Menu

Monthly Archive:: September 2009

బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం

బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ శీర్షికలో వచ్చిన మొదటి వ్యాసంలో రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ గారు అవార్డు సినిమాల గురించి చెప్తూ “మన తెలుగు వారికీ, అవార్డులకీ చుక్కెదురనీ, మనవాళ్ళు అవార్డులనూ, అవార్డులు మనవాళ్ళనీ పట్టించుకవనీ చెప్తూ అవార్డు సినిమాలంటే అర్థంకానివి, స్లో గా నడుస్తూ, తానేడుస్తూ ఇతరులనేడిపించేవి అని డిఫైన్ చేసి ఆ తర్వాత అవార్డు

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు.

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.) వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.) వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే

బాణం-మూడోస్సారి!

నవతరంగంలో బాణం గురించి జరుగుతున్న చర్చ చూసి ఎలాగైనా ఈ సినిమా చూడాలనిపించింది. (నవతరంగం ఈ సినిమా బాగోలేదని వ్రాసిన సమీక్షలు చదివికూడా ఈ సినిమా చూడాలనుకుని చూసిన చాలామందిలో నేనూ ఒకడిని. ఆ విధంగా నవతరంగం రివ్యూ ఆధారంగా మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించకోడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ) బాణం సినిమా చైతన్య దంతులూరి అనే నూతన దర్శకుని మొదటి ప్రయత్నం అని తెలిసిందే. ఇక ఈ సినిమా కథ

UK Environment Film Fellowhips-2010

బ్రిటిష్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఔత్సాహిక సినీ దర్శకులకు అందచేసే ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెలోషిప్స్ కోసం 2010 సంవత్సరానికి గానూ ప్రకటన జారీ చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీం ఆధారంగా ఈ ఫెలోషిప్స్ కి ఆహ్వానం పలుకుతోంది బ్రిటిష్ కౌన్సిల్. 2010 సంవత్సరానికిగానూ ఈ క్రింది రెండు థీమ్స్ గురించి సినిమాలు నిర్మించాలనుకునే దర్శకుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ ఎదురుచూస్తోంది. Climate change and Cities Climate change and water ఈ ఫెలోషిప్స్