నిన్న నే మగధీర చూసాను. తెలుగు లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల్లోకీ కాస్ట్లీయెస్ట్ మూవీ అంటున్నారు. నిజమేనా? లేక బిజినెస్ బాగా చేసుకోడానికి నిర్మాతలే అలా ఒక టాక్ క్రియేట్ చేసారా? రాజమౌళి కి ఇప్పటిదాకా ఫ్లాప్ రాలేదట కదా, మరి ఈ సారి ఏం చేస్తాడో? సినిమా రిలీజ్ అయిన మరునాడు ఉదయానికల్లా అన్ని వెబ్ రివ్యూస్ వచ్చేసాయి(ఇదో కొత్త సంప్రదాయం అనుకుంటా), అది కూడా అన్నీ బాగా పాజిటివ్ గా రివ్యూస్ ఇచ్చాయి. మరి నమ్మొచ్చా? ఇలాంటి ప్రశ్నల మధ్య థియేటర్ లోకి అడుగుపెట్టాను. చెప్పొద్దూ, థియేటర్ లోకి అడుగుపెడుతున్న్న మిగతా వాళ్ళలోనూ కొంచెం అటు ఇటూగా ఇదే తరహా చర్చ. మరింతకీ ఏంటి ఈ సినిమా పరిస్థితి? వివరాల్లోకి వెళితే..
కథ:
క్రీ.శ. 1609 లో హీరో హీరోయిన్లు చనిపోయే ఒక నాటకీయ సన్నివేశం తో కథ ప్రారంభమవుతుంది. 400 ఏళ్ళ తర్వాత తిరిగి జన్మించిన హీరో, హీరోయిన్ని కలవడం ఆమె చేతి స్పర్శ ఇతనిలో గతాన్ని స్ఫురింప చేయడం.. “నిను పొందేటందుకె పుట్టానే బొమ్మ, నువు అందక పోతే వృధా ఈ జన్మ” అన్నంత స్థాయిలో హీరో ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఆమె వెంట తిరగడం… ఇలా ఒక లవ్ ట్రాక్ సాగుతూ ఉంటే, ఉదయఘడ్ కోటమీద హక్కుల కోసం హీరోయిన్ తండ్రికీ, వాళ్ళ బంధువులతో జరుగుతున్న కోర్టు కేసుల నేపథ్యం లో కథలోని ఇంకో పార్శ్వానికి తెరలేస్తుంది. హీరోయిన్ కి బావ వరసయ్యే రఘువీర్ ఆమె మీద కన్నేస్తాడు. వాళ్ళ కుటుంబానికి దగ్గరయేందుకు ఉదయఘడ్ కోట ని వాళ్ళకి తిరిగివ్వడానికీ సిద్దపడతాడు. అయితే తను హీరోయిన్ కి దగ్గరవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎవరో దానికి అడ్డుపడుతున్నట్టు, తనని నరికేస్తున్నట్టు అతని మెదడు లో ఏదో భయోత్పాతం. ఎందుకిలా జరుగుతోందో తెలుసుకోవడానికి ఒక అఘోరా ని కలిస్తే అతను వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతం చెబుతాడు. పూర్వజన్మ లో ఆమె రాకుమారి మిత్రవింద అనీ, ఆ జన్మ లో తను ఆమెని పొందలేక పోవడానికి కారణమైన కాలభైరవ కూడా తిరిగి జన్మించాడనీ అతనున్నంత కాలం ఈ జన్మలోనూ తను ఆమెని పొందలేడనీ తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పూర్వ జన్మ లో ఏం జరిగింది తెలియాలంటే తెరమీద చూడాలి.
ఇతరత్రా:
తీసుకున్న కథ పునర్జన్మ నేపథ్యానికి సంబంధించింది కావడం తో- కథ లో ఏం జరగబోతోందనే విషయం ప్రేక్షకులకి ముందే తెలుసు. అలాంటి తెలిసిన కథనే ఆసక్తికరంగా చెప్పడం లో రాజమౌళి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా విడుదల కి ముందు రాం చరణ్ మాట్లాడుతూ ” ఈ సినిమా ని- ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కోసం ఒకసారి చూడండి” అన్నాడు. ముమ్మాటికీ నిజం. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఉన్నత స్థాయిలో ఉందీ చిత్రం. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ వాడితే నేలక్లాస్ ప్రేక్షకుడు కూడా గుర్తుపట్టేసి, “గ్రాఫిక్స్ లేరా” అని తేలిగ్గా తీసిపారేసే స్థాయి నుండి నెమ్మదిగా గ్రాఫిక్స్ అని సులువుగా గుర్తించలేని విధంగా కథలో ఇమిడిపోయే లాగా టెక్నాలజీ ని ఉపయోగించుకునే దిశలో తెలుగు సినిమా ప్రయాణించడం శుభ పరిణామమే. డాడీ, అందరివాడు టైం లో గీతా ఆర్ట్స్ సినిమాలంటేనే విరక్తి వేసేది నాకు. చిరంజీవి లాంటి పెద్ద హీరో ని పెట్టి, సినిమా లోని మిగతా అంశాలన్నీ “డెడ్ చీప్” గా లాగించేసి, బిజినెస్ మాత్రం భీబత్సంగా చేసుకుంటారు వీళ్ళు అనిపించేది. అయితే ఈ మధ్యకాలం లో పరిస్థితులు మారినట్టుగా అనిపిస్తోంది. నిర్మాణవిలువలపరంగా ఇప్పటిదాకా వచ్చిన తెలుగుసినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా అత్యున్నత స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం వేసిన సెట్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించిన విధానం కానీ అద్భుతంగా ఉన్నాయి. అయితే అంత గొప్పగా సినిమా రావాలంటే డబ్బులు పోసే నిర్మాత ఒక్కడుంటే సరిపోదు, అత్యుత్తమమైన టెక్నికల్ టీమ్, ఆ టెక్నికల్ టీమ్ నుంచి ఔట్ పుట్ రాబట్టుకోగల దర్శకుడు కావాలి. జక్కన్న గా ఇండస్ట్రీ లో పిలవబడే రాజమౌళి “సృజనాత్మకమైన గొప్ప” సినిమాలు తీసిఉండకపోవచ్చు కానీ, తన పరిధి అయిన “కమర్షియల్ తెలుగు సినిమా” లో తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకుని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం లో తాను నంబర్ వన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. కథాపరంగా ఇది ‘తెలుగు సినిమా’ని ముందుకు తీసుకెళ్ళే కథేమీ కాదు. కమర్షియల్ సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినా కూడా, ఆరుంధతి సినిమా కథ తో కొద్దిపాటి పోలికలు కనిపిస్తాయి. అయితే షుమారు రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమై, దాదాపు రెండొందల డెబ్బై పనిదినాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కథకి, ఆర్నెల్ల క్రితం రిలీజ్ అయిన ఆరుంధతి కథతో పోలికలుండటం బహుశా కాకతాళీయం కావచ్చు. కథాపరంగా ఇది తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథ కాకపోవచ్చు కానీ, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా తెలుగుసినిమాల్లో బెంచ్ మార్క్ లా మిగిలిపోయే సినిమా లో ఒదిగిపోయే కథే.