Menu

‘మగధీర’లో రంధ్రాణ్వేషణ

Magadheera_Wallpapers_8‘మగధీర’ seem to be the flavor of the season. ఎక్కడ చూసినా అదే చర్చలు.

హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా చేరిందని కొందరు. అసలు హాలీవుడ్డే రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని మరికొందరూ పందేలు వేసేసుకుంటున్నారు.
పెట్టిన ఖర్చుకి గ్రాఫిక్స్ కి అయ్యే ఖర్చుకి సరిపోలిస్తే సాంకేతికంగా మగధీర సినిమా తెలుగు సినిమా తెరమీద ఒక అద్భుతం అనేది పరిశ్రమ పెద్దలుకూడా నిర్ణయించేశారని వినికిడి.
ఏ గ్రాఫిక్ ఏ హాలీవుడ్/జపనీస్/కొరియన్/చైనీస్ సినిమా నుంచీ స్ఫూర్తి పొందింది అనేది పక్కనబెడితే, ఈ సాంకేతిక విలువల (ముఖ్యంగా గ్రాఫిక్స్)  ఒరవడిలో సినిమాకి అత్యవసరమైన కథ,కథనం (స్క్రిప్ట్)లోని లోపాల్ని అందరూ విస్మరింపబూనటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
ఆస్కారొచ్చిన చిత్రాల్లోకూడా కొన్ని ‘గూఫులు’ (goof-ups) ఉండటం కొత్తకాదు. ప్రొడక్షన్ వాళ్ళ మహిమో, అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ చూసుకోకపోవడమో,రచయిత దగ్గర సరైన సమాచారం లేకపోవడమో లేక హడావుడి షూటింగ్ మహత్యమో ఇవి “గొప్పగొప్ప”(?) సినిమాలకే తప్పలేదు. కానీ స్క్రిప్టులోని లోపాల్ని ‘సినెమాటిక్ లిబర్టీ’ అనేసుకోవడం ఎంతవరకూ సమంజసం అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి కొన్ని లోపాలు మగధీరలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. రెండు సంవత్సరాలు కష్టపడి సాంకేతిక విషయాలపై పెట్టిన శ్రద్ధ స్క్రిప్టు మీద ఎందుకు పెట్టలేదా అనే సందేహాన్ని కలిగిస్తాయి.
1. హీరో ఆటోలో ఎయిర్ పోర్టుకి: ఈ సినిమా కథ ప్రధమార్ధం విశాఖపట్నం లో జరుగుతుందా లేక హైదరాబాద్ లోనా అనేది ఒక పెద్ద సందేహం. ఒకవేళ హైదరాబాద్ లో అయితే…  హీరోబైక్ రేసులకోసం విదేశాలకు వెళ్ళాలనుకుని ఆటోలో ప్రయాణిస్తుంటాడు. పైసలకి కక్కుర్తిపడి మిత్రుడు సునిల్ టాక్సీబదులు ఆటో తీసుకున్నాడని రామ్ చరణ్ ఎత్తిపొడుస్తాడు. కానీ ఇక్కడ కిటుకేమిటంటే, శంషాబాద్ విమానాశ్రయానికి ఏ ఆటోవాడూ చచ్చినారాడు. అసలు ఆ ప్రాంతంలోకి ఆటోలు వెళ్ళవు. వెళ్తే ట్యాక్సీలో వెళ్ళాలి లేకపోతే ఎయిర్ పోర్టువాళ్ళు ఏర్పాటుచేసిన బస్సుల్లో వెళ్ళాలి.
ఒకవేళ విశాఖపట్నం అనుకుంటే, హెలీకాఫ్టర్ నుండీ పడిపోయిన హీరోని సాల్మన్ (శ్రీహరి) శ్రీకాకుళంలో రక్షించడం సరిపోతుంది. కానీ, హీరో-హీరోయిన్ నెక్లెస్ రోడ్డులో కలుసుకోవడం మాత్రం అర్థంకాని విషయంగా మిగిలిపోతుంది.

అసలు కథాప్రదేశానికి విలువ లేదు కాబట్టి, “ఎక్కడైతేనేం!” అనుకుంటే అసలు సమస్యే లేదు.

