Menu

మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో..

FOR NAV.మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో..
(
ప్రయత్నం చెయ్యండి ..ఫలితం ఆశించకుండాఅని ఒక మంచి పుస్తకం లో ఒక మంచి వ్యక్తి చెప్పినట్ట్లు గా…) వ్యాసానికి ముందు మాట ఏంటంటే. : వెంకట్ గారు చెప్పినట్లు ఇది సాధ్యమె.ఇలాంటి ఒక చిన్న ప్రయోగం మేము 1997లోనె చేశాము..తరువాత ఎన్నోఇప్పుడు సినిమా..ఆన్ లైన్ లో కాని , పుస్తకాలలో కాని , స్వయంగా విదేశాలలో కాని ఎంతమంది ఫిల్మ్ మేకింగ్ చదివిన వారు నవతరంగాన్ని చూస్తున్నరో లెక్కలు పక్కన పెట్టి…. ఇక దీనికి సంబంధించికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా.
నువ్వెం చదివావు నువ్వెక్కడెక్కడ తిరిగావు అని అడిగుతున్నరా? (మేము మిత్రులం 14 మంది మా అదృష్టం ఎంటంటె డిగ్రీ అయిన వెంటనె 12 సంవత్సరల క్రితం రామోజి ఫిల్మ్ సిటి లో ఉషాకిరన్ మూవిస్ స్టొరి దిపార్ట్ మెంట్ లో రైటర్స్ గా సెలక్ట్ అవ్వడం. ఆరోజుల్లోనె….పన్నెండు సంవత్సరాలక్రితమే.. మా చైర్మన్ శ్రీ రామోజి రావు గారు , సినిమా కధా
స్క్రీన్ ప్లే రచన , డైలాగ్ రచన , మొదలగు అంశాలమీద ..తెలుగు సినిమా ప్రముఖులు , పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రోఫెసర్ల తో మా అందరికి ఒక వారం పది రోజుల వర్క్ షాప్ పెట్టించారు.
మా మటుకు అది హాలి వుడ్ స్టూడియో లో చేసిన అనుభవం. అప్పటి నుంచిప్రింట్ , వీడియో లైబ్రరీ లో దొరికిన ప్రతి పుస్తకం ,ఫిల్మ్ మేకింగ్ ,హాలివుడ్ ఇంటర్వ్యూలు చదివినవన్ని ,చూసినవన్ని శాయశక్తుల ఆచరణలోపెట్టాం
మా స్థాయిలో ( శారిరకంగా, మానసికంగా, ఇగో పరంగా… ,డబ్బు పరంగా, ఇతర ఇతర లెక్కలు వేసుకోని ..సమయాన్నిబట్టి… ) అవి ప్రయత్నించి విజయవంతం కూడ అయ్యాము. అయితే ప్రపంచం రంగం తీసుకున్నా కాని మన వద్ద ఉన్న డబ్బు తో లెక్క కట్టి మన సక్సెస్ ని నిర్ణయిస్తది.
సో , సక్సెస్ అంటే ఇతరులు ఇచ్చె గ్రాఫా…? లేక్ మీకు మీరు ఇచ్చుకునే గ్రాఫా ? అనేది ఎవరికి వారు నిర్ణ ఇంచుకోవాలి.టైం పాస్ కి నోట్లో కిల్లీ వేసుకుని కూర్చున్నట్లు కాకుండ సినిమా కు సంబంధించి సీరియస్ గా ఉండి చదవాలనుకున్నట్లయితే ఫర్వాలెదు..లేక పొతే.. సెల్ఫ్ డబ్బా ఎంటి బాబు సుత్తి అని మీ విలువైన ఒక కామెంట్ ఖర్చు అయితె మాత్రం నా బాధ్యత కాదు )
ప్రధానంగామూడు విషయాలు చెప్తాను
1.
నా అనుభవం.
2.
నాకు తెల్సిన నేటి సినిమా లెక్కలు
3.