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రామ్ చరణ్ కి ఇది రెండో సినిమా. సినీ వారసులకి సాధారణంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి పరిచయమైపోయాక సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టి, “స్టే కనెక్టెడ్” ప్రోగ్రాం కింద కాస్త మంచి దర్శకులని ఎన్నుకుంటూ రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఒక బ్లాక్ బస్టర్ తగులుతుంది. అయితే రెండో సినిమా కే కేవలం దర్శకుడి ప్రతిభమీదే ఆధారపడి కాకుండా నటుడిగా ప్లస్ హీరోగా తననుంచి ఎన్నో రకాలు గా ఎంతో డిమాండ్ చేసే పాత్ర దొరకడం ఒకరకంగా తన అదృష్టం అని చెప్పాలి. ఆ అవకాశాన్ని తను కూడా సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. హార్స్ రైడింగ్ , వీరోచిత దృశ్యాలూ చాలా బాగా చేసాడు. ఇక డ్యాన్సులూ ఫైట్లూ సరేసరి. ఇక నటనకూడా ఎక్కడా వంక పెట్టే విధంగా లేదు. షేర్ ఖాన్ గా నటించిన శ్రీహరి పాత్ర తెరమీద కనిపించేది ఓ పదిహేను నిమిషాలే అయినా కీలకమైన పాత్ర. శ్రీహరి ఆహార్యం, ఆ పాత్రని శ్రీహరి పోషించిన విధానం చాలా బాగున్నాయి. కాజల్ బాగా చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రాకుమారిలానే ఉంది. విలన్ గా నటించిన దేవ్ గిల్ బాగా చేసాడు. అయితే ఒక పాత్రని “వీడు విలన్” అని ప్రేక్షకులకి చెప్పడానికి ఆ పాత్ర ని పరిచయం చేసిన వెంటనే ఉత్తిపుణ్యానికి ఎవణ్ణో ఒకణ్ణి ఆ పాత్రచేత చంపించే తెలుగు సినీ సాంప్రదాయం ఈ సినిమాలోనూ కొనసాగింది.
చాలామంది సినీప్రియులకి ఛత్రపతి సెకండాఫ్ నరకమనిపించుడొచ్చు గాక, చాలామంది విశ్లేషకులని సింహాద్రి భయపెట్టిఉండొచ్చుగాక, విక్రమార్కుడు సినిమా మాస్ చిల్లరకామెడీ గా ఎలైట్ ప్రేక్షకు తీసిపారేసి ఉండొచ్చు గాక, సినిమా సినిమా కి తన రేంజ్ పెంచుకుంటూ మాస్ సినిమాలు తీయడం లో తాను సిద్దహస్తుణ్ణని నిరూపించుకున్న రాజమౌళి ఈసారి తన ట్రేడ్ మార్క్ బూతుకామెడీకి ఆస్కారమివ్వకుండా, విచ్చలవిడి రక్తపాతాన్నీ ఆరబోయకుండా (రిలేటివ్ గా), గ్రాండ్ స్కేల్ లో తీసిన ఈ సినిమా అటు సాధారణ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకొనేలానూ ఉంది, ఇటు కూసింత ధైర్యంగా మీ నాన్-తెలుగు స్నేహితులకి చూపించదగ్గదిగానూ ఉంది.
–మోహన్ రాజ్
మగధీర ఎలా ఉంది?? « జురాన్ సినిమా says:
[...] సమీక్ష నవతరంగం లో ప్రచురితమైంది. ఇక్కడ [...]
Chetana says:
Technical values, direction, production values విషయంలో నేను మీతో పూర్తిగా ఏకిభవిస్తాను. అంటే మిగతా విషయాల్లో ఏకీభవించను అని కాదూ,details చదవలేదంతే. గ్రాఫిక్స్ వాడితే అవి గ్రాఫిక్స్ అని అందరికీ తెలియాలి అన్నట్టు, sound effects బాగున్నాయి అనిపించుకోవలంటే ఎంత loudగా ఉంటే అంత బాగున్నట్టు, పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపించాలన్నట్టు garishగా ఉండటాలకి అలవాటుపడిపోయిన మన తెలుగు పెద్ద/hit దర్శకనిర్మాతల తీరుకి పూర్తిగా విరుద్ధం ఈ సినిమా. రాజమౌళి మీద నాకు positive impression కలిగించిన మొదటి సినిమా ఇది. చిరంజీవి కొడుకుని చూడలేమ్రా బాబూ, డాన్సులు ఫైట్లు అంటే అందరూ ఇప్పుడు బాగానే చేసేస్తున్నారు దాన్లో వీడి స్పెషల్ ఏముంది, ఈ మధ్య హిట్లు అవుతున్న/అయినట్టు హైప్ ఇచ్చుకుంటున్న గోల సినిమాల్లాగానే ఇదీనూ అనుకుంటూ వెళ్ళాం. మనవాళ్ళు technical values అనేసరికి హాలివుడ్తో ఎందుకు కంపేర్ చేస్తారో గానీ, హాలివుడ్ని పక్కనపెట్టి, “తెలుగు సినిమాల లెవెల్లో” “మా సినిమాలో technical values నభూతో నభవిషతి అని boast చేసుకుంటున్న వాటిల్లో” the best ఈ సినిమా. Definitely we’ll have to give it to Rajamouli. డబ్బు, టెక్నాలజీ ఎక్కడ ఎంత వాడుకొవాలో అంత/అంతే వాడుకున్నారనిపించింది. అందరూ compare చేస్తున్న అరుంధతికి కూడా ఆ ఎండూ ఉన్నా, ఓఓ ఉన్నాయి కదా పెట్టెసినట్టేగానీ దాని result ఎంత loadగా ఎంత garishగా ఉంటుందో, ఈ సినిమాకి అవే money and technology సరిపోయేలా ఉంటాయి. ఒక actor పరంగా రాంచరణ్ has a long way to go, కాని మొదటి సినిమా కన్నా చాలా improve అయ్యాడు, fights, action sequences విషయంలో చాలా కష్టపడ్డాడు and that shows. ఇంకో impressive aspect ఏంటంటే పీటర్ హైన్స్ ఉన్నా కూడా సినిమాలో ఎక్కడా త్రెడ్ వర్క్ లేదు (atleast notice చేసే లెవెల్లో, చేసి చిరాకొచ్చే లెవెల్లో). ఇండియాలో ఎంత హైప్ చేస్తున్నారో ఏమో తెలియదు కానీ మేము ఏమాత్రం expectations లేకుండా వెళ్ళటం వల్ల కూడా సినిమా మాకు నచ్చిందేమో.
praveen says:
sir
Mana telugu cinema ne ento karchu pette tiste konta mande piracy chese chirinjivi ke vunna fans kante ekkuva ga pirasy chese market lo ke release chestunaru.ok mana magadera movie pracharane ke pette karchu lo kontina piracy kakunda vunda taneke amina jagratalu tesukonte bagudede.
sharath chowdhary says:
mi samiksha chusina tharuvatha josh thvaraga release avthadhi ani anipisyhundhi
mohanrazz says:
nijaaniki JOSH aug12th release ani mundannaaru. ippudadi konchem venakki vellindi. bahusha aug end loga vachestundanukuntaa
harsha says:
Maghadheera nannu disappoint chesindi.Technical gaaa bagane vunnaa..story first half bore kottindi..second half is good..kaani idi average anipinchindi.antha pedda hit ela ayyindo teliyadam ledu.
nenu, naa frnd antha first day chooosi, movie antha ledu average anukuntu vacchi morini review choosi shock ayyaa..magadheera masterpiece ani choosi..idi nijangaa hit movie aaaaa????
