వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.)
వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచిన ఘనత ఆయనది. చల్లగాలి, సన్నజాజుల నేపథ్యంతో చిన్న మాటని అత్యంత మనోరంజకంగా చెక్కిన పదశిల్పి వేటూరి. (చిన్నమాట… ఒక చిన్నమాట)
వేటూరి కలం నుంచి జాలువారిన కవిత్వం… అజరామరం. పాటల రాతలోనే కాదు…. వచన రచనలోనూ మేటి అనిపించుకోవడం… ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఆయన ప్రతి పాటా… మెరుపుగా, ఉరుముగా నినదించింది. మారుతున్న కాలంతో పాటే పాట స్టైల్‌నూ మార్చి… యువత మనసు కొల్లగొట్టడంలో ఆయన నిత్య యవ్వనుడే!
వాక్యం పురుష లక్షణమైతే లయతాత్మకమైన వాక్యం అంటే పాట.. స్ర్తీ అంశ. పాటలోని ఆ లాలిత్యాన్ని లెక్కకు మిక్కిలి పాటలలో జీవింపచేసిన పదబ్రహ్మ- వేటూరి.
పడచుదనపు లోగిలిలోకి వచ్చిన అమ్మాయి మనోవాంఛలని సిరిమల్లెపూవు చిన్నారి చిలకమ్మ సాక్షిగా రాసిన వేటూరి… ఎదురుచూపులోని మధురబాధని అద్భుతంగా చెప్పారు. (సిరిమల్లెపువ్వా, చిన్నారి చిలకమ్మ)
యువ హృదయాలలోని సంఘర్షణని, తడబాటుని, తత్తరపాటుని చిత్రిక పట్టడంలో వేటూరిని మించిన రచయిత లేరేమోననిపిస్తుంది. మనసా త్రుళ్లి పడకే, అతిగా ఆశపడకే అని హెచ్చరికలు చేసిన ఆ కవే… తొలిసారి చూపు తర్వాత అమ్మాయి మదిలో మెదిలిన కలల గురించి… నిదుర రాని కనుపాపలకు జోలపాడలేని నిస్సహాయత గురించి చెప్పిన తీరు హ్యాట్సాఫ్. (తొలిసారి మిమ్మల్ని )
వేటూరి కేవలం గీతకారుడు మాత్రమే కాదు… మంచి రచయిత కూడా. ఆయన ‘సిరికాకొలను చిన్నది’ అనే సంగీత నాటకాన్ని కూడా రాశారు. శ్రీకాకుళం నేపథ్యంగా శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి కథతో రాసిన ఈ నాటికలో భక్తి పారవశ్యతను వర్ణించిన తీరు గొప్పగా ఉంటుంది.
ఇదే కాకుండా సినిమా సంగీతం-సంగీతకారులపై తన మనోభావాలను ఆయన “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే వచన రచనలో అద్భుతంగా రాశారు. పాటలతోనే కాకుండా వచనంలో కూడా ప్రాస క్రీడలాడడం తనకు “పెన్నుతో పెట్టిన విద్య” అని నిరూపించారు వేటూరి. ఇక గోరింటాకులోని ఆయన రాసిన పాట పల్లవినే ఈ పుస్తకానికి శీర్షికగా పెట్టడం విశేషం.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వేటూరి 10వేల పైగా పాటలు రాశారు.
పంతులమ్మ, కాంచన గంగ, చంటి, రాజేశ్వరి కల్యాణం, సుందరాకాండ సినిమాల్లో రచించిన పాటలకు నంది అవార్డులు గెల్చుకున్నారు. ఇక శంకరాభరణం లోని అన్ని పాటలకు రచన చేసి శాస్త్రీయ సంగీత ధర్మంలోని పాటల రచనలో మేటి అని నిరూపించుకున్నారాయన. (శంకరా నాదశరీరాపరా)
వేటూరి ఎన్నో తాత్విక పరమైన పాటలను కూడా రాశారు. స్రవంతి సినిమాలోని “నవ్వుతూ వెళ్లిపో నువ్వుగా మిగిలిపో” పాట పాజిటివ్ థింకింగ్ ఆటిట్యూడ్స్‌ని చూపిస్తే… మాతృదేవోభవ సినిమాలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటలో జీవన తాత్వికత- వైరాగ్యంగా వ్యక్తమవుతుంది. ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డును సాధించింది. తెలుగు పాటకు కీర్తిని తెచ్చింది. వేణువై వచ్చాను అనే పేరుతోనే వేటూరి తన ఆత్మకథను రాయాలని సంకల్పించడం… ఆ పాటపై ఆయనకున్న ప్రేమకు తార్కాణమే.
