జోష్ : శివ2009

naga-chaitanya-josh-movie-poster-designs-2
జోష్. నాగార్జున కుమారుడు నాగచైతన్యని తెలుగుతెరకి పరిచయం చేస్తూ వాసూవర్మ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన చిత్రం. నాగచైతన్య ఎలా చేసాడు? హీరోగా నిలబడతాడా? దిల్ రాజు బ్యానర్ లో పరిచయమైన సుకుమార్, భాస్కర్ ల మాదిరిగా వాసూవర్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇస్తాడా? దిల్ రాజు ‘నాకు ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ సినిమా అవుతుంది’ అన్నాడు. అవుతుందా? నిన్నటి తరం హీరోయిన్ రాధ కూతురు కార్తీక కి ఇది మొదటి సినిమా. ఆమె పరిస్థితి ఏంటి? -ఇంతలో టైటిల్ కార్డ్ పడింది.

కథ:
“శివ” సినిమా లో – వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో కాలేజ్ జాయినైన తర్వాత శివకి (నాగార్జునకి) ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కి, లోకల్ డాన్ భవానీ (మరియు వాడి పైన వుండే రాజకీయ నాయకుడు మాచిరాజు) కి ఉండే కనెక్షన్, ఈ కనెక్షన్ వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాలు, గొడవలు తెలుస్తాయి. అవి చూసి ఈ సిస్టం ని మార్చాలి అన్న ఉద్దేశ్యం తో కాలేజ్ వదిలేసి బయటకి వచ్చి, మాచిరాజు-భవాని ల ‘సిస్టం’ ని దెబ్బకొడతాడు. జోష్ లో సత్య (నాగ చైతన్య) వైజాగ్ నుంచి హైదరాబాద్ కి చిన్న ఉద్యోగం కోసం వచ్చి, ఇక్కడి స్టుడెంట్స్ కి లోకల్ “అన్నయ్య” జెడి కి ఉన్న కనెక్షన్, దానివల్ల ఏర్పడుతూన్న పర్యవసానాలు, గొడవలు చూసి, సిస్టం మార్చాలి అనుకుని (ఇంటర్వల్ సమయానికి) తర్వాత అదే కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ శివ గొడవలవైపు, భవాని లాంటి వాళ్ళ వైపు ఆకర్షితులవుతున్న స్టుడెంట్స్ ని వదిలేసి, భవానీ-మచిరాజులని టార్గెట్ చేస్తే, ఇక్కడ సత్య స్టూడెంట్స్ లో మార్పు వచ్చేలా చేసి జెడి కుయుక్తులు దెబ్బ కొడతాడు.

నాగచైతన్య:

నాగార్జున ముఖకవళికలని పుణికిపుచ్చుకున్నాడు, చూడటానికి బాగున్నాడు. తనకి వాడిన కాస్ట్యూంస్ బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే ఒక్క ఫ్లాష్ బ్యాక్ లో తప్పిస్తే మిగతా సినిమా అంతా ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఎమోషనల్ బాలెన్స్ తో ఉండే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. చాలా వరకు అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ లో ఫుల్ జోష్ తో ఉండే క్యారెక్టర్. రెండింటి మధ్య వైవిధ్యం చూపించగలిగేంత నటన మొదటి సినిమాలో చేయడం మెచ్చుకోదగ్గ అంశం. డాన్సులు, ఫైట్లు బానే చేశాడు.

కార్తీక :
డిగ్రీ చదవాల్సిన వయసులోనే కాన్వెంట్ టీచరవడం వల్ల, కాలేజ్ లైఫ్ ని మిస్సైపోతున్నానని తెగ బాధపడే ఒక చిలిపి పాత్ర. తన పరిధిలో బాగానే చేసినప్పటికీ పాత్ర చాలా పరిమితం. చూడటానికి పర్వాలేదు. ఏదో పాటలో డ్యాన్సులో కొంచెం ఈజ్ చూపించినప్పుడనిపించింది- ‘అన్నట్టు రాధ కూతురే కదూ’ అని. సవితారెడ్డి డబ్బింగ్ కొంచెం మొహం మొత్తింది.

ఇతర నటీనటులు:
20 ఏళ్ళ క్రితం కాలేజ్ లో శివలాంటి వాళ్ళ చేతిలో తన్నులు తిన్న జెడి(బ్రతికి ఉంటే) ఇప్పుడెలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? కొంచెం ఒళ్ళు చేసి, తను చదివిన కాలేజ్ కే కమిటీ మెంబరై, రాజకీయాల్లో కి వెళ్ళడానికి సీరియస్ గా ట్రై చేస్తూ, తన ఎదుగుదల కోసం విద్యార్థి రాజకీయాల్ని, విద్యార్థి గ్రూపుల మధ్య గొడవల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడంటారా? కరక్టే. అలా ఉంటే ఎలా ఉంటాడో అదేపాత్రని చేసిన జెడి ని చూస్తే తెలుస్తుంది. బాగా చేసాడు. ఇక ప్రకాష్ రాజ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ కాలేజ్ ఏజ్ లో పాడైపోతుంటే బాధపడే కాలేజ్ ప్రిన్సిపాల్ రోల్ లో బాగా చేసాడు.

వాసూవర్మ:
నాగార్జున కుమారుడి మొదటి సినిమా కాబట్టి కేవలం నాగచైతన్య ఎబిలిటీస్ నీ బాగా షోకేస్ చేస్ చేసి బాగా లాంచ్ చేస్తే చాలు అనుకోదానికి వాసువర్మకి ఇదేమీ పదో సినిమానో ఇరవయ్యో సినిమానో కాదు. మొదటి సినిమా. నాగచైతన్యతో పాటు తనని తాను కూడ షోకేస్ చేసుకోవాల్సిన ఒక సంక్లిష్ట బాధ్యత వాసూవర్మ మీద ఉంది. అందులోనూ బహుశా “శివ” లైన్స్ లో కథ తయారు చేసుకోవాల్సి రావడం తన బాధ్యతని మరింత క్లిష్టతరం చేసింది. ఇన్ని పరిమితుల మధ్యలోనూ తను డెలివర్ చేసిన ఫైనల్ ప్రాడక్ట్ చూసాక వాసూవర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

దిల్ రాజు:
వరస హిట్లతో గోల్డెన్ హ్యాండ్ గా పేరొందిన దిల్ రాజు మరొకసారి మెసేజ్ ఓరియెంటేషన్ ఉన్న కథ కి మొగ్గు చూపాడు. నిర్మాణవిలువలు బాగున్నాయి.

శివ వర్సెస్ జోష్:
రాం గోపాల్ వర్మ ఆ మధ్య శివ2006 అనే పేరు తో ఒక రీమేక్ చేసి పోలీస్ సినిమా ఒకటి తీసాడు కానీ నిజంగా శివని మాడ్రనైజ్ చేయాలనుకుంటే అది ఎలా చేయొచ్చో వాసూవర్మ చూపించాడు. నేనిక్కడ కథ గురించే చెప్తున్నాను. సాంకేతికవిలువల గురించి కాదు. రౌడీ స్టూడెంట్స్ ని కాలేజ్ మొత్తం పరుగెత్తించి పరుగెత్తించి కొట్టడం, రౌడీలు రోడ్డు మీద (తను హీరోయిన్ తో) ఉన్నపుడు అటాక్ చేస్తే ఫైట్ చేయకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక ఆటో (శివలో అయితే సిటీ బస్) క్యాచ్ చేసి తప్పించుకోవడం లాంటి సీన్లు శివని గుర్తు కి తెచ్చి నోస్టాల్జిక్ ఫీలింగ్ తెప్పిస్తాయి. సమస్య శివ ఎదుర్కున్నదే. కానీ ఆ సమస్య మీద దృష్టి సారించడానికి శివకి ఉన్న కారణం వేరు, సత్యకు ఉన్నకారణం వేరు. సమస్యని శివ పరిష్కరించిన విధానం వేరు, సత్య పరిష్కరించిన విధానం వేరు.

అయితే ఇక్కడ ఇంకొక “సమస్య” ఏంటంటే-ఆ సమస్య ఇప్పుడంతగా లేదు…ఐ మీన్-  శివ సినిమా టైం లో ఉన్నంతగా ఇప్పుడు లేవు విద్యార్థులు-రాజకీయ నాయకుల మధ్య కనెక్షన్లు, విద్యార్థుల గ్రూపు ఫైటింగులు వగైరా. ఇప్పుడు విద్యార్థులు ఒక ప్రక్క ఎంసెట్, ఐసెట్, ఆ సెట్, ఈ సెట్,
ఇంకోప్రక్క ఫ్రెండ్ షిప్, లవ్, వేలంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే ల తో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల్లో “సమకాలీనత” పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ ఈ సినిమా బేసిక్ మెసేజే అది కావడం వల్ల ప్రస్తావించవలసి వచ్చింది.

ఫైనల్ గా :

 ఒకరకంగా చెప్పదలుచుకున్న మెసేజ్ లోని సీరియస్ నెస్ వల్లా, హీరో క్యారెక్టరైజేషన్ లో డెప్త్ వల్లా – “జోష్” అనే టైటిల్ చూసి ఒకతరహా ఎక్స్పెక్టేషన్స్ తో (ఫుల్ కామెడీ లేదా ఫుల్ రొమాంటిక్ స్టోరీ లేదా ఫుల్ యూత్ ఫుల్ మూవీ అనుకుని ) వచ్చిన వాళ్ళకి, మొదటి సినిమాలోనే నాగచైతన్య విపరీతమైన డ్యాన్సులూ ఫైట్లూ చేయాలనో లేదంటే డైరెక్టుగా నాగార్జున తరహా “మన్మధుడు” అయిపోవాలనో ఆశించినవాళ్ళకీ, కొంత నిరుత్సాహమనిపిస్తుంది కానీ నటనా పరంగా నాగచైతన్య, దర్శకుడిగా వాసూవర్మ, సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడం లో దిల్ రాజు- అందరూ ఫస్ట్ క్లాస్ మార్కులే సంపాదించుకున్నారు.

Filed Under: lead

Comments (60)

Trackback URL | Comments RSS Feed

  1. సమీక్ష ఆసక్తికరంగా ఉంది. ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నమాట.

  2. G says:

    మరి బయట చాలా నెగటివ్ టాక్ విన్నానే…? ఎటూ చూడాల్సి వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి

  3. goutham says:

    జయరాజ్ గారు రాసిన అ౦త బాగా సినిమా వు౦దదు అన్నది నిజ౦.నాగచెతన్య బాగ చెసాదు,కానీ దర్శకుదు,మొదతి సగ౦ లొ అర్థమ్ లెని చిత్రీకరణ అన్నది అసహనానికి గురి చెస్తు౦ది.రె౦దొ సగ౦ మొదతి దానిత్తొ పొల్చకున్దా its also waste part,but chitanya did well in second half,this movie is completly disaster made by the producer and director,dilouges are good at few scenes.

  4. ceenu says:

    మోహన్‌రాజ్‌గారూ!మీరు అక్కినేని కుటుంబాభిమాని కాదుకదా?

  5. ఈ సినిమా చూళ్ళేదుగానీ, ఇవ్వాళ టీవీలో ఓ ఫోనిన్ కార్యక్రమం చూడాల్సొచ్చింది. అందులో దర్శకుడు మాట్టాడినదాన్ని బట్టి, ఫోను చేసినవాళ్ళు చెప్పినదాన్ని బట్టీ, ఈ సినిమా అంత బాగా పోవడం లేదని అనిపించింది. ‘కొంత డివైడెడ్ టాక్ వచ్చిందండి’ అని, ఓ రెండు మూడు రోజుల్లో పుంజుకుంటుందనో ఏదో అన్నాడు దర్శకుడు. మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో ఆహా, ఓహో, అబ్బో బ్రహ్మాండం అని చెప్పుకుంటూంటారుగదా సినిమా తీసినవాళ్ళు -కానీ ఈ దర్శకుడు చెప్పినది వాటితో పోలిస్తే చా..లా తక్కువ. అంచేత సినిమాపై నాకు సందేహం కలిగింది, అంతే!

  6. G says:

    This movie is a disaster. Just my friend’s back, and wanted his Rs. 50 back. :-D

  7. మీ సమీక్ష బాగుంది… నేను ఇప్పుడే చూసొచ్చా.. మీరు చెప్పినట్లుగా.. తెరగేట్రం చేసిన నటనా పరంగా నాగచైతన్య, దర్శకుడిగా వాసూవర్మ, సక్సెస్ ఫుల్ అయ్యారని చెప్పొచ్చు..

  8. ఎవడో ఒకడు says:

    ఇది నిజంగా రివ్యూనా? ప్రమోషనా? సెటైరా?
    Comparing Josh to Siva is nothing short of blasphemy!
    సమీక్షకుడి మీద నాకు చాలా జాలికలుగుతోంది.

  9. sanju says:

    this film is not good boss

    • విజయ్ నామోజు says:

      సమీక్ష బాగుంది . సినిమా కూడా బాగుంది .

  10. sasank says:

    THe film is not good boss. It lacks josh.

    Josh # Shiva (1989)

    Josh = Shiva (2006)

  11. sankar says:

    me site ni nammi time tesukuni mari ..navatarangam chaduvutanu.
    mari meru yelanti chetta cinemani promote chese laga rastee.
    me meda nammkam yela chepmaaaa

    • vinay chakravarthi says:

      well said sankar………they r not movie lovers just fans…..of some hero ……they promote their hereo movies and find loop holes in opponent movies…..

      after reading this one and magadheera’s review by katti gaaru…….i came 2 this opinion…….

      try to fallow some standard rules man……..

      • @వినయ్: “opinions” don’t have “standards” my fiend. If this was a site for FANS ALONE your comment wouldn’t have been entertained.

        కాబట్టి ఈ సినిమా చూసి, మీరు ఎంత చెత్తగా ఉందో ఒక వ్యాసం రాస్తే ఆ వ్యాసానికీ నవతరంగంలో స్థానం ఉంటుంది.So, Please pick up your key board and write something.

        • sankar says:

          “opinions” don’t have “standards”ఆ ..? ఇఎద్దెక్కడి రుల్ అండి బాబు..మనిషి నిద్ర లేసిన దగ్గర నుంచి నిద్ర పొయేదాక Standard లేకుండా చేసే పని ఒక్కటంటే ఒక్కటి చేప్పండి చూద్దాం.. అలా మన Opinions కి Standards లేకపోబట్టే చైనా వాడు వచ్చి రాళ్ళకి రంగులేసుకు వెల్లాడు మరి. ఐనా..!
          ఒపినియన్ లు ఒపినియన్ బాక్స్ లొ రాసుకోవాలనుకుంటా….!మరి ఇక్కడ రాసింది రివ్యు కదా. ఇక్కడ రివ్యులు నిష్పక్షపాతంగా వుంటాయ్ కదా అని మేము మిమ్మల్ని నమ్మి సినిమా చూసి, డబ్బులు పొయి..ఆ భాదేదొ ఇక్కడ చెప్పుకుంటే,your comment wouldn’t have been entertained,అని నిరంకుశత్వంగా మాటలాడితే ఏలాగండి.చెప్పుకుందామనుకుంటే Rajashekar Reddy కూడా బ్రతికి లేరు.. ప్చ్..!

          • Norman Bates says:

            @ Sankar : lol !!

            ikkada konta mandi opinions matramee standard ani valla feeling !!

          • @శంకర్: Let me make clear… one more time. నవతరంగం ఒక వెబ్ సైట్ కాదు.సినిమాల గురించి చర్చించుకునే ఒక వేదిక. ఇక్కడ standards set చేసే EXPERTS ఎవరూ లేరు.

            సినిమా చూసిన ప్రతొక్కరికీ ఆ సినిమా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే హక్కూ, ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అధికారం ఉంటాయి.ఆ హక్కునూ అధికారాన్నీ సాకారం చేసేదే నవతరంగం.అందుకే ఇక్కడ ఒకే సినిమా గురించి ఎన్నైనా OPINIONS ఉండొచ్చు. వాటికి STANDARD అవసరం లేదు. కేవలం రాసేది చదివేవాడికి అర్థమయితే చాలు.

            If you can’t live with such difference of opinion, this forum is not for you. If you aspire for standards please go to http://www.idlebrain.com

        • vinay chakravarthi says:

          we must analyze the movie and performance of artists and technical team rather than finding loop holes/giving hype

          చెత్తగా వుందని రాస్తె అది ఎలా review/వ్యాసం /చర్చ అవుతుంది.నీకు/మీకు అనిపించవచ్హేమో. మగధీర రంధ్రాన్వేషణ అసలు ఎలా వ్యాసం అవుతుంది.ఇది వ్యాసం ఎలా అవుతుంది.

      • @వినయ్ చక్రవర్తి: సమీక్షకు విశ్లేషణకు ముందుగా తేడా తెలుసుకోండి. మగధీర సమీక్ష ఈ జోష్ సినిమాను సమీక్షించిన మోహన్ రాజ్ గారే చేశారు. It was surely a quite positive review.కాబట్టి ఇక్కడేదో ఒక హీరో ప్రమోట్ చేసే పనిలోఉన్నారనే అపోహ మీరు పెంచుకోనఖ్ఖరలేదు. కావాలంటే మీరే ఆ “సమీక్ష” చదువుకోండి.
        http://navatarangam.com/2009/08/magadheera-review/

        నా మగధీర విశ్లేషణలోని ఉద్దేశమే “రంధ్రాణ్వేషణ”.విశ్లేషణ సినిమాలోని ఏదైనా కోణాన్ని,అంశాన్ని,ఒకదృశ్యాన్ని కూడా తీసుకుని చెయ్యొచ్చు. కాబట్టి మీ విమర్శలోని ఔచిత్యాన్ని మీ తెలియనితనంగా తప్ప మరేవిధంగా గుర్తించాలో తెలియకుంది.

        • sasank says:

          @Mahesh: విశ్లేషణ సినిమాలోని ఏదైనా కోణాన్ని,అంశాన్ని,ఒకదృశ్యాన్ని కూడా తీసుకుని చెయ్యొచ్చు? ఎవరు చెప్పారండి ఇది? మరి కామెడీ కాకపోతే :-) . మీ వీలుంటి పట్టి అన్ని మార్చేస్తారా. మరి మీరు చేసిన విశ్లేషణ సినిమా మొత్తం పై చేసారు కదా. మీ ఆర్టికల్ హెడింగ్ కూడా మగధీర సినిమాలో రంద్రాన్వేషణ అని వుంది కాని ఆ సినిమాలో ఒక దాని పైన అని లేదు కదా.కాబట్టి పైన వినయ్ గారు అన్నదానిలో ఏమి తప్పు లేదు అని నాకు అని పిచ్చింది

          పైన మీరు చెప్పినట్టు నవతరంగం సినిమా గురుంచి చర్చినట్టు లేదు.ఇంకొక లాగ వుంది. అయినా అసలు పైన రాసింది సమీక్ష లాగ లేదు.జోష్ సినిమాని ప్రమోషన్ చేసినట్టు వుంది.అంతః విశ్లేషించే వాళ్ళు మల్లన్న, ఆంజనేయులు , జోష్, కమీనే, నదోదిగల్ సినిమా పై ఎందుకు బొక్క(రంద్రా)న్వేషణ చెయ్యలేదు. అంటే పేరు వచ్చిన సినిమాలకే చేస్తారా రంధ్రాన్వేషణ. మిగితా వాటికి చెయ్యరా. అలా చెయ్యనప్పుడు ఇది చర్చించుకోవడం ఎలా అవుతుంది. చర్చ అంటే అన్ని సినిమాల పైన జరగాలి కదా. ఒక్క దానిపైనే జరిగితే ఎలా?

          • @శశాంక్: సినిమాలోని కథ,కథనం,కథావస్తువు,సామాజిక ప్రయోజకత్వం,నటుల నటన, కథకు ఎంచుకున్న నేపధ్యం,సమాజంలో ప్రచులితమైన వాదాలు (స్త్రీవాదం-దళితవాదం-కమ్యూనిజం etc.)సిద్ధాంతాల నేపద్యంలో కథని చూసే ధృక్కోణం,కొన్ని పాత్రలు లేక కొన్ని దృశ్యాలలో దర్శకుడు (దీన్నే ఇంగ్లీషులో Director’s actors and Director’s scenes అంటారు) చెప్పదలుచుకున్న స్త్ఘూలమైన విషయాలు ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని కూడా సినిమా గురించి విశ్లేషించొచ్చు.