మోహన్ రాజ్ says:
ఇదొక కళాత్మకమైన “మాస్టర్ పీస్” అని నేననను కానీ ఇది “మాస్”టర్ పీస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
sree says:
ee chettu leni chota amudame maha vruksham ane sameta vundane vundi kada…..
idi antha pedda hit avvataaniki migilnia movies inkaa chettaga vunnayi
చిడిపోతు అశొక్ says:
మోహన్ రాజ్ గారు,
సినిమా ఏమో గాని మీ రివ్యు బాగుంది
Alag Niranjan says:
Hi Mohan Raj,
R u same Mohan Raj from SVU 2001 Mech?
Is your native is Yemmiganoor?
కత్తి మహేష్ కుమార్ says:
రాజమౌళి సినిమాకదా, ఒకసారి తప్పకుండా చూసెయ్యాలి.
sasank says:
@Mahesh Gaaru : tvaraga choodandi sir, ikkada mee reivew kodam nenu waiting.
RAJU says:
FLOOP
Aditya says:
“Mana telugu cinema ni katha paranga munduku teeskella leka poindi” valid point. flashback lo sagam scenes 300 lonchi okati ara gladiater lonchi lepesaru. inta lavish ga kharchupetti inta dedicated ga two years teesina movie lo mallee ee ethesina scences chusthe chala disappoint ga untundi. manadi ani cheppukune sthai lo katha kuda unte enta bavundedi.
అబ్రకదబ్ర says:
చత్రపతిలో షార్క్ ఎపిసోడ్, యమదొంగలో యమలోకం సన్నివేశాలు గురించి కూడా భీభత్సకరమైన ప్రచారం విని నమ్మి వెళ్లి ఆ సినిమాలు చూసి నిరాశ చెందాను. మగధీర గురించి ఇప్పుడు ఎందరు చెప్పినా నమ్మాలంటే కష్టంగానే ఉంది
Chetana says:
“చత్రపతిలో షార్క్ ఎపిసోడ్, యమదొంగలో యమలోకం సన్నివేశాలు గురించి కూడా భీభత్సకరమైన ప్రచారం విని నమ్మి వెళ్లి ఆ సినిమాలు చూసి నిరాశ చెందాను.”
నాది కూడా same opinion. ఆ సినిమాల్లో అంత hype ఇచ్చిన ఆ sequences పరమ tackyగా అనిపించాయి. రాజమౌళి అంటే చిరాకు/negative opinion ఉండటానికి violent/loud/cheap and vulgar comedy/villiany ఉండే సినిమాలు తీస్తాడనే కాదు, ప్రతి సినిమాలో technology use చేసుకోవటానికి ప్రయత్నించి outcome ఎంత tackyగా ఉన్నా అబ్బో అబ్బో అని స్పీల్బర్గ్ లెవెల్లో తీసినట్టు గొప్పలు చెప్పుకుంటాడని కూడా. Anyway, hype/marketing/propagandaలతో పెట్టుకోకుండా చూస్తే, ముందు సినిమాలకన్నా ఈ సినిమా commendable improvement అనిపించొచ్చు. The usage/implementation of visual effects is a whole lot better than all the previous telugu movies. In my opinion, he got most of the things just about right in this attempt.
విజయ్ నామోజు says:
లాజిక్ కంటే మ్యాజిక్ కి పెద్ద పీట వేసె మన సో కాల్డ్ టార్గెట్ ఆడియెన్స్ కి మాంచి విందు భోజనం లాంటిది ఈ మూవీ . రాజమౌళి టైటిల్స్ వేయడంలో చూపించిన వైవిధ్యం కథని నడిపించడంలో చూపించి వుంటే బాగుండేది అని నా అభిప్రాయం .ఒక సీన్లో చనిపొతాడెమో అనుకున్న హీరోకి ప్రాణం పొసి మరు క్షణమే ఒక ఐటం సాంగ్ కి స్టెప్పులు వేయించి తన దర్శకత్వ ప్రతిభని మరో సారి చాటాడు రాజమౌళి .ఈ సినిమా మొత్తంలో నన్ను బాగ ఆకట్టుకున్న అంశం కుమారి ముమైత్ ఖాన్ డ్యాన్స్ ( బహుశా నిరాశ పరచని అంశం కూడా కాబొలు
)
Madhura vaani says:
నాదీ అశోక్ గారి మాటే.!
సినిమా ఏమో గాని మీ రివ్యూ బాగుంది.
Master says:
Hero dialog delivery mathram parama chettaga unnadhi. Rajamouli ee cinema lo maroka saari thanani niroopinchukunnadu ram charantho kooda ala acting chepinchi. I can think how he was struggled with RamCharan dubbing time.
కొత్తపాళీ says:
నా ఒక పేరా సమీక్ష ఇక్కడ.
@అబ్రకదబ్ర. మీరు చూడదల్చుకుంటే ఇవేమీ చదవకండి, చదివినా నమ్మకండి.
గోల్కొండ కోటని చాలా అందంగా చిత్రీకరించాడు ఆ పాటలో. నేపథ్య దృశ్యం కూడా చిత్రీకరణలో ఒక పాత్ర అవుతుంది అంటే ఇదే కాబోలు.
రాంచరణ్ తేజ ఫైట్లు డేన్సుల్లో శిక్షణతో బాటు తెలుగు ఉచ్చారణలో కూడా కొంచెం శిక్షణ తీసుకుంటే మంచిది.
కొన్ని తమాషా లొసుగులు.
400 ఏళ్ళ క్రితం రాజగురువు అష్టగ్రహ కూటమి గురించి చెబుతూ అవి భూమికి అతి దగ్గరగా వస్తాయి, పట్టపగలే కనబడేంత వెలుగుతో ప్రకాశిస్తాయి అని చెబుతాడు. జ్యోతిశ్శాస్త్ర ప్రకారం ఐతే మన నవగ్రహాల్లో నాలుగు భౌతికమైన గ్రహాలు కాదు, ఆకాశంలో ఎనిమిది నక్షత్రాల్లా కనబడ్డానికి.
పరమ కిరాతకుడైన ముస్లిము చక్రవర్తిని అతని సేనాపతులు “సాబ్” అని పిలుస్తారు, ఏదో హైదరాబాదు పాతబస్తీలో గూండా లీడర్ని పిలిచినట్టు.
