Menu

Monthly Archive:: August 2009

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నేను అరెస్టయ్యాను – ఒక క్విజ్ షోలో గెలిచినందుకు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోలీసులు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. వీధికుక్కలు కూడా అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాయి. వాళ్ళు భళ్ళున తలుపులు తోసుకునివచ్చి, సంకెళ్ళు వేసి నన్ను దూరంగా ఆగిఉన్న ఎర్రలైటు

‘మగధీర’లో రంధ్రాణ్వేషణ

‘మగధీర’ seem to be the flavor of the season. ఎక్కడ చూసినా అదే చర్చలు. హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా చేరిందని కొందరు. అసలు హాలీవుడ్డే రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని మరికొందరూ పందేలు వేసేసుకుంటున్నారు. పెట్టిన ఖర్చుకి గ్రాఫిక్స్ కి అయ్యే ఖర్చుకి సరిపోలిస్తే సాంకేతికంగా మగధీర సినిమా తెలుగు సినిమా తెరమీద ఒక అద్భుతం అనేది పరిశ్రమ పెద్దలుకూడా నిర్ణయించేశారని వినికిడి. ఏ గ్రాఫిక్ ఏ హాలీవుడ్/జపనీస్/కొరియన్/చైనీస్ సినిమా నుంచీ స్ఫూర్తి పొందింది అనేది పక్కనబెడితే,

స్వరకోకిల సుశీల – 2

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి. 1952లో పెండ్యాల నాగేశ్వరరావుగారి స్వరసారథ్యంలో ‘కన్నతల్లి’ సినిమాతో ప్రారంభమైన స్వరకోకిల సుశీల గానప్రస్థానం… అప్రతిహతంగా దాదాపు నలభై ఏళ్ల పాటు దక్షిణాది భాషా చిత్రాలు అన్నింట్లోనూ కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడం హిందీలోనే కాకుండా సింహళభాషలో కూడా ఆమె పాటలు పాడారు. శాస్త్రీయ సంగీతం… జానపదం… సంప్రదాయ పురాణపద్యం… వంటి ఎన్నో స్వరప్రక్రియలలో సుశీల ముద్రపడని ప్రయోగం లేదు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకూ

విజయ విశ్వనాథం: అసూయా౭నసూయత్వం

గతంలో ఈ వ్యాస పరంపరలో వచ్చిన వాటిని 1, 2, 3, 4 ఆ అంకెల మీద నొక్కి చదవండి. హ్మ్! చాలారోజులైంది ఇది ఆలోచించి. ఆయనతో నా పరిచయం నా ఆలోచనా ధోరణిని క్రొత్త పుంతలు తొక్కించింది. కానీ కాస్తంత అలజడిని నాలో రేకెత్తించింది. ఏమిటీయన తత్వం. అసలు ఆ మనిషి నిజంగానే మారాడా? లేదా ఇది నాభ్రమా? లేదా మళ్ళా పరిస్థితుల్లో మార్పా? అనంతరామ శర్మ! అసూయకి పర్యాయ పదం. ఒకసారి ఆయనతో నా

స్వరకోకిల సుశీల – 1

సినీ పాటల తోటలో లతను మరిపించిన రేరాణి. దక్షిణాది సినీ సంగీత రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు పాలించిన రారాణి. పాటలతల్లి తన పాదాలకు దిద్దుకున్న సప్తస్వరాల పారాణి. సందర్భం ఏదైనా సన్నివేశం మరేమైనా.. అన్ని రకాల భావాలను మాధుర్యంగా తన గొంతులో పలికించిన రుతురాగం… జీవననాదం… ప్రేక్షక హృదయ నాదం- సుశీల. సినీ సంగీతానికి నిజంగా ఆమె ఒక వరం. ప్రపంచమంతటా సంవత్సరానికి ఒకసారే వసంతం వస్తుంది. వసంతకాలానికి కోయిల గానం మృదుమధురంగ ఉంటుంది. కానీ