హీరోయిన్ చెయ్యి తగిలి పునర్జన్మ గుర్తుకు రావడానికి ఆటోయే సరైన దారి అనుకుందాం. కానీ ట్యాక్సీ అయితేమాత్రం వచ్చే నష్టముందా?

2. హీరోకు పునర్జన్మ గుర్తుకు రావడం: హీరోయిన్ చెయ్యి తగలగానే అతనికి పూర్వజన్మ “ప్రేమ” గుర్తుకొస్తుందా లేక పూర్వజన్మ “ప్రేమభావన” మాత్రం ఉజాగృతమౌతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. హీరోకి కనిపించే పూర్వజన్ల ‘ఫ్లాష్ విజువల్స్’ లో హీరోయిన్ ముఖం బహుచక్కగా కనిపిస్తుంది. కానీ, ప్రధమార్థమంతా హీరోయిన్ తో ఉంటూనే ఆ స్పర్శకోసం తపిస్తాడేతప్ప ముఖాన్ని సరిగా చూసే శ్రమ తీసుకోడు.
అంటే ఇంతకీ అతనికి గుర్తొచ్చిందేమిటి?

ప్రధమార్థంలో వెరయిటీగా “తాకకూండా ప్రేమ” అనే కాన్సెప్టుకి కమిటయ్యారు కాబట్టి ఇలా కానిచ్చేద్దామనుకున్న నిర్ణయమా లేక ప్రేక్షకుల్ని taking for granted అనుకున్న సినెమాటిక్ లిబర్టీనా!

