కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం

bnreddi-s.jpgకళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యన్.రెడ్డి.

ఈ సంవత్సరం ఆయన శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగానైనా ఆయన్ని మనం తలుచుకోవడం అవసరం. ఇవాళ బి.యన్.రెడ్డి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన రూపొందించిన సినిమాలు చూడాలన్నా చాలా కష్టమైన పనే. గతంలో రాండర్ గై రచించిన మోనోగ్రఫ్ తప్పితే బి.యన్ గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదనే చెప్పాలి. కానీ గత సంవత్సరం ప్రచురించబడ్డ “కళాత్మక దర్శకుడు – బి.యన్.రెడ్డి” అనే పుస్తకం ఈ లోటును చాలావరకూ తీర్చనుంది. ఈ పుస్తక రచయిత డా.పాటిబండ్ల దక్షిణామూర్తి.

తన విద్యార్థి దశ నుండి బి.యన్.రెడ్డి గారి చిత్రాలను అభిమానంతో చూసి, వారి చిత్రాలలో ఉత్తమ ఆశయాలను మహోన్నతమైన ప్రమాణాలను ఆస్వాదింది ప్రభావితులై, బి.యన్. గారి జీవితాన్ని, ఆదర్శాలను నేటి తరానికి తెలపాలనే లక్ష్యంతో, తీరిక దొరకని వైద్య వృత్తిలో వుంటూ కూడా బి.యన్. గురించి ఒక సమగ్ర గ్రంధాన్ని రచించారు పాటిబండ్ల దక్షిణా మూర్తి గారు.

బి.యన్. జీవిత విశేషాలతో కూడిన “జీవనరేఖలు”,ఆయన విశిష్టతను తెలిపే “ప్రముఖుల అభిప్రాయాలు”, తెలుగు సాహితీ ప్రపంచంలోని కవులనూ సినీరంగానికి పరిచయం చేసి ఆధునిక శ్రీ కృష్ణదేవారాయలు గా భాసిల్లిన వైనాన్ని తెలిపే “బి.యన్, చిత్రాల్లో కవులు,రచయితలు,సాహిత్యం”, ఎన్నడూ కానని అందాలను నిదురలేపగలిగే సంగీతంతో వీనులవిందు చేసిన బి.యన్. సినిమాల “సంగీతదర్శకులు,సంగీతం”, ఛాయాగ్రహణం మొదలుకొని కూర్పు,లైటింగ్, కళ,శబ్దగ్రహణం లాంటి అంశాలతో కూడిన “బి.యన్. చిత్రాల్లో సాంకేతిక నైపుణ్యం” తో పాటు, ఆయన “ఆశయాలు, ఆదర్శాలు, ప్రభావాలు”, “లభించిన అవార్డులు, గౌరవాలు”, ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు.

ఇవి మాత్రమే కాకుండా, ’ఇప్పుడు వస్తున్న కొన్ని చిత్రాలు న్యూవేవ్ చిత్రాలు కావు, న్యూడ్‍వేవ్ చిత్రాలని’ విమర్శించిన బి.యన్. వ్యక్తిగత ఆలోచనలతూ కూడిన “వ్యక్తిత్వం”, నేటి సమాజానికి బి.యన్. “జీవిత సందేశం” లతో పాటు బి.యన్ రూపొందించిన 14 చిత్రాలకు సంబంధించిన లోతైన విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి.

pd-s.jpgఎవరూ పురమాయించకుండానే కేవలం పుజ్యభావంతో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, బి.యన్. నిర్దేశించిన నైతిక విలువలను, నేటికీ చలనచిత్ర పరిశ్రమ అందుకోలేకపోతున్నదనే ఆవేదనతో, బి.యన్ ఆదర్శాలను నేటి తరానికి తెలాపలనే లక్ష్యంతో ఈ పుస్తక రచన చేసిన డా.పాటిబండ్ల దక్షిణామూర్తి గారు అభినందనీయులు.

గతంలో గూడవల్లి రామబ్రహ్మం గురించి కూడా ఒక గ్రంధం దచించిన శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు బి.యన్.రెడ్డి గురించి వ్రాసిన ఈ గ్రంధం రాబోయే తరాలవారికి ఎంతో మేలు చేకూరుస్తుందని నా నమ్మకం.

ఈ పుస్తకం వెల 125 రూపాయలు.

ఆసక్తి కలిగిన వారు ఈ పుస్తకం www.avkf.orgనుంచిఆన్‍లైన్లోఆర్డర్ చెయ్యొచ్చు. లేదా విశాలధ్ర బుక్ షాప్స్ లో కూడా ఈ పుస్తకం పొందవచ్చు.

