , పోలీసుల డ్యూటీలు ఏమిటి , యాంటి సోషల్‍ ఏలిమెంట్స్ ను ఏరివేయాలంటే హీరో తండ్రి నమ్మే నక్సలిజం ( టెర్రరిజం/ లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే మరే “ఇజం” అయినా ” ) కరెక్టా లేక చట్ట ప్రకారం సమాజాన్ని బాగుచేయొచ్చా అనే వాదప్రతివాదాల పిదప హీరో విలన్‍తో యుద్ధం.

ఇదీ కథ.

నక్సలిజం , సాయుధ పోరాటం ఇత్యాది బ్యాక్‍డ్రాప్‍ తప్పించి చూస్తే ఎన్నాళ్ళనుంచో వస్తున్న పాత కథ ఇది. ఒక సినిమా ఫ్యాక్షనిజం బ్యాక్‍డ్రాప్ అయితే , ఇంకోటి మాఫియా, ఇంకోటి సీమాంతర ఉగ్రవాదం ..ఇది నక్సలిజం బ్యాక్‍డ్రాప్‍ అంతే తేడా.
నా ఉద్దేశ్యంలో అయితే… ఈ సినిమా ఏ మాత్రం బాగాలేదు.

దర్శకత్వం , స్క్రిప్టు పేలవం అనిపించాయి. సినిమా చూస్తున్నంతసేపూ విసుగు అనిపించింది. నా ముందు, వెనుక వరసల్లోని కొందరు ప్రేక్షకులు వెళ్ళిపోవడం , ఫోన్లు చూసుకోవడం జరిగింది. సరే.. నాకు సినిమాలు సమీక్షించడం అట్టే నచ్చదు. ఎందుకంటే నాకు నచ్చని సినిమా ఇంకొకరికి మాస్టర్‍పీసు కావొచ్చు. సో…ఎక్కువ చెప్పదలచట్లేదు. ఇంతకీ ఈ సినిమాలో ఏముందని నా స్నేహితుడు ఇంత ఇదిగా చూడమన్నాడా అనేది అర్థం కాక వాడికే ఫోన్‍ చేసాను. నేను మామూలుగా కొత్త తెలుగు సినిమాల గురించి తెలుసుకోవడానికి చూసే కొన్ని వెబ్‍సైట్లలో ఈ సినిమా గురించి వ్రాసిన సమీక్షలు చదవమని , ఆ తర్వాత ఫోన్ చేయమన్నాడు. ఇదేమి ట్విస్టురా అని ఆ పనిలో పడ్డాను. చదివాక…

ఈ రివ్యూలు…

http://idlebrain.com/movie/archive/mr-baanam.html

http://greatandhra.com (due to some server problem rview page is not opening now)

http://www.hindu.com/2009/09/18/stories/2009091857620200.htm

హృదయం దహించుకుపోయింది.

ఇదే నవతరంగంలో ఈ సినిమాకు వ్రాసిన ఒక సమీక్ష గురించి ఎవరో ఆవేదన చెందుతూ వ్రాసిన కామెంటు ఇప్పుడే చదివాను. నేను ఇక్కడ సుస్పష్టం చేయదలచినది :

రెండవ అధ్యాయం :

నా వ్యాసం ఈ బాణం అనే సినిమాకు సమీక్ష కాదు.

కానీ…. బాణం సినిమాను ఉదహరిస్తూ తెలుగు సినిమా ఎంత పతనస్థితిలో ఉందో , అలాంటి స్థితిని కప్పెడుతూ మన చంకల్లో మనమే గిలిగింతలు పెట్టుకు నవ్వినట్లు , మన చెత్త సినిమాలనే అత్యుత్తమ సినిమాలని భట్రాజుల్లా పొగుడుతున్న తెలుగు సినీ జర్నలిజం/మీడియాను వ్యతిరేకించడమే నా ఈ వ్యాసం ఉద్దేశ్యం.

పైన చెప్పినట్లు ఈ సినిమా కథాంశం ఒక పాత చింతకాయ పచ్చడి. అది తెరకెక్కించిన పద్ధతి ఫక్తు కమర్షియల్‍ తరహా. ఒక వ్యక్తి ఇరవైమందిని చావ చితకబాదడం , చంపాలని వచ్చిన ప్రతినాయకుడు కేవలం చిన్న చిన్న దెబ్బలతో బయటపడేట్లు హీరోను వదిలేయడం , ఆ హీరో మళ్ళీ లేచి , తాను చట్టప్రకారం అన్నీ చేస్తానని చెబుతూ చట్టబద్ధంకాని చర్యలతో ప్రతినాయకుడి సారా దుకాణాలనూ , ఆస్తులనూ తగలబెడుతూ , తన జట్టు మనుష్యులతో ఒక నల్లటి గదిలో ఫోజుగా నిల్చోవడం , ఆఖరుకు ప్రతినాయకుడిని….చట్టం తన చేతుల్లోకే తీసుకుని…. “చంపడం “….. అన్నీ…అన్నీ…. ఫక్తు కమర్షియల్‍ సినిమా చెత్త. ఇదొక ” పారలెల్‍ సినిమా” అనీ , ” రొటీన్ కమర్షియల్‍ సినిమాకు విభిన్నం ” అనీ కొన్ని మీడియా వర్గాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. అలా అయితే… ఈ సినిమాలోని సన్నివేశాలు ” లక్ష్మీనరసింహా ” సినిమాలో లేవా? (చట్టం పరిమితులు దాటి పోలీసులు విలన్‍ను అంతమొందిచడం…ఎన్ని సినిమాల్లో చెప్పని థీమ్ ? ఈనాటికీ…. ప్రేమించని ఆడదాని ముఖంపై యాసిడ్‍ పోసిన వికృత మగాళ్ళను ఎన్‍కౌంటర్‍ చేస్తేనే.. పోలీసులకు అలాంటి హక్కు లేదు అని ఘోషించే ఇదే మీడియా.. అలాంటి ఎన్నో పనులు చేసే పోలీసును హీరోయిజంగా చూపించడం కొత్తరకం సినిమా అనడం చూస్తే.. డబ్బులిచ్చే వారుంటే మాట ఎటయినా మారుతుందేమో అనిపిస్తోంది.

విలన్ తన తండ్రినే చంపడం . “వర్షం” సినిమాలో విలన్‍ చేసేదేమిటో ? అది కూడా తెలుగు సినిమాలో కొత్త ఒరవడా? “మగధీర” సినిమాలోకూడా విలన్‍ అదే చేస్తాడు. మగధీరలాంటి చందమామ కథ ఉన్న సినిమాలో రంధ్రాన్వేషణలు చేసి , హీరోకి గత జన్మలో పాతిన కత్తి ఎలా దొరికింది అనే జనాలు , ఈ “బాణం”లో … హీరోకు.. గుడి ముంగిట చెరొక చేతికి కమ్యూనిజం ప్రతీకలయిన సుత్తి కొడవలి దొరకడం ఏమిగా కనిపిస్తోంది ? ” ఛత్రపతి” సినిమాలో ప్రభాస్‍కు ఒక ఫైటులో చెంబు దొరకడం కూడా తెలుగు సినిమాలో ఒక ” సింబాలిక్‍” ఘట్టం అనాలేమో! సింబాలిజం అంటే అర్థం తెలియని వాజమ్మలు “బాణం” సినిమాలో ఎంతో సింబాలిజం ఉందని చెప్పడం చూస్తుంటె మన సమీక్షకులు ఇంత నాసిరకం వారా అనిపిస్తోంది. 1989అనే కాలాన్ని చెప్పడానికి “గీతాంజలి” సినిమాను బ్యాక్‍గ్రౌండ్‍లో చూపడం సింబాలిజం ఎలా అవుతుందీ ?అది కథాకాలాన్ని సురింపజేయడానికి స్క్రిప్టులోనే ఉండే కనీస జాగ్రత్త/బాధ్యత.