3. విలన్ కి పునర్జన్మ గుర్తుకురావటం: హీరోయిన్ ను ముట్టుకోగానే విలన్ కళ్ళెదురుగా ఒక అద్భుతమైన మెరుపు మెరిసి గతజన్మ వేషంలో హీరో తల నరుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ తరువాత అఘోరా దగ్గరున్న పుస్తకంలో హీరో ముఖం కనిపించక, హీరో కోసం వెతుకుతున్నటునా చూపిస్తారు. పూర్వజన్మ గుర్తొచ్చినప్పుడు కనిపించిన హీరోని కళ్ళెదురుగా పెట్టుకునికూడా వెతుక్కుంటూ ఉంటాడు విలన్.
బహుశా పూర్వజన్మ గుర్తొచ్చినప్పుడు షాక్ వల్ల హీరో ముఖం గుర్తైనా చెరిగిపోయుండాలి. లేకపోతే దర్శకుడు ఇలాంటి ప్రశ్నలు అడక్కూడదనైనా చెప్పుండాలి.
4. హీరోయిన్ కి పునర్జన్మ గుర్తుకు రాకపోవడం: హీరోని గతజన్మలో గాడంగా ప్రేమించింది హీరోయిన్ కు హీరో తాకితే గతజన్మ గుర్తుకురాదు. విలన్ తాకినా రాదు. అఘోరా ఈ (అష్టగ్రహకూటని) గడువు గడిస్తే హీరోయిన్ కి గతజన్మ గుర్తుకొచ్చే అవకాశం లేదని ఒక చోట విలన్ తో అంటాడు. ఆ స్పెషల్ కండిషన్ హీరోయిన్ కి మాత్రమే ఎందుకు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
అంత ఘాఢంగా ప్రేమించి. హీరోతన ప్రేమని తెలుపుతాడని ఆశించి నిరాశతో చనిపోయిన హీరోయిన్ కు, గతం ఎంత పేలవంగా గుర్తొస్తుందో సినిమాలో చూస్తే మాత్రం ఖచ్చితంగా నిరాశ కలుగుతుంది.
5. ఘోరమైన ‘అఘోరా’ : ఇప్పుడిప్పుడే ఫ్రెష్ గా  ‘నేను దేవుడ్ని’ ,‘అరుంధతి’ సినిమాలు చూసినోళ్ళకి నిజమైన అఘోరాలకీ సినిమాల్లోని అఘోరాలకీ తేడా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ సినిమాలో అఘోరా (పాత్ర పోషించింది రావుగోపాలరావు కొడుకనుకుంటాను. గొంతు అలాగే ఉంది)ది మరో దారి. రాజమౌళి దారి. మొదటి సీన్లో ‘నువ్వు హీరోని గెలవలేవు’ అని చెబుతాడు. ఆ తరువాత సినిమా మధ్యలో పరుగుపరుగున వచ్చి ‘హీరోయిన్ కు గతం గుర్తురాకుండా చేస్తే నువ్వే గెలుస్తావ్’ అని చెబుతాడు.
అది స్కిప్టులో మార్పా లేకపోతే షూటింగ్ ఇన్నాళ్ళయింది కాబట్టి కంటిన్యుటీ తప్పరా అన్నది తెలీదు. మొత్తానికి తేడాగా మాత్రం ఉంది. ఇక అఘోరా గెటప్, దాని డీటెయిలింగ్ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. అన్నట్టు, ఈ అఘోరావి మంచి మ్యానిక్యూర్ చేసుకున్న చేతి గోర్లండోయ్! మరోసారి సినిమా చూసినప్పుడు గమనించండి.
6.తికమక రాజు: ఒకవైపు నవగ్రహ కూటమి. మరోవైపు షేర్ ఖాన్ దాడి జరుగుతుంటే ఆ విషయాల్ని వదిలేసి పోరాటపోటీలు నిర్వహించే రాజు (శరత్ బాబు)ని ఏమనాలో తెలీదు.
పైగా ‘ఎవరు గెలుస్తారో నాకు తెలుసు’ అని ఒకసారి నర్మగర్భంగా చెప్పి, మళ్ళీ హీరోకిచ్చి పెళ్ళి చెయ్యడానికి మాత్రం ‘యుద్ధంలో చచ్చిపోతాడు’అనే సాకు చెబుతాడు. ఒకవేళ ఆ జరిగే యుద్ధంలో రాజు ఓడిపోతేమాత్రం హీరోయిన్ జీవితం సురక్షితంగా ఉండేదా! హేమిటో!!
7.షేర్ ఖాన్ నిలబడని మాట – సాల్మన్ రాజస్థాన్ లో ప్రత్యక్షం: వందమందిని చంపి శతధృవ వంశ వీరుడిగా నిరూపించుకుంటే హీరోయిన్ ని రాజ్యాన్నీ అప్పగిస్తానని షేర్ ఖాన్ మాటిచ్చి హీరోచేత ‘300’ పోరాటాన్ని చేయిస్తాడు షేర్ ఖాన్. తీరా పోరాటం ముగుశాక విలన్ వచ్చి ‘నాకు మాటిచ్చావ్’ అంటే ఎంచక్కా హీరోని చంపే ఛాన్స్ ఇచ్చేస్తాడు. అంటే షేర్ ఖాన్ మాట మీద నిలబడడనా లేక ప్రేక్షకులు ఇంత దూరం ఆలోచించరనా?
శ్రీహరి వేసిన మరో పాత్ర సాల్మన్. హీరో పునర్జన్మ బానే ఉంది. హీరోయిన్ పునర్జన్మ బాగుంది. విలన్ కూడా ఓకే…కానీ షేర్ ఖాన్ మళ్ళీ పుట్టిందెందుకు? ఓ.కే. హీరో-హీరోయిన్ ను ఈ జన్మలో కలపడానికీ అనుకుందాం. అయితే అతను శ్రీకాకుళంలో చేపలెందుకు పడుతుంటాడు? హీరోకి రాజస్థాన్ ప్రయాణానికి బైక్ ఇస్తాడు సరే, కానీ  హఠాత్తుగా శ్రీకాకుళం నుంచీ రాజస్థాన్ లో హెలీకాఫ్టర్ (Die hard 4.0 లోలాగా) కూల్చడానికి ఎట్లావచ్చేస్తాడు? అదీ లొకేషన్ ఖచ్చితంగా పట్టుకుని అనేది మరో సమాధానం లేని ప్రశ్న. బహుశా అనవసరంకూడానేమో!
