Menu

వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ”

FFFవైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ”

మనం ఇక్కడ చర్చిస్తున్నాం…అక్కడ వైజాగ్ లో “జర్నీ ” మొదలయ్యింది.
మొన్న వెంకట్ గారి వీడియో ఫిల్మ్ ఆర్టికల్ చదివి నేను నా ఆర్టికల్ రాసినాక.. నిన్న ఖమ్మం నుండి మా బావ గారు ఫోన్ చేసి “చానల్ గుర్తులేదు కానీ ఏదో న్యూస్ లో …ఎవరో వైజాగ్ కుర్రోల్లు ఏదో వీడియో ఫిల్మ్ తీసారంట రా కాస్త కవర్ చెయ్యరాదు అని చెప్పి ఫోన్ పెట్టెసారు. .సరె ఎవరో కనుక్కుందాం వారి గురించి కాస్త నవతరంగం లో కూడా రాద్దామని ..మహ టీవి లో మిత్రుడికి ఫోన్ చేసి విషయం అడిగాను , అతను వైజాగ్ ఇంచార్జ్ నెంబెర్ ఇవ్వడం అతను అక్కడి రెపోర్టర్ నంబెర్ ఇవ్వడం మొత్తానికి ఎలాగో అలా దర్శకుడు ప్రశాంత్ కుమార్ ఫోన్ లో దొరికారు .

“ఇష్టమైన అమ్మాయి ప్రేమ కోసం తమ కెరిర్ ను కూడ పట్టించుకో కుండా తిరిగిన ముగ్గురు యువకుల జీవితాలు చివరకు ఎమయ్యాయి అనె కధాంశంతో జర్నీ అనె గంటన్నార ఒక చిన్న వీడియో ఫిల్మ్ నిర్మించినట్లు వైజాగ్ లో బీటెక్ చదువుతూ మరో వైపు బిగ్ ఎఫ్ ఎం లో పనిచేస్తూ కధా దర్శకత్వం చేసిన ప్రశాంత్ కుమార్ దిమ్మాలచెప్పుకొచ్చారు.

వివరాలు :

కధ; దర్శకత్వం ;-ప్రశాంత్ కుమార్ దిమ్మాల

చదువు ; చైతన్య ఇంజనీరింగ్ కాలేజి లో

బడ్జెట్; 2 లక్షలు

నటీనటులు ; షఫి, శివ వాత్సవ్, ప్రశాంథ్ కుసుమంజుల,రమ్య ,వైశాలి,

సంగీతం ; ఆనంద్( ఈయనకీరవాణి దగ్గర పనిచేసారంట)

గాయకులు ; ఆశీన్

కెమెరా మెన్; మూర్తీ

స్నేహితులంతా కలిసి తమ వద్ద నున్న డబ్బుటొనె దీనిని అరకు , వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీనినిDDD నిర్మించారంట.ఆడియో , వీడియో త్వరలోనే పంపిస్తాను అని చెప్పారు ప్రకాష్.నేను కాస్త నా వ్యక్తిగత పనులలో బిజీగ ఉండటటం వలన వీరి గురించి ప్రస్తుతం సరిగ పూర్తి స్థాయిలో వివరాలు అడగలేక పోయాను, రాయలేక పోతున్నాను. సరే నేను వీలు చూసుకుని రాద్దామనుకుంటే ఆలస్యం అయి పోవచ్చు …వీరి శ్రమ వ్యర్ధం కారాదు . సరె క్లుప్తంగా అయిన రాయాలి .ఇలాంటి వారిని ప్రోత్సాహించాలి అని ఇదిగో ఇలా రాస్తున్నాను. కాని వీరి ఇంటర్యూ కాని,ఇతర విషయాలు మీలో ఎవరైనా నవతరంగం లో ఇంకా వివరంగా రాయాలనుకుంటే ..వీరి చిరునామ కింద ఇస్తున్నాను సంప్రదించి ఆశీర్వదించ గలరు. శుభం.

Prashaanth 9985575720 (vaizag)
and his mail ID:- prasanthkumar.dimmala at gmail.com
వాళ్ళ ఈ చిన్న ప్రయత్నం ఫలవంతం కావాలని ప్రార్ధిద్దాం .(నాస్తికులైతే ..ఆశిద్దాం) .అమీన్.

5 Comments
  1. గీతాచార్య August 24, 2009 /
    • Alibhai August 24, 2009 /
  2. కొత్తపాళీ August 24, 2009 /