చివరిమాట:నవతరంగంలో ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు ప్రచురించగోరుతున్నామని అడగాలనుకునే లోపే, తన పుస్తకంలోని వ్యాసాలనూ నవతరంగంలో ప్రచురించమని, ఆ విధంగానైనా బి.యన్. గురించి పదుగురూ తెలుసుకుంటే తనకంతకంటే సంతోషం లేదని చెప్పిన పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి పాదాభివందనాలు. రాబోయే రోజుల్లో ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు నవతరంగం లో చదవొచ్చు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

13 Comments to “కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం”

  • మంచి పరిచయం కృతజ్ఞతలు.
    అలానే సినిమాలు కూడా ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే చాలా బాగుంటుంది.

    అంతర్జాలంలో మిగిలిన చోట్ల ఎక్కవగా బి.ఎన్ రెడ్డి అంటున్నారు. పుస్తకం పేరులో ఎన్ అని వుందా యన్ అని వుందా. ఇక avkfలో నాకు పుస్తకం కనిపించలేదు.

  • నేను avkf కి ఇచ్చిన లింకు పై నొక్కండి. ఆ పేజ్ లో ల్యాండ్ అవుతారు. కొంచెం కిందికి స్క్రోల్ చెస్తే కనిపిస్తుంది.

  • కరెక్ట్ చేసా. పుస్తకం పేరులో బి.యన్ అని వుంది.

  • మంచి పరిచయం. ధన్యవాదాలు. విశాలాంధ్ర లో దొరికితే చదువుతాను… ఇక… బీ.ఎన్.రెడ్డి సినిమాలు ఎంత వరకూ అందుబాటులో ఉన్నాయో మరి…..

    • మన అద్రుష్టం కొద్దీ పాత తెలుగు సినిమాలు కొన్ని ఆన్లైన్ లొ కనిపిస్తాయి !!

      I don’t think I should be posting the links here , If you guys are open to watch rips I can post few links to Navatarangam mail list.

      • వెయ్యవోయ్! అమ్మా పెట్టదూ అడుక్కు తిన్నివ్వదూ అని! అంత వాటిని రక్షించే మొనగాడు నడుంబిగించి, “డివిడీలమ్ముతున్నానో” అని దండోరా వేసేదాక,రిప్ లూ కళాసేవే! (నేను సభ్యుడిని కాదు. వాళ్ళ అనుమతితోనే చేయుడి :) . ఆ రిప్పులింకులేవో నా బ్లాగులో వేయుడి. లేక మీ బ్లాగులోనే ఇచ్చి, దాన్ని ఇక్కడ వేయుడి!)

      • Kishh గారు, మీ links లో ఈ క్రింది సినిమాలు దొరకొచ్చా?
        ౧. ఇంటి గౌరవం
        ౨. ఏది న్యాయం ఏది ధర్మం
        ౩. యముడన్నకు మొగుడు
        ౪. శ్రీనాథ కవిసార్వభౌమ
        నా email id bvijay@gmail.com

  • నేనయితే మల్లీశ్వరి, పూజాఫలం చూసాను. బంగారు పప కూడా DVD దొరుకుతుందనుకుంటా…మిగిలిన సినిమాల సంగతి తెలియదు. తెలిసిన వాళ్ళు తెలియజేస్తే సంతోషం.

    • ఈయనే తీసిన రాజమకుటం కూడా చెప్పుకోదగ్గ చిత్రమే. కాస్త కమర్షియల్ పంథాలో తీశానని చెప్పుకున్నా ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.

  • వెంకట్ గారు,

    మంచి పుస్తకం పరిచయం చేశారు. డి.వి. నరసరాజుగారు ఈనాడులో రాసిన కొన్ని బి.ఎన్. సంగతలు తప్ప అచ్చులో ఈ పుస్తకంలో వున్నంత సమగ్రమైన సమాచారం యింకెక్కడా నేను చూడలేదు. రంగులరాట్నం కూడ డివిడి కాకపోతే సి.డి అయిన దొరకచ్చు. కనీసం బి.ఎన్. సినిమాలన్నీ అయిన మంచి క్వాలిటీతో కలక్టర్స్ ఎడిషన్ లాగా ఎవరైనా మార్కట్ చేస్తే బాగుండును.

  • చాల మంచి పరిచయం మిత్రమ….

  • గ్రేట్!.ఆ వ్యాసాలకోసం ఎదురు చూస్తుంటాను.

    “కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే అభిప్రాయం ఎక్కడ ఎప్పుడు ఎవరితో వెలిబుచ్చినట్టు తెలుస్తోంది?

  • [...] దత్త హృదయశాస్త్ర పురస్కారగ్రహీత, కళాత్మక దర్శకుడు – బి.యన్.రెడ్డి అనే పుస్తక రచయిత  – వెరసి అన్నీ [...]

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories