తల్లీ కొడుకుల పెళ్ళి. కిక్కే కిక్కు
అలా అమరావతీ నగరమున ధర్మ నందనుడు కడు విచారగ్రస్తుడయి పచార్లు చేయుచున్నాడు. అట్టి సమయమున పిలవకనే పలికిన దైవము వలె నారద మహర్షి అతనికి అగుపించినాడు. మహర్షిని చూసిన గౌరవముతో ధర్మరాజు, “నారద మహర్షికి ప్రణామములు.” అని పలుకగా సంతసించిన నారద మహర్షి, ప్రేమతో ఆశీర్వదించి, “నాయనా ఏలనంత దు:ఖమునుంటివి?” అని ప్రశ్నించినాడు.
“మహర్షీ! మీ వద్ద దాచుటకునేమున్నది? మా పాంచాలిని పంచభర్తృకయని ఎన్ని విధముల యా దుర్యోధనుడు పరిహసించెనో గుర్తునకు వచ్చి నాకు విచారముగనున్నది. ఆడకూతుళ్ళని జనులు ఎన్ని విధముల హింసించుచుంటిరో యని నాకు విచారము కలుగుతున్నది.”
(ధర్మరాజు ఇంకా ఆ భారత కాలపు పరిస్థితులని ఆలోచిస్తున్నాడా? అసలు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాక ఈ విషయాలు గుర్తుంటాయా? అసలు భారతం జరిగిందా అని నన్ను మాత్రం అడగొద్దు. అసలే మన తెలుగోళ్ళ దృష్టిలో యముడికి ఆంగ్లం కూడా, చిరంజీవో, ఎన్టీయారో నేర్పిస్తే కానీ రాదని ఒక భయంకర నమ్మకం. యమగోల నోరు తెరుచుకుని చూళ్ళే?
)
“యుధిష్ఠిరా! నీ విచారము సంగతి సరే. నేను నీకొక విచిత్రమైన వార్తను జెప్పెద. వినుము. తల్లీ, కొడుకులకు వివాహమైనట్టి కడు చిత్రమైన సంఘటనని నీకు చెప్పెద. ఇందు మరొక ఆశ్చర్యము కూడనుయున్నది.”
“ఏమా ఆశ్చర్యమైన విషయము మహర్షీ?” అని ధర్మరాజు చేతులు కట్టుకుని ఆసక్తిగా ప్రశ్నించాడు.
*** *** ***
14 May 2009,
InoX, Vijayawada. Time… 4:20 pm.
షో మొదలైంది. నేను, నా స్నేహితులు ముగ్గురు తలుపు తెరుచుకుని వెళ్ళి మా సీట్లలో కూచున్నాం. సినిమా మొదలైంది. పేర్లు లేవు, ఏమీ లేదు. డైరక్ట్ గా ఇలియాన, తన చెల్లెలు కనిపించారు. “అక్కా! శుభవార్తే. నీ ఎంగేజ్‍మెంట్ ఫిక్సయింది.” ఏదో తేడా గొట్టి వెనక్కి తిరిగేలోపల “బ్రదర్! ఈ సీట్లు మావి.” అంటూ ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు.” మ్యాటరర్ధమయి, అక్కడినుంచీ జంపయి, మా స్క్రీన్ కి చేరే సరికి ఇంకా షో మొదలు కాలేదు. “ఏంట్రా ఈ డిజాస్టరు? సినిమా కూడా ఇంతేనా?” రవీంద్ర అనబడే బండ అన్నాడు.
“ఆగరా బాబూ, తెలుగు సినిమాలు చూసి చాన్నాళ్ళయింది. ఇది పిచ్చ ఫ్లాపైనా సరే ఇలియానా కోసమైనా చూడాల్సిందే.” ధన అనబడే ధనరాజ్ మన్మధ అన్నాడు.
సినిమా మొదలు. స్క్రీన్ పైన ఇలియానా యోగా. గుడ్లప్పగించాం. ఫ్రెండ్స్ తో గీతాచార్య. నౌ ఓవర్ టూ అమరావతి.
*** *** ***
“పూర్వం సూత మహర్షి శౌనకాది మహామునులకు ఒక చిత్రమైన కథని చెప్పాడు. ఆ కథనే ఈ మధ్య ’కిక్ ’అనే సినిమాగా తీశారు. దానిలోనే నాయనా నేను చెప్పిన చిత్రము జరిగినది. ”
“మహర్షీ! ఆ చిత్రము బాగుగనె ఆడినది కదా! కొందరికి అమితముగా నచ్చినది. మరికొందరికి అది నచ్చలేదు. నచ్చని వారు ఆ చిత్రమును ఒక మీడియోకర్ చిత్రముగ తీసి పారవైచినారు. అంతకు మించి మీరు చెప్పిన విచిత్రమైన సంఘటన ఏమీ లేదే. నేనునూ ఆ చిత్రమును చూచితిని.”
“అక్కడనే నాయనా నీవు చిత్రాన్నమున పాదముంచితివి. నీకు తెలిసినది ఆ చిత్రము గురించియే. నేను చెప్పబోవునది సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పిన వృత్తాంతము. అందున ఉన్న కథలోనే కొద్దిభాగమును సురేంద్ర రెడ్డి కిక్కెను. మిగిలినది నాకు తెలుసును. నీకు జెప్పెద. ఇక ప్రశ్నింపక వినుము.”
*** *** ***
14 May 2009,
InoX, Vijayawada. Time… 5:41pm.
ఇంటర్వెల్.
“సినిమా ఎలా ఉందిరా?” రవీంద్రని అడిగాను. “ఏం సినిమారా బాబూ. తల పోటెక్కి పోతోంది. అది కామెడీనా? రవితేజది యాక్షనా? ఆ పాటలేంటిరా బాబూ…”
ధన సైలెంటుగా ఉన్నాడు. వినయ్, ఇమ్రాన్ మాకు డ్రింక్స్, పిజ్జా తేవటానికి వెళ్ళారు. నేను ఆలోచనలో పడ్డాను. అంత చెత్తగా ఉందా సినిమా అని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఇంత ఎంజాయ్ చేసిన సినిమ ఇంకోటి లేదు. నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకూ. మనవతరంగంలో కూడా రివ్యూ ఒకమాదిరిగానే ఇచ్చారు.
*** *** ***
NTR Gardens,
One Indefinite day either in future or in past,
Evening 6:30.
మునులారా అస్సమయమున ఆ కుర్రాడికి వచ్చిన ఆలోచన ఇదీ. ఆ ఆలోచన అతని ఫ్రెండునే మార్చేసింది.
“ఎవరయ్యా మీరు. ఈ గడ్డాలేంటీ. మీసాలేంటీ? ఏంచేస్తున్నారిక్కడ?” ఆ వ్యక్తులని (మునులని) అక్కడ ఉన్న కాన్స్టేబుల్ ప్రశ్నించాడు.
“మమ్ము శౌనకాది మునులందురు. వీరు మహాపురాణవేత్త సూత మహర్షి,” అని శౌనక మహాముని చెప్పగా ఆ కాన్స్టేబుల్ పెద్దగా నవ్వి, “మీరు మునులా? ఇంగిలిపీచుని మాట్లాడేస్తున్నారు. ఎవరో వేషగాళ్ళాలా ఉన్నారు. చాల్చాల్లే ఊకోండయ్యా!.”
“కలికాలము నాయనా. మహామునులని అవమానింపకుము,” సూత మహాముని అన్నారు.
“తెలుగు సినిమాలుగానీ చూస్తావా ఎక్కువ? What nonsense are you talking. Don’t we know English? మేము త్రికాల వేదులము. మాకు తెలియనిది లేదు. మాకు ఆంగ్లము రాదనియేనా నీ వెక్కిరింపు? మరుజన్మలోకూడా హైదరాబాదులోనే జన్మించెదవుగాక!” అని శపించెను. “వీడెవడో Genre Yama సినిమాలు ఎక్కువ చూసే వాడిలా ఉన్నాడు.”
(ఆ తరువాత ఏమయిందో వ్యాసం ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది కనుక వదిలేద్దాం).
“అసలు విషయమును చెప్పండి సూత మహర్షీ. మాకు తెలుసుకొనవలెనన్న ఉత్సుకత పెరుగుతున్నది.”
“అటులనే వినుము. ఈ చిత్రములో మూడు సందర్భములో, ఆ హీరోయిను ఆ హీరో తన పుత్రుడనియే చెప్పెను. ఆ సందర్భములేంటో చూడుడు.’
ఇంతలో నాకు ఏదో ఓమెన్ అనిపించి, చూడగా ఆ మహర్షుల సమావేశం కనిపించింది. “మహామునులకు వందనం. మీరు చెప్పు ఆ సన్నివేశాలు నాకు తెలుసును. వాటి గురించి వ్రాసినను ఏ ఇబ్బంది లేదు కానీ… ఆ పదముల ఉచ్ఛరించుట, వ్రాయుట నవతరంగములో బాగోదు. ఆ సన్నివేశాలేవో జనులకు బాగుగా తెలుసును. కనుక మీరు మిగతా మునులను దివ్య దృష్టితో తెలుసుకొనమని చెప్పమని నా ప్రార్థన,” అన్నా. “అటులనే నాయనా. అశ్లీలోచ్ఛారణా, అశ్లీల పద దర్శనం ఎచటనైనను మంచిది కాదు. నీవడిగినటులే గావించెదను.” నేను మళ్ళా విజయవాడ ఐనాక్స్ లో పడ్డాను.
మహర్షులు ఆ సన్నివేశాలేవిటో, అందు ఆ వనితా రత్నం వాడిన నీ .. కాకుండా ఉన్న వేరొక దొంగ . …, కిక్కు . … అను మాటలు అర్థం చేసుకున్నారు.
*** *** ***
అమరావతి.
Some indefinite time.
“ఆ విధముగ ఆ హీరోయిన్ తన పుత్రునే వివాహమాడగా ఆంధ్ర జనులు ఎగబడి చూసి ఆ నిర్మాతలకు కనక వర్షమును కురిపించినారు. కనుక నాయనా, సహృదయులైన (అంటే ఎంత చెత్తైనా సహించువారని మహర్షి అభిమతము. నాకు ఈ అభిప్రాయముతో ఏవిధమయిన సంబంధము లేదని మనవి) ఆంధ్రజనులు ఇక ముందు మిమ్ములను కించపరిచే విధముగ మాట్లాడరనియె ఆశిద్దాము.”
“నారద మునివర్యా! అది సరే. సూత మహాముని “ఆ కుర్రాడికి వచ్చిన ఆలోచన ఇదీ. ఆ ఆలోచన అతని ఫ్రెండునే మార్చేసింది” అన్నారు కదా. ఆ ఫ్రెండుని మార్చిన ఆలోచన గూర్చి వారు చెప్పక కథలో ఇంటిగ్రిటీని దెబ్బ తీసినారే. లేదా ఆ విషయము అనవసరమని మీరె వదలినారా?”
“ఇంటిగ్రిటీ విషయమును మరొక కుర్రాడు(???) రాకేశునకు వదలి మనము ఆ మిగిలిన కథని గూర్చి కల్పవృక్షము క్రింద చర్చించుకుందాము.”
*** *** ***
14 May 2009,
Music world Coffee bar, Vijayawada.
Time… 7:41pm.
“ఏముందనిరా ఈ సినిమా గురించి తెగ ఇదైపోతున్నాడు?” రవీంద్ర ఉవాచ.
“మన ఇలూ అదిరిందిరా. సినిమా ముందే కాదు చివరిలో కూడా ఆ యోగా సీన్లు పెట్టటం మాత్రం కేక. చాలా రోజులైంది అంత సెక్సీగా చూసి.” ధన ఉవాచ.
“సినిమా ఎవరు చూడమన్నారు? దాని గురించి ఎవరు డిస్కషన్ పెట్టమన్నారు? అసలు మీతో సినిమా చూస్తే ఇదే సమస్య.” ఇమ్రాన్ కహాఁ.
“అసలీ ధన గాడితో వచ్చింది సమస్య. ఐనా సినిమా బానే ఉంటే వీడికేమో ఇలియానా, వాడికేమో (అనగా… యువర్స్ ట్రూలీ)…” అని వినయ్ అంటుండగానే… అప్పటిదాకా సరదాగా ఈ సంభాషణని వింటూ మధ్య మధ్యలో ఓ మాటేస్తున్న ధన “ఆఁ వాడికేమో? ఫినిష్ ఇట్ బ్రదర్” అన్నాడు. కాస్త కోపంగా.
ఇంతలో డెబ్బై రెండు రూపాయల (ఒక కాఫీ) కాఫీలు రావటంతో అందరి దృష్టీ అటు వైపు మళ్ళింది.
*** *** ***
అమరావతి, కల్పవృక్షం క్రింద.
సమయం నాకైతే తెలియదు.
కావాలంటే రాజమౌళినడగండి.
“అసలింతకీ ఈ సినిమా అంతగా నచ్చిన అప్ఫలానా కుర్రాడు ఎందుకు నచ్చిందో చెప్పక అలా సైలెంటుగా ఎందుకు కూచున్నట్టో? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసీ…” ధర్మరాజు అవాక్కై… “మహర్షీ, మహర్షీ! మన్నించండి. ఈ మధ్య పాత చందమామలు చదివీ చదివీ అందులో భేతాళుడి భాష అలవాటయింది.”
నారద మహర్షి చిరునవ్వు నవ్వి, “గ్రహించినాను యుధిష్ఠిరా! ఆ విషయమును వదులుడు. ఆ కుర్రాడు ఏమి చేశాడో ఇలా చూడు నాయనా…” అని ఆ కల్పవృక్షం వైపు తిరిగి “ఓ కల్పవృక్ష రాజమా! వివరమును ధర్మనందనునికి చూపుము.” అంతే. అక్కడో ఐమాక్స్ స్క్రీన్ వెలసింది. (స్వర్గంలో ఐమాక్స్ ఉంటుందా అని ఆ కానిస్టేబుల్ ప్రశ్నలు వేశారో… మీ మరో జన్మ కూడా హైదరాబాదులోనే).
*** *** ***
14 May 2009,
Music world Coffee bar, Vijayawada.
Time… 7:46pm.
కాఫీ సిప్ చేస్తూ నేను అన్నాను, “సినిమాలో చివరి సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. వాడు ఎందుకు పెట్టాడో నాకు అనవసరం. ఆ పాప కథ మొదలైనప్పటినుండీ నాది ఒకటే ఆలోచన. గుండే జబ్బు ఉన్న పిల్లలున్నారు. అలాగే థలసీమియా మేజర్, ఇంకా అలాంటి జబ్బులు, ప్రాణాంతక వ్యాధులున్న పిల్లలున్నారు. వాళ్ళకి సరైన చికిత్స లేక ఎంతమంది చిన్నవయసులోనే అసువులు బాశారో. ఆ విషయాల్ని కేవలమ్ హీరోయిజం ఎలివేట్ చేయటానికైనా సరే చెప్పటం నాకు బాగా నచ్చింది. అలాగే మనసే తడిసేలా పాట కూడా భలే వ్రాశాడు సిరివెన్నెల. నాకా సీన్లు చూశాక మనలాంటి వాళ్ళు చేతనైనంతలో ఏదన్నా చేయగలిగితే బావుణ్ణేమో కదా అనిపిస్తోంది. ఇందాకటినుంచీ నేను అదే ఆలోచిస్తున్నాను.”
*** *** ***
అమరావతి, కల్పవృక్షం క్రింద.
సమయం నాకైతే తెలియదు.
కావాలంటే యమగోల డైరక్టర్ ని అడగండి.
“మహర్షీ! మరొక చిన్న సందేహం.” “అడుగు నాయనా.” “ఎవరూ అతనెందుకు మౌనంగా ఉన్నావని అడగకుండానే అతను తననేదో అడిగినట్టే అదే ఆలోచిస్తున్నాను అన్నాడు దేనికి?”
నారద మహర్షి మందహాసం చెసి ఇలా అన్నారు, “కులం కోసం చావటం కంటే, మతం కోసం చావటం కంటే, రాష్ట్రం కోసం చావటంలో రాజసముంటుంది సార్… అని నాగ సినిమాలో జూ ఎన్టీయార్ ముఖ్యమంత్రికి కాకుండా కెమేరా వైపు చూసి ఎందుకు నమస్కారం చేశాడు? జల్సాలో చాలా సన్నివేశాల్లో పవన్ ఎదురుగా ఉన్న కారక్టర్ల వైపు కాకుండా ఎందుకు జనం కొసం ఏదో నటిస్తున్నట్టు కెమెరా వైపు ఎందుకు చూసినట్టు? ఇదీ అంతే నాయనా.”
“మరి అలా ఐతే ఇంటిగ్రిటీ దెబ్బ తినదా?”
“దాని సంగతి రాకేశుడు చూసుకుంటాడని ఇందాకనే చెప్పితిని కదా?”
*** *** ***
8:45 pm,
Pandit Nehru Bus station,
Vijayawada.
“సరే బైరా! నేను రాత్రికి హైదరాబాదు వెళ్తున్నాను.” ఐ సెడ్.
“ఇంకెప్పుడెళ్తావురా?” రవి సెడ్.
“ధన బైక్ మీద దింపుతాడు. ఎలెవెన్ కి బస్. మేము ఇప్పుడు వెళ్ళే సరికి టెన్. ద టైమ్ ఈజ్ ఇనఫ్.” ఐ సెడ్.
“ఒరే, నిజంగా చెప్పు సినిమా ఏ కోశాణన్నా బాగుందా?” రవి సెడ్.
“నాకైతే బాగా నచ్చిందిరా. అందులో వాడిన పాయింట్ నన్ను కాస్త కదిలించింది. రవితేజ కారక్టర్ నాకు నచ్చింది. ఇంక వదిలెయ్.” ఐ సెడ్.
ఆ తరువాత నేనూ, ధన, ఇమ్రాన్ వెళ్ళిపోయం.
*** *** ***
అమరావతి,
సమయం తెలియదు.
“ఇంతకీ ఈ సినిమా గురించి మీరూ ఏమనుకుంటున్నారు మహర్షీ?” యుధిష్ఠిర ఉవాచ.
నారద మహర్షి గాఢంగా నిట్టూర్చి (దీర్ఘంగా నిశ్వసించి), ” ఈ సినిమాని ఆంధ్రదేశంలో తప్పదీశారు.”
“అది ఏమి మహర్షీ?”
“అదే దీనిని తమిళనాడులో, ఏ విజయ్‍నో, మరో క్రొత్త నటుడినో పెట్టి, ఏ మురుగ దాసో, ఆమీరో తీసి, చివరాఖర్లో హీరోని పోలీసులు ఎన్‍కౌంటర్ చేసినట్టు చూపినట్టయితే, ఆహా సమాజంలోని బాధాకరమైన విషయాన్ని ఎంత హృద్యంగా చెప్పాడో కదాయని ఆంధ్ర జనులు దాన్ని రీమేకు గా తీసేవారు. ప్చ్. అలా జరిగిపోయింది. ఇక నేను వచ్చెదను. నారాయణ. నారాయణ.”
*** *** ***
కథ, స్క్రీన్ ప్లే: బాగనే ఉన్నాయి.
నటినటులు: ఈ సినిమా రవితేజదే. కానీ ఆ యాక్షన్ సన్నివేశాల్లో ఏ మహేషో, హృతికో గుర్తొస్తే మనం ఏమీ చేయలేము. వాళ్ళు చేసిన సన్నివేశాల మీద స్పూఫు లా ఉన్నాయి. బట్ ఎనీవే కూల్. ఇలియానా వద్దన్నా హైలైటే. అందరూ లోలోపలైనా ఒప్పుకుంటారు. నటన ఓ మాదిరిగా ఉంది. బ్రహ్మానందం, ఆలీ హాస్య సన్నివేశాలు అదుర్స్. మిగతా వాళ్ళు మామూలే. ’జిల్ జిల్ జిగా జిగా స్వామీజీ నవ్వించాడు.
సంగీతం: థమన్ సంగీతం కన్నా, సీతారామ శాస్త్రి కలమే పాటలని హిట్ చేశాయన్నది బహిరంగ రహస్యమే. వినగా వినగా బాగున్నాయి. “బాసూ మనకి మెమోరీ లాసూ…” దీన్ని హమ్మింగ్ చేస్తున్నాను. “మనసే తడిసేలా…” లో గీత రచయిత ఒక గొప ఫీల్ ని అందించారు. నేను ఎక్కువగా వింటున్న పాట అదే. అనుష్క పాడిన పాట… యాక్షన్ సీన్లలో (దొంగతనాల) రవితేజ ఇనెబిలిటీని కవర్ చేయటానికే. మిగతావి ఫర్లేదు. కన్నేత్తి చూడకే… కేక. Rerecording ditto మణిశర్మ.
ఇతరాలు: రసూల్ ఎల్లోర్. చాలా బాగా వర్క్ చేశాడు. స్టంట్ సీన్లు బాగున్నాయి. చివరి సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. మిగతా శాఖలు కూడా ఎబౌ ఏవరేజ్. నో మీడియోక్రిటీ.
దర్శకత్వం: టెక్నికల్ మెరుపులు లేకున్నా, అవకాశం ఉన్నా కూడా రక్తపాతాలు, భీభత్సమైన పోరాటాలు చొప్పించకుండా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ ని అందించాడు సురేంద్ర రెడ్డి.
రేటింగ్: సినిమాకి 4.5, హీరోయిన్, ఇతర పాత్రధారులుపయోగించిన బూతులకి -1, సినిమాలో స్పిరిట్ కి 0.5. వెరసి 4. You can watch it any time. Surely movie of the year in the fisrt half year.
*** *** ***
July 24th,
“ఇప్పటికైనా చెప్పరా ఆ సినిమా ఎందుకు నచ్చిందో?” రవీంద్ర అన్నాడు. వాడు నాతో ఆ సినిమాకి రావటం రెండో సారి. నాకది తొమ్మిదో సారి.
“రవితేజ ఇలియానాతో అంటాడే… ’నువ్వు మనం విడిపోయిన క్షణాలనే గుర్తుంచుకున్నావ్. నాకు మాత్రం మనం కలిసి గడిపిన ఆ హ్యాప్పీ మూమెంట్సే గుర్తున్నాయి…” something like that dialogue ఉందే. సినిమా అంతా అదే స్పిరిట్ క్యారీ అయింది. అదే కాదు. మనిస్షి సంతోషం గురించి హీరో చెప్పిన డైలాగులన్నీ నాకు నచ్చాయి. అందుకే ఈ సినిమా నాకు నచ్చింది. A portrayal of benevolent universe. ఇంకా కోటాతో పిల్లల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవో వెప్పే సీన్ నాకు నచ్చింది. అందుకే ఇన్ని సార్లు చూస్తున్నా. నీకు మాత్రం అందులో వేరేవే ఎక్కువ కనిపిస్తున్నాయి.”
So, with this, Ravi got convinced.
ధర్మరాజూ, నారద మునీ ఈ విషయం మళ్ళా మాట్లాడుకుంటారో లేదో నాకు తెలియదు.
Filed Under: featured • lead • భారతీయ సినిమా • విశ్లేషణ
mana kharma …to see such 3rd rate films and ppl to write lenghty trying to analyse such and my fate to read such and my worst fate to comment on such
Su,
So, I surely got one point. You have a preposterous opinion, and came with it, and missed the essentials of the post. Just read it, and commented. Hehehe.
You neither explained why it is a third rate film, nor you… Ok. ok. It’s better the author take the work of replying. Sorry for intruding
Well said Su.
Wish i hadn’t wasted 10 minutes of my life on this silly piece.
edisaaru…cinema hit ayyindi..prajalandariki nachindi….
lyf long kick praptirastu………..
ప్చ్!
““ఆగరా బాబూ, తెలుగు సినిమాలు చూసి చాన్నాళ్ళయింది. ఇది పిచ్చ ఫ్లాపైనా సరే ఇలియానా కోసమైనా చూడాల్సిందే.” ధన అనబడే ధనరాజ్ మన్మధ అన్నాడు.”
“ఇంతలో నాకు ఏదో ఓమెన్ అనిపించి, చూడగా ఆ మహర్షుల సమావేశం కనిపించింది.”
***
Lots of things are inserted at apt places. My complaint is it’s lengthy. But the narration is very interesting, and racy. Split scene presentation. Eh? Every other thing we discussed a no. of times.
BTW, check whether Rakesh is going to file a case against u. Hehehe.
స్క్రీన్ప్లే తరహాలో రాసిన శైలి బాగుంది. ఈ సినిమా గురించి…ఏం చెప్పాలి!
Ditto my feelings. But any way I enjoyed the movie.
Mother-son affairs or marriage is no more a joke. They are actually happening, albeit secretly and sporadically. See this :
http://www.mashada.com/forums/general-discussion/88775-i-want-marry-my-son.html
NACHHALEDU….
గీతాచార్య. నువ్వు పెట్టిన టైటిల్ కూడా జుగుప్సకరంగా ఉంది. తల్లీ కొడుకుల పెళ్ళి అంటే వినే వాళ్ళకి వాంతొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా?
ప్రవీణ్ శర్మ,
కాస్త ఫార్మల్ గా మీరు అంటే బాగుండునేమో? ఎందుకంటే మన మధ్య ఇంతవరకు ఏ విధమైన సంభాషణా జరగలేదు. (కాస్త సంస్కారం నేర్చుకోండి.)
ఇక టైటిల్ సంగతి! అందులో వాంతి వచ్చేంత అసభ్యత జుగుప్త్స కలిగించే విషయం ఏముందో నాకేమాత్రం అర్థం కాలేదు. ఇందులో నేను కన్వే చేసిన దాన్ని వదిలేసి టైటిల్ మీదే పడ్డారంటే… బహుశా మీకు ఇదే కావాలేమో… వెతుక్కుని మరీ వస్తారా?
>>>”టైటిల్ చూసినప్పుడు నాకు జుగుప్సకలిగి బి.పి. పెరిగింది. ఇలాంటి ఆర్టికల్స్ నవతరంగం లాంటి వెబ్ సైట్ లో ఎలా ప్రచురించారు?
ఇందులో ఒక్క అభ్యంతరకరమైన అక్షరాన్ని చూపగలరా? అసలు నేను చెప్పిన దాన్నీ అర్థం చేసుకోగలిగే కెపాచిటీ మీకు ఉందా? అసలు విషయం వదిలేసి కొసరు మీద పడ్డారు.
హరే కృష్ణ!
babu..geetacharya…overall ga concentrated chadivite mee article lo okka mukka kuda ardam kaledu…edo title variety ga undanukuni ochi chaduvudamanukunna…
asalu aa bhashemito ..aa golemito mekaina ardamaite naku cheppa galarani manavi….
inkokasari ilantivi raaste kaneesam certified for adults ani naina cheppandi..chadavakunda untamu…
అన్నయ్యా హీరో,
అదే మన దౌర్భాగ్యం. టైటిలు వెరైటీ తప్ప రాసిందాన్లో విషయం ఎవరికీ ఎక్కలేదు. అంతేలే. ఎవడికేంకావాలో అదే కనిపిస్తుంది.
@Marthanda,
ROFL. జోకులెయ్యడంలో మీకు మీరే సాటి.
Babu Geethacharya,
Praveen sarma cheppina dantlo thappemundi…. asalu aa title ki nuvvu cheppina daniki sambandham enti? raasindi thokkalo kick review.. mention chesina title mathram incest….
standards gurinchi ippudu avasaram ledu kani.. asalu how can you judge that title to kick review?
@శేఖర్: మీరు కిక్ సినిమా చూసుంటే ఈ ప్రశ్న అడగరేమో! ఇందులో హీరోయిన్ ఇలియానా హీరో రవితేజని ముద్దుగా ‘నాకొడకా’,‘దొంగనా కొడకా’అను మొదలగు “కొడుకులు”గా పిలుచుకుంటూ ఉంటుంది.
Hey Mahesh,
Mee aakrosam chusina tharvatha i did understadn why you came up with that title. Ippudu cool ayyuntaru kada…. so just think abt it…. Anyhow mee review bagundi… btw are you trying as writer?
to navatarangam management please dont publish these kind of worst articles.sodhi article.please maintain your stsndards.
Hehehe. What do you mean by standard sir? Not even reading a single line, and just commenting what you want to? Show me a single word which is objectionable to the reputation of NT?
Not about single word … its the whole article .. babbling
ఈ సినిమా నాక్కుడా సూపర్‌గా నచ్చింది. ఒకసారి నచ్చటం మొదలెట్టాక, నచ్చకపోవడమే లేదు…ఈ సినిమాలో…కిక్కే కిక్కు.
>>A portrayal of benevolent universe.
- అద్దిరింది.
>>’నువ్వు మనం విడిపోయిన క్షణాలనే గుర్తుంచుకున్నావ్. నాకు మాత్రం మనం కలిసి గడిపిన ఆ హ్యాప్పీ మూమెంట్సే గుర్తున్నాయి…” something like that dialogue ఉందే. సినిమా అంతా అదే స్పిరిట్ క్యారీ అయింది.
- పెర్ఫెక్ట్!
రవితేజ “కిక్” దొరకబుచ్చుకున్న ఆ మొత్తం సీను చాలా బాగా పండింది. రవితేజ కూడా చాలా బాగా చేశాడు. హెవీగా సీనుండదు. కానీ, కావాల్సిన ఎమోషనల్ సీరియస్‌నెస్ ప్రేక్షకుడికి వచ్చేస్తుందనే అనిపించింది. (నాకు వచ్చింది.గుండె బరువెక్కింది. ఎంత చక్కగా చెప్పాడో కదా అని ద్రవించి పోయింది).ఎక్కువ సెంటిమెంట్ సీన్లు లేకుండా తీయాలనే పూరీ జగన్నాథ్ తాపత్రయం కంటే, ఈ సినిమాలో దర్శకుడు సాధించింది ఎక్కువ. ఐ డోంట్ థింక్ హి కెన్ రిపీట్ ఇట్. కానీ ఈ సినిమా వరకూ – కిక్కే కిక్కు.
>>వాళ్ళు చేసిన సన్నివేశాల మీద స్పూఫు లా ఉన్నాయి.
“స్ఫూఫు” అనకూడదు. దీనికేదన్నా వేరే పేరెట్టాలి. ఎందుకంటే “స్ఫూఫు”లో దాన్ని కామిడికి వాడుకుంటాం. కానీ, ఇక్కడ అలాంటివి కొన్ని “ఫ్రేమ్స్” చూపించేసి, ఆ సినిమాలోని ఎఫెక్టుని ఎస్సెన్సుని ఒక్కసారిగా తీసుకొచ్చి ఈ పాత్ర కిచ్చేస్తాం!!!!
ఎలా చెప్పాలి…..ఉదా: హృతిక్ ’ఆర్యన్’ ని రవితేజలో తీసుకొచ్చేయడానికి, మీరు మళ్ళీ సినిమా మొత్తం తీయరు! వర్షం, బేస్‌బాల్ ఫ్రేమ్స్ అలా వచ్చి వెళ్ళిపోతాయి. మన అసలు సినిమా “కిక్”కి అవి సంబంధమే లేదు! కానీ కొన్ని ’కీ ఫ్రేమ్స్’ వాడేసుకోవడం ద్వారా – సడన్‌గా హీరో ఇప్పుడు “ఆర్యన్” పాత్రగా ఎస్టాబ్లిష్ చేసేసాం.
అదే, అల్లరి నరేష్ సినిమాని “స్పూఫ్” అంటాం. Hope I could convery the difference!!! అలాగే – రామ్ గోపాల్ వర్మ తెగ కష్టపడిపోయి తేసే సీన్లని “స్పూఫ్” తీసినంత ఈజీగా తీస్తాడు – అదే! ఓ స్వామీజీ, రాజకీయనాయకులు ఇలా అన్నమాట.
ఈ టెక్నిక్ కేవలం తెలుగు సినిమాలకీ, తెలుగు ప్రేక్షకులకే సొంతమేమో. ఇక్కడ గమనించాల్సిన విషయం – ఆ ముందటి హిట్ సినిమాలు మీకు తెలీకపోతే, ఏం జరుగుతోందో తెలుసుకునే “ఙ్జానం” ప్రేక్షకుడిలో ఉండదు!! ఎప్పుడూ సినిమాల్తో కాంస్టంట్ టచ్ లో ఉండాలి సుమా!ఇంగ్లీషు సినిమాలతో సహ!ఇది ప్రేక్షకులకీ , డైరక్టర్లకీ మధ్య నిరంతర పోటీ!
ఇంకోటి, హీరోలు , పాత్రలు డైరెక్టుగా ఆడుయన్స్‌తో మాట్లాడ్డానికి – “ఒన్ టు ఒన్ మెస్సేజింగ్” – అని పేరుపెట్టుకున్నాం – చాలా ఏళ్ళ క్రితం, మా మిత్రబృందంలో.
)
దీనిలో కొన్ని హైట్లుంటాయి – పాట మధ్యలో హీరోయిన్‌ని హత్తుకుంటున్న హీరో , ప్రేక్షకుల వైపు తిరిగి కన్నుగీటుతాడు! ఎందుకు? – మెస్సేజింగ్!! థియేటర్‌లో ఎంతమంది ఉన్నా- హీరో ఓ స్పెషల్ మెస్సేజ్‌ని ఫ్యాన్సు గొండొల్లోకి పంపిస్తున్నాడన్నమాట. అది ఆయా ఫాన్సుకు మాత్రమే తెలిసిన మెస్సేజీలుట! చిరంజీవి దీన్ని బ్రహ్మాణ్ణంగా పోషిస్తాడు.
అందుకే “తెలుగు ఫిల్మ్ అప్రిసియేషన్ క్లబ్” ఒకటి కావాలి.అందులో, ఇవన్నీ కమర్షియల్ మూవీ అప్రిసియేషన్ కింద నేర్పించాలి.
@రేరాజు: మీరు అన్న “ఒన్ టు ఒన్ మెస్సేజింగ్” ద్వారా ప్రేక్షకుడికి సినిమాతో interact అయ్యే అవకాశం కల్పించడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కేవలం అది తెలుగు సినిమాలకు పరిమితం కాదు. పాప్యులర్ “హీరోలు” హాలీవుడ్,బాలీవుడ్, లాలివుడ్,టాలీవుడ్ తో బేధం లేకుండా అందరూ చేసేపనే.
మనం కోరుకున్నప్పుడు హీరో తెరమీద ప్రత్యక్షమవ్వడం, మనకోసం హీరోయిన్తో అంగాంగవైభోగాలు చేసుకోవడాన్ని అనుభవించడానికి ప్రత్యేకమైన కోర్సులక్కరలేదు. సాధారణ ప్రేక్షకుడైతే చాలు. ఇవన్నీ రాక లేక తెలియక కాదు. ఈ rudimentary స్థాయిని దాటి ప్రేక్షకులతో engage అయ్యే విధానం కావాలి అని మాత్రమే ఒక చిన్నకోరిక. ప్రేక్షకుడి primordial instincts ని తృప్తిపరచడంతోపాటూ, కొంత aesthetic ఆనందాన్నికూడా సినిమా అనే “ఆర్ట్ ఫామ్” అందించాలని ఒక చిన్న ఆశ.
కమర్షియల్ సినిమా ఫార్మాట్లోకూడా ఆ బృహత్తర అవకాశం మెండుగా ఉందనేదే నా వాదన. Actually commercial cinema has greater opportunity towards creating that space.
సరే సీరియస్ గా :
—————————————–
ఈ rudimentary స్థాయిని దాటి ప్రేక్షకులతో engage అయ్యే విధానం కావాలి అని మాత్రమే ఒక చిన్నకోరిక. – ఎవరి కోరిక? దీంట్లో తప్పేంటి? ఇంకెలా కావాలి?
—————————————–
ఈ కింది వాక్యం అద్దరగొట్టారు. మీ మీదే ప్రయోగిస్తే నెప్పుడున్నా భవిష్యత్తులో
>> (ప్రేక్షకుడి) primordial instincts ని తృప్తిపరచడంతోపాటూ, కొంత aesthetic ఆనందాన్నికూడా (సినిమా అనే) “ఆర్ట్ ఫామ్” అందించాలని ఒక చిన్న ఆశ.
—————————————–
“కమర్షియల్ సినిమా ..opportunity towards creating that space.”
- I am curious to know. I think i will undertsand it better if you explain this with examples. I am still “thinking” abt it. It will be helpful.
—————————————–
Anyway, I felt there is more to it than what meets the eye in this movie. It surely has ‘A portrayal of benevolent universe’ – than just satisfying the ‘premordial instincts’ .
Was it intentional on the part of the director?Even if it was a deliberate attempt, was it an intellectual and intelligent crafting? I sincerly doubt it. But it would be great if the director can understand that he has shown something beyond the mundane in the random racy entertainer he has created.
But then, was it really random? Is it not the person’s innate urge to tell the secret of a real “kick” ? Do you think he failed to convey it to the masses! I think he succeded.And the masses have actually accepted the message and liked the package too.
Most often – people missunderstand and attribute the wrong reasons for success.
Well, i don’t know what was the reason for this sucess. I just want to say – this was just not crap. There is something in it. If you have not seen it, you have a definition of an “aesthetic” and perhaps it has not met your expectation.
I came back eagerly, for your answer. Because I am looking for the answer. It’s ok.
Chandu introduced NT to me. But, he ended up creating this question in my head.
The question is here : http://navatarangam.com/2008/12/slumdog-millionaire/
If i can rephrase Vamsi’s question there:
I like Kalyani Biryani. You like Burger King. In what way my Kalyani Biryani is inferior !?
If they are equal/great each in their own taste, then why call Kalyani Biryani inferior and eat the Burger King!?And why “teach” about Burger King? It is like the old man – shop keeper on pustakam.net asking the British – why should i learn about hair-cut or nail-cut from them?
Does this mean we will never “change” from Kalyani Biryani or Burger King? Does this mean i don’t want change? If i want change, what change? and what for? what’s wrong with this?