ఈ సినిమాలో ” రియలిజం” ఉందట. ప్రతినాయకుడూ , అతని చుట్టూ ఉండే ఆకురౌడీలూ వేసుకునే బట్టలను చూస్తే అర్థమవుతోంది సమరసింహా రెడ్డి లాంటి సినిమాకు ఇందులోని రియలిజంకూ అట్టే తేడా లేదని. “విక్రమార్కుడు” సినిమాలో రాజీవ్‍ కనకాలకు విల్న్‍తో ఎదురయే రిఅయలిజం ఈ సినిమాలోని రియలిజం పోటీ పడుతుంటాయి. ఇలాంటి సమీక్షకుల ప్రకారం ” బైసికిల్ థీఫ్” లాంటి సినిమాల్లో ఉండే రియలిజం ఇంక ఏమిటో ? పోనీ మన దేశంలోనే వచ్చిన సత్య , కంపెనీ సినిమాలూ , అదే వర్మ క్యాంపులోంచి ఇంతకంటె బాగా తీసిన పోలీసు సినిమా ” షూల్ ” (మనోజ్‍ బాజ్‍పేయి నతించగా ఇదే షిండె విలన్) ఏమిటో.. కనీసం పక్క రాష్ట్రంలోని అంజాతే సినిమాలోని రిఅయలిజం కూడా లేదు ఇందులో. (ఆఫ్‍కోర్స్ , తమిళతంబిలు ఏమీ తక్కువ కాదు , కాస్తం రియలిస్టు సినిమాలో మాసు సాంగులూ అర్థం లేని హింసాత్మక హీరోయిజమూ వాళ్ళూ సిగ్గు లేకుండా/పడకుండా ఇరికించేస్తారు ) “బాణం” లో గ్రూపు డ్యాన్సర్ల సాంగులు లేకపోవడమూ , వైరింగు ఫైట్లు , ఛాలెంజీ సంభాషణలూ లేకపోవడమే రియలిజం అయితే ప్రతిభాషలోనూ ఎన్నో “కమర్షియల్” సినిమాలే అలా వస్తుంటాయి. మన తెలుగులోనే దాదాపు పదిహేనేళ్ళ క్రితం ” అంకురం” వంటి అద్భుతమయిన చిత్రాలు వచ్చాయి. హీరోగా స్ఫురధౄపి, హీరోయిజంలో భాగంగా అమ్మాయిని ఎత్తుకొచ్చి కాపాడడం , కనీసం యాభైమందిని చావదన్నడం, మధ్యలో హీరోయిన్‍తో (అదీ తామిద్దరూ ప్రేమను వెలిబుచ్చుకోని అమ్మాయితో) మంచి లొకేశన్లలో ఒక స్లో రొమాంటిక్‍ సాంగు వేసుకోవడం , ప్రతినాయకుడి వ్యాపారాలను కాల్చేస్తూ ఫోజులిచ్చి నిల్చోవడమే రిఅయలిజం సినిమా అయితే… ఇంకేం… ప్రతి తెలుగు సినిమా ఇటలియన్ / ఫ్రెంచి నియో రియలిజంను దాటి ఎదిగినట్లే . అప్పుడెప్పుడో ఒకసారి కొంతమంది సినీ ఔత్సాహికుల పార్టీలోంచి ఒక జోకు : ” అసలు మన గవర్నమెంటుకు బుద్ధిలేదు , ఈ ఆది , నరసింహనాయుడు, ఇంద్ర…. ఇలాంటివాటిని పంపించొచ్చుగా ఆస్కారు ఎంట్రీలుగా, ఇదేదో కొత్తరకం ఫిల్మ్‍మేకింగు అనుకుని బుర్రలుగోక్కుంటూ అవార్డులు ఇచ్చేసి మన కంట్రీ సినిమాను సీరియస్ స్టడీ చేస్తారు ” అని.