మొదటిసారి విలన్ కాజల్‌ని చూసే సన్నివేశంలో అతని మొహాన్ని క్లోజప్లో ఐదారు సార్లు చూపిస్తారు. చూపించిన ప్రతిసారీ అతని నుదుటి తిలకం వేరే షేపులో ఉంటుంది. ఆ తిలకం మీద అద్దిన అక్షతలు మారిపోయి ఉంటాయి.
కొత్తపాళీ says:
ఇందాక చెప్పడం మరిచాను. మా స్థానిక ప్రదర్శకుడు ఈ సిన్మాకి 15 డాలర్లు పుచ్చుకున్నాడు. నేను జీవితంలో ఒక్క సినిమా చూడ్డానికి ఖర్చుపెట్టిన అతి పెద్ద మొత్తం ఇదేనేమో. వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చిన లాసులన్నీ ఈ ఒక్క సినిమాతో పూడ్చుకోవాలని చూస్తున్నట్టున్నారు. అమెరికాలో ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితా?
Manjula says:
Even in Bay Area, new films cost more. Theaters royally suck, but charges are same as that of the other theaters(Century etc).
అబ్రకదబ్ర says:
బే ఏరియాలో కూడా ఈ సినిమాకి $15 వసూలు చేస్తున్నారని విన్నాను. ఇంతకు ముందు హైప్‌తో వచ్చిన సినిమాలకి $12 దాకా ఉండేది. ఇప్పుడా రికార్డు బద్దలయింది
గుడ్డిలో మెల్ల – బే ఏరియాలో తెలుగు సినిమాలాడే థియేటర్లన్నిట్లోనూ ఇదాడుతున్న సెర్రా థియేటర్ చాలా రెట్లు మెరుగు. అంటే, మరీ AMC స్థాయిలో ఉండదు కానీ, మొత్తమ్మీద మెరుగే. ఏదేమైనా ఓ సినిమాకి $15 అంటే ఆలోచించాల్సిందే – అంత గొప్పగా ఆ సినిమా ఉందా అని. సినిమా బాగున్నా లేకున్నా, ఇలాంటి సినిమాలకెళితే అంత డబ్బులిచ్చీ ప్రశాంతంగా సినిమా చూట్టానికి బదులు వీరాభిమానుల వీరంగం, వాళ్లు చేసే రచ్చ చూసి తలనొప్పితో తిరిగొచ్చే అవకాశాలెక్కువ. రెండు మూడు సార్లు ఆ అనుభవమయ్యాక, తెలుగు సినిమాలు పాతబడ్డాకో లేదా డీవీడీ వచ్చాకో చూట్టం అలవాటు చేసుకున్నాను.
Krishh says:
Bay Area lo nu ade price ,
Ikkada Serra Theatres , open ayyaka kocham parledu.
RAJU says:
NOTHING NEW IN IT AND IT IS A VERY BORING.BUT BANGARU KODIPETTA SONG DANCE IS GOOD .THIS IS THE 1ST RAJMOULI FLOOP . THE MYTH [JACKI CHAN MOVIE COPY]SAME STORY
RAJU says:
COPYING FROM ENGLISH MOVIES AND TELLING HOLYWOOD RANGE
శంకర్ says:
they usually charge 15 Euro here. Seems we are the highest paying ppl
.. still need to wait until Sunday
budha says:
i paid 20€ …….:)
suresh says:
Hi Hero,
Really good review, better than any other web site. Tokkalo job emi chesthamu kani, web site start cheddam..
జీడిపప్పు says:
$15? lol. I really admire their business strategy. They should charge $20 and encash the stupidity of “first day audience”!
Pradeep says:
మొన్ననే చూసా. సూపరు సినిమా కాదు కానీ బానే ఉంది. యమగోల formatలోనే ఉంది ఇది కూడ. Graphics మాత్రం చాలా బావున్నాయ్. చూడదగ్గ సినిమా.
sekherkchandhra says:
recentgaa choosina cinamaalalao ok baagundi.rajamouli inkaa baaga
theeyochu.but improvement.
నాగప్రసాద్ says:
అయితే తప్పకుండా థియేటర్లోనే చూడాలన్నమాట. విదేశాల్లో కూడా రిలీజ్ చేసి చెన్నైలో ఈ సినిమాని ఇంకా రిలీజ్ చెయ్యకపోవడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారో మరి.
బైదివే రివ్యూ బాగుంది.
m prasad says:
rajamouli indias steven spielburg
కత్తి మహేష్ కుమార్ says:
ఎలా? ఎందులో?
rr says:
direction lo
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
నవతరంగం పాఠక మిత్రులకు ఒక విన్నపం.కొందరి వ్యాఖ్యలు స్పాం లోకి వెళుతున్నాయి,వాటిలో ఎక్కువగా ఇంగ్లీషులో వ్యాఖ్యలు రాసినవే ఉంటున్నాయి.స్పాము లోనుంచి మామూలు వ్యాఖ్యలను వెలికితీసి ప్రచురించే లోపు కొందరు వారివారి కామెంట్లను తిరస్కరించామనో,ప్రచురించలేదనో అపోహపడటం,అనుమానించటం జరుగుతుంది.ఈ సమస్యకు పరిష్కారం కామెంటులను తెలుగులోనే రాయటం.బరహ వంటి సాధనాలను వాడండి లేదంటే లేఖినిని ఉపయోగించండి.
http://lekhini.org/
mahi says:
endi vadu speilberg keeravani hans zimmer naa… 300 bewolf gladiator kalipi teesesi na vadu meeku speilberg laga kanipistunnada nayana..
mahi says:
Myth cinema kooda copy chesadu shark scene english movie lo copy kaada
hero ki srihari bike isthadu cheekkulam lo rajasthan ki vellinappudu dani meeda peru RJ registration vuntundi
Dissappointing charan career next jagratha ga vundali intha hype vachaka
mahi says:
rajamouli hindi enduku polaa? india’s kaadu bollywood lo oka movie teesi hit cheyamani cheppandi
rr says:
meeru bollywood lo enni cinemalu teesi hit kottarenti..
konchem mee cinemala list ivvandi.. chusi anandistamu.. pls.
mahi says:
ask RGV
Narasimha says:
సినిమ చాల బాగుంది. విమర్సలు, చిన్న చిన్న లొపలు పక్కన పెదిథె, ఈ మధ్య కాలం లొ వచ్చిన మంచి సినిమ. ఈంగ్లిష్ సినిమ లొ స్చీన్ లు కపీ కొతిన వాతిని మల్లి తీయలి కద. ంఅన తెలుగు సినిమ మత్రమె చూసె ప్రెక్షకులకి ఇధి ఒక అద్బుథం. శెచొంద్ ఒఫ్ఫ్ ఎక్ష్త్రర్దినర్య్ గ ఉంది. ఈప్పతి వరకు రాజమౌలి తీసిన సినిమలలొ చాల బాగున్న సినిమ ఇధి. రాంచరన్ కూద ఇక సినిమా ఫీల్ద్ లొ స్టార్ అయ్యిపొథాదు. ఏమాత్రం అంచనాలు మిస్స్ అయ్యినా హిస్ నెక్ష్ట్ సినిమా హిట్ అవుటం కష్టమె.
praveen says:
copy of 300 movie its not good
satyam says:
నిన్ననే చూసాం, ఇది పూర్తిగా రాజమౌళి సినిమా. 80% బాగున్న సినిమా. ఈరోజుల్లో అదెక్కువే, చాలా బాగున్నట్లు లెక్క. కాపీ పెద్ద విషయం కాదు, నా దౄష్టిలో. అందరూ చేస్తారు. మళ్ళీ తీయడానికైనా కష్ట పడాలి కదా! ఇది చక్కగా తెలుగు పద్ధతిలోకి మార్చిన సినిమా.
