![]()
గతంలో ఈ వ్యాస పరంపరలో వచ్చిన వాటిని 1, 2, 3, 4 ఆ అంకెల మీద నొక్కి చదవండి.
హ్మ్!
చాలారోజులైంది ఇది ఆలోచించి. ఆయనతో నా పరిచయం నా ఆలోచనా ధోరణిని క్రొత్త పుంతలు తొక్కించింది. కానీ కాస్తంత అలజడిని నాలో రేకెత్తించింది. ఏమిటీయన తత్వం. అసలు ఆ మనిషి నిజంగానే మారాడా? లేదా ఇది నాభ్రమా? లేదా మళ్ళా పరిస్థితుల్లో మార్పా?
అనంతరామ శర్మ! అసూయకి పర్యాయ పదం. ఒకసారి ఆయనతో నా సంభాషణలో నాకు అసూయ అంటే తెలియదన్నాను. సత్యాన్వేషివి కదా! అన్వేషించు. అన్నారు. ఇందాకన కూచుని అలా ఆలోచిస్తుంటే ఇదే గుర్తొచ్చింది. అప్పుడె నాలోంచీ వెలువడిందా శబ్దం.
హ్మ్!
అంతటి మహా పండితునికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్నే తిరస్కరిమ్చిన వ్యక్తి, ఒక సర్వసఙ్గ పరిత్యాగి అయిన సచ్చితానంద స్వామినే మెప్పించిన ఘనుడు. పురుష సూక్తాన్నే వరుస (బాణీ) మార్చి పాడగలిగే సామర్థ్యం ఉన్న… ఆఁ అద్గదీ ఇప్పుడు దొరికారు. హుర్రే!
*** *** ***
“నన్నే కీటింగ్ అంటాడా?” అని వెంకట్ ముందు గర్జించిన ఆయన స్వరం నా చెవులలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఒకసారి కాదు. రెండు సార్లు ప్రయత్నిస్తేనే కానీ ఆయన వాక్ప్రవాహానికి నేను అడ్డుకట్ట వేయలేని పరిస్థితి.
ధాటైన, ధీర గంభీరమైన స్వరం! అది ఒక కీటింగ్ కి ఉండునా? అంతమాత్రాన ఆయన “శంకర శాస్త్రిని Roark తో పోల్చిన ఇతను నన్ను మాత్రం కీటింగ్ తో పోలుస్తాడా!” అని గర్జించిన తీరు ఆయన మనస్తత్వాన్ని కాస్తంత లోతుగా పట్టి ఇచ్చింది. అంతటి మహా (???) పండితుడు ఎవరో ఒక పిలగాడు చెప్పిన మాటకి అంతలా బాధపడటం!!!
హ్మ్!
ఆశ్చర్యమే కదూ. నేనంతలా చెప్పగలిగానా? లేదా ఆయన నేననుకున్న ట్రాప్ లో పడ్డారా? నాకైతే మరొక క్లూ దొరికింది. (ఆ క్లూలను బట్టే నేను ఆయనకి అసూయ కలగటానికి గల కారణాన్ని కనుగొన్నాను) ఆ తరువాత నా లక్ష్యం అసూయ అంటే ఏమిటో అన్వేషించి అర్థం చేసుకుంటం. ఎందరినో అడిగాను. ఎవరూ నాకు అసూయకి మూలం ఇవ్వలేదు. అందుకే నాకు తెలిసినంతలో అసూయని డీకోడ్ చేసే పని పెట్టుకున్నాను. అ-సూ-య. చిత్రమైన మాట. దుర్యోధనుని కాలం నాటి నుంచీ ఈనాటి వరకూ ఆ అసూయ పట్టిన వారంతా పతనమే తప్ప వేరొకటి ఎరుగరు. అంత చెడ్డదా అసూయ? అవునా?
