ఈ సినిమా నేను చూసి 35 సంవత్సరాలు గడచిపోయాయి. అయినప్పటికి ఏమాత్రం మర్చిపోలేదు. అంత చక్కని సందేశం ఉన్న సినిమా ఇది. గిరీష్ కర్నాడ్ మొదటి సినిమా అని గుర్తు. తప్పయితే ముందే క్షమార్హుడిని. పట్టాభిరామరెడ్ది దర్శకత్వం చిత్రా రామమనోహర నిర్మాత.
ఓ కుగ్రామంలో చంద్రప్ప అనే బ్రాహణ తిరుగుబోతు ఉంటాడు. తాగుతూ వ్యభిచరిస్తూ ఊరు బయటే ఉంటాడు. అందరు అతన్ని వెలివేసి తప్పించుకు తిరుగుతూంటారు. అటువంటి వాడు ఒకరోజున చచ్చిపోతాడు. అతనికి ఎవరు కర్మకాండ చెయ్యాలనేదే అసలు ప్రశ్న. బ్రాహ్మణులు చెయ్యాలా లేక వేరేవారా. గిరీష్ కర్నాడ్ ఆ ఊళ్ళో పూజారి. అతని దగ్గర ఈ ప్రశ్న కి సమాధానం ఉండదు. ఆ ఊళ్ళో ఉన్న సంప్రదాయం ప్రకారం శవాన్ని దహనం చేసేవరకు ఎవ్వరు ఇంటి లోనికి వెళ్ళటం భోజనాలు చెయ్యటం చెయ్యరు. అందరు పస్తులుంటారు. అందరు కలసి గిరీష్ కి ఆ భాధ్యత అప్పచెబుతారు. ఈలోగా ఇవన్ని చూసి తట్టుకోలేక మరో గృహిణి మరణిస్తుంది. గిరీష్ కి దారి తోచదు. దేవుడిని ప్రార్దిస్తాడు దహనం చెయ్యవచ్చంటే పువ్వు పడాలని. ఎంత సేపు ప్రార్దించినా పువ్వు పడదు. ఇంతలో ప్రక్క ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారని తెలిసి ఆయన దగ్గరకి వెళ్ళి సలహా అడుగుతాడు. ఆయన చంద్రప్ప కి బ్రాహ్మణులే దహన సంస్కారాలు చెయ్యాలంటాడు. దానికి కారణం ” చంద్రప్ప బ్రాహ్మణీకాన్ని వదిలాడు కాని బ్రాహ్మణీకం చంద్రప్ప ని వదలలేదు”
ఇదీ కధ. 1970 లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. గిరీష్ కి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చినట్లు గుర్తు. నెల్లూరు ఫిల్మ్ క్లబ్ లో ఓ పది మంది కలసి ఈ సినిమా తెప్పించి అప్పటి విజయ మహల్ లో చూశాము. బ్లాక్ అండ్ వైట్ సినిమా. టెక్నికల్ గా అంత బాగుండదు. లంకేష్, స్నేహలతా రెడ్డి, జయరాం గుర్తున్న నటులు. కధ, స్క్రీన్ ప్లే గిరీష్ వే.
చక్కని సినిమా చూడాలనేవారికి ఇదో అవకాశం. డివిడి దొరుకుతుందేమో ట్రై చేసి చూడండి.
కత్తి మహేష్ కుమార్ says:
యు.ఆర్.అనంతమూర్తి సంస్కార నవల ఒక విప్లవమైతే సినిమా ఒక సంచలనం. కులం గురించి,మానవ విలువల గురించి,guilt గురించి ఇంత లోతుగా చర్చించిన సినిమాలు అరుదుగా లభిస్తాయి. ఈ సినిమా నేను VHS టేప్ రూపంలో ఉండగా మైసూర్లో చూశాను (1995). ఇప్పుడు డిజిటల్ రూపంలో లభ్యమవుతుందో లేదో తెలీదు. ప్రయత్నించాలి.
విజయవర్ధన్ says:
ఈ సినిమా vCD/DVD రూపంలో ఇంకా రాలేదని బెంగుళూరు DVD దుకాణాదారులు అంటున్నారు. నాకైతే ఇప్పటివరకు దొరకలేదు.
sujata says:
I read a lot abt this book of UR Ananta Murty. I didnt know they made a film out of it. Then it must be a brilliant movie.
గీతాచార్య says:
I planned to write about this movie. డీవీడే దొరకటంలేదు.
deepasikha says:
ఈ సినిమా తెలుగు లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చింది.పేరు??( పంతాలూ పట్టింపులు లా ఉంటుంది).బహుశా సింగీతం తొలి తెలుగు చిత్రం కావచ్చు.సంస్కార చిత్రానికి సింగీతం పనిచేసారు.