Lots of questions Mahesh. Sometimes I feel you are looking at the question. Sometimes I feel you are the same….with all those:
>>”ఇంతలో నాకు ఏదో ఓమెన్ అనిపించి, చూడగా ఆ మహర్షుల సమావేశం కనిపించింది……కనుక మీరు మిగతా మునులను దివ్య దృష్టితో తెలుసుకొనమని చెప్పమని నా ప్రార్థన”………who are these seers the author of the above piece is referring to? Or you NOT one among them?
rayraj…
and
everyone in this discussion…
sorry….for my aprastuta prasangam..
but nt able to resist myself from asking…
wht is this KALYANI BIRYANI???
would you please enlighten me about it rayraj..and ifi ts alluring to me..where can i get it?? i am already damn hungry this afternoon
@రేరాజు: I believe in telling “my stories – our stories”. దానికి తగినట్లుగా సినెమాటి భాషను మార్చుకోవచ్చని, కొత్తగా సృష్టించవచ్చని ఇప్పటికే ఎంతోమంది భారతీయ దర్శకులు నిరూపించేశారు.
అందుకే నేను బర్గర్ కింగ్ ను ఆస్వాదించినా, నా మూలం మాత్రం కళ్యాణీ బిర్యానీయే అంటాను. అంటోనినీని చూసినా,అడూర్ గోపాలకృష్ణనే నేర్చుకుంటానంటాను.
హాలీవుడ్ స్థాయికి “ఎదగడం” అనే ఆలోచనే పెద్ద ఫార్స్. నా సినిమాతో కొత్త సినీప్రపంచాన్ని సృష్టిస్తాననుకోవడమే నాకు కావాలి. నేను ఆశించేదీ అదే.
యూరోపియన్ న్యూవేవ్ ఇక్కడ రాదు. ఎందుకంటే రెండోప్రపంచ యుద్ధం అనంతరం fragmantataion of human self ఇక్కడ జరగలేదు గనక. As simple as that.
కాబట్టే, మన మానసికత, మన కథావిధానం వేరు. అదే సినిమాగా రావాలి.మన పురాణాలూ, మన సమాజాలూ వేరు. అందుకే మన కథలూ వేరుకావాలి. అలా “వేరుగా” ఉన్నప్పుడే మనదైన అస్తిత్వం వస్తుంది. దానికి కావలసింది అమలులో ఉన్న కొలమానాలు కాదు. కొత్తవి కొంగ్రొత్తవి కావాలి. అలా జరగాలంటే నిబద్ధత కావాలి. నేను ఆశించేది ఆ నిబద్ధతని.
చలం,బుచ్చిబాబు,గోపీచంద్, తిలక్ ఎందరు లేరు మన కథల్ని మనకు చెప్పినోళ్ళు. ఆ కథలు ఏవీ…మనసినిమాల్లో ఆ మనుషులేరీ! మన సినిమాల్లో “మనం” ఎక్కడ?
@రేరాజు: ఎక్కడి నుంచో ఉదాహరణలు ఎందుకు ‘కిక్’ గురించే చెప్పుకుందాం.
ఈ సినిమాలో హీరోకి “అసలు కిక్కు మానవత్వంలో ఉంది” అని తెలియజెప్పడం అత్యంత కీలకం. కథాపరంగా అత్యంత ఉదాత్తమైన పాయింట్. సినిమా మొత్తం ఆ ఒక్క విషయం మీద ఆధారపడి ఉంటుంది.
ఒక సీన్ చెబుతాను వినండి…
ఒక బస్ స్టాప్ దగ్గర హీరో నిల్చొనుంటాడు. ఆ కేన్సర్ ఉన్న అమ్మాయి సహాయార్థం డబ్బాలో డబ్బులు అడుగుతూ వస్తూంటుంది. అప్పుడే ఒక బైక్ యాక్సిడెంట్ ఆ రోడ్డు మీద జరుగుతుంది. హీరో హడావిడిగా ఆ గాయపడిన వ్యక్తిని ఆ రోడ్డు మీద వస్తున్న బెంజికారులో ఎక్కిస్తాడు.
బెంజ్ కారు ఓనర్: “ఏమిటయ్యా నా కారే కావలసొచ్చిందా! ఆ ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళొచ్చుకదా”
హీరో: “ఆటోలో వెళితే కిక్కేముంటుంది? అందుకే నీ బెంజికారుని ఆపాను”
ఈ సంబాషణ జరుగుతుండగా, ఆ యాక్సిడెంటుకు కారణమైన రోడ్డు మీదున్న గుంతని, పక్కనే ఉన్న మట్టి తీసుకొచ్చి ఇప్పటివరకూ సహాయంకోసం డబ్బా పట్టుకుని డబ్బు అడిగిన పాప నింపుతూ ఉంటుంది.
హీరో: “ఏంటి పాపా ఏంచేస్తున్నావ్?”
పాప: “ఇంకో యాక్సిడెంట్ కాకుండా ఈ గుంతని పూడుస్తున్నాను” అంటుంది.
హీరో ఒక్క సారిగా ఆలోచనలో పడతాడు. లోతుగా ఆలోచించే లోపే అక్కడ్నించీ వెళ్ళిపోవాల్సి వస్తుంది.
ఈ సీను సినిమాలో లేదు. ఇలాంటి మరో నాలుగు సీన్లు స్కిప్తు స్థాయిలో ఉండీ ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని తీసెయ్యబడ్డాయి(అట). వాటి స్థానంలో ప్రధమార్థంలో కొన్ని జోకులు ఏరుకుని సీన్లు కూర్చబడ్డాయి. ఇలియానా ఫుటేజ్ పెంచడానికి మరిన్ని బూతులతో కూర్చిన డైలాగ్ మాలలు పేర్చబడ్డాయి(ట).
అంటే, సినిమాకు అత్యంత కీలకమైన Hero’s journeyని విజయవంతంగా ప్రేక్షకుల “presumed” primordial craving కోసం తొలగించబడ్డాయి. ఒక బలమైన కథాంశాన్ని చీప్ థ్రిల్స్ అందించడం కోసం “త్యాగం” చెయ్యాల్సివచ్చింది.
ఇక నేను పెద్దగా వివరణ ఇవ్వాల్సిన పనిలేదనుకుంటాను. Making a film that you believe in. Making a film that has a “story” to tell కన్నా మించిన aesthetics సినిమాలకు అవసరం లేదు. అదే మన సినిమాల్లో క్రమక్రమంగా లోపిస్తోంది.
I am not aware of the script or the scene changes. But then, I liked the final product.
So – was their “presumed primordial craving” the reason behind this? I don’t think so!
I think i have seen the point he wanted to make!!
I am not sure how i would feel with those other scenes you mentioned. But I have got the essential thing. I have no complaints the way the ingredients were mixed. Now, how is this inferior? Thats the question I am trying to answer myself/and asking you to help with an answer.
You think there were NO compromises in the so called “best movies” from what they were originally planned!? I don’t think so.
So “compromising” is not reason for calling it crap. It can’t be!!
I will stop here. But the question is not answered. First start with who wants this “change” ? Perhaps, the seers, you and me!!
The others have liked and enjoyed. isn’t it!?
సినిమా చూస్తున్నంత సేపూ ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా నవ్వు రాలేదు. నా వెనక లైన్లో వాళ్ళు మాత్రం ప్రతి డైలాక్కీ దొర్లి దొర్లి నవ్వారు.ఇలియానా బూతులు, రవి తేజ వెకిలి కామెడీ, బ్రహ్మానందం అతి, వీటన్నిటినీ పీక్ లెవెల్ కి చేర్చిన సినిమా! వాడు చేసే వెధవ పన్లకు రోగిష్టి పిల్లలు అడ్డం! పాపం హైద్రాబాదులో ఉన్న ఠాలసీమియా పిల్లలకు కూడా ఇలాంటి కిక్కు గాడొకడు దొరికితే ఎంత బాగుండో! సి కాదు సి ప్లస్ ప్లస్ ఇవ్వాల్సిన చిత్ర రాజం!