            ఇది నేను కొత్తగా చెప్పడం లేదు. చాలా వరకూ విశ్లేషణలు ఇలాగే ఉంటాయి. ఆ విషయం మీకు కామెడీగా అనిపిస్తే, నా ప్రఘాఢసానుభూతి మీతో ఉంటుంది.

            మగధీర సినిమాకే అలాంటి విశ్లేషణ ఎందుకు చేశాను అనేది ఆ వ్యాసంలోని మొదటి రెండు పేరాగ్రాఫ్స్ చదివితే మీకు తెలుస్తుంది. మిగతా సినిమాలకు ఎందుకు చెయ్యలేదంటే…చెయ్యలేదు అంతే! దానికి ప్రత్యేకించి కారణాలేమీ లేవు. అనిపించింది,ఆలోచించిందే నేను రాస్తాను.అన్ని సినిమాల గురించీ రాయాలని రూలేమీ లేదుకదా!! మీరు కావాలంటే ఆ సినిమాల మీద రాయండి. ఆపిందెవరు?

        • vinay chakravarthi says:

          i expected this……..”కాబట్టి మీ విమర్శలోని ఔచిత్యాన్ని మీ తెలియనితనంగా తప్ప మరేవిధంగా గుర్తించాలో తెలియకుంది.” from u…

          ok mahesh nuvvu tondaraga movie tiyyalani adi nenu choodalani….devudi ni korukuntunna…..em ledu ela movie teeyalo telusukundam ani………boss sameeksha vishleshana pedda diff vundadu boss……

          nuvvu define chey mari….

          cinema ekkada baagaledu ekkada baagundi improvements em chesukovaali ani cheppakunda……..mottam one side raasesi..adi sameeksha ante ela………….

          • @వినయ్ చక్రవర్తి:
            సమీక్ష = review
            విశ్లేషణ = Analysis
            ఇవి రెండూ ఒకటి కాదు. సమీక్షలో కొంత విశ్లేషణ మిళితమైనంతమాత్రానా ఆరెంటికీ పెద్దతేడా లేదు అని చెప్పే ముందు వాటికి అర్థాలు తెలుసుకోండి.
            http://en.wikipedia.org/wiki/Review
            http://en.wikipedia.org/wiki/Analysis

          • Bluto says:

            @ Vinay: జోష్ మూవీ ఆయనకి నచ్చింది కాబట్టి ఆయన అలా రాశారు. మీకు నఛక పోతే మీరు ఇంకొ వ్యాసం రాయండి. అంతే కాని +ve గా రాశారని, మీరు సినిమా Promote చేస్తున్నారని అనడం బాగాలేదండి.

        • vinay chakravarthi says:

          boss mahes acess chesetappudu anni right ani chepparu kadandi…..mistakes kooda tick chestaaru…….at least ela improve chesukovaalo cheppakapoyina……….

          • sasank says:

            @Vinay: Yes i agree with this

            @Mahesh: వికీ ఎమన్నా స్టాండర్డ్ aa ?

  12. Thought of communicating/re-iterating a couple of points-

    1. @ vinay, @ ceenu –
    Dont jump to conclusion that the reviewer is fan of so and so hero – just because his review for a paticular hero’s movie is positive.

    2. Shiva vs Josh >>నేనిక్కడ కథ గురించే చెప్తున్నాను. సాంకేతికవిలువల గురించి కాదు>>
    శివ సినిమాకి జోష్ సినిమా తో పోల్చింది- కథాంశం లో ని పోలికల గురించి మాత్రమే- The comparision ends there.

    • vinay chakravarthi says:

      i have so many things to pointout but….

      instead of giving transperent reviews/resp ur fighting with us.. what to do.

      @katti mahesh

      మీరు చెప్పాల్సిన అవసరం లేదు …ఇలానే వుంటే మీరు చెప్పకుండానే వెల్లిపొతారు/ము.
      అలానే చాల సార్లు చెప్పాను చాల oddగ వుంటున్నాయ్,మీ comments అని.మీరు idlebrain or some website కి వెల్లండి అంటె ఎంటి..

      • @వినయ్ చక్రవర్తి: ఇక్కడ ట్రాన్స్ పరెంటుగా,ఆబ్జక్టివ్ గా సమీక్షలు రాస్తామని ఎవరూ బోర్డుపెట్టుకుని రాయట్లేదే!

        ఎవరో ఒక సభ్యుడు సినిమా చూసి, తనకు అనిపించింది స్వచ్చందంగా రాసి నవతరంగంలో పెడుతున్నారు అంతే. అందుకే ఇక్కడ objectivity కన్నా,subjectivity ఎక్కువగా ఉంటుంది. అన్నిరకాల subjectivities కు అవకాశం ఇస్తూ, ఒకే సినిమాపై అనంతమైన అభిప్రాయాలకు ఇక్కడ చోటుంది.కాబట్టి మీరు రచయితల్ని ఆడిపోసుకోవడం, వారికి లేనిపోని నిందల్ని ఆపాదించడం మానుకుని transperent reviews/resp రాసేప్రయత్నం మీరు చెయ్యండి.