ఇక దర్శకత్వంలో కొత్తదనం : రాంగోపాల్ వర్మ చరిత్రలో నిల్పిన సైకిల్‍ చైను త్రెంపుడునే మళ్ళీ వాడుకోవడమే కాక ఆ సందర్భంలో కెమెరా కదలికలనూ , ఇంకో రెండు ఫైటు సన్నివేశాల్లో హఠాత్తుగా వర్షం రావడంలాంటి ఎఫెక్ట్సూ…. ఎంత భావదారిద్రమో! షాట్లు కాపీ కొట్టడమేనా… కొత్తరకం దర్శకత్వం?  ఇక అన్ని సైట్లూ, పత్రికలూ చెబుతున్న మాట ఈ సినిమా ఒక “హానెస్ట్” సినిమా అని. నిజాయితీ అనే మాటకు అర్థం తెలుసా?  ఐటమ్‍ సాంగులూ , కామెడీ ట్రాకులూ పెట్టకపోవడమే నిజాయితే అయితే ఒక రొమాంటిక్‍ ట్రాక్‍ పెట్టడం ఏమిటో ?  కనీసం ఇరవైమంది రాడ్లతో చితకబాదినప్పుడె హీరో చనిపోయినా కనీసం పక్షవాతం వొచ్చినా ఈ సినిమాలో “కాస్తం” నిజయితీ ఉందనొచ్చు. ఇక భగత్‍సింగ్‍పేరునూ , చే గువెరా పేరునూ వాడుకోవడం.. కేవలం సినిమాకు ఒక సూడో-ఇంటలెక్చువల్‍ ఇమేజీ ఇచ్చే ప్రయత్నమే కాక మరోటి కాదు. అసలు భగత్ సింగుకూ చే గువెరాకూ తేడా ఏమిటి ? ఇద్దరూ కూడా సమాజంలోని చట్టాలను వ్యతిరేకించి ఉగ్రవాద/సాయుధ విప్లవ మార్గాలు ఎంచుకున్న మహనీయులు. చట్టప్రకారం పోలీసు అయ్యి నక్సలైట్లను తప్పుపట్టే హీరో వారిద్దని చిత్రపటాలు తగిలించుకోవడం ఏమిటి ? హీరో సమాజం గురించి మాట్లాడుతున్నంతసేపూ అతడి ప్రతిబింబాన్ని చేగువెరా ఫోటొఫ్రేముపై చూపడం ఏమిటి ? చే గువెరాలా ఎక్స్‍ప్లాయిటేషన్‍కు గురయిన విప్లవవాది మరొకరు లేరెమో! పెట్టుబడిదారీ వ్యవస్థను ఉద్ఘాటించే ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ జీవితాన్ని త్యాగం చేసిన ఆ వ్యక్తి ఫోటోనూ బ్రాండెడ్‍ టీ షర్టుల మీద ప్రింట్‍ చేసి అవే కేపిటలిస్టిక్‍ దేశాలు సొమ్ము చేసుకుంటుంటే , అదేదో ఫ్యాషన్ అనుకుని అతనెవరో తెలిసీతెలీక మిడిమిడిజ్ణానంతో ..ఇంట్లో పోరాడి పబ్బుకెళ్ళడమే విప్లవం అనుకునే టీనేజర్లుఅ ఉదహరించినట్లు ఈ సినిమాలో.. చేను “వాడుకున్నారు” . మన భారతదేశపు పోరాట యోధుడు భగత్‍ సింగ్‍ పేరునూ , ఫోటొనూ ఇలాంటి పెట్టుబడిదారీ సినిమాలో వాడుకోవడం… చాలా అవమానకరం.

ఈ దేశంలో ఒక కులంవారిని ఒక మాటఅంటే ఊరుకోరు. ఒక మతంను ప్రస్తావించాలంటే భయం, కానీ , ఉద్యమాలకోసమూ దేశాలకోసమూ ప్రాణాలర్పించిన వారి పేర్లను , బొమ్మలను అడ్డుపెట్టుకుని అబద్ధపు దేశభక్తిని “అమ్ముకోవాలనే” సినిమాకు కొమ్ముకాసే మీడియాను ఈవాళ ఈ “బాణం” సినిమా విషయంలో చూస్తున్నాను.

ఇక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వ్రాసారు : ఈ సినిమా దాదాపు నిజాయితీగా తీసారుట..క్లయిమాక్స్‍ తప్పించి. ఇదేమి మాట ? వెనకటికెవడో అన్నాట్ట : మా అబ్బాయి చిన్నప్పటినుంచీ ఉత్తముడు అండీ , పరీక్షల్లో కాపీలు కూడా కొట్టడు , జస్ట్ ఒకసారి ఒక అమ్మాయిని మానభంగం చేసాడంతే అని. అలా ఉందీ మన మీడియాలో దృష్టిలో నిజాయితీకు నిర్వచనం . ఇదొక “ఎక్స్‍పెరిమెంటల్ ” చిత్రమట. ఏ రకంగానో మరి! కనీసం కథాంశంలో విభిన్నత లేని చిత్రాన్ని ప్రయోగాత్మక చిత్రం అనడం తెలుగు సినీ జర్నలిజం అవగాహనాలోపమో మరి యెల్లో జర్నలిజమో.

ఇక ఈ సినిమాలో ” ఇన్‍ కన్సిస్టెన్సీ” ప్రతి ఐదు నిముషాలకూ వస్తుంది. నక్సలిజం కోసం జీవితాన్ని అర్పిస్తానంటాడు ఒక సన్నివేశంలో శివాజీషిండే. తర్వాత అదీ ఒక “ఉద్యోగం”లాంటిదే కాబట్టే “రిటైర్మేంట్” తీసుకున్నాను అంటాడు లొంగిపోయేప్పుడు. “ఇకనైనా జనంలో ఉంటారా” అని పోలీసు అడిగితే ” నేనెప్పుడూ జనంలోనే ఉన్నా” నంటాడు. అయిదారు డయిలాగుల తర్వాత ” ఇక నుంచి జనంలో ఉండి పోరాటం చేస్తాను ” అంటాడు. హాస్యాస్పదం ఏంటంటే.. ఆ తర్వాత అతను చేస్తూ కనిపించిన పనులు : గడ్డం గీసుకోవడం , తన బట్టలు తాను ఉతుక్కోవడం, ఇంటిపట్టున ఉండి కొడుకుతో వాదులాడడం.. అంతే. మళ్ళీ కొడుకు హాస్పిటల్ బెడ్ మీద “అసలు మీ నక్సలైట్లు ఎం ఉద్ధరించారు ” అన్నట్లు ప్రశ్నిస్తే.. హడావుడిగా విలన్‍ను అంతమొందిచడానికి సరి అయిన ప్లాను కూడా లేకుండా వెళ్తాడు. ఈ సినిమా ద్వారా బహుశా నక్సలైట్లు పరమ దద్దమ్మలా అనిపించేంతగా ఉంది ఆ పాత్ర స్వభావం.

ఇప్పటికే చాలా చెప్పాను… ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలోని డొల్లతనం , దాన్ని అనవసరంగా “ఎవరి లాభాల కోసమో” పొగుడుతున్న మీడియా డొల్లతనం చాలానే ఉంది కానీ , ఈ సాంపుల్స్‍ చాలు అనుకుంటాను.

మూడవ అధ్యాయం :

ఆ సమీక్షలు చదివాక ఇలాంటి భావావేశం అనుభవించాక అర్థమయింది నా స్నేహితుడి వేదన. వాడిదొక తత్వం .

” గొప్పవాళ్ళ గొప్పతనాన్ని గుర్తించకపోయినా లోకం పెద్ద నష్టపోదు కానీ , అల్పులూ , మీడియోకర్సూ ప్రశంశలందుకున్ననాడు నిజమయిన టలెంట్ అదే చచ్చిపోతుంది” అనే రకంగా మాట్లాడేవాడు. ఆఫీసుల్లో దద్దమ్మ బాసులనూ , నిశానీగాళ్ళు రాజకీయనాయకులూ , డబ్బున్న వంశ వారసులే కళాకారులూ అవుతున్న సందర్భాలు చూసినప్పుడల్లా ఆ మాటే గుర్తుకువచ్చేది. ఇన్నాళ్ళకు కళాకారులేకాక , సమీక్షకులూ , తద్వారా సినిమా అనే కళ కూడా చచ్చిపోబోతోందేమొ అనిపిస్తోంది. అందుకు ఒక సూచన… మళ్ళీ ఫోన్ చేసాక మా ఫ్రెండు మాట ” ఇక తెలుగులో సినిమా కోసం ప్రయత్నించడం వేస్టురా.. అక్కడొచ్చిన టీవీ ఉద్యోగమే బెటర్ ” అన్నాడు.