నా దృష్టిలో అసూయంటే నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు నీలో రేగే అలజడి. అవును అంతే కదా! అంటారా? కాదంటాను నేను. ఆ అలజడిని ఎందుకు మంచి మార్గంలో పెట్టరనేదే నా అనుమానం. నాకున్న పెద్ద డౌట్. నీకన్నా గొప్పవారిని చూసినప్పుడు చేతనైతే వారిని మీంచేలా ఎదగాలనుకోవాలి కానీ వారిని ఎందుకు దెబ్బతీయాలని అనుకోవాలి? ధర్మరాజుని, పాండవులని చూసి దుర్యోధనుడు ఎందుకు అసూయ పడ్డాడు? అదే పాండవులని మించి ఎదిగి (వ్యక్తిత్వంలో), ఒదిగి (మనిషిగా) పెద్దలనీ, ప్రజలనీ మెప్పించేందుకు తన తెలివితేటలనీ, సమయాన్నీ, వనరులనీ వెచ్చిస్తే? భారత యుద్ధమే జరిగేది కాదేమో! అంటే చరిత్రగతిని అసూయ మార్చేసింది.
హ్మ్!
“అంత శక్తివంతమైనదా అసూయ?” అనుకున్నాను. ఇంకా నా అన్వేషణలో మునిగాను. ఒక మిత్రుని అడిగితే తగు మాత్రమైన సమాధానం చెప్పి, అది… Anthropological కారణాలు కూడా ఉన్నాయని చెప్పగా నేనాశ్చర్యపోయాను. అంటే మనిషి మూలంలోనే అసూయ కూడా ఉన్నదా? అని నాకు తట్టిన ఒక మాట. అది నిజమో కాదో? valiDO కాదో నాకు తెలియదు. నీకన్నా పైవారిని చూసి నీకు కలగాల్సిన భావన వారిని మించి ఎత్తుకి ఎదగాలనే కోరిక. అదే వారినణిచేసి నీ పైచేయిని చూపుకోవాలనుకోవటం నీ ఫూలిష్నెస్. నాలుగడుగులు వెనుకకి వేయడమే. నీ నిజమైన ఎదుగుదలని నీవే కుంచింపజేసుకోబూనడం. ఒకరు పతనమైన తరువాత నీవెంత గొప్పవానివైనా, ఆ గొప్ప అసలైన పోటీదారు లేనిదే రాణించదు. మొన్న ఫ్రెంచి గెలిచిన Federer లా. (Federer అసూయా పరుడు కాదు. నాడల్ లేనందువల్ల అతని విజయాలకి మచ్చలేకున్నా నాడల్ లేడు అనే భావన మాత్రం అలాగే ఉంటుంది). నాడల్ ఉంటే అనే ప్రశ్న అందరి మదిలోనూ. వింబుల్డనులోనూ అంతే. ప్రత్యర్థిని మించి ఎదగటమే విజేత లక్షణమే కానీ, ప్రత్యర్థిని పడగొట్టి, నీకన్నా క్రింద పడేలా చేసి, లేదా ప్రత్యర్థిని రూపు మాపి, నీవు ఎదగక నేను గెలిచాననుకోవటం… చేతగాని తనానికి పరాకాష్ట. అందుకే ఆయన పీటర్ కీటింగ్. తనకి ప్రత్యర్థి లేకుండా చేసుకోబూనాడు కానీ తాను ఎదగాలనే ఆలోచనని వదిలేశారు.
*** *** ***
గంగాధారానికి, అనంతరామ శర్మకీ మౌలికమైన భేదం నాకు అవగతం అయింది. అదే… “సంగీతమే ప్రపంచం Vs ప్రపంచమే సంగీతం”
ఎలా?
మళ్ళా కలుద్దాం!
హ్మ్!
అసూయా అనసూయత్వం… హహహ
K మహేశ్ కుమార్ says:
ఇలా చైతన్యస్రవంతి శైలిలో మ్యూజింగ్స్ లాగా సాగే వ్యాసాల్ని విడివిడి భాగాలుగా ప్రచురించడం వలన పాఠకులకు విసుగొస్తుందేతప్ప ఆస్వాదనకు ఆస్కారం కలగదు. సమయం తీసుకున్నా ఒక్కసారిగా రాసి ప్రచురించండి.