        • sasank says:

          @Mahesh: మరి రచయితలు సినిమా తీసేవాల్లని ఆడిపోసుకోవడం ఎంత వరకు సబబు.

          ఇక్కడ ట్రాన్స్ పరెంటుగా,ఆబ్జక్టివ్ గా సమీక్షలు రాస్తామని ఎవరూ బోర్డుపెట్టుకుని రాయట్లేదే, అన్నారు, మరి అలా ఐతే ఎందుకు వాటిని పోస్ట్ చెయ్యడం :-)

        • Norman Bates says:

          @ Mahesh :

          seriously , konni rojulu ee site ki dooranga unte manchidi , mee valle su lanti vallu vellipoyaru …

        • vinay chakravarthi says:

          @ ఇక్కడ ట్రాన్స్ పరెంటుగా,ఆబ్జక్టివ్ గా సమీక్షలు రాస్తామని ఎవరూ బోర్డుపెట్టుకుని రాయట్లేదే!

          manake standards leni vallam , movie teesina vallani criticize chese anta vallama……to acess others we must have some knowledge in subj/standrds. otherwise manaki teleenivi anni waste anukone pramaadam telisinave corect anukune pramadam vundi.

  13. sivaji says:

    good review -sivaji

  14. Arvind says:

    There is no problem with the review. But there is a hell lot of problem with the movie. Not a movie worth giving single look. chala chetta sinima. emi nammi aa sinimaki naga chaaitanyya ni appa ginchado Nagarjuna

  15. sankar says:

    అబ్బో సినిమా అద్దిరింది..సూపర్ రివ్యూ okey na…

    • vinay chakravarthi says:

      yes man if we give +resp like this they feel happy.
      otherwise…..see katti resp, he is suggessting us(who r giving -ve resp to their review) to move idlebrain.

      • sasank says:

        Yes i agree with you. These writers of navatarangam will make comments on the film makers and they wont take the comments made by others on them.

        I think this is not review, more over its looking like a promotional campaign for josh.

  16. harsha says:

    @vinay chakravarthi,sasank
    మీకు తెలుగు అర్ధం అవ్వదా??? జోష్ మూవీ ఆయనకి నచ్చింది కాబట్టి ఆయన అలా రాశారు…..మీకు నఛక పోతే మీరు రాంధ్రాణ్వేషణ అని మరొక వ్యాసం రాయండి. మిమ్మల్ని ఎవరైనా వొద్డన్నారా???…మగధీర కే రంద్రన్వేషణ ఎందుకు రాశారు మిగిలిన వాటికీ ఎందుకు రాయలేదు అనడిగితే జల్లెడ లో రంద్రాలు చూపించాల్సిన అవసరం లేదు కదా????గొడవలు మాని నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదో వేరే వ్యాసం లో రాసుకోండి..

    • రామ says:

      చక్కగా చెప్పారు (ఇంతకంటే విడమర్చి చెప్పడం వీలు కాదు). ఫోరం ఉన్నదే వివిధ అభిప్రాయాలకి. నచ్చిన వాడు నచ్చినదాన్ని నచ్చింది అని చెప్పడం నచ్చకపోతే మీకు ఏమనిపించిందో ఇంకో రివ్యూ రాస్తే చదివి పెడతాం :) .

      • sasank says:

        @rama: ఫోరం ఉన్నదే వివిధ అభిప్రాయాలకి, అందుకే ఇక్కడ మేము మాకు నచ్చలేదు అనీ చెప్పాం. మీరు చదవడానికి మేము రివ్యూ రాయడం ఎందుకండి మీరే రాసుకొని చదవచ్చు కదా :-)

        ఇంతకన్న విడమర్చి చెప్పడం నాకు రాదూ

        • రామ says:

          మేము రాసింది చదువుకుంటే మాకు కావలసిందే కనిపిస్తుంది.. మీరు ఏమనుకుని జనాల్ని ఏకుతున్నారో తెలుసుకుందామని మిమ్మల్ని వ్రాయమని అందరూ కాళ్ళా వేళ్ళా పడుతున్నారు.

          • sasank says:

            రాస్తే మరి మీరు ఏకుతున్నారు కదా, సో మీరే రాయచ్చు కదా

    • sasank says:

      @Harsha: నేను అన్ని సినిమాల గురుంచి రాయండి అని అడగడం లో తప్పు ఏంటి, దానికి తెలుగు అర్థం కాదా అని మీరు ఫీల్ అవ్వడం :-) .
      ఇక్కడ గొడవలు ఎవ్వడు పడడం లేదు, మమ్మల్ని వేరే వ్యాసం రాయమనే బదులు మీరే వేరే చోట కామెంట్స్ రాసుకుంటే మంచిది ఏమో :-)

      • @Sasank: I am sure you don’t understand Telugu. So, let me explain to you in English. Navatarangam is run by film enthusiasts with regular VOLUNTARY CONTENT CONTRIBUTION from its members.Some times non-members do contribute with their share of articles.