నాకు తెల్సిన కొన్ని వీడియో సినిమా సంగతులు మూడు సంవత్సరాల క్రితం ..ఒక రోజు దిన పత్రిక లో సినిమా పేజి ని చూస్తున్న అప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్న మా తమ్ముడు సాదిక్ …” సినిమా విడుదల అయినాక కనీసం రెండు వారాలు అంటె 14 రోజులు అయినా ఆడని సినిమాకు 45 రోజుల షెడ్యూల్ అంటా? అవసరమా అన్నా?? అని అడిగె సరికి . నాకు జ్ఞానోదయం అయిందని పించింది.
కట్ చేస్తె
ఇందాక ఒక డీవిడి షాపు కి వెళ్ళాను.
అక్కడ మా మిత్రుడి ఒక కొత్త సినిమా టైటిల్ ( అంటే డీవీడి ) చూసి ఆశ్చర్య పోయాను. కోటిన్నర రూపాయల బడ్జట్ తో రెండు నెలల షెడ్యూల్ తో తీసి గత నెల విడుదలయిన సినిమా ,నెల కూడ పూర్తిగా అయ్యిందో లేదోడీవీడిగా మార్కెట్ లో వచ్చింది.
*** *** *** *** *** ***
వేరె ఉదాహరణలు చెప్పడం ఎందుకు అంటారేమో సరె .నా కు సంబంధించిందే చెప్పుకుంటాను .అయితే..మేము మిత్రులం సక్సెస్ అయ్యాము అనుకునే భావన లో నా అనుభవం చెప్తున్నాను.ఇది చదివినతరువాత మీ దృష్టిలో ఇది పెద్ద సక్సెస్స్ కాదు అనుకుంటే మీ అనందాన్ని నేను కాదనను.
1997
లో డిగ్రీ ఫైనల్ ఇయర్. సిటికేబల్ కి ఒక వీడియో ఫిల్మ్ తీద్దామని అంతా ప్రణాలిక వేసుకున్నాం.(ఇక్కడ మా లక్ష్యం ఉద్దేశ్యం,లేదా టార్గెట్ ఆడియన్స్ …నిర్ణయం జరిగిపోయిందనెది గమనించండి) అంతా పబ్లిసిటి అయిపోయింది. కాని చివరి నిముషం లో ఫైనన్స్ ప్రాబ్లం వచ్చి నిర్మాత నిలవాల్సిన వ్యక్తి పక్కకు తప్పుకున్నారు. మా మొదటి ప్రయత్నం .ఆగి పోవద్దనుకున్నాం .అప్పుడు మాకు కావల్సిన బడ్జెట్ ఇరవై వేలు పెట్టె నిర్మాత ఎవరు ఎవరు ఎవరు అని సంఘ ప్రముఖల పేర్లు రాస్కుంటూ కూర్చున్నాం.
మా గ్యాంగ్ కి చాయ్ చేసి లోపలినుంచి తీసుకొచ్చిన వచ్చిన మా అమ్మి..మా పరిస్థితి చూసి విషయం ఏంటని అడిగి తెలుసుకుని ..”మొత్తం ఎంత ఖర్చు అవుతుందిరా ? నిజంగా మీరంతా చెయ్యాలని నిష్ఠగ ఉంటె అదెం అంత అసాధ్యం కాదు కదా అనిచెప్తే.., అది కాదు అమ్మి బచ్చాగాళ్ళం ఇప్పుడు మాకు పాతిక వేలు ఎవరు ఇస్తారు? అన్నాను .
అవును ఎవరైన మీకు ఎందుకు ఇవ్వాలి ? మీ ఆనందం కోసం వారెవరో కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఇవ్వాలి ?లాభలు వస్తాయని గ్యారంటి ఇస్తారా అది లేదు…?అని తిరిగి మా అమ్మి యే అనేసరికి ..మా అందరి మోహాలు ఢీల పడిపోయినవి.అప్పుడు మా అమ్మి , ” చెప్పానుకదా మీరంతా నిజంగా నిష్ఠగా చెయ్యలనుకుంటే మాత్రం చెయ్యగలరు .అదెం పెద్ద పనేం కాదఅనేసరికి నాకు తిక్క లేచింది. “అంతా తెల్సి మల్లి అదె మాట ఎంటి అమ్మి అని చికాకుగా అడిగాను.