ఇంతకీ బడ్జెట్ ఎంతయ్యిందో తెలుసా? ఒక ప్రాబ్లెం, ఈ రోజుల్లో ప్రతీ ఫ్రేం అంత గొప్పగా తీయాలా .. మామూలుగా వుండకూడదా! అంత రిచ్నెస్స్ కొంత భరించలేనట్లుగా వుంది.
చరణ్ బాగా కష్టపడ్డాడు. ఇంతకు ముందు అన్నట్లు తన డైలాగులు చెప్పడం మీద బాగా కృషి పెట్టాలి. మంచి భవిష్యత్తు వున్న ఏక్టర్ హీరొ. ఈ తరువాత తక్కువ బడ్జెట్ సినిమాలో ఎలా వుంటాడో?
కత్తి మహేష్ కుమార్ says:
మొన్ననే మగధీర చూశాను.
అప్పట్నుంచీ (మరో)సమీక్ష రాయలా అని ఆలోచించి…ఆ రాసే ప్రయత్నంలో ఈ సినిమాని మళ్ళీ గుర్తుంతెచ్చుకోవడం ఇష్టం లేక రాయడం మానేసాను.
ఈ సినిమాలో…
కథ: లేదు
కథనం: అతుకుల బొంత
హీరో:చిరంజీవి కొడుకనే ఒక క్వాలిఫికేషన్, కొన్ని స్టంట్ గిమ్మిక్కులు తెలుసు. అవి బాగానే ఉన్నాయి. కానీ నటన, వాచకం,స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ జీరోనే (ఇదే నేను చూసిన తన మొదటి సినిమా)
హీరోయిన్: చూడ్డానికి అందంగానే ఉంది. ఆహార్యం రెండు గెటప్పులకూ బాగానే కుదింది. నటన ఎలాగూ అనవసరం కాబట్టి మోతాదులో బాగానే ఉంది.
ఇతరుల నటన: శ్రీహరి ని కొంత మినహాయిస్తే ఎవరూ చెయ్యలేదు. ఆ విలన్ ఎవడోగానీ కనీసం “కసిగా” చూడ్డంకూడా సరిగా చెయ్యలేని ముఖం.
సెట్స్ – గ్రాఫిక్స్:దాదాపు రెండు దశాబ్ధాల క్రితం కృష్ట నటించిన ‘సింహాసనం’ అనే సినిమాలోని సెట్టింగుల స్థాయిని దాటి ఈ సినిమా సెట్టింగులు ఉన్నట్టు అస్సలు అనిపించదు. గ్రాఫిక్స్ సగానికిపైగా ఎక్కడో (ముఖ్యంగా హాలీవుడ్లో) చూసినవే. ఇక మనోళ్ళి కొత్తగా చేసింది పెద్దగా ఏమీ లేదు. అవి కథకు (ఉంటేగా) ఉపయోగపడింది కొంతే.
ఫోటోగ్రఫీ: కష్టం ప్రతిఫ్రేములోనూ కనిపిస్తుంది. శ్రమకోర్చి షాటుతీసిన తపన కనిపిస్తుంది. కొంత DI కూడా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా సాల్ట్ డెసెర్ట్స్ దృశ్యాల్లో.
యాక్షన్ (పోరాటాలు): బాగున్నాయి.మిగతా పోరాట దృశ్యాలు బాగున్నా, రథాల ఛెజ్ తియ్యడం కోసం మనకు బెన్-హర్ లాంటి సినీ బైబిల్ ఉండగా కనీసం దాన్నికూడా ఉపయోగించుకోకపోవడంతో పేలవంగా ఉంటుంది. 300 స్ఫూర్తితో తీసిన శతధృవంశ వీరుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే పోరాటం…ఫరవాలేదు అనిపిస్తుంది.
సంగీతం: పాటలు అస్సలు సినిమాకి అచ్చిరాలేదు. నేపధ్యసంగీతాన్ని మొత్తంగా చైనీస్ ఫిల్మ్స్ నుంచీ అరువుతెచ్చుకోవడం నిజంగా అవసరమా?
దర్శకత్వం: తెరపైన డీటెయిలింగుకు పెట్టిన శ్రద్ధ స్కిప్టు కోసం, నటులతో నటన చెయ్యించడంలోకూడా పెట్టుంటే రాణించేది. క్రితం చిత్రాలతో పోల్చుకుంటే ఇప్పటికీ ‘ఛత్రపతి’ సినిమా రాజమౌళి best. మగధీర అన్నిటికన్నా worst.
మొత్తంగా అతిభారీగా ఖర్చుపెట్టిన మీడియోకర్ చిత్రం.చూడకపోయినా ఫరవాలేదు. కానీ, అంతఖర్చు అనవసరంగా ఎలా పెట్టాడో చూడ్డానికి ఒకసారి చూడండి.
jonathan says:
direction of photography meeku telisina varu evaraina chesara
కత్తి మహేష్ కుమార్ says:
@జోనధన్: ఏంటి అలా అడిగారు? అన్నింటిలో లోపాలు చెప్పి దానిలో చెప్పలేదనా!
సినెమాటోగ్రఫీ సెంధిల్ చేశాడు. నాకు తన పేరు తప్ప వేరే పరిచయం లేదు లెండి. ఆమాటకొస్తే శ్రీహరి, కాజల్ కూడా నాకు వ్యక్తిగతంగా తెలీదు…
Chaitanya says:
meeku magadheera rajamouli cinemala lo anniti kante worst ga enduku anipinchindo teliyadu. meeru Yamadonga ni marachinattunnaru.
boothu dialogues, vulgar comedy sruthi mincha kunda teesina rajamouli cinema student no 1 taruvata magadheera matrame.
hollywood cinemalu andaru chudaru. naakaite special effects team chala kashta padi manchi workni andincharu anipinchindi.
copy chesinaa kashtapadi present chesaru.
inka hero ki screen presence ledanalemu. voice lo manchi base undi. kakapothe diction tappakunda improve cheyali. hero pedda star koduku kakapothe intha budget pettaru, openings raavu.2nd cinema kaabatti, definitega improve avutaadu anipistondi.
naa aalochana enti ante 300 laanti cinema state lo cinemaalu chuse vaarilo 1% ki telustundi. adi vizag, hyd laanti cities lo. mari migilina prajalaku arundathi, magadheera vanti cinemaale oka adbutham. completega copy kottakunda konni manchi scenes andivvadamlo tappu ledanukuntaanu.