అలాగే అక్కడక్కడా సాగిన మీ ర్యాండమ్ ఆలోచనలకు లంకెల ద్వారా కొన్ని రెఫరెన్సులు ఇవ్వండి. పీటర్ కీటింగ్ ఎవడో తెలీని వారికి ఒక వికీ లంకె తగిలిస్తే తెలుస్తుంది. ఫెడరర్ నాడర్లు ఎవరో మాకు తెలుసుకునే ఆస్కారం కలుగుతుంది.
One things is for sure, This is NOT the right way of presenting such a complex essay.
సుజాత says:
సరే, ఇంతకీ అసూయ అంటే ఏమిటో అనుభవమైందా మీకు మాస్టర్జీ!
ఇంత గాప్ తీసుకుంటే ఎలా? ఈ టపాకు అనుబంధ టపా ఇంతకు ముందెప్పుడో చాలా రోజుల క్రితం చదివినట్లు గుర్తు!
గీతాచార్య says:
Sure. I’l finish the Swathikiranam scenes in a jiffy. Then I’ll take the responsibility of The Fountainhead.
ఈ శ్రేణి లోని రెండొ సినిమాకి సంబంధించిన వ్యాసాలని ఎప్పుడో వ్రాసుకుని ఉంచాను. ఇదే కాస్త ఆలస్యం చేయించింది. వాటిని నాలుగైదు రోజులకి ఒకటి చొప్పున ప్రచురిస్తాను. మీ ఆలోచనకి, సూచనకి ధన్యవాదాలు.
Sarath 'Kaalam' says:
నాకయితే ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు. ఇదివరకటి భాగాలు చదవకపోవడం వల్ల కాబోలు. అసలు నవతరంగానికీ ఈ వ్యాసానికీ ఏమయినా సంబంధం వుందా అని బోల్డు సందేహం వచ్చేసింది. ఇంతకీ ఈ వ్యాసం దేని గురించి మహాశయా? సినిమాల గురించేనా!
chandrasen says:
me too.. i didn’t read old parts but couldn’t understand anything in this- everything is going over my head-why so much complexity? what do you want to communicate Geethacharya? can u pls explain this in plain terms- so that I can read your content again and map it.
chandrasen says:
hey..not bad…old links chadivaanu…artham avuthundi ippudu…but still complex ga anipinchindi…
వెంకట్ ఉప్పలూరి says:
మీ భావన అర్దం అయ్యింది. కానీ ఎప్పుడో 20 సంవ త్సరాల క్రితం వచ్చిన సినిమా. క్లాస్ కే నచ్చింది గాని మాస్ కు నచ్చలేదు. అది గుర్తుంచుకొనో లేక ఈ మధ్య ఆ సినిమా మళ్ళీ చూసో మీరీ వ్యాసం రాశారు. కానీ మాకు ఆ సినిమా గుర్తుండాలిగదా. అన్వయించుకోలేక పోతున్నాము.
మేడేపల్లి శేషు says:
గీతాచార్య గారూ, ఇలాంటి వ్యాసాలకు కంటిన్యుటీ చాలా అవసరమండీ. మొదట్లో మీ కాన్సెప్టు చాలా బాగా అన్పించింది. కాని తర్వాత్తర్వాత ఇది ఎటుతిరిగి ఎటు వెళ్తోందో అర్థం కాకుండా ఉంది. మీరేం చెప్పదలచుకున్నారో స్పష్టంగా తెలియడంలేదు. ఇంకొంచెం straight forward గా రాయటానికి ప్రయత్నించండి. మీరిచ్చే రెఫరెన్సుల గురించి పాఠకులకు తెలిసే ఉంటుందని అనుకోకండి. కొన్నిచోట్ల క్లాస్ టీచర్ టైపు వివరణ కూడా అవసరం. అలాంటి వివరణ ఇవ్వటానికి మీరు వెనకాడనవసరం లేదు. ఆ స్టైలు కొంత బాగోదనుకున్నా, చదివేవాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడక్కుండా ఉంటారు. ఈ వ్యాసాలకు మీ స్టైలును (శైలిని) డిఫైన్ చేసుకోవటం చాలా అవసరం. మీరు ఆయన ఒక్కొక్క పాత్రను తీసుకుని ఒకటి, రెండు వ్యాసాల్లో విశ్లేషించవచ్చు.