అవున్రాఎవరో ఏదో ఇస్తెనె చేస్తార…? ఎవరూ ఏది ఇవ్వరు, సహయం చెయ్యడం లేదని మీ లక్ష్యాన్ని మానెస్తారా? తలా ఇంతా మీరె వేసుకుంటే.. చాలు ఎవరి కాళ్ళో మీరు పట్టుకోవాల్సిన పని ఉండదు కదా అని చెప్పెసరికి , మా ఫ్రెండ్ జగదీష్ కిసీక్రెట్ ఆఫ్ ఎనర్జి తెలిసినట్లు నిజమె కదా అని తనే మొత్తం ప్రోడక్షన్ బాధ్యత తీసుకుంటానని ముందుకోచ్చాడు.
నెను హీరో ని కాదు కదా నెను తక్కు వేస్తాను అని ఎవ్వరం అనుకోలేదు .నా కధ అందరు మార్పులు చెప్పారు ,కొన్ని మాత్రమె తీసుకున్నాం.దర్శకుడిగా చివరినిర్ణయం నీదె అని ముందె అనుకున్నాం కాబట్టి.ఉండదు

ఈనాటి కొంతమంది ప్రోడుసర్ల లా ,అంతా డబ్బులు వేస్తున్నాం కదా మా నిర్ణయాలు తూచ తప్పక స్వీకరించాలి అనే ఇగో లు లేకుండ…దర్శకత్వం నువ్వు కెప్టైన్ నువ్వె… మనం అనుకున్న డ్రగ్స్ కాంటెంట్ పక్క కు పోకుండ చూసుకో చాలు అని మంచి సప్పోర్ట్ ఇచ్చారు.

సోఇదంతా ఎందుకు నీ సోది అంటే
అప్పుడు మేముఅమిగోస్లా మా స్థాయిలో భారి బడ్జెట్ ఫిల్మ్బానిసతీసాం.
ప్రోడక్షన్ లో కొన్ని జ్ఞాపకాలు
1.
ఏడిటింగ్ కోసం రవివర్మ స్టూడియోకి వెల్తే.. ఆయన మా తపన , మా కాన్సెప్ట్ ,మా పని చూసి. ఫ్రీగా చేసుకోండి , నెక్స్ట్ నుంచి అంతా కల్సి మరిన్ని ప్రాజెక్ట్ లు చెద్దాం అన్ని ప్రొత్సహించారు.చేసాం కూడా
2.
మిత్రుడు చంద్ర శెఖర్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి తక్కువలో తనే వీ హెచ్ ఎస్ కెమెరా పట్టుకొచ్చాడు .
3.
షూటింగ్ లో ఒక ఆటొ అవసరం .ఆటొ ఉన్న గౌస్ మిత్రుడిని ఒక రోజు ముందే క్లీయర్ గా విషయం చెప్పి ఒక రోజు కి ఎంత కావాలి అని అడిగాం ..ఆనందం .పెట్రోలు పోయిస్తె చాలు ఆటొ ఫ్రీ తెస్తా అని మాతో టె తిరిగాడు
4.
షూటింగ కి మా ఊరు పోయాం .అనుకున్న సమయానికి ఎక్కువగా పట్టింది.వెల్లి పోదాం ఎక్కడైన టిఫిన్ చెద్దం అని అనుకున్నంకాని 20నిముషాలు కూర్చోండి అని ..మొత్తం 20 మందికి మా అత్తయ్య ,పెద్దమ్మ లంచ్ చూసుకున్నారు(అప్పుడు తెలిసింది అనుకున్న షెడ్యూల్ లో కాకపోతె…అవూట్ డోర్ లో మెస్ ప్రాబ్లం అవుతుందని.మా పరిస్థితి చూసి అత్తయ్య పెద్దమ లు ముందె అర్ధం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది..
5.
సిఖ్ పాత్రకు పగడి దొరకలేదు జగదీష్ వాళ్ళ అమ్మ గారి కొత్త చీర తెచ్చాడు. చుట్టాడు,
6.
నెషనల్ హై వే మీద తిరుగు ప్రయాణం వస్తూ వస్తూ ఒక చోట ఒక అందమైన ఇళ్ళు కనబడింది , వెంటనె వెళ్ళి ఒక రెండు సీన్స్ షూటింగ్ చేసుకుంటామని చెప్పాం. వాళ్ళు వెంటనె ఒప్పుకున్నారు
7.