        All the members out here are busy professionals in their respective fields of expertise.Cinema is a passion for them so they write it to cherish it.

        So,your DEMAND seeking essays on ALL FILMS is ridiculous.

        • sasank says:

          ridiculous, how it is ridiculous.

          నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కొంత మది కొన్ని సినిమాల పైన కక్ష కట్టుకొని రాస్తున్నారు.ఎవరో ఎందుకు మీ మగధీర రంద్రాన్వేషణ లో మీరు రాసిన మొదటి 2 లైన్స్ ఇవి “అసలు హాలీవుడ్డే రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని మరికొందరూ పందేలు వేసేసుకుంటున్నారు”.
          ఇందులో మీకు వెటకారం, చిన్నగా చేసి రాయడం కనిపించలేదా , నాకైతే అనిపిచ్చింది.
          ఇది ఓకే, అలాంటప్పుడు అన్నిటికి రాయాలి కదా, మరి కమినె ని కూడా అందరు హాలీవుడ్ మార్క్ ఫిలిం అన్నారు (గయ్ రిట్చీ కయ్నడ్ అఫ్ ఫిలిం అన్నారు), మరి నీని గురుంచి ఎందుకు రాయలేదు అని అడిగా, అందుకే అంటున్న మన ఫిలిం మకెర్స్ అంటే వెటకారం, పక్క వాళ్ళు అంటే వేరొకటి

          “Cinema is a passion for them”, మీకు నిజంగా సినిమాలు అంటే ప్యాషన్ అలా రాయరు మన ఫిలిం మేకేర్స్ గురుంచి.మీకు ఉన్నదీ ప్యాషన్ కాదు ఇంకేదో. మీరు తెలుగు, ఇంగ్లీష్ లో కాదు కదా తమిళ్ లో చెప్పిన నాకు అర్థం కాదు, ఎందుకు అంటే

          “Your views keep changing every time if some body writes against you”

          Bye take care

          Alvidaa :-)

    • vinay chakravarthi says:

      boss………..nenu magadheerake raasaaru anatam ledu just recent ga chdivina taruvaata …too much anipinchindi…..

      asalu reviews laaga vundatam ledu edo oka side ayyi raastunaru ani nenu cheppedi………..naaku telugu vachhaleda aanedi matter kaadu anukunta ide vaddu anedi…….

      pina maatladam emanna okka maata jaarama……….
      ide vadddu anedi…..

  17. I don’t think there is a great problem with the article written over here…
    మిగతా సభ్యులెందుకు ఈ రివ్యూ ను చూసి భావోద్వేగాలకు లోనవుతున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకు ఈ article ను చూశాక నేను సినిమా చూసి ఏదైతే అనుకున్నానో అదే రాశారనిపించింది. సినిమా చూసేటప్పుడు మనకున్న ఆశలు(expectations) పక్కన పెట్టి ఒక neutral reviewer గా గనక చూసినట్టైతే నాది కూడా ఇదే అభిప్రాయమవుతుంది…
    కావాలంటె ఎవరైనా negative అంశాలను తీసుకుని ఇంకొక వ్యాసం రాయచ్చు కదా…దీనికింత రభస చెయ్యటమెందుకు…
    “సినిమా ఎందుకు చూడచ్చు?” అన్న ప్రశ్నకు పై వ్యాసం జవాబు..
    “సినిమాలో ఫలానా అంశాలు బాలేదు!” అని ఇంకొకటి రాయండి
    కాని “సినిమా ఇందుకు చూడక్కర్లేదు!” అని రాసేంత చెత్తగా ఐతే లేదని నాకనిపించింది..ఈ అభిప్రాయం చెప్పడం లో నాకే పక్షపాతం లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను…

  18. నాగచైతన్య, కార్తీక ఇద్దరూ అంత చూడబుల్‌గా లేరు. తండ్రి ఎత్తు & గ్లామర్ కొడుక్కీ, తల్లి అందం కూతురికీ వచ్చినట్లు లేవు (వారసుల్లో నటన ఆశించటం ఎటూ వృధాయే. రెండున్నర గంటల పాటు ఓపిగ్గా చూడాలంటే చక్కదనమన్నా ఉండాలి కదా)

  19. It’s not Josh. It’s simply NOsh

  20. aakasaramanna says:

    నాగచైతన్య కొంచెం వయసు వచాక తేలతాడు కాని రాద కూతిరిని మాత్రం బరించడం కష్టం…మరి డైరెక్టర్ గారు,నాగార్జున గారు హిరొఇన్ ని ఎలా సెలక్ట్ చేసారో ఎంటో…?

  21. Nagarjuna says:

    @anu,
    నా పేరు నాగార్జున అండి..నేనేదో నాగ చైతన్య ని support చెయ్యడానికి ఆ పేరు పెట్టుకున్నానని అనుకుంటారేమో అని (నిజంగా) అని bracesలొ పెట్టాను…

    as someone was saying above, heroine ని భరించడం కష్టంగానే అనిపించింది…కానీ నటన పరంగా పర్వాలేదు…నాగచైతన్య కూడా చూడటానికి అంత గొప్పగా ఏమీ లేడు..కానీ ఏదో charm ఉంది…he will succeed

  22. Bluto says:

    జోష్ మూవీ ఆయనకి నచ్చింది కాబట్టి ఆయన అలా రాశారు. మీకు నఛక పోతే మీరు ఇంకొ వ్యాసం రాయండి. అంతే కాని +ve గా రాశారని, మీరు సినిమా Promote చేస్తున్నారని అనడం బాగాలేదండి.