‘స్వాతికిరణం’ సినిమా చూడనివాళ్ళు వెంటనే ఒక సిడి/డివిడి కొని పెట్టుకోండి. తెలుగులో ఆస్కార్ అవార్డు అంటూ ఇచ్చే అవకాశం నాకేదైనా ఉంటే, నేను ఈ సినిమాకు ఇస్తాను. చాలా మంచి సబ్జెక్టు. అది ఫెయిలవటం మన దురదృష్టం. విశ్వనాథ్ సినిమాలన్నీ నాట్యం, సంగీతం చుట్టూనే తిరుగుతుంటాయి, ఆయనకు వేరే సబ్జెక్టులు దొరకవా అనుకునేవాళ్లు, అలాంటి ఆయన సినిమాలన్నీ మళ్ళీ చూడండి. దేనికది విభిన్నమైన కథలు. కథ విషయంలో ఏం చెప్పాలనుకునే దాంట్లో ఆయనకో స్పష్టత ఉంది. కళకూ (సినిమా అనే), వ్యాపారానికీ చక్కటి వారధి వేసి సక్సెస్ అయిన దర్శకుడు విశ్వనాథ్.
su says:
oscaraaa??? inkem kaadu???
anyone watched the movie AMADEUS??
its made way back in 1984…
based on biography of music maestro MOZART….
http://www.imdb.com/title/tt0086879/
it won 8 oscars…
some people say SWATIKIRANAM is direct copy of this film…
but I wont say it..
but I can see hell of inspiration in its story..
the basic storyline of one music maestro shaken by exuberant talent of a younger prodigy…who is a bit naughty (in english naughtiness is depicted in his erratic sexual behaviour too) …
and one more similarity is the aspect of GOD/DIVINITY and older composer always blaming Why God never gave him such talent..
our people ..if they find any similarity…they try to malign the indian filmmakers saying..they “copied” it… which is very outrageous assault on a director’s talent..
I respect Viswanth’s capability in “adapting” Amadeus story to our telugu nativity..
but at the same time..the film falls much shorter than the english one..in aspects of everything…
may be thats y..it dint cross national festival borders..if only there was no AMADEUS in ’84then recognition would have been different for this film
గీతాచార్య says:
Nice information. ThankQ.
But I won’t agree with… “the film falls much shorter than the english one..in aspects of everything…” But probably it may not be better than that movie. I oughtta watch it before comment. Right.
అభిమాని says:
బాబూ/అమ్మా సూ.
మీరు అందరిని క్రిటిసైజ్ చేస్తూ ఉండడమేనా లేక మీకంటు ఏదైనా ఒక ఒపీనియన్ లేదా థియరీస్ ఉన్నాయా?
మరో విషయం.
మీరెందుకు తెలుగులో వ్రాయటం లేదు?
ఇక స్వాతి కిరణం అమేడ్యుస్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీసిందనీ కాబట్టి విశ్వనాథ్ గ్రేట్ అయినా మరీ అంత గ్రేట్ కాదని మీ నాలెడ్జి ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం బావుంది.
అయితే అదే విశ్వనాథ్ తీసిన స్వాతిముత్యం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిందే ఫారెస్ట్ గంప్ అని ఒక టాక్. మరి ఆ ఫారెస్ట్ గంప్ కూడా ఆస్కార్ విన్నరే.
ఇప్పుడు మీరేమంటారు?
జీడిపప్పు says:
గీతాచార్య గారి ఆర్టికల్ లా ఉంది “స్వాతిముత్యం – ఫారెస్ట్ గంప్” లాజిక్. ఓసారి ఫారెస్ట్ గంప్ చరిత్ర చూడండి మాస్టారూ.