For eg: Nuvvu naaku nachav lo amma meeda kavita chadive scene. adi english cinema lonidi. kaani entha mandi prekshakulu scene ni enjoy chesaru. sometimes, cinema normal prekshakudini entha entertain chesindi anedi kuda consider cheyaali. mukhyamga commercial cinemalu teesukunte. different cinema enjoy chese vaariki mana navatarangam vanti forum undi.
కత్తి మహేష్ కుమార్ says:
@చైతన్య: సాధారణంగా రాజమౌళి చిత్రాల్లో ఉండే బూతు శాతం కొంచెం తగ్గినంత మాత్రానా మగధీరను మంచి సినిమా అనుకోవాలంటే ఎట్లా!
టేకింగ్,ఎమోషన్,డ్రామా, మాస్ మసాలాలూ సమపాళ్ళలో ఉన్న ఛత్రపతి ఇప్పటికీ రాజమౌళి తీసిన తనమార్కు బెస్ట్ సినిమా అని నా అభిప్రాయం. నేలవిడిచి సాముచేసే కథను మంచి కథనంతో ఎలివేట్ చేసి “నమ్మబుల్”గా తీసిన చిత్రం అది. స్టూడెంట్ నెంబర్ వన్ సమయానికి రాజమౌళి్దంటూ ఒక శైలి తయారవలేదు. సింహాద్రితో తనదైన ఒక ముద్రవేసి ఛత్రపతితో స్థిరపరిచాడు.
కానీ యమదొంగ నుంచీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరంభమయినట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలోకూడా కొన్ని సీన్లు ‘నేను తీశాను కాబట్టి చూస్తారు’ అన్న తరహాలో కనిపిస్తాయి. And his obsession with “mega scale production” also started with యమదొంగ.
ఇక మగధీరలోని 300 కువస్తే, ఆంగ్లచిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. B-C సెంటర్లలో అది సూపర్ హిట్టు. కాబట్టి దాన్ని కేవలం 1% తెలుగు ప్రజలు మాత్రమే చూశారని అనుకోకండి.
అలవాటుపడితే రామ్ చరణ్ కూడా భవిష్యత్తులో ‘సూపర్ హీరో’ అనిపిస్తాడేమో బహుశా మరో పది సినిమాల తరువాత తెలుస్తుంది. నేనైతే ఇదే తనని మొదటిసారిగా స్క్రీన్ మీద చూడటం. నాకైతే ఆనలేదు. సూటిగా కెమెరాని కూడా చూడని అభినయం,ఎలా పలకాలో తెలీని వాచకంతో నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు.ఇక వాయిస్ లో బేస్ సంగతేమోగనీ కీచు మాత్రం కనిపించింది/వినిపించింది.
కాపీ కొట్టడం, ఇన్స్పైర్ అవ్వడంతో నాకు పెద్ద ఇబ్బంది లేదు. అలా చేసినప్పుడు అడాప్ట్ చేసి ఇంప్రూవ్ చెయ్యాలి. అది జరగలేదు. కథలో పెద్దలోతులేనందువల్ల అవి అందమైన అతుకులుగా కనిపిస్తాయేగానీ కావల్సిన ఎక్సైట్మెంట్ ని ఇవ్వవు. ఉదాహరణకు “అఘోరా సీన్లు” మొత్తంగా చెప్పుకోవచ్చు. ఇలా సినిమాలో చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి.
jonathan says:
prapancham lo cinemalaku pranamaina scenes ni copy chesi edit chesthe vallu vandala crores tho kastapithe mana vallu dead cheap ga copy cheyadam droham kaadoo?inka purathana kalam cinema laku ramcharan suit avuthademo
Chaitanya says:
background music chinese cinema nunchi aruvu techukovadam avasarama ani adigaaru. meeku nachhina chatrapati cinemalo agni skhalana music korean animated feature nundi copy chesindi ani telise untundi. chatrapathi cinema chusinappudalla prabhas interval mundu imp scenelo dialogue delivery sarigga unte entha bavundedho anipistundi.
కత్తి మహేష్ కుమార్ says:
చైతన్య: agreed. ఛత్రపతి రాజమౌళి బెస్ట్ అన్నానుగానీ నాకు బెస్ట్ అని చెప్పలేదుగా!
ప్రభాస్ నోరు తెరవనంతవరకే బాగుంటాడు అనేది నూటికి తొంభైశాతం మంది అంగీకరించే విషయమే. పాత్ర ఔచిత్యం, పరిస్థితితో సంబంధం లేకుండా గోదావరి యాసలో అదరగొట్టెయ్యడం ప్రభాస్కే చెల్లు. కీరవాణి నేపధ్య సంగీతం మొదటి నుంచీ కూడా అంతో ఇంతో inspiration తో చేసినవే. కాబట్టి కొత్తగా మగధీరకు చేసిన రీమిక్సు గణణలోకి తీసుకోకూడదంటారా!
Sandhya says:
rehman anthavadike ke tappani copy tippalu africa beats ni kottukochi ikkada play chesthunnadu kada,keeraavaani ni kshamincheyandi chinna pilladu copy ki ippude alavattu paduthunnadu
Chaitanya says:
i agree with all your points. inka ramcharan gurinchi antaara, mana 4 pedda heroes mundu cinemallo chesina acting gurthu techhukunte ippati vallu train ayyi vachhina, edina gaani better anipistunnaru.
శంకర్ says:
నాకైతే విక్రమార్కుడు రాజమౌళి సినిమాల్లోకెల్లా బెస్ట్ (డబుల్ మీనింగ్స్ ఎక్కువైనప్పటీకీ, కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ డ్ గా ఉంటాయి). చరణ్‍లో ఇంకా బెరుకు ఉన్న మాట నిజమేకానీ, ఈ సినిమాకి మొదటి సినిమాతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎలాగు ఇంకో పది సినిమాల వరకూ ఓపినింగ్స్ కి తిరుగులేదు కాబట్టి, కుర్రాడు రాటుదేలేప్పటికి మనకి అలవాటు కూడా అయిపోయి స్ధిరపడీపోతాడ్లెండి. నచ్చే విషయం ఏంటంటే స్టార్ స్టాటస్ ఉంది కదాని కూర్చోకుండా దాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నట్టుగానే కనిపిస్తుంది అవుట్పుట్ చూస్తుంటే. అయినా మన తెలుగు సినిమాల్లో నటన తెలిసి నటించేవాళ్ళకంటే, నటిస్తూ నటులుగా చలామణి అయిపోయేవాళ్ళే ఎక్కువైనప్పుడు, వాళ్ళకు అలవాటు పడేవరకూ వైట్ చేసి తర్వాత అదే నటననుకుంటే పోలా.