గీతాచార్య, మీ వ్యాసం సినిమా మళ్ళీ ఇప్పుడే చూసినంత ఫ్రెష్ అనుభూతిని కల్గించి ఒళ్ళు మండిస్తోంది.
aithe meeru kick unna cinemalu kakunda vere cinema lu chudachannamaataa…
btw asalu ravi teja hit ayyinde aa attitude kosam, comedy kosam…
adi vekiliga anipiste emo no comments……
వ్యాసం బాగుందనే చెప్పాలి. కానీ ఓ చెత్త సినిమా గురించి ఇంత పెద్ద వ్యాసం రాసి మీ సమయమూ చదివించి మా సమయమూ వృధా చేశారు.
ప్రాణహిత గారూ మీరు చెప్పింది నిజమే. ఈ సినిమాని ఏ తమిళ డైరెక్టరో తీసి ఉంటే స్క్రీన్ ప్లే ఇంకా బాగుండిఉండేదేమో. నేను మాత్రం తొలి అర్ధ భాగం చాలా గందరగొళంగా ఫీల్ అయ్యాను. ఇది చాలా మంచి కధ. అగణిత ప్రతిభావంతులకి సమాజంతో ఉండే సహసంభందం గురించి ఇంకా బాగా చూపించ వచ్చు అనిపించింది ఈ సినిమా చూసాక. మొత్తానికి ఒక మంచి పాయింటు ని ఎంచుకున్నారు. అది మాత్రం సంతోషించదగిన విషయము.
ఇంత గందరగోళంగా వ్రాసే బదులు కాస్త సామాన్యులకర్ధమయ్యేటట్టుగా వ్రాయవచ్చు కదా! సార్.
“కిక్” సినిమాని తెలుగువాడు తీసాడు కాబట్టే అంత మంచి పాయింటుని పావుగంటసేపు చూపించి మిగతాదంతా మసాలాతో నింపేసాడు.
నాకు ఈ సినిమా ఏవిధంగానూ నచ్చలేదు. మీరు రచనలో చూపించిన నైపుణ్యం ఇలాంటి సినిమా మీదనా అనిపించింది. అలాగే ఈ సమీక్ష కు మీరు పెట్టిన టైటిల్ ఏమాత్రం బాగాలేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. అదే సమయంలో కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. వీలయితే ఆలోచించండి . లేకపోతె వదిలేయండి.
1. కిక్ సినిమా నాకు నచ్చింది. దాదాపు 25 కోట్లు వసూలు చేసిందని విన్నాను. ఇక ఈ వ్యాసం విషయానికి వస్తే వ్యాసం బాగానే ఉంది. వ్రాసిన గీతచార్య గారి శైలి బాగుంది. కానీ ఒక కమర్షియల్ సినిమా మీద, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకుల్ని రంజింప చేయాలనే ఉద్దేశ్యం తో తీసిన సినిమా మీద ఇంత విశ్లేషణా, మునులు మాట్లాడుకున్నట్టి క్రియేటివిటీ పిచుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఉంది.
2. హీరోలు ఈ మధ్య కొన్ని సినిమాల్లో హీరోయినలని “ము**డా” అని సంభోదించడం, హీరోయిన్లు హీరోల్ని “నా కొ****” అని సంభోదించడం ఈ మధ్య కొంచెం తరచూ జరుగుతోంది. గర్హించదగ్గ విషయమే. కానీ ఆ పాయింట్ ని పట్టుకుని వ్యాసానికి ఇలాంటి టైటిల్ పెట్టడం ఒకరకంగా వ్యాసాన్ని సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నం లాగే కనిపిస్తోంది.
@మోహన్ రాజ్: నాకెందుకో కమర్షియల్ సినిమాల మీద ఎక్కువ విశ్లేషణ జరగాలనిపిస్తుంది. ఆర్టుసినిమా సీరియస్ సినిమా గురించి ఏదో ఒక చోట అకడమీషియన్లు విశ్లేషణలు రాసేస్తారు. కానీ ఇంత ముఖ్యమైన పాప్యులర్ సినిమాల సంస్క్టృతి గురించి మరింత విశ్లేషణ అత్యవసరం. కాబట్టి ఆ మాత్ర క్రియేటివిటీ వాడితే ఫరవాలేదేమో!
ఇక టైటిల్ సంగతి…రచయితే చెప్పాలి.
>>కమర్షియల్ సినిమాల మీద ఎక్కువ విశ్లేషణ జరగాలనిపిస్తుంది
నిజమే!
>>విశ్లేషణ అత్యవసరం
పై వ్యాసం లో చిత్రాన్నమున పాదముంచితివి – ఇత్యాది మంచి పదప్రయోగాలు, శైలిపరంగా మరి కొన్ని చమక్కులు ట్రై చేసారు గీతాచార్య గారు. బాగున్నాయి. కానీ ఈ వ్యాసం లో సినిమా మీద విశ్లేషణ తక్కువ, వ్యాసాన్ని వ్రాస్తున్న శైలి మీద ఏకాగ్రత ఎక్కువ కనిపించాయి నాకు.
వ్యాసానికి పెట్టిన టైటిలు గీతాచార్య గారి సంస్కారానికి, ఆయనగారి అభిరుచికి అద్దం పడుతోంది…!!
ఏదో ఒక మాస్ డయలాగ్ ని పట్టుకుని ఇంత పెడార్ధపు టైటిల్ తో గజిబిజి వ్యాసం రాయడం రచయిత మానసిక పరిపక్వతను సూచిస్తోంది. తింగర వేషాలు తెలుగు సినిమా హీరోయిన్లకే కాదు… వెబ్ రయితలక్కూడా పాకినట్లుంది…
ఇది కూడా ఒక మాస్ టైటిల్ అనుకోండి సారూ…
ఎవడో ఒకడు,
ఒక పెడర్థపు టైటిలుని చూసే ఎగిరెగిరి పడే సమాజోద్ధారకులు ఒకసారి కాదు. వందలసార్లు పెదర్ధపు మాటలున్న సంభాషణలని ఎందుకు సహిస్తున్నట్లు? ఏఁ అక్కడేమైంది మీ ప్రతాపం? ఏఁ ఆ చెత్తని ఎందుకు ఎదిరించరు? అది మాస్ డైలాగా? అయితే నాది కూడా మాస్ టైటిలే.
వ్యాసాన్ని మరొక్కసారి సావధానంగా చదవండి. నేను చెప్పాలనుకున్న విషయం బోధపడుతుంది. మేము బుర్రుపయోగించం. ఇంకోటేదో ఉపయోగిస్తాం అనుకుంటె నష్టం మీకేగానీ నాకు కాదు. లేదా కొన్నాళ్ళాగండి. మరింత వివరంగా నా అభిప్రాయాన్ని డైరక్ట్ గా చెప్తాను.
ఏదో ఒక మాస్ టైటిలుని పట్టుకుని రచయిత ఇంతకు ముందు గానీ, ఈ వ్యాసంలో గానీ వాడిన భాషని గమనించకుండా మానసిక పరిపక్వత గురించి వ్యాఖ్యానించటం ఏరకమైన పరిపక్వత? ఒక్కసారి నే వ్రాసిన గత వ్యాసాలని చూడండి. ఇక్కడ శీర్షిక (FYI శిరీష కాదు. టైటిలు) తప్పని సరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాసానికి ఇంతకు మించిన టైటిలు కుదరదు. ఆ క్షణంలో నాకు కలిగిన అసహ్యమే ఇలా వచ్చింది. I’l never regret for coming up with such a title.
In-spite of all this nonsense, హీరో దొంగతనాలకి డైరక్టర్ (సిన్సియర్ గానే చూపాడో, లేదా అడ్డం పెట్టుకునేందుకు చూపాడో నాకనవసరం) సపోర్టుగా చూపిన పాయింటు చాలా గొప్పది. పసి పిల్లల గురించి వారి అనారోగ్యం (రాష్ట్రంలో గుండె జబ్బులు, థలసీమియా,
ఎయిడ్స్, మూత్రకోశ వ్యాధులూ… లిస్టనంతం. కళ్ళు తెరిచి చూస్తే నిజాలు భయపెడతాయి. ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తుంది) గురించీ, ఈ మాత్రం ఎస్కేపిస్టు దారిలోనైనా చూపిన సినిమాలు నాకైతే తగలలేదు ఈ మధ్య. అందుకే సినిమాకి నేనిచ్చిన రేటింగ్ ఎక్కువగా ఉంది.