  23. sekhar says:

    Friends,

    I appreciate Navatarangam for giving the opportunity to oppose a review….I strongly disagree with this review….

    Nenu ninnane ee cinema online lo half movie megavideo lo chusa….. (vaarasula cinemalu theater lo chudakudadhani ottu pettukunna super duper hit aithe thappa) i.e. 2*72 hrs haha… second half next day chuddamanukunesariki movie theesesaru…. so, aa half part chusina tharvatha… na opinion

    College Environment:::: idi college ani ekkada anipinchaledu… andulo evaraina students la meeku ekkada anipincharu? nakaithe ledu… nenu chadivina campus lo antha darunam ga unna batch okkati kuda kanipinchaledu… mari ekkada nunchi oohinchado ee director… ee director ni mari how can you say that he did a good job?(very bad character selection) ikapothe college motham vedhavalena??? Master movie better kondare vedhavalu ani chupisthundi ee vishayam lo….

    Hero::::: As I told you, nenu ilanti industry varasulni assalu accept cheyalenu… nizam ga vadi face lo antha attraction kani, natana (action) kani emi kanipinchindi… daniki thodu father ni imitate cheyyatam okati vaadi face ki… aa nagarjuna edo pedda actor ayinattu…

    Heroin:::::: nakaithe vamp kanipinchindi aa face lo… che mana telugu cinema daridram kakapothe… ilanti heroins ni ippudu chudalsosthundi… sridevi, jayaprada lanu chusina kallatho veellani chudalsosthundi….

    Ika migatha departments gurinchi cheppalante motham movie chudalsinde….

    Sasank and Vinay I agree with you 100%…
    pedda boku cinema… atlease heroin aina baledu basu…

    • @ Sekhar,

      I do appreciate ppl expressing different views on a particular cinema. You have every right to say that u didnt like a particular movie and I am not going to argue against ur right. But I have a couple of points to say to YOU.

      1. You told you watched only half of the movie in megavideo then – <> pls dont say things like this – as college environment is shown in second half of the movie – and u didnt watch it.

      2. After watching a movie if u say – i couldnt accept that particular hero because of his bad performance – it is understandable. But when u say <<>> it shows u r watching the movie with all ur pre-conceived notions and u have already determined things even before watching the movie.

      3.<<> Did u feel the same with RGV’s Shiva?? or u thought there are some +ve chars like – shubhalekha sudhakar etc in that movie. U have to watch 2nd half to find some chars on that lines. After watching only first half- ILAANTI LOGICS TEEYAKOODADU..u have every right to say u didnt like FIRST HALF of the movie-after watching it in megavideo – kaanee cinema POORTHIGAA CHOODAKUNDAA -logics gurinchi cheppe right- meeku ledu.

      Do watch the second half (if u really want and if some other host uploads again :D ) then come and talk about the logics. We do hear. but not now.

      • Ponit 1 above is regarding ur statement- College Environment:::: idi college ani ekkada anipinchaledu

        point 2 is about u saying – As I told you, nenu ilanti industry varasulni assalu accept cheyalenu

        point 3 is about the statement- ikapothe college motham vedhavalena

        • sekhar says:

          Hey Mohan..

          gotchya… about second half… sure I will add my comments again…

          @point1
          Still I didnt watch the second half… I thought that what I saw in the first half is college… Isn’t it? Even in the movie Shiva… we have some ppl like Subhaleka Sudhakar… that is what I have expected in the first half as well…
          @point3
          Hey you know what… I liked Magadheera…althouhg he is chirutha… so, I dont have obligation to accpept if it is really good. FYI, this is not preconceived notion…

          any how I like the way you presented the movie.. although too positive… have fun dude…

  24. ధోండి says:

    రాక రాక ఒక్క తెలుగు సినీమా వచ్చిందని (వెల్లింగ్టన్) వెళ్ళా! ఈ సినీమా నుండి ఎటువంటి ఆశ లేనప్పటికి తీవ్ర నిరాశతో బయటకి వచ్చా.

  25. shanthi says:

    ఈ సినిమా ఏమి బాలేదు. నిజం చెప్పాలంటె ఒక చెత్త సినిమా. దిల్ రాజు ‘పరుగూ ‘జొష్’ ఫ్లొప్స్ తరువాత కొంచెం జాగ్రత్తగా అడుగు వేస్తాదేమొ చూద్దాం! ఐనా తెలుగు సినిమా అద్రుస్టమేమంటె Govt. పుణ్యమా అని అత్యధికంగా వున్న ticket rates మూలంగా, multiplex మూలంగా,అలాగే అంధ్రులకి వున్న సినిమా పిచ్చి వలన commercial ఫ్లొప్ అయ్యె అవకాశాలు తక్కువ!మరీ కడుపు లో దేవే సినిమా లైతే తప్ప.lol

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.