jonathan says:
sankar garu
intha comedy chestharu anukoledu ha ha ha
brave heart cinema ki copy dinchina vikramarkudu best ani antaaara mel gibson acting choosi vikramarkudu choodandi hero moham choosara dance chesthunnappudu hero face choodandi ela vuntundo ila aithe alavatu padatam kastam andee baboo
mana mahesh garu annattu sri hari kaajal baaga chesaru
శంకర్ says:
రాజమౌళి మీద బ్రేవ్‍హార్ట్ ఎఫెక్ట్ నాకు సింహాద్రిలోనే కనిపించింది. ఒక్కసారి సింహాద్రిలో సీత చనిపోయాక పైట్‍ని బ్రేవ్‍హార్ట్ లో హీరోయిన్ చనిపోయాక ఫైట్‍ని చూడండి. అలానే బ్రిటీష్‍వాళ్ళు స్కాటిష్‍ని అణగద్రొక్కే సీన్‍లు అన్నీ సింహద్రి ఫ్లాష్‍బ్యాక్‍లో తెలుగీగరించబడ్డాయి. ఇక విక్రమార్కుడుకి నేను రాజమౌళి సినిమాలకి అలవాటు పడిపోయి, బ్రేవ్‍హార్ట్ ఇన్ఫ్లూయెన్స్ ని గుర్థుపట్టే స్టేజ్ దాటిపోయానన్నమాట
. శ్రీహరి నటనకు పేరు పెట్టలేను కానీ, కాజల్ గురించి ఒక్కమాట. ప్రెజెంట్ క్యారెక్టర్లో బాగానే బిహేవ్ చేసిందికానీ (దాంట్లొ నటించడానికేముంది, ఇంటర్వెల్‍కి ముందు సీన్లో ఆమె ఏడుస్తుంటే నాకు నవ్వొచ్చింది), ప్లాష్‍బ్యాక్‍లో చూడడానికి అందంగా ఉందికానీ, ఆ ఎక్స్ ప్రెషన్స్ చూడాలి, ఎప్పుడెప్పు హీరోతో సాంగేసుకుందామా అన్నట్టు కళ్ళు పెద్దగా చేసి చూడ్డం తప్ప ఇంకేం తెలియనట్టు నటించేసింది. మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‍కి అదే ఎక్కువనుకొని అందరూ కాజల్ బాగాచేసిందనుకుంటున్నారని నా అనుమానం ( నా అనుమానం మాత్రమే)….
jonathan says:
nijamga mee anumaanam nijam 2 piece laku alavatupadipoyina telugu prekshakalaki idi konchem baagane anipinchi vuntundi
vulgur comedy ni rajamouli vadulukovali cheap ga nee size entha ani simhadri lo antaadu entha daarunam ga vuntundi family tho kalasi choosetappudu
jonathan says:
rajamouli family tho kalasi hills have eyes choodagalada
jonathan says:
Hey…i didnt write this comment, i mean some one is writing using my name.
I’ve been observing since few days and today i’m shocked read comments written by me.
Hey who are you man?
Jonathan
పుల్లాయన says:
ఈ సినిమా రజమౌళి సినిమాలలో worst ఆ? చాలా బాగా చెప్పారండి. ఇంతకన్నా మీ అభిప్రాయానికి స్పందించటం అనవసరం అనుకుంటున్నా.
కె.మహేష్ కుమార్ says:
@పుల్లాయన: సాంకేతిక పరంగా రాజమౌళి ఉత్తమ చిత్రం “సై”. కథా కథనాల పరంగా ఉత్తమచిత్రం “ఛత్రపతి”. నా ఉద్దేశంలో “మగధీర” ఇప్పటికీ worst among his films.
Ajay Kumar says:
మహేష్ గారు,
అరుంధతిని నచ్చిన మీరు, మగధీరపై ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారంటే…ఇప్పటినుంచి మీరు చెప్పే ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించాల్సిందె….
Chandra says:
mahesh gaaru, naaku yekkado gurthu vundi…meeru cinemalani nela tharagathi prekshakudi la choostharani ( I guess while replying to comments of “su” )..mari yenti andi..sudden ga successful hollywood director la analyze chesaaru…nenu maa oori vallatho maatladanu…dhimma thirigela theesaru annaru…vallaki meeru anna benhur kaani, 300 kaani theliyaduley.. naaku aiythe idea ledhu kaani..B,C grade prekshakudu kadha cinema success ni decide chesedi…naaku cinema goppa chitram kaakapoyina..mee review tho assalu angikarinchatledhu..anyways…we spoke to “Gamyam” krish recently..and he is little worried as Rajamouli set a new standard for telugu movie..it always better to highlight to positivities here…because most of the audience in this forum are in process of learning film making.. and if there are any improvements..you should be very specific..i feel both of the aspects missed in your review..
sekhar says:
@chandra
kummav tammudoo..keka question
**naaku aiythe idea ledhu kaani..B,C grade prekshakudu kadha cinema success ni decide chesedi
perfect..keep going
కత్తి మహేష్ కుమార్ says:
@చంద్ర: నేను ఈ సినిమానుకూడా ఒక “సాధారణ” ప్రేక్షకుడిలాగానే చూశాను. నాకు కొన్ని సమస్యలున్నాయి. అవే నేను చెప్పాను.
300 సినిమా నే ను తెలుగు డబ్బింగ్ చూశాను. బెన్-హర్,టెన్ కమాన్డ్ మెంట్స్ లాంటి సినిమాలు మాస్కూల్లో చూపిస్తే చూశాను (అప్పట్లో అవి చూపించడం ఒక ట్రెండు.
రాజమౌళి సృష్టించింది తెలుగు సినిమాకి కొత్త స్టాంన్డర్డ్ అయితే తెలుగు సినిమాని ఎవడూ రక్షించలేడు. All we might see in future is GOING DOWN THE DRAIN thats all.
sasank says:
@మహేష్ : అయినా మీరు చెప్పాల్సినవి మీ సమస్యలు కావు అండీ ఇక్కడ, సినిమా గురుంచి చెప్పాలి.ఎలా చెప్పగలరు మీరు తెలుగు సినిమా స్టాండర్డ్ పడిపోయింది అని. ఒకరకంగా పడిపోతుంది అనే చెప్పాలి, ఎందుకు పడిపోతుంది అంటే రాజమౌళి సెట్ చేసిన స్టాండర్డ్స్ వాళ్ళ కాదు, మీ లాంటి వాళ్ళ ఏడుపు వాళ్ళ అవ్వచ్చు ఏమో
అయినా సినిమాల విలువ పడిపోతుంది అని మీకు మీరే జనరలైజ్ చేసి ఎలా చెప్పగలరు “All we might see in future is GOING DOWN THE DRAIN thats all” అని.
I completely agree with chandra gaaru on this.
పుల్లాయన says:
శశాంక్ గారు,
రీమేకులు,ఆగంతకులు చర్చ లో మనం అనుకున్నట్లే ఒక అబోవ్ యావ్రేజ్ తెలుగు సినిమా లో ఎన్ని తప్పులు వెతుకుతున్నారో చూడండి. ఇంకా అది worst సినిమా అని కితాబు ఒకటి.
su says:
25yrs later…. RCt’s son will do a film with similar story and with as sucking graphix as this one..and i believe one of our children will be having a website like this while one writes a similar review and while someone helplessly weeps here…
its all written…..
sharma says:
రాజేంద్ర గారు.. పాపం నరసిం హ గారు మీరు చెప్పారు కదా అని తెలుగు లో ట్రై చేసినట్లున్నారు
:-)
రాజమౌళి ఇండియా స్పీల్ బర్గా… ఎం.ప్రసాద్ గారు వ్యాఖ్యలతో కూడా కామేడి చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు!