ఇంతకీ నా స్నేహితుడు మంచి ఫిలిం మేకరో కాదో నాకు తెలియదు , కానీ నిజాయితీ అయిన వాడు.. “బాణం” లాంటి సూడో సినిమాలు ఇలాంటి తగని సన్మానాలే అందుకుంటే ఇక తెలుగు సినిమాలో నిజాయితీ అంటే ఏమేమి చూడాల్సి వస్తుందో అనిపిస్తోంది.

బహుశా.. సినిమాల్లో నిజాయితీ అనే మాటకు అర్థం మార్చడనికే వదిలిన “బాణం” కాబోలు ఇది.

—శు

84 Comments
 1. Dhanaraj Manmadha September 21, 2009 /
 2. moviefan September 21, 2009 /
 3. కన్నగాడు September 21, 2009 /
 4. కొత్తపాళీ September 21, 2009 /
  • a2zdreams September 26, 2009 /
 5. విజయవర్ధన్ September 21, 2009 /
 6. rajesh September 21, 2009 /
 7. అబ్రకదబ్ర September 21, 2009 /
  • Santhosh September 21, 2009 /
  • chandrasen September 22, 2009 /
  • కొత్తపాళీ September 22, 2009 /
   • Dhanaraj Manmadha September 22, 2009 /
   • a2zdreams September 26, 2009 /
   • su September 26, 2009 /
   • a2zdreams September 26, 2009 /
   • a2zdreams September 26, 2009 /
   • a2zdreams September 27, 2009 /
 8. chandrasen September 22, 2009 /
 9. గీతాచార్య September 22, 2009 /
 10. thikamaka September 22, 2009 /
 11. srilu September 22, 2009 /
  • Srikanth Dhondi September 22, 2009 /
   • rayraj September 22, 2009 /
 12. Nagesh September 22, 2009 /
 13. పులి రాజా September 22, 2009 /
 14. madhava September 22, 2009 /
 15. Jonathan Vesapogu September 22, 2009 /
 16. su September 22, 2009 /
  • శంకర్ September 22, 2009 /
  • రాజేష్ September 22, 2009 /
  • mohanrazz September 22, 2009 /
   • su September 22, 2009 /
   • విజయవర్ధన్ September 22, 2009 /
  • విజయవర్ధన్ September 22, 2009 /
 17. చదువరి September 23, 2009 /
   • చదువరి September 24, 2009 /
   • చదువరి September 24, 2009 /
 18. అబ్రకదబ్ర September 23, 2009 /
  • rayraj September 23, 2009 /
   • rayraj September 24, 2009 /
 19. Manjula September 23, 2009 /
  • పులి రాజా September 23, 2009 /
 20. bhaskara September 23, 2009 /
 21. గీతాచార్య September 23, 2009 /
  • chandrasen September 23, 2009 /
 22. Venkat September 24, 2009 /
 23. ceenu September 25, 2009 /
  • అబ్రకదబ్ర September 26, 2009 /
 24. a2zdreams September 26, 2009 /
   • a2zdreams September 26, 2009 /
 25. Hari Charana Prasad September 26, 2009 /
 26. a2zdreams September 26, 2009 /
  • శిద్దారెడ్డీ వెంకట్ September 27, 2009 /
   • a2zdreams September 27, 2009 /
 27. su September 27, 2009 /
  • Srikanth Dhondi September 28, 2009 /
   • su September 29, 2009 /
 28. Purnima September 28, 2009 /
  • su September 29, 2009 /
 29. su September 29, 2009 /
  • RK October 6, 2009 /
 30. su September 29, 2009 /
  • RK October 6, 2009 /