స్థానిక జర్నలిస్ట్ మిత్రులు నాలుగు ముక్కలు రాసారు.
ఇలా చాలా ఉన్నాయికాని మీ లో కొంతమంది దృష్టి లో మేము సక్స్ కాదు కాబట్టి నా సోది ..పోడిగించను. ఇలా నేను ,నా మిత్రులంకొన్ని డిజిటల్ ఫిల్మ్ లు చేసుకున్నాం. మా టార్గెట్ ..మీము చేరుకుంటున్నాం. జీవితం అంటే ప్రయాణం, గమ్యం కాదు .అలాగె సినిమా అంటే తీసిన తరువాత కాదు..తీసె టప్పుడు ఉండె ఆనందం కోసం తియాల.తీసినాక ప్రతిఒక్కరికి నచ్చాల అని అనుకోవడం మా లో లేదు. ఎందుకంటే వినాయక చవితి రంజాన్ ఒకే సారి వస్తె… హిందువులు నెలవంకను చూడరు పండగ చేసుకుంటారు, ముస్లిం లు ఆ నెలవంక చూస్తెనె పండగ జరుపుకుంటారు కాబట్టి.. ఇక్కాడ నెలవంక అందరికి నచ్చిన నచ్చక పోయిన నెలవంక ఆకాశం లో రావడం మాత్రం తధ్యం కద..అలా ఎంతమంది చూస్తారు చూడరు …నచ్చిద్ద నచ్చదా అనెది ఛోడ్ దో.

2నేటి సినిమా లెక్కలు షార్ట్ గా ;
ఇంటర్నెనెట్ పేరిగి, హోం ధియేటర్లు పేరిగిన నేపధ్యం లో లో పేద్ద నిర్మాతలు కూడ తమ చిత్రం విడుదల అయిన వారం లోపె పెట్టిన పెట్టుబడి వచ్చేసె విధంగ.. ప్రింట్లు వేసుకోని విడుదల చేసుకుంటున్నారు.ముఖ్యంగా డిజిటల్ ప్రొజెక్షన్లు వచ్చాక.
చిన్న ఉదాహరణ పెపర్లో , మధ్య విడుదల అయిన అడవి సినిమా 7 తేదిన విడుదల అని ప్రకట వచ్చింది , 14 తేదిన రోజె చివరి రోజు అని వచ్చింది . అంటె అర్ధం చేసుకోవచ్చు.
సో ఏది చేసిన ముందుగా మార్కెట్ ఎక్కడుంది? ఎంత వస్తది అని లెక్క వేసుకోని లెక్కలోపు బడ్జెట్ వేసుకోని ఏదయిన తీసుకుంటే బాగుంటది.
అంటే ముందె శాటిలైట్ ఎంత వస్తది కనుక్కోని ,ఆడియో రైట్స్ ,డీవీడి రైట్స్ ఎంత వస్తాయి అని ,సినిమా లేద వీడియో లో బ్రాండ్ ప్రోమొషన్ ఎంత వస్తంది..
ఇలా ముందుగా లెక్క వేసుకోని కధ రాసుకుంటే నష్టాలుండవు. . క్రిష్ణా నగర్ కు వెల్తె నటించడానికి లైన్లు కట్టి ఎంతో మంది నటీనటులు ,ఇలా..మీకు సహయ పడటానికియూనివర్స్సిధ్ధంగా ఉంది మీరు మొదలు పెట్టడం ఆలస్యం.