సినిమా అద్భుతం కాదు గాని బాగుంది,
హీరో ని, కోటని గ్రాఫిక్స్ లొ చూపించినప్పుడు రెండింటికి ప్రపోర్షన్స్ సరిగ సెట్ అవలేదు..
చరణ్ బాగానే చేసాడు, కాని ఉచ్చారణ మాత్రం బాలేదు
ఉదా: రాకుమారి ప్రయానానికి(ప్రయాణానికి) సిద్ధంకండి!!
sasank says:
Check the below link
http://rgvzoomin.com/2009/08/09/the-real-horror/
ఇది చూసాక అయినా మీ లాంటి వాళ్ళు సమీక్షల పేరుతో లోపల వున్నా కక్ష ని బయట పెట్టకుండా వుంటే మేలేమో
prem says:
మఘధీర గురంచి ఎంత చెప్పిన తక్కువె అవుతుంది.మన తెలుగు లొ ఈ సినిమ రావతం మన అధ్రుస్తం.
గీతాచార్య says:
ఎనబై శాతం సినిమాలో, హీరో గారి కదలికలో (శరీర భాష. ఇది బూతనిపిస్తే సారీ
) ఎక్కడో చూసిన విషయమే. లిస్టెందుకు కానీ ఏదో అలా కూచో బెట్టాడనే కానీ, గోప్ఫగా చెప్పుకునే సినిమా ఏమీ కాదు.
mss says:
hi
i have seen the picture yesterday.overall the picture is good.but i think rajmouli need more trianing in these type of stories.may he can go to SINGITAM SRINAVS GARU director of aditya 369 ,bhirva dweepametc.because in the picture they prepared a set with a lot of cost.it would be more attrative if they had used different colour cotumes.mainly i felt that heoriene doesnt look like princess or even sharatbabu being a king ,he too dont look rich. Though he told that wanted to be perfect in every aspect he couldnt.he could have done it better.totally i feel the art direction have failed to be perfect.it needs more improvement.finally coming to CHARAN, i think its still his 2 movie and he quite improved a lot.
పుల్లాయన says:
నిన్నే సినిమా చూశాను. తెలుగు సినిమాలో అప్పట్లో రాజుల సినిమా లాగా ఒక గంట మాత్రమే చూపించినా నన్ను మాత్రం బాగ ఆకట్టుకుంది. సినిమాలో లోపాలు ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా బాగుంది.
అబ్రకదబ్ర says:
ఇప్పుడే చూసొచ్చాను ఈ సినిమాని. పాత జన్మ సీన్లలో వేసిన సెట్టింగ్స్, అవీ యమా కామెడీగా ఉన్నాయి. ఆ గుర్రం దౌడు సీన్ మాత్రం చాలా బాగా తీశారు. అలాగే హీరో హీరోయిన్ల ఆహార్యం కూడా చాలా బాగుంది. షేర్ ఖాన్ గుర్రాల దండుతో ఎడారిలో వచ్చే సన్నివేశం బాగుంది. ‘జోధా అక్బర్’లో ఇలాంటి సన్నివేశాలతో పోలిస్తే ఇది చాలా రెట్లు మెరుగు. గ్రాఫిక్స్ పెద్ద ఫరవాలేదు. రాజమౌళి సినిమా సినిమాకీ ఈ విషయంలో చాలా మెరుగవుతున్నాడు. కథ మాత్రం నలుసంతే ఉంది. గ్రాఫిక్స్ మీద పెట్టిన దృష్టి కథ మీద పెడితే బాగుండేది. విలన్ వేషంలో సోనూ సూద్ బాగా చేసుండేవాడేమో. హీరోయిన్‌గా కాలజ్ చూట్టానికి ఫరవాలేదు కానీ నటనలో తేలిపోయింది. బ్రహ్మానందం ఎందుకున్నాడో కూడా అర్ధమవలేదు. శ్రీహరి పాత్రకి పత్రికల్లో బిల్డప్ ఇవ్వటమే కానీ సినిమాలో అంత సీన్ లేదు. ఫస్టాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు ఎత్తేసి వాటిబదులు పాత జన్మలో మరికొన్ని మెలికెలు పెట్టాల్సింది. మొత్తమ్మీద – ఈ సినిమా విసుగెత్తించలేదు, అలాగని ఓహో అనిపించలేదు – just passable. ఒకసారి చూసి మర్చిపోవచ్చు. విజువల్స్ చాలావరకూ బాగున్నాయి.
కె.మహేష్ కుమార్ says:
@అబ్రకదబ్ర: చాలా లైట్గా చెప్పి వదిలేసారు. బాగుంది మీ ఎక్స్ ప్రెస్ సమీక్ష.
SN says:
నేనూ చూసాను సినిమా … నాకయితే ఒవరాల్ గా నచ్చింది.
ఆఫ్ కోర్స్ ప్రతి సీన్ ని జోధాఅక్బర్ తో కంపేర్ చేసుకుంటూ ముందుకు సాగాను.కాకపోతే కొన్ని నిముషాల్లొనే అర్థమయ్యింది నెనెంత తప్పు చేస్తున్నానో…
కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయి…
రాకుమారి ఒక సైనికుడితో మేలిముసుగు లేకుండా తిరుగుతూ, అతడితో కామెడీలు వేసుకోవడం, అతడి చేతిలోని, ఎంగిలి పండు తినడం…దానికతడూ ఎమీ పట్టనట్టు చూడటం/ వెళ్ళిపోవడం…
పాట అవసరం లేకున్నా “ఎక్కడరా నా బంగారు కోడిపెట్టా” అంటూ కల్పించుకొని మరీ పాట పాడేసుకోవడం …
ఆ బుంగమూతి బుర్రమీసాల మారాజు కూతురు ఒక సాధారణ సైనికుడితో తిరుగుతోందని తెలిసినా అదేదో మామూలు విషయం లా పట్టనట్టు ఉండిపోవడం.
ఇక చరణ్ డైలాగ్స్ అల్టిమేట్….
” ఇదిగొ ఇది తాగు కూలయిపోతావ్” అనే డైలాగ్ సూపర్… ఆ వాయిస్ లో ఉన్న గీర/జీర. బెమ్మాండం….
రాజమౌళి లో నచ్చే అంశం ఇదే. హీరో కోసం కథ కాకుండా, కథ ని హీరో కొసం అల్లి చరణ్ ని ఎలివేట్ చెయ్యాలని పడిన శ్రమ సార్థకం. అప్పుడు ప్రభాస్, ఇప్పుడు చరణ్. సైనికుడి పాత్ర కి బాగ సూట్ అయ్యాడు. ఇక పోలో మంటూ కుప్పలు తెప్పలు గా సైనికుల కథలతో సైనిమాలొచ్చినా అశ్చర్యం లేదు.
కొన్నాళ్ళకి చరణ్ కూడా మనకి అలవాటయి పోవడం ఖాయం.. అల్రెడీ జనాలకు కొద్ది కొద్ది గా నచ్చేస్తున్నాడు.