అభిమాని says:
ఏమి చూడమంటారు ఫారెస్ట్ గంప్ హిస్టరీ…
స్వాతిముత్యం 1985 లో వచ్చింది. ఫారెస్ట్ గంప్ క్యారెక్టర్ 1986 లో సృష్టించబడింది. మాకు తెలియని ఆ చరిత్ర మీరే చెప్పకూడదూ?
గీతాచార్య says:
Jeedipappu,
I seriously object your comments. You may like or not. మీ అభిప్రాయాలని చెప్పండి. ఎవరికీ అభ్యంతరం ఉండదు. వేరొక వ్యాఖ్య గురించి మాట్లాడుతూ నా ఆర్టికిల్ గురించి హాస్యంగా వ్యాఖ్యానించవద్దు.
జీడిపప్పు says:
అభిమాని గారు, “స్వాతిముత్యం 1985 లో వచ్చింది. ఫారెస్ట్ గంప్ క్యారెక్టర్ 1986 లో సృష్టించబడింది” అన్నారు. నిజమే. ఇప్పుడు చెప్పండి రెండింటికి పాత్రల విషయంలో, కథ విషయంలో, కథనం విషయంలో సంబంధమేమిటో.
గీతాచార్యగారు, ఎందుకు అంత సీరియస్ అబ్జెక్షన్? నేను అన్నమాటకు “మీలాజిక్ గీతాచార్య గారి ఆర్టికల్ లా చెత్తగా ఉంది” అని అర్థం. “గీతాచార్యగారి ఆర్టికల్ లా” అన్నమాట మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పుడు కేవలం ఈ ఆర్టికల్ మీద నా అభిప్రాయం చెబుతున్నా – మీరు రాసిన ఆర్టికల్ పరమ చెత్తగా ఉంది.
ఇప్పుడు కూడా సీరియస్ అబ్జెక్షనా?
btw, for some reason the ‘reply’ icon is not showing for your posts, hence posting them here
గీతాచార్య says:
శేషు గారు,
మీ సూచనకి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులని బట్టి ఇలా జరిగింది. ఇక ముందు కంటిన్యుటి దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాను.
BTW, this is the BEST INDIAN MOVIE I ever watched.
su says:
well…if you watch with such a preconcieved notion…obviously u may nt like it better
i know Viswanth’s films are like mother’s food for us…and when we taste something really authentic still nothing beats mother’s food..
but when we are talking about the craft…we got to get rid off some sentiments to look things objectively…and its only to make mother’s food better..not disliking/looking inferior at it..
there are some real idiots i know…who love vishwanath for his caste…and there are much more idiots who hate wtever he does just attaching caste brand to it which he might have never intended…
(viswanath ane kadu lendu..mana vaLLu caste drushTito cinemalu pogiDi.TiTTevaaLLu unnaru )…
it may sound unrelated to discussion here…but all about this film and this director..where i heard both versions…just felt like sharing..
గీతాచార్య says:
FYI, I have no such preconceived notions. I even won’t emotions to play part in my works. If I get to watch the movie, I’ll watch it open minded.
Caste, and race are like shit to me. I judge things by their quality. That’s all.
గీతాచార్య says:
@Jeedipappu garu,
ఏ ఆర్టికిల్ చెత్తగా ఉందో, ఎమ్దుకు చెత్తగా ఉందో చెపితే మాకు కూడా ఇంప్రూవ్‍మెంట్ కి అవకాశం ఉంటుంది
Dhanaraj Manmadha says:
Very well written. But must not lack continuity. కనీసం నెలకొకటైనా వస్తేనే బాగుంటుంది.
Vaishnavi Harivallabha says:
Sorry for coming late.
Very entertaining and thought provoking. But the gap is so huge that following and enjoying the series is a bit difficult. But can not help but read. The posts are valuable.
The last paragraph b4 the tail piece is more than excellent. Waiting for the next post in this series.