వీడియో హోం ధియేటర్ ఫిల్మ్ కి టీవి టెలి ఫిల్మ్ లకు బ్యానర్ రిజిష్ట్రేషన్ లు అవసరం లేదు సెన్సార్ లేదు.వీడియో సీడి , డీవీడిలకు మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ ను అందజేస్తారు.మసాబ్ ట్యాంక్ ,జె ఎన్ టీ యూ పక్కన ఎన్ ఎఫ్ డీ సి కార్యాలం వెల్తె అన్ని వివరాలు ఇస్తారు.సినిమా బ్యానర్ రిజిష్ట్రేషన్ అయితె..నిర్మాతల మండలి లో సభ్యత్వం ,ఫిల్మ్ చాంబర్ లో సభ్యత్వం..కావాలి ..అన్ని ఖర్చులు కలుపుకోని 1.20 నుంచి …1.50 లక్షలు ఖర్చు అవుతుంది అది నిర్మాత గా జీవిత సభ్యత్వం.(ఇది అతి త్వరలో బహూష నెల లో కూడ కావచ్చని ఊహా గానాలుమూడులక్షలకు పేరగవచ్చు.) సినిమా టైటిల్ రిజిష్ట్రేషన్ చెయ్యాలనుకుంటే.. మూడొందల యాభై రూపాయలు అవుతుంది . మొదటి సారి అయితె..ఏదైన ల్యాబ్ నుంచి అగ్రిమెంట్ లెటర్ ఉండాలి, లేద ఎఫ్ డీ సి సర్టి ఫికేట్ ఉండాలి .ఒక సారి రెండు టైటిల్స్ చేసుకోవచ్చు.(ఇవన్ని చాలా మందికి తెలిసె ఉంటాయని ఇప్పుడు అనుమానం వచ్చింది కనుక ఈ విషయాలనుంచి వీడియో విషయాల కు వెల్దాం.)
3.
నాకు తెల్సిన కొన్ని వీడియో సినిమా సంగతులు
a.
అయితే..మీరు చదివె ఉంటారు .చదవని వారి కోసం మధ్య వీక్ పత్రికలో వచ్చిన ఆర్టికల్ లంకె ఒకటి ఇస్తున్నాను .
http://week.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/theWeekContent.do?BV_ID=@@@&contentType=EDITORIAL&sectionName=TheWeek%20Statescan&programId=1073755754&contentId=5644628
మాలె గావ్ సినిమాల గురించి తెల్సె వుంటది.http://www.youtube.com/watch?v=kqvgzFVSZ_g
c.
ఇంకా ఎన్నోN.G.O. సంస్థలు రక రకాల విషయాలమీద డీవీడి ఫిల్మ్ లు తీసి అమ్మడం చేస్తునే ఉన్నాయి
d.
జానపద , విప్లవ, పౌరాణిక పరమైన ఎన్నో వీడియో సీడి లు స్థానిక గ్రామీణ ప్రాంతాలలో బాగ అమ్ముడవుతున్నాయి.నాకు తెల్సిన మిత్రులుబ్లూమాట్ లోనెఎన్నో వీడియో ఫిల్మ్ లు తీసి మార్కెట్ చేసుకుంటున్నారు.మా మిత్రుల ఉద్దేశ్యం ఎమిటంటే.. చిన్న చిన్న ఫిల్మ్ లు అయిన టెలీ ఫిల్మ్ లు అయినా.. అంతిమంగా మేము కోరుకునేది ఏమిటనేది చూసుకుంటాం.
అర్జున ఏమి కనపడుతుంది అంటే కన్ను మాత్రమే గురువర్య అన్నట్లు
కొన్ని ఫిల్మ్ లు కేవలం అనుభవం కోసం అని చేసుకున్నాం.
కొన్ని పేరు కోసం చేసుకున్నాం.
కొన్ని మార్కెటింగ్ కోసం చేసుకున్నం. ఇప్పుడు మేము . .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో.. ఒక సినిమా మొదలెట్టాము .. సినిమా ఉద్దేశ్యాలుమిగితా టీం వివరాలు మరో మరో టపా లో రాస్తాను .
అందరికి వినాయక చవితి విజయాలను తీసుకో రావాలని మనసార కోరుకుంటూఅమీన్.

b.

11 Comments
  1. Dr. Acharya Phaneendra August 23, 2009 /
    • Alibhai August 23, 2009 /
  2. Malakpet Rowdy August 23, 2009 /
  3. Srinivas August 23, 2009 /
  4. jonathan v August 23, 2009 /
  5. john August 23, 2009 /
  6. rayraj August 24, 2009 /
  7. sreenivas pappu August 24, 2009 /
  8. j_ July 6, 2011 /