I ALWAYS SEE THE POSITIVE SIDE OF ALL THE THINGS I ENCOUNTER. అందుకే ఈ సినిమాలో చూపిన కొద్దిపాటి మంచినీ ప్రశంసించగలిగాను. మీరంతా ఆ శీర్షిక దగ్గరే ఆగిపోయారు. బహుశా మీకు కావలసినది అదేనేమో.
baga chepparu sir.
సారీ, ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నందుకు. పూర్తిగా మీరు చెప్పింది అర్ధం అయ్యేసరికి కాస్త లేటు అయింది.
చదివేటప్పుడు మధ్య మధ్యలో మీ చమక్కులకి నవ్వొచ్చినా, విషయం అర్ధమవుతుంటే నిజమే కదా అనిపించింది. బుర్ర తిరిగిపోయింది.
సినిమా సంగతి వదిలేస్తే, the style of presentation is at once hilarious, and thought provoking. Very nicely constructed, and racy. Some exceptions are there. But, ఇంత ఆర్టికిల్ మీద ఓకే. Especially ‘genre Yama’ మీదేసిన బాణాలు అదిరాయి.
And to the title, I don’t see anything wrong. “ఈ వ్యాసానికి ఇంతకు మించిన టైటిలు కుదరదు.” AGREED. Could have mellowed it down. But… Ok. It’s an apt title.
“మీరంతా ఆ శీర్షిక దగ్గరే ఆగిపోయారు. బహుశా మీకు కావలసినది అదేనేమో.” Seems to be right. hahahaaaaaaaaaaaa మొత్తానికీ నవతరంగానికి మంచి ‘కిక్’ నిచ్చారు.
వైష్ణవి హరివల్లభ,
Thanks for your kindness.
“పూర్తిగా మీరు చెప్పింది అర్ధం అయ్యేసరికి కాస్త లేటు అయింది.” Thanks for reading with that interest
@All: ఎవరైనా ఈ క్రింది పేరాలో చెప్పదలుచుకున్న విషయమేమిటో కాస్త విడమర్చి చెప్పగలరా?
“It amazes me how Ravi Teja can come up with such a fresh and extraordinary performance for the similar roles in each and every movie. He has been playing similar kind of roles and similar characterizations for over 7 years since Idiot and he manages to look fresh and agile with different portrayal of the same character. Ravi Teja is simply superb and he carried the entire movie on his shoulders.”
http://idlebrain.com/movie/archive/mr-anjaneyulu.html
మహేష్ గారూ..దీనికి సమాధాంగా ఇక్కడ వ్రాద్దామనుకున్న కామెంట్ నే ఈరోజు టపా వ్రాశాను – చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు ..అని
@మోహన్ రాజ్: రవితేజ “ఏకపాత్ర”లో ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏమిటి,ఎందువల్ల అంతగా ఐడెంటిపై చేసుకుని అభిమానిస్తున్నారు అనేది ఒక విశ్లేషణ/పరిశోధన అంశం.
ఇలాంటివి ఏ సినిమాలో అయినా జరిగేవే. హాలీవుడ్ లో క్లింట్ ఈస్ట్ ఉడ్ పోషించిన ఇనస్పెక్టర్ “కలహాన్” పాత్ర లేదా మన బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ పోషించే “రాజ్” లేదా “రాహుల్” పాత్రలు ఆ రకానికి చెందుతాయి. కానీ, ఒక నటుడిగా రాణించాలంటే మాత్రం ఆ పాత్రల పరిధుల్ని దాటి నటుడు పాటుపడాలి. ఆ అవకాశం లేకుండా, ఆ “ఏకపాత్రే” మహా “ఫ్రెష్షుగ్గా అన్ని సినిమాల్లో ఉంది” అనే ఈ తరహా misleading image ప్రమాదకరం. అందుకే ఈ ‘జీవీ’ ని ప్రశ్నించాలనిపించింది.
@Mahesh garu,
Ravi Teja can do any type of character. His action in ‘naa autograph’ is not any way below the standard. The only problem is he is a telugu actor, and that’s all.
But there is an image trap. That’s what is ailing. He is capable. It’s only that people are not accepting, and the directors are not coming up with good stories. Still his performance is fascinating in every movie. He never failed a character given to him.
మీ చర్చ అంతా చదివాక ఈ సినిమా చూడడానికి ధైర్యం చాలటం లేదు
ఈ సినిమా మీద పైన జరిగిన, జరుగుతున్న,జరగనున్న చర్చలో పాల్గొనలేను గానీ.. ఈసినిమా పట్ల మా కుటుంబసభ్యుల ప్రతిస్పందన మాత్రం క్లుప్తంగా తెలియజేస్తాను.
నేను:-మొదటి అరగంటలోనే నిద్రపోయాను.(ఇదే నా మొదటి రవితేజ సినిమా ఇలా నిద్రకు గురవ్వటం)
నా భార్య:-సినిమా అయ్యాక నన్ను శుభ్రంగా తిట్టిపోసింది,ఇలాంటి సినిమా చూపిస్తావా అని,
మా పిల్లలు:-చక్కగా ఎంజాయ్ చేశారు.
Geetacharya garu,
ayya baboy ee sinima gurinchi intha pedda reviewnaa? kick bagundani cheppataniki paapam maharshulani kashtapettala? valla chetha katha cheppinchi. title choosi mundu apardham chesukunna. mottam chadivithe chala varietyy ga undi. oka sinima script laga.
rasina style chala nachindi kani, ee sinima kosam intha kashta padala ani naukuntunnanu.
tamudi sinimala gurnchi rasindi matram keka. language variation chala baga chuparu. but i dont kike raviteja though. but this movie is watchable.
@మహేష్,
LOL and half. “నేను రాసిన అమృత…” It’s really right. Have been observing NT for the past few days. Every crap of an article is being flooded with comments galore. But the articles which are the real motto of NT are not even given a single comment for the most part. A hundred for your రంధ్రాన్వేషణ, and a fifty for this article, (Hehehe I’m completing it), wow. People select what they want, and పైకి మాత్రం ఏదో ఉద్ధరించే పోజు.
ఇక్కడీ టైటిలు చూసి మార్తాండ వర్యులకి గుండెల్లో కోరమాండల్ రైళ్ళు పరిగిడెతే, రచయిత మానసిక పరిపక్వత మీదా, సంస్కారం మీదా కొందరికి అనుమానాలున్నాయి. కానీ అసలు విషయాన్నొదిలేసికొసరు మీద దృష్టి జనానికి. గురువు, శిష్యుడు, అందమైన ఆడపిల్ల, నది దాటటం కథ గుర్తుందా?
@మాస్టర్జీ,
Of all the things you write here in NT, this one takes the cake both in the technique, and narration style. The subtle changes in the language of all the people involved in the story is very great. ఇన్ని మెలికలు పెట్టినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా అన్నిటినీ ఒక కొలిక్కి తేవటం ఎంత కష్టమో చదివితే అర్థం అవుతుంది.
As for the movie, I completely agree with you. “’నువ్వు మనం విడిపోయిన క్షణాలనే గుర్తుంచుకున్నావ్. నాకు మాత్రం మనం కలిసి గడిపిన ఆ హ్యాప్పీ మూమెంట్సే గుర్తున్నాయి…” something like that dialogue ఉందే. సినిమా అంతా అదే స్పిరిట్ క్యారీ అయింది.” RighttO!
But, “Surely movie of the year in the fisrt half year.” This, I can see exaggeration. But the movie is worth watching.