సిరిసిరిమువ్వ సినిమాకు జంథ్యాలతో కలిసి- వేటూరి మాటలు రాయడం విశేషం. అలాగే దేశమంతా గర్వించే దర్శకుడు మణిరత్నం తీసిన గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. రాలేటి పూలతో రాగాలను పలికించారు.(ఆమనీ పాడవే… హాయిగా )
తెలుగు సినిమా పాటను అశ్లీలం చేశారని, వల్గారిటీని చొప్పించిన సంస్కృతికి శ్రీకారం చుట్టారని వేటూరిపై విమర్శలు ఉన్నాయి. అయితే అంతకు మిక్కిలి హృదయసంగమమైన పాటల్ని … భక్తి-ఆధ్యాత్మికంగా సైతం రాశారాయన. భక్తకన్నప్పలో శివశివ శంకర అనే పాట అందుకు ఉదాహరణ.సంగీత-నృత్య-సాహిత్యాల సమన్వయంతో కైలాసాన కార్తీకాన శివరూపాన్ని శివుని నయనత్రయ లాస్యాన్ని… సాగరసంగమంలో నాదవినోదంతో పరుగులెత్తించారు. నటరాజు కీర్తనలో ఓం నమశ్శివాయను మహాద్భుతంగా ఉరకలెత్తించారు. (నాద వినోదం నాట్యవిలాసం )
తెలుగు సినిమా ఒక అందమైన తోట లో ని పాటల చెట్టు కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి! తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!
–మామిడి హరికృష్ణ
vinay chakravarthi says:
he got for raalipoyae not for vaenuvai
he expected for that(venuvai)…………….
దేశమంతా గర్వించే దర్శకుడు మణిరత్నం తీసిన గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. రాలేటి పూలతో రాగాలను పలికించారు.(ఆమనీ పాడవే… హాయిగా )?
నాకు ఎందుకొ మీరు వేటూరిని తక్కువ చేసారనిపించింది. మణికి వేటూరి రాత అంటే చాల ఇష్టం అందుకే
Chari says:
raali poye puvvaa neeku raagalenduke paataku vachchindi award, venuvai vachanu ku kaadu, venuvai vachanu paata ku vachunte baagundedi ani anukunnaru veturi gaaru, mee daggara komma kommako sannayi undaa? aa book kosam monna inida vellinappudu try chesanu, kaani adi out of print ayindata, can you let me know where I can find the book. thank you
vinay chakravarthi says:
hi chari…u can order here………
http://www.avkf.org/books
K మహేశ్ కుమార్ says:
చదువుతూ చదువుతూ మధ్యలో మీరు పాటల్ని బ్రాకెట్లో పెట్టినచోట ఒక వీడియో వేసుకుంటే…ఒక మాంఛి TV కార్యక్రమం అయ్యుండేది. ఇన్ని మంచి పటల్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
నేస్తం says:
“అలాగే దేశమంతా గర్వించే దర్శకుడు మణిరత్నం తీసిన గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు”
ఇందులో ఉన్న “అరుదైన” ఘనత ఏమిటో నాకు అర్ధం కాలేదు.
మణిరత్నం సినిమాకు రాయటమా? ఇంకా మరి కొన్ని మణిరత్నం సినిమాలకు కూడా ఆయన రాసారు.
లేక ఒక సినిమాకు అన్ని పాటలను రాయటమా? కొన్ని డజన్ల కొద్ది సినిమాలకు వేటూరి వారు సింగిల్ టైటిల్ కార్డు హోల్డర్.
పదాలని భారీగా వాడాలనే తాపత్రయం వదిలేసి విషయాన్ని సూటిగా చెప్తే బెటర్.
రాకేశ్వర రావు says:
రెండు వ్యాసాలు అనేసరికి ఇంకాస్త ఎక్కువ ఆశించాను. దశాబ్దాల క్రమంగా ఆయాన వ్రాసిన పాటలు, అందులోని మంచిపాటలు. దానితో పాటు ఆయని నేపథ్యం అందిస్తూ ఇంకొన్ని వివరాలు ఉంటే ఇంకా బాగుండేది.
ravi s says:
essay is good..but felt it as incomplete.. i have expected more details on the lyrics..the author explained them in peripheral
yardstick says:
The article is not good. Neither does it provide proper information nor it has good content.
Maniratnam ku rayadame Veturi Ghanata ani article lo rasarante it shows how much the author has knowledge about Veturi..
Better to stay away than filling some crap on Legendary personalities..
Niranjan Rao says:
ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని “శంకరాభరణం” లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు.”సిరి సిరి మువ్వలో” వారు వ్రాసిన”ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల” అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి.”ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన” అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే “మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ” అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,”నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక “అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని”స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ” అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే.”నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు”"మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం’ అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే .”క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు” అని తట్టిలేపింది వారె.”ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె” అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే.”ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది.” అని కులాలు లేవు అని చెప్పందీ వారె.”పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో” అని ఒక అమాయక కొయదొర భక్తిని “ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము ” అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె.”ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ” అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే.”నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన” అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ “అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె.”ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ,” అని “అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ ” అంటూ ధైర్యాన్నిచ్చింది వారె.”వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం ” అని చెప్పిన అయనే “అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం” అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.