ఒక హిట్ సినిమాను పట్టుకుని దానిలో “తప్పులు” వెతకడం రంధ్రాణ్వేషణలాగానే అనిపిస్తుంది. కానీ తెలుగు సినిమాకు ఒక కొత్త అర్థాన్నిచ్చిందని చెప్పుకోబడే ఈ సినిమా సాంకేతిక సమ్మోహనాస్త్రమే అయినా, కథ,కథనం తప్పుల తడక అనే నిజం గ్రహించనంతవరకూ ఆ రెంటినీ (కథ + సాంకేతిక విలువలు) సరైనపాళ్ళలో రంగరించి మరో మంచి సినిమా తీసేస్థితికి పరిశ్రమ ఎదగలేదు. అందుకే ఈ రంధ్రాణ్వేషణ.
114 Comments
 1. కొత్తపాళీ August 13, 2009 /
   • vinay chakravarthi.gogineni September 6, 2009 /
 2. Satish Medos August 14, 2009 /
  • Ajay Kumar August 15, 2009 /
 3. Indian Minerva August 14, 2009 /
  • నాగప్రసాద్ August 14, 2009 /
  • Ajay Kumar August 15, 2009 /
  • Ajay Kumar August 15, 2009 /
   • Indian Minerva August 16, 2009 /
   • నాగప్రసాద్ August 16, 2009 /
   • కొత్తపాళీ August 16, 2009 /
   • Indian Minerva August 17, 2009 /
  • Manjula August 21, 2009 /
   • vinay chakravarthi September 6, 2009 /
 4. chandrasen August 14, 2009 /
  • అభిమాని August 14, 2009 /
   • rr August 15, 2009 /
   • rr August 17, 2009 /
   • vinay chakravarthi September 6, 2009 /
 5. a2zdreams August 14, 2009 /
  • అభిమాని August 14, 2009 /
   • a2zdreams August 14, 2009 /
 6. suresh August 14, 2009 /
 7. గీతాచార్య August 14, 2009 /
 8. నాగప్రసాద్ August 14, 2009 /
   • రాజేష్ September 4, 2009 /
 9. sasank August 14, 2009 /
 10. చదువరి August 14, 2009 /
 11. virat August 14, 2009 /
 12. Magadheera August 14, 2009 /
 13. Magadheera August 14, 2009 /
 14. ravigaru August 14, 2009 /
  • నాగప్రసాద్ August 14, 2009 /
  • sasank August 14, 2009 /
   • కొత్తపాళీ August 16, 2009 /
 15. Zulu August 14, 2009 /
 16. Magadheera August 14, 2009 /
  • నాగప్రసాద్ August 14, 2009 /
   • bonagiri August 14, 2009 /
   • sasank August 14, 2009 /
   • నాగప్రసాద్ August 14, 2009 /
   • sasank August 15, 2009 /
   • Manjula August 21, 2009 /
 17. venu August 14, 2009 /
  • అభిమాని August 14, 2009 /
   • a2zdreams August 15, 2009 /
 18. radhika August 15, 2009 /
  • Ajay Kumar August 15, 2009 /
   • vinay chakravarthi September 6, 2009 /
 19. కొత్తపాళీ August 15, 2009 /
  • Ajay Kumar August 15, 2009 /
  • a2zdreams August 15, 2009 /
   • నాగప్రసాద్ August 15, 2009 /
   • నాగప్రసాద్ August 15, 2009 /
   • నాగప్రసాద్ August 15, 2009 /
   • కొత్తపాళీ August 15, 2009 /
   • నాగప్రసాద్ August 15, 2009 /
 20. Ajay Kumar August 15, 2009 /
  • a2zdreams August 15, 2009 /
 21. VenuVasi August 15, 2009 /
   • sasank August 15, 2009 /
  • గీతాచార్య August 16, 2009 /
  • కొత్తపాళీ August 16, 2009 /
  • చదువరి August 16, 2009 /
  • Krishh August 17, 2009 /
  • నేను August 30, 2009 /
 22. అబ్రకదబ్ర August 16, 2009 /
  • vinay chakravarthi September 6, 2009 /
 23. Uttara August 17, 2009 /
  • vinay chakravarthi.gogineni September 6, 2009 /
 24. రవి August 17, 2009 /
 25. రవి August 17, 2009 /
 26. రమేష్ పంచకర్ల August 17, 2009 /
 27. shanthi August 24, 2009 /
 28. Anil Kumar August 24, 2009 /
 29. జ్యోతి August 31, 2009 /
  • గీతాచార్య September 4, 2009 /
 30. రాజేష్ September 4, 2009 /
 31. శ్రీరావం September 7, 2009 /
 32. Arvind September 8, 2009 /
 33. rajesh September 9, 2009 /
 34. rajesh September 9, 2009 /
 35. su September 19, 2009 /
 36. కొత్తపాళీ October 13, 2009 /
 37. Ram Cheruvu January 16, 2010 /