55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

kanchiPoster

kanchiPosterఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు)

ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ ఖాన్ (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఫిరోజ్ ఖాన్ వహించారు. ఇది పిరోజ్ మొదటి చిత్రం)

pennungal_3ఉత్తమ దర్శకుడు: అడూర్ గోపాలకృష్ణన్ (‘నాలు పెణ్ణుంగల్ చిత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది)

షారుఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. భావనా తల్వార్ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద చిత్రం ‘ధర్మ’ కు ఉత్తమ జాతీయ సమగ్రతను ప్రేరేపించే చిత్రంగా అవార్డు లభించింది. అమీర్ ఖాన్ నిర్మించి,దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’  ఉత్తమ కుటుంబ సంక్షేమ చిత్రంతోపాటూ ఉత్తమ గీత రచయిత (ప్రసూన్ జోషి), ఉత్తమ గాయకుడు (శంకర్ మహదేవన్) కు అవార్డులు లభించాయి. ఉత్తమ గాయనిగా ‘జబ్ వుయ్ మెట్’ చిత్రానికి శ్రేయా ఘోషాల్ కు లభించింది.

అవార్డు విజేతలందరికీ నవతరంగం తరఫున అభినందనలు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

9 Comments to “55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)”

  • ఈ అవార్డుల లిస్టులో ఒక్క తెలుగు సినిమానూ కనిపించడం లేదేమిటి చెప్మా!!

  • మహేష్ గారు,
    చీకట్లో పడేసుకున్న దాన్ని వెలుగులో వెతికే ప్రయత్నం చేస్తున్నారేమో.

  • వీటిల్లో ‘కాంజీవరం’, ‘నాలు పెణ్ణుంగల్’ చిత్రాలు నేను కొన్ని నెలలక్రితం డిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో చూశాను. ‘కాంజీవరం’ లో దర్శకుడు పడ్డ కష్టం బాగా తెలుస్తుంది. సినిమాలో మెలోడ్రామా ఎక్కువగా ఉన్నట్టు అన్పించింది. కాని వెనుకటికాలం వాతావరణం సృష్టించడానికి ఆ సినిమావాళ్ళు చేసిన కృషి బాగా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ది, మన తెలుగు సినిమాల్లో కనపడే పాత్రలకు పూర్తిగా భిన్నమైనది. అతనిలోని ‘నటుడి’ని ఈ సినిమాలో బాగా చూడవచ్చు. మన తెలుగువాళ్ళకు అంతగా తెలియని శ్రియా రెడ్డి అనే అమ్మాయి కూడా ప్రకాష్ రాజ్ భార్యగా బాగా చేసింది. ఆడూర్ ‘నాలు పెణ్ణుంగల్’ ప్రఖ్యాత మళయాళ రచయిత తకళి శివశంకర పిళ్ళై నాలుగు చిన్నకథల ఆధారంగా నిర్మించినది. చూడదగ్గ చిత్రం. అదే సందర్భంలో ప్రదర్శించిన ఒకే ఒక తెలుగుచిత్రం ‘మీ శ్రేయోభిలాషి’ అంతకు కొన్ని నెలలక్రితమే చూసి, చాలారోజుల తర్వాత తెలుగులో అలాంటి చిత్రం వచ్చినందుకు సంతోషించాను. చాలా చాలా పేరు తెచ్చుకున్న ‘తారే జమీన్ పర్’ చిత్రాన్ని మాత్రం నేను ఈరోజు వరకూ చూడలేకపోయాను.

    • “తెలుగు సినిమాలలో విషయ ప్రమాణాలు లేవు. బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారే తప్ప అవార్డులకి పనికి వచ్చే విధంగా ఉండటం లేదు” ఇవ్వాళ వార్తల్లో చదివా. నిజమా ??? మరీ అంత రోత గా వున్నాయా మన సినిమాలు? విపరీతమయిన మెలోడ్రామా వుండాలి కామొసు ! ప్చ్! వైయస్ బతికుంటే మీశ్రేయోభిలాషి కి వచ్చేదేమొ అనిపించింది.

      • @గోపిగాడు: తెలుగు సినిమాల్లో హంగూఆర్భాటం ఖచ్చితంగా ఉంటున్నాయి. కానీ, విషయప్రమాణాలకొచ్చేసరికీ వెనుకబాటు ఉండటం నిజమే.

        ఒకవేళ నిజంగానే మంచి సినిమా తియ్యాలనుకున్నా కావలసిన ఆర్థిక వనరులు లేక అవి పేలవమైన ప్రయత్నంగా మిగిలిపోతాయి. ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ అనుకోవచ్చు.కథాపరంగా మంచి సందేశాత్మక చిత్రమే అయినా, సినెమాటిక్ క్రాఫ్ట్ పరంగా ప్రస్తుతం అవార్డు లభించిన ఏ చిత్రానికీ సరితూగదు.

        మీ శ్రేయోభిలాషి తో పాటూ అవార్డులకు పంఫిన మిగతా చిత్రాలు చందమామ,హ్యాపీడేస్.

        • చందమామ & హ్యాపీడేస్ ఎంట్రీలుగా పంపారంటేనే ఆ ఏడాది తెలుగులో వచ్చిన సినిమాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్ధమవటంలా? ఈ ఏటికి ఎంట్రీలుగా కిక్కు, ఆంజనేయులు వగైరా ఉంటాయేమో :-)

        • ప్రమాణాలు అంటే ఏంటి? ఎవరు నిర్దేశించారు? నిర్దేశించిన వాళ్ళు ఏమైనా పైనుంచి వచ్చారా? పాతాళ భైరవి లో ఒక డైలాగు వుంటది. జనం మెచ్చేది మనం చెయ్యడమా? మనం మెచ్చేది జనం చూడటమా ? అని . జనం మెచ్చిన సినిమాలకు అవార్డులు రావా ? ఎక్కడో ఢిల్లీ లో కూర్చుని చూసి ఇవి గొప్ప సినిమాలు అని నిర్ధారణ చేస్తే చూసే జనాలు పిచ్చోళ్ళా? నేను మన తెలుగు సినిమా కు అవార్డు రాలేదని భాధగా లేదు . జనాదరణ పొందిన సినిమాల కు అవార్డు లు ఎందుకు రావడం లేదని అంతే!

          • @గోపిగాడు: సినిమాను “కళ” అని అంగీకరిస్తే ప్రమాణాలు దానంతకు అదే సమయానుగుణంగా నిర్దేశింపబడతాయి.

            ప్రజాకళకు సముచిత స్థానం ఉంటూనే(వినోదాత్మక చిత్రానికి జాతీయ అవార్డులు ఉంటాయి) కళకోసం తీసిన సినిమాలకు గుర్తింపు ఉంటుంది.సినిమా కళకు సంబంధించిన శైలి, సాంకేతిక ప్రతిభ చీపించినవారికి అవార్డులు ఇవ్వబడతాయి.

            సత్యజిత్ రే,రిత్విక్ ఘటక్,శ్యామ్ బెనెగల్,గోవింద్ నిహలానీ, ఆడూర్ గోపాలకృష్ణ వంటివారు ఆ కళ పరిధుల్ని సాధిస్తున్న కొందరు కళాకారులు.

  • శేషు అన్నా అది నా అభిప్రాయం . మీ వ్యాఖ్య కు ప్రత్యుత్తరం కాదు